మంత్రాలయము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మంత్రాలయము
—  మండలం  —
కర్నూలు జిల్లా పటములో మంత్రాలయము మండలం యొక్క స్థానము
కర్నూలు జిల్లా పటములో మంత్రాలయము మండలం యొక్క స్థానము
మంత్రాలయము is located in ఆంధ్ర ప్రదేశ్
మంత్రాలయము
ఆంధ్రప్రదేశ్ పటములో మంత్రాలయము యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 15°56′30″N 77°25′41″E / 15.94167°N 77.42806°E / 15.94167; 77.42806
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కర్నూలు
మండల కేంద్రము మంత్రాలయము
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 51,620
 - పురుషులు 25,821
 - స్త్రీలు 25,799
అక్షరాస్యత (2001)
 - మొత్తం 40.76%
 - పురుషులు 54.63%
 - స్త్రీలు 26.92%
పిన్ కోడ్ 518345

మంత్రాలయము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము, పట్టణము. పిన్ కోడ్: 518345.

మధ్వాచార్యుల పరంపరలో ధృవనక్షత్ర సమానమైన రాఘవేంద్రస్వామివారి పుణ్యక్షేత్రం మంత్రాలయం తుంగభద్రా నదీతీరంలో ఉన్నది. ఇది రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం.ఇది కర్నూలు నుండి 100కి.మీ దూరంలో ఉన్నది. ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయుని ఆలయం కలదు. ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ వివిథ కులస్తుల ఉచిత సత్రములు కలవు. ఇక్కడ గురువారం ప్రత్యకత. ఇక్కడ సాయంత్రం స్వామివారి ఏనుగు అందరిని దీవిస్తూ సందడి చేస్తుంది.

అక్టోబరు 2, 2009న తుంగభద్ర నది ఉప్పొంగి రావడంతో మంత్రాలయం దేవస్థానంతో పాటు పట్టణంలోని 80% జనావాసాలు నీటమునిగాయి. వేలాదిమంది ప్రజలు, దర్శనానిని వచ్చిన భక్తులు వరదనీటిలో చిక్కుకున్నారు.[1]

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి[మార్చు]

శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671), హిందూ మతములో ఓ ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించాడు. ఇతను వైష్ణవాన్ని అనునయించాడు, మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. ఇతను శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తుడు. ఇతను పంచముఖిలో తపస్సు చేసాడు, ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు. మంత్రాలయం లో తన మఠాన్ని స్థాపించాడు, మరియు ఇక్కడే సమాధి అయ్యాడు. వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు.

గ్రామాలు[మార్చు]

రాఘవేంద్ర స్వామి ఆలయం ప్రవేశం వద్ద

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 03-10-2009


దస్త్రం:Mantralaya map.PNG
300pxగూగల్ మ్యాపులొ మంత్రాలయము
వికీవాయేజ్ కోసం ఒక ట్రావెల్ గైడ్ ఉంది మంత్రాలయము .