Jump to content

గాంధీ కొండ (విజయవాడ)

అక్షాంశ రేఖాంశాలు: 16°31′11″N 80°37′00″E / 16.5198°N 80.6168°E / 16.5198; 80.6168
వికీపీడియా నుండి
(ఓర్ హిల్ నుండి దారిమార్పు చెందింది)
గాంధీ కొండ
గాంధీ స్మారక స్థూపం
స్థానంవిజయవాడ
అక్షాంశరేఖాంశాలు16°31′11″N 80°37′00″E / 16.5198°N 80.6168°E / 16.5198; 80.6168

విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న కొండ గాంధీ కొండ. ఇది సముద్ర మట్టానికి 500 అడుగుల ఎత్తున ఉంది. విజయవాడ రైల్వే స్టేషనుకు వెనక తారాపేట ప్రాంతంలో ఈ కొండ ఉంది. ఈ కొండపై గాంధీ స్మారక స్థూపం ఉంది. దేశం లోని ఆరు గాంధీ స్మారకస్థలాల్లో ఇది ఒకటి.[1] [2]దీంతో ఈ కొండకు గాంధీ కొండ అనే పేరు వచ్చింది. గాంధీ స్మారకాన్ని నిర్మించక ముందు ఈ కొండకు ఓర్ కొండ అనే పేరు ఉండేది.[3]

చరిత్ర

[మార్చు]

1852 లో కృష్ణానదిపై తొలి బ్యారేజీని నిర్మించిన కెప్టెన్ చార్లెస్ ఓర్ ఈ కొండపై నుండే ఆనకట్ట నిర్మాణాన్ని పర్యవేక్షించేవాడు. అప్పటి నుండి ఈ కొండకు ఓర్ కొండ ఆనే పేరు వచ్చింది. ఆ ఆనకట్ట వందేళ్ళ తరువాత 1952 లో వచ్చిన వరదల్లో కొట్టుకొని పోగా దానికి కొద్దిగా ఎగువన ప్రస్తుత మున్న ప్రకాశం బ్యారేజీని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది.

గాంధీ స్మారక సంస్థ దేశంలో నెలకొల్ప దలచిన 6 శాశ్వత స్మారక కేంద్రాల్లో విజయవాడను ఒకటిగా ఎంపిక చేసింది. అప్పట్లో ఓర్ కొండగా పిలిచే ఈ కొండను స్మారక కేంద్ర స్థలంగా ఎంపిక చేసారు.

కొండపై ఉన్న ఆకర్షణలు

[మార్చు]
స్థూపంపై రాట్నం

1967 లో అప్పటి ఉప ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ గాంధీ హిల్ సొసైటీని ప్రారంభించాడు. పదేళ్ళ తరువాత ఈ సొసైటీని, గాంధీ హిల్ ఫౌండేషన్ పేరుతో ట్రస్టుగా మార్చారు. 52 అడుగుల గాంధీ స్మారక స్థూపాన్ని 1968 అక్టోబరు 6 న అప్పటి రాష్ట్రపతి జాకీర్ హుసేన్ ఆవిష్కరించాడు. ఈ స్థూపం పీఠంపై గాంధీ సూక్తులను చెక్కారు.

1969 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రైలును బహూకరించింది. భారతీయ రైల్వే కొండపైకి ఒక రైలు మార్గాన్ని నిర్మించింది. ఈ రైలు ఇక్కడి ప్రధాన ఆకర్షణల్లో ఒకటి.

1968 లో అప్పటి రాష్ట్రపతి వివి గిరి ఒక దృశ్య శ్రవణ ప్రదర్శనకు శంకుస్థాపన చేసాడు. 1969 లో సరిహద్దు గాంధీగా పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ దీన్ని ప్రారంభించాడు.

కొండపై ఒక నక్షత్ర వేధ శాలను ఏర్పాటు చేసారు. 1971 లో దీన్ని ప్రారంభించారు. న్యూయార్కుకు చెందిన ఫోర్డు ఫౌండేషను దీనికి టెలిస్కోపును సమకూర్చింది.[4] కొండపై ఒక గ్రంథాలయం కూడా ఉంది.

విస్మరణ

[మార్చు]

తరువాతి కాలంలో ఈ మహాత్మా గాంధీ స్మారకం వివిధ రాజకీయాల కారణంగా విస్మరణకు గురైంది. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి గాంధీ స్మారక సంస్థల మధ్య నిధుల విషయంలో ఉన్న విభేదాల కారణంగా నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో గాంధీ కొండ అశ్రద్ధకు లోనైంది.[5]

విజయవాడలోని గాంధీ హిల్ (ఎత్తు 500 అడుగులు (150 మీ) ) తారాపేట ప్రాంతంలో విజయవాడ రైల్వే స్టేషను వెనుక ఉంది. ఈ కొండపై నిర్మించిన ఒక మహాత్మా గాంధీ మెమోరియల్, ఏడు స్తూపాలను కలిగినది దేశంలో మొదటిది. ఈ కొండ కూడా గాంధీ పేరుతో ప్రసిద్ధి చెందింది.[6][7] ఈ కొండ గతంలో ఒఆర్‌ఆర్ కొండ అని పిలువబడింది.[8]

స్మారక చిహ్నం

[మార్చు]
గాంధీ మెమోరియల్ స్థూపం
గాంధీ కొండ వద్ద గాంధీ విగ్రహంపై శాసనాలు.

మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక స్మారక చిహ్నంగా భావిస్తారు, దేశపు పిత మహాత్మా గాంధీకి ప్రణమిల్లుతారు. గాంధీ హిల్ మెమోరియల్ లో గాంధీ ఉల్లేఖనాల శాసనాలను కలిగి ఉన్న ఒక రాతి స్లాబ్ ఉంది. ఇక్కడ లైబ్రరీ సౌకర్యం, ప్లానిటోరియం కలిగి ఉంది. కానీ ప్లానిటోరియం పని చేయడం లేదు. లైబ్రరీ కూడా అందుబాటు లో లేదు. 1968 అక్టోబరు 6 న, 52 అడుగుల (16 మీటర్లు) పొడవు గల ఒక స్తూపం భారత మాజీ రాష్ట్రపతి డా. జాకీర్ హుస్సేన్ చేత ఆవిష్కరించబడింది. అదేవిధంగా ఏడు పొడవైన స్తంభాలు కూడా ఉన్నాయి, ప్రతి స్తంభం 150 మీ (490 అడుగులు) పొడవైనది.[7][9]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Gandhi Hill India Tourist Information". web.archive.org. 2014-07-14. Archived from the original on 2014-07-14. Retrieved 2022-06-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Gandhi Hill Vijayawada". web.archive.org. 2014-07-04. Archived from the original on 2014-07-04. Retrieved 2022-06-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Information about Gandhi Hill". mapsofindia. Retrieved 12 June 2014.
  4. Shridharan, J. R. (2015-12-07). "A hill with history cries for attention". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.
  5. Varma, P. Sujatha (2019-10-01). "A monumental fight over Gandhi Hill in Vijayawada". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.
  6. "Places in vijayawada". touristlink. Archived from the original on 14 జూలై 2014. Retrieved 12 June 2014.
  7. 7.0 7.1 "Overview of hill". vijayawadaonline portal. Archived from the original on 4 జూలై 2014. Retrieved 12 June 2014.
  8. "Gandhi Hill". www.mapsofindia.com. Retrieved 2022-06-17.
  9. "Statues and structures on the hill". journeymart. Archived from the original on 14 జూలై 2014. Retrieved 12 June 2014.