కన్నూర్ జిల్లా (కేరళ)
Kannur district | |
---|---|
district | |
Country | India |
రాష్ట్రం | కేరళ |
ప్రధాన కార్యాలయం | Kannur |
Government | |
• Collector | Rathan Kelkar |
విస్తీర్ణం | |
• Total | 2,966 కి.మీ2 (1,145 చ. మై) |
జనాభా | |
• Total | 24,12,365 |
• జనసాంద్రత | 813/కి.మీ2 (2,110/చ. మై.) |
భాషలు | |
• అధికార | Malayalam,ఆంగ్లం |
Time zone | UTC+5:30 (IST) |
ISO 3166 code | IN-KL-KNR |
లింగ నిష్పత్తి | 1090 ♂/♀ |
అక్షరాస్యత | 92.80% |
కన్నూర్ జిల్లా, భారతదేశం కేరళ రాష్ట్రంలోని ఒక జిల్లా.[1]ఈ జిల్లా ప్రధాన కార్యాలయం కన్నూర్. జిల్లా కేంద్రం పేరిటే ఈ జిల్లాకు పేరు పెట్టారు. పాతపేరు కన్ననూరు ఆంగ్లీకరణలో కన్నూరుగా రూపాంతరం అయింది. కన్నూరు జిల్లా 1957లో రూపొందించారు. జిల్లా ఉత్తర సరిహద్దులో కాసర్గోడ్ జిల్లా, దక్షిణ సరిహద్దులో కోళికోడ్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో వాయనాడు జిల్లా ఉన్నాయి. జిల్లా తూర్పు సరిహద్దులో ఉన్న పశ్చిమకనుమలు జిల్లాకు కర్నాటక రాష్ట్రానికి చెందిన కొడగు జిల్లాకు మద్య సరిహద్దు ఏర్పరుస్తూ ఉన్నాయి. కన్నూరు జిల్లా లాండ్ ఆఫ్ లూం, లాండ్ ఆఫ్ లోర్ అని కూడా అంటారు. ఇక్కడ నేత పరిశ్రమలు, ఆలయాలలో నిర్వహించబడే సంప్రదాయ ఉత్సవాలు పండుగలు అధికంగా ఉన్నాయి. కనుక జిల్లాకు ఈపేరు వచ్చింది. జిల్లాలో ఉత్తర కేరళలో ప్రసిద్ధమైన " తెయ్యం " అనే సంప్రదాయ నృత్యానికి కేంద్రంగా ఉంది. జిల్లాలో తెయ్యం సంబంధిత కవు అనే మందిరాలు ఉన్నాయి. కన్నూరుకు 26 కి. మీ దూరంలో " కన్నూరు ఇంటర్నేషనల్ విమానాశ్రయం " నిర్మాణానికి ప్రతిపాదన జరిగింది.[2]
పేరు వెనుక చరిత్ర
[మార్చు]కన్నూరు జిల్లాపేరు గురించిన పలు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ పేరుకు "కణ్ణన్", "కృష్ణ"లు మూలమని విశ్వసిస్తున్నారు. ఊరు అంటే నివాసితప్రాంతం అని అర్ధం. కృష్ణభగవానుడు నివసించిన ప్రాంతం అని అర్ధం. కడలై శ్రీకృష్ణా ఆలయం ఆరంభకాలంలో కడలై కోటలో చిన్న మందిరంగా ఉండేది. ఇది ప్రస్తుత కన్నూరు జిల్లా ఆగ్నేయ భాగంలో ఉండేది. బ్రిటిషు పాలనాకాలంలో నగరాన్ని కన్ననూరు అని పిలిచేవారు. పోర్చుగీసు యాసలో ఇది కన్ననోర్గా రూపాంతరం చెందింది. కేరళ రాష్ట్రంలోని అరక్కల్ సుల్తానేట్ కాలంలో ఇది ముస్లిం రాజ్యానికి రాజధానిగా ఉండేది.
చరిత్ర
[మార్చు]కన్నూరు 12వ శతాబ్దంలో ప్రముఖవాణిజ్యకేంద్రంగా విలసిల్లింది. కన్నూరు నుండి పర్షియా, అరేబియా దేశాలతో వాణిజ్యం జరిగింది. ఇది 1887 వరకు బ్రిటిషు ఇండియా పశ్చిమ సముద్రతీర సైనిక కేంద్రంగా ఉంది. తనసోదరి నగరం తల్లిచేరితో విలీనం తరువాత ఇది బ్రిటిషు ఇండియా పశ్చిమ తీరంలో అత్యంత విశాలమైన నగరంగా తృతీయ స్థానానికి మారింది. మొదటి స్థానాలలో బొంబయి, కరాచి నగరాలు ఉన్నాయి.
పోర్చుగీసు కోట
[మార్చు]1505 లో మొదటి పోర్చుగీసు వైస్రాయి ఆఫ్ ఇండియా డాం ఫ్రాంసిస్కో అల్మెయిడా సెయింట్. ఆగ్లో కోట నిర్మించాడు. 1663లో డచ్చి వారు పోర్చుగీసు నుండి కోటను స్వాధీనం చేసుకున్నారు. వారు కోటను ఆధునీకరణ చేసి హోలండియా, జీలండియా, ఫ్రీస్లాండియా బురుజులను నిర్మించారు. అవి ప్రస్తుత కోటలో ప్రధానాంశాలుగా ఉన్నాయి. తరువాత అసలైన పోర్చుగీసు కోటను పడగొట్టారు. ఇక్కడ ఉన్న ఫిషింగ్ ఫెర్రీ నేపథ్యం ఉన్న వర్ణచిత్రం ప్రస్తుతం అమస్టర్‌డామ్ మ్యూజియంలో ఉంది. 1772లో డచ్చివారు ఈ కోటను అలిరాజాకు విక్రయించారు. 1790లో బ్రిటిషు ప్రభుత్వం ఈ కోటను స్వాధీనం చేసుకుని కోటను వారి ప్రధాన సైనిక కేంద్రాలలో ఒకటిగా చేసింది. 17వ శతాబ్దంలో కన్నూరు ముస్లిం సుల్తానేటుకు రాజధానిగా (అరక్కల్) ఉంది.[3] బ్రిటిషు పాలనా కాలంలో కన్నూరు మద్రాసు ప్రావిన్సులో భాగంగా ఉండేది.
పళసి రాజా
[మార్చు]కొట్టాయం పాలకుడు పళసి రాజా బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగించిన గొరిల్లా యుద్ధం కన్నూరు ప్రాంతాన్ని బాగా ప్రభావితం చేసింది. 20వ శతాబ్దం ఆరంభంలో కేరళలో సాంఘిక ఆర్థిక, రాజకీయరంగాలలో సంభవించిన మార్పులు కమ్యూనిస్టు ఉద్యమం బలపడడానికి కారణం అయింది. 1906 మిషనరీలు ప్రారంభించిన ఆగ్లభాషా మాధ్యమ విద్య తరువాత బ్రిటిషు ప్రభుత్వ నిర్వహణలోకి మారింది. 1888లో శరీరపైభాగం కప్పుతూ దుస్తులను ధరించడానికి తిరిగుబాటు కొనసాగింది. ఇందుకు స్మారకంగా అరువిప్పురం సమీపంలో విగ్రహప్రతిష్ఠ, 1891లో మలయాళీ మెమోరియల్, 1903లో ఎస్. ఎన్. డి. పి. యోగం స్థాపన, యాక్టివిటీస్, అల్లర్లు మొదలైన సంఘటనలు జరిగాయి.
సోషలిజం
[మార్చు]తరువాత సోషలిజం, సోవియట్ విప్లవం కేరళలో ప్రవేశించాయి. స్వదేశాభిమాని రామకృష్ణ పిళ్ళై, సహోదరన్ అయ్యప్పన్, పి. కేశవదేవ్ తదితర నాయకులు ప్రజలను ప్రభావితం చేసారు. 1930లో ప్రయోజనకరమైన అభివృద్ధి చోటుచేసుకుంది. ట్రావంకోర్‌లో నివర్తన ఆందోళన జరిగింది. ప్రభుత్వంలో భాగస్వామ్యం వహించడానికి బలహీన వర్గాల అణిచివేతకు వ్యతిరేకంగా ఉద్యమాలు చోటుచేసుకున్నాయి. ఫలితంగా ప్రభుత్వ పదవులలో, ఉద్యోగాలలో రిజర్వేషను సదుపాయం కలిగించారు. అణిచివేతకు గురైన బలహీన వర్గాలకు చెందిన ప్రజలలో ఇది కొత్త ఆశలను చిగురింపజేసింది.[4]
సహాయనిరాకరణ ఉద్యమం
[మార్చు]భారతస్వాతంత్ర్య సమరంలో ముఖ్య మలుపుగా మారిన ఉప్పు సత్యాగ్రహానికి (1930 ఏప్రిల్ 13) పయ్యనూర్ ప్రధాన కేంద్రంగా ఉంది. కె.కేలప్పన్ నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు కోళికోడు నుండి పాదయాత్రతో ఆరంభించి ఏప్రిల్ 21న పయనూరుకు చేరుకుని ఉప్పుచట్టాన్ని అధిగమిస్తూ ఉప్పుతతారీ చేపట్టారు. పయ్యానూరు సత్యాగ్రహ శిబిరం మీద బ్రిటిష్ ప్రభుత్వం దాడిచేసి సత్యాగ్రహుల మీద లాఠీచార్జి చేసారు. ఉలియత్ కాదవ్ పయ్యనూరు సంఘటన కేరళ స్వాతంత్ర్యోద్యమాన్ని ప్రధాన మలుపు తిప్పింది. ప్రజలకు ఇది ప్రేరణ కలిగించి వేలాది ప్రజలను స్వాతంత్ర్యోద్యమం వైపు ఆకర్షించింది. జిల్లాలోని కన్నూరు, తలస్సేరి, ఇతర భాగాలలో పలు ఉపన్యాసాలు జరిగాయి. పలు కాంగ్రెస్ సభ్యులు ఖైదుచేయబడ్డారు. తరువాత స్వాతంత్ర్యోద్యమం పౌర అవిధేయత ఉద్యమం నుండి అతివాద కాంగ్రెస్ శఖ రూపుదాల్చడానికి దారి తీసింది. 1934లో కేరళ రాష్ట్రంలో అతివాద కాంగ్రెస్ ఆరంభమై ప్రత్యేక పార్టీగా పనిచేయడం మొదలైంది. అతివాద కాంగ్రెస్‌కు పి కృష్ణ పిళ్ళై, ఎ.కె. గోపాలన్, ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్. కదచిరా (కన్నూర్), సోషలిస్టు నాయకుడు కె.వి.కుంహిక్కన్నన్ నాయర్ ప్రాధాన్యత వహించారు. మొహమ్మద్ అబ్దూర్ రహీమన్ కాంగ్రెస్‌లో ముస్లిం అతివాద బృందం జాతీయవాదం కూడా తలెత్తింది. కె.కేలప్పన్, సి.కె గోవిందన్ నాయర్, కె.ఎ. దామోదరన్ నాయకత్వంలో కాంగ్రెస్ సోషలిస్టులు నేషనలిస్ట్ ముస్లిములు రైట్‌వింగ్ పేరుతో గాంధీకి వ్యతిరేకంగా కామన్ కాజ్ రూపొందించారు.
ముస్లిం లీగ్
[మార్చు]1930లో మలబార్ రాజకీయాలలో గుర్తించతగిన విధంగా " ఆల్ ఇండియా ముస్లిం లీగ్ " రాజకీయ పార్టీగా అభివృద్ధి చెందింది. పార్టీ స్థాపనకొరకు తలస్సేరి, కన్నూరు ముస్లిం నాయకులు ప్రత్యేక కృషిచేసారు. 1930లో కేరళరాష్ట్రంలో వామపక్ష కాంగ్రెస్ క్రియాశీలకంగా పనిచేసింది. వారు తమ కార్యవర్గంలో రైతులు, శ్రామికులు, విద్యార్థులు, కన్నూరు ఉపాధ్యాయులను కలుపుకుని క్రియాశీలకంగా పనిచేసారు. 1938లో కేరళ కాంగ్రెస్ కమిటీ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. తరువాత కన్నూరు జిల్లాలో రైటిస్టులు కొంత వెనుకంజ వేసారు. " అబ్దూర్ ర్హిమాన్ సాహెబ్ " [2] కె.పి.సి.సి అధ్యక్షునిగా ఎన్నుకొనబడ్డాడు.
నంబూద్రి జనరల్ సెక్రెటరీగా ఎన్నుకొనబడ్డాడు. అదే సంవత్సరం చివరికి మలబార్లో " ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ " స్థాపించబడింది. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీలో విలీనం అయ్యారు.
మొర్జా సంఘటన
[మార్చు]1940 సెప్టెంబరు 15 న కె.పి.సి.సి. ఉత్తర మలబార్ ప్రజలకు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించమని ఇచ్చిన పిలుపును జాతీయ కాంగ్రెస్ నిరాకరించింది. అయినప్పటికీ ఈ విషయం మీద మలబార్ ప్రాంతం అంత వాదవివాదాలు చెలరేగాయి. ఈ ఉద్యమానికి కన్నురు జిల్లా కేంద్రబిందువుగా మారింది. జిల్లాలో పలుప్రాంతాలలో పోలీస్, ప్రజల మద్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. పోలీసు ప్రజలను అదుపులోకి తీసుకురావడానికి ప్రజల మీద లాఠీప్రయోగం, కొన్ని చోట్ల తుపాకి షూటింగ్ జరిపింది. మోరాఝా వద్ద ఉద్యమకారుల చేతిలో మద్య ఇద్దరు యువకులు (సబ్ ఇంస్పెక్టర్ కె.ఎం.కుట్టి కృష్ణా, కానిస్టేబులు రహమాన్) మరణించారు. ఈ సంఘటనతో సంబంధం ఉన్న ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు కె.పి.ఆర్ గోపాలన్‌కు హత్యానేరం కింద ఖైదు మరణశిక్ష విధించబడింది. మహాత్మాగాంధీ మొదలైన ప్రముఖ జాతీయనాయకుల జోక్యంతో మరణశిక్ష రద్దు చేయబడింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం కన్నూరులో తన ప్రభావం చూపింది. ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీకి చెందున సోషలిస్టు నాయకుడు కె.బి. మేనన్ నాయకత్వం వహించాడు.
వామపక్షాలు
[మార్చు]ముప్పై చివరిదశలో కేరళ ప్రొవింషియల్ కాంగ్రెస్ వామపక్ష బృందాలు మలబారు రాజకీయాలలో ప్రధాన పాత్రపోషించాయి. కన్నూరు జిల్లాలో రైతులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కార్యవర్గ సభ్యులుగా పనిచేసారు. 1939 జనవరిలో కేరళ ప్రొవింషియల్ కాంగ్రెస్ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. రైటిస్ట్ పక్షాలు కొంత వెనుకడుగు వేసారు. మొహమ్మద్ అబ్దూర్ రహిమన్ కె.పి.సి.సి. అధ్యక్షుడుగా నంబూద్రిపాద్ జంరల్ సెల్రటరీగ ఎన్నిక చేయబడ్డాడు. అదే సంవత్సరం మలబారులో ఇండియన్ కమ్యూనిస్టు పార్టీ అధికారికంగా స్థాపించబడింది. కాంగ్రెస్ షోషలిస్ట్ పార్టీ సభ్యులు కమ్యూనిస్ట్ పాటీలో విలీనం అయ్యారు.
వ్యవసాయదారుల సమస్య
[మార్చు]1943 - 1945 మద్య జిల్లా కరువురక్కసి కోరలలో చిక్కుకుంది. కరువు, కలరా జిల్లాలోని బడుగువర్గానికి చెందిన వేలాది ప్రజలను బలితీసుకుంది. కిసాన్ సభ నాయకత్వంలో కరువుబారి నుండి ప్రజలను రక్షించడానికి స్వయంసేవకులు గుర్తించతగినంత సేవలు అందించారు. గ్రోమోర్ ఫుడ్ కార్పొరేషన్ మంగత్తుపరంబా వద్ద నిర్వహించిన కిసాన్ సభ ప్రజాఉద్యమంలో సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. ప్రభుత్వ భూములలో 50 ఎకరాలకంటే అధికంగా వ్యవసాయయోగ్యం చేయబడ్డాయి. ప్రభుత్వం మాత్రం తోటలను ధ్వంసం చేసి ఉద్యమన్ని అణిచివేసింది.
క్షామం
[మార్చు]1945 నాటికి యుద్ధం ముగింపుకు వచ్చింది. అయినప్పటికీ కరువు మాత్రం ప్రజలను బాధించడం కొనసాగించింది. కరివెల్లోర్, పూమరం (తిల్లెనకేరి) గ్రామాలు పేదరికం, కరువుతో పోరాటానికి అడుగులు ముందుకు వేసాయి. కరివెల్లోర్ నుండి చిరక్కల్కు తరలించబశుతున్న వడ్లను అడ్డగించి గ్రామంలోని ప్రజలకు పంచిపెట్టారు. ఈ ఉద్యమానికి రౌతునాయకులు ఎ.వి.కుంహంబు, కృష్ణన్ మాస్టర్ నాయకత్వం వహించారు. కన్నన్, కుంహంబు పోలీసుల కాల్పులలో అసువులు కోల్పోయారు.1946 డిసెంబరు మాసంలో కవుంబయి పునం (ప్రజలు పైరు చేయడం ) ఉద్యమించారు. ఉద్యమాన్ని అణిచువేయడానికి పెద్ద ఎత్తున పోలీస్ పంపబడింది. ప్రజలు పోలీసు బలగాలను ఎదుర్కొన్నారు. ఈ ఘర్షణలలో 5 గురు ప్రాణాలను కోల్పోయారు.
శ్రామికులు
[మార్చు]పారిశ్రామిక రంగంలో శ్రామిక వర్గాలు సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించేవారిలో ప్రాధాన్యత వహించారు. అరన్ మిల్ శ్రామికులు 1946లో నిర్వగించిన ఉద్యమమం ఇదుకు నిదర్శనం. స్వతంత్రం వచ్చిన తరువాత కూడా రాష్ట్రంలో రైతులు సాగించిన ఉద్యమాలు రాజకీయంగా పెనుమార్పులకు కారణం అయ్యాయి.రైతుకూలీలు భూస్వాములకు వ్యతిరేకంగా సాగించిన యుద్ధ్హలలో తిల్లంకేరి, మనయంకున్ను, కొరం, పడ్డికున్ను స్వాతంత్ర్యం తరువాత రైతులు సాగించిన ఉద్యమాలలో ప్రధానంగా గుర్తించబడ్డాయి. కన్నూరు వద్ద 1953లో " ఆల్ ఇండియా కాంఫరెంస్ ఆఫ్ కిసాన్ సభ " రాష్ట్రంలో సరికొత్త అసెంబ్లీ రూపకల్పనకు దారితీసింది. రాష్ట్రంలోని సకలవర్గాల ప్రజలను ఆకర్షించిన " ఐఖ్య కేరళ " ఉద్యమం కూడా రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర వహించింది.
భౌగోళికం, వాతావరణం
[మార్చు]భౌగోళికం
[మార్చు]కన్నూరు జిల్లా 11-40 నుండి 12-48 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 74-52 నుండి 76-07 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా వైశాల్యం 2, 996 చ.కి.మీ. భౌగోళికంగా కన్నూరు హైలాండ్, మిడ్‌లాండ్, లోలాండ్‌గా విభజించబడింది. హైలాండ్ పశ్చిమకనుమలలో భాగంగా కొండలమయంగా ఉంటుంది. ఇక్కడ వర్షారణ్యాలు, టీ, కాఫీ, యాలుకల తోటలు ఉంటాయి. ఇక్కడ టింబర్ ప్లాంటేషన్ కూడా ఉంటుంది. హైలాండ్, లోలాండ్ మద్య ఉన్న మిడ్‌లాండ్ ప్రాంతం కొండలు, లోయలతో ఎగుడు దిగుడుగా ఉంటుంది. లోలాండ్ ఇరుకైన సన్నని సముద్రతీరప్రాంతం, నదీప్రవాహాలు, నదీముఖద్వారాలతో ఉంటుంది.
నదులు
[మార్చు]కన్నూరు జిల్లాలో ప్రధానంగా 6 నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలో అతిపెద్ద నది 110కి. మీ పొడవైన నదిగా వలపట్టణం ప్రత్యేకత కలిగి ఉంది. ఇతర నదులలో కుప్పం, మాహేనది, అంజరకండి, తలస్సేరి, రామాపురం, పెరవూరు.
శీతోష్ణస్థితి
[మార్చు]జిల్లా తేమ శీతోష్ణస్థితి ఉంటుంది. మార్చి నుండి మే చివరి వరకు వాతావరణంలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. తరువాత నైరుతి ఋతుపవనాలు ఆరంభమై సెప్టెంబరు వరకు వర్షపాతం ఉంటుంది. తరువాత అక్టోబరు - నవంబరు మాసాలలో ఈశాన్య ఋతుపవనాల కారణంగా వర్షాలు పడతాయి. ఏప్రిల్ మే మాసాలలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు 20, 16 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. సరాసరి వార్షిక వర్షపాతం 3438 మి.మీ ఉంటుంది. 80% వర్షపాతం నైరుతి ఋతుపవనాల కారణంగా ఉంటుంది. జూలై మాసంలో మాత్రమే 68% వర్షపాతం ఉంటుంది.
విషయ వివరణ | వాతావరణ వివరణ |
---|---|
వాతావరణ విధానం | |
వేసవి | మార్చి- మే |
వర్షాకాలం | జూన్- సెప్టెంబరు (నైఋతీ ఋతుపవనాలు) |
కాలాంతర వర్షాలు | అక్టోబరు - నవంబరు (ఈశాన్య ఋతుపవనాలు) |
శీతాకాలం | |
గరిష్ఠ ఉష్ణోగ్రత | 35 ° సెల్షియస్ (ఏప్రిల్ - మే) |
కనిష్ఠ ఉష్ణోగ్రత | 20 ° సెల్షియస్ డిసెంబరు- జనవరి రాత్రి (16 డిగ్రీలు) |
వర్షపాతం | 3438 మి.మీ (వర్షపాతం 80% (నైౠతీ ౠతుపవనాలు)) |
అత్యధిక వర్షపాతం | జూలై (68%) |
కన్నౌర్ నగరం
[మార్చు]- కన్నూరు (కన్నౌర్) నగరం గతంలో కన్ననూర్ అని పిలువబడింది. ఇది కన్నూర్ జిల్లాకు కేంద్రంగా ఉంది.
- అయిక్కరా నగరం కన్ననూర్ నగరంలో భాగంగా ఉంది. పురాతన కాలంలో వాస్తవంగా ఇది నగరకేంద్రంగా (డౌన్‌టౌన్) ఉండేది. ప్రస్తుతం ఇది నివాసిత ప్రాంతంగా ఉంది. ఇక్కడ ముస్లిం జాలర్లు అధికంగా నివసిస్తున్నారు. ప్రాంతీయవాసులు అధికంగా ఈప్రాంతాన్ని సిటీ అంటారు.
సముద్రతీరాలు
[మార్చు]కన్నూరులో పలు సముద్రతీరాలు ఉన్నాయి.
పయ్యంబలం సముద్రతీరం
[మార్చు]కన్నూరు పట్టణంలో ఉన్న సముద్రతీరాన్ని పయ్యనూర్ సముద్రతీరం అంటారు. ఇక్కడ కొన్ని కిలోమీటర్ల దూరం అంతరాయరహిత సముద్రతీరం ఉంది. సముద్రతీరం నుండి మలబార్ తీరంలో కోళికోడు నుండి మంగుళూరు, గోవా, ముంబయి ప్రయాణిస్తున్న నౌకలు కనిపిస్తుంటాయి. ప్రకృతిసహజమైన సౌందర్యం, చక్కగా తీర్చిదిద్దబడిన పూదోటలు సముద్రతీరాన్ని ఆహ్లాదకరంగా మార్చాయి. ప్రముఖ శిల్పకారుడు కనాయి కుంహీరాం తల్లీబిడ్డల శిల్పం దృశ్యాన్ని మరింత మనోహరంగా చేస్తుంది.
బేబీ బీచ్
[మార్చు]పయ్యంబలం సముద్రతీరం, సెయింట్ ఆంగ్లో ఫోర్ట్ మద్య ఉన్న చిన్న సముద్రతీరం కనుక దీనిని బేబీ బీచ్ అంటారు.
మీన్కున్ను సముద్రతీరం
[మార్చు]మీన్కున్ను సముద్రతీరం అళికోడే వద్ద ఉంది. ఇది పట్టణం నుండి కొంతదూరంలో ఉంది.
మాపిల సముద్రతీరం
[మార్చు]మాపిల సముద్రతీరం సెయింట్ ఫోర్ట్‌కు సమీపంలో ఉంది. మాపిల సముద్రతీరానికి చారిత్రక నేపథ్యం ఉంది. ఇది కొలాథిరి రాజులకు రాజధానిగా ఉంది. ఇక్కడ ఉన్న కడలాయి కోట, శ్రీక్రుష్ణాలయం చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. కోట శిథిలాలు, ఆలయం మాపిల సముద్రతీరం నుండి ఇప్పటికీ కనిపిస్తుంటాయి. మాపిల సముద్రతీరం వద్ద ఇండో నార్వేజియన్ కొలాబరేధన్తో ఫిషింగ్ హార్బర్ నిర్మించబడి ఉంది.
కీళున్న ఎళరా సముద్రతీరం
[మార్చు]కేరళ రాష్ట్రంలోని ఏకాంత సముద్రతీరాలలో కీళున్న ఎళరా సముద్రతీరం ఒకటి. ఇది కన్నూరు నుండి 11 కి.మీ దూరంలో ఉంది.
ముళప్పిలంగాడ్ డైవ్- ఇన్ - బీచ్
[మార్చు]కేరళరాష్ట్రంలోని ఒకేఒక డ్రైవ్ ఇన్ బీచ్‌గా ముళప్పిలంగాడ్ డైవ్- ఇన్ - బీచ్ గుర్తింపు ఉంది. ఇది తలస్సేరికి 5కి.మీ దూరం, కన్నూరు నుండి 15 కి.మీ దూరంలో వెడల్పైన వంపు తిరిగి సౌందర్యవంతంగా ఉంది. సముద్రతీరంలో సహజసిద్ధంగా పెరిగిన కొబ్బరి చెట్ల మద్య పాదచార మార్గరహిత రహదారి మార్గం ఉంది. ఇక్కడ నుండి 200 మీ దూరంలో ఉన్న గ్రీన్ ఐలాండ్ దృశ్యం సముద్రతీరానికి మరింద అందం చేకూరుస్తుంది.
ధర్మాడం ద్వీపం
[మార్చు]ధర్మాడం ద్వీపం ధర్మాడం నుండి 100 మీ దూరంలో ఉంది. దీవి వైశాల్యం 20,000 ఎకరాలు. ద్వీపం అంతటా కొబ్బరి చెట్లు, దట్టమైన పొదలతో ముళప్పిలాండ్ బీచ్ నుండి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆటు పోటుల మద్య మనుషులు నడకద్వారా ద్వీపాన్ని చేరుకోవచ్చు. ఇందులో నదీప్రవాహాలు కూడా ఉన్నాయి. ప్రైవేటు యాజమాన్యంలో ఉన్న ఈ ద్వీపంలో ప్రవేశించడానికి అనుమతి అవసరం. ధర్మాడం మునుపు ధర్మపట్టణం అనిపిలువబడేది. ఇది ఒకప్పుడు బౌద్ధమత ప్రాధాన్యత కలిగిన ప్రాంతం.
ఆర్ధికం
[మార్చు]జిల్లాలో ప్రజలు జీవనోపాధికి అధికంగా ఆర్థికంగా వ్యవసాయం, తత్సంబంధిత వృత్తుల మీద ఆధారపడి ఉన్నారు. జిల్లాలో ప్రధానంగా వరి, కొబ్బరి, మిరియాలు, కర్రపెండెలం, పోక, రబ్బర్ వంటి తోటల సాగుచేయబడుతున్నాయి. ఆసియాలోని అతి పెద్ద దాల్చిన చెక్క ఎస్టేట్ నుండి దాల్చినచెక్క ఉత్పత్తి చేస్తుంది. 1767 లో కున్నూరు లోని అంజరకండీ వద్ద బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి చెందిన లార్డ్ బ్రౌన్ ఈ ఎస్టేటును స్థాపించాడు.
వరి
[మార్చు]జిల్లాలో వార్షిక పంటలలో వరి ఆధిక్యత సాధించింది. పంట ఉత్పత్తిని అధికంచేసే ప్రణాళిక కింద వరి పంట సాగులో అధిక ఉత్పత్తుని సాధించింది. వరిపొలాలలో ఇతర పంటలు అధికంగా పండిస్తున్న కారణంగా వరిపంట పండిస్తున్న వ్యవసాయ భూముల వైశాల్యం తగ్గుముఖం పడుతుంది. అయినప్పటికీ జిల్లాలో సరాసరి వరి ఉత్పత్తి హెక్టారుకు 2146 కి.లో. జిల్లా అంతటా కొబ్బరి పుస్కలంగా పండించబడుతుంది. ముంతమామిడి పంటకు జిల్లాకు ప్రత్యేకత ఉంది. తక్కుసారవంతంమైన భూములు విస్తారమైన బీడు భూములు ముంతమామిడి పంటను, దానికి సంబంధించిన పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాయి.
సుగంధద్రవ్యాలు
[మార్చు]జిల్లాలో పండించబడుతున్న సుగంధద్రవ్యాలలో మిరియాలు ప్రధానపాత్ర వహిస్తున్నాయి. మిరియాలు కొబ్బరి, పోక, ఇతర పండ్ల తోటలలో అంతరపంటగా పండించబడుతుంది. జిల్లాలోని కొండప్రాంతంలో రబ్బరు, జీడితోటలు పెంచబడుతున్నాయి. ప్లాంటేషన్ పంటలలో రబ్బర్ పారిశ్రామికంగా అధిక అదాయం ఇచ్చే పంటగా ప్రత్యేకత కలిగి ఉంది. జిల్లాలోని 55% పంట తలిపరంబ తాలూకాలో పండించబడుతుంది. వారు హెక్టారుకు 2000 - 4000 కి.గ్రా రబ్బర్ ఉతపత్తి చేస్తున్నారు.
పరిశ్రమలు
[మార్చు]కన్నూరు జిల్లా ఆరంభకాలం నుండి పారిశ్రామికంగా ప్రధాన్యత కలిగి ఉంది. జిల్లాలో మంచి మట్టి, ఆరోగ్యకరమైన వాతావరణం, పచ్చని అడవులు, విస్తారమైన చేపల నిలువలు, ఖనిజాలు అలాగే రహదారి, రైలు, జలవనరులు మొదలైన మౌలిక సదుపాయాల అభివృద్ధి ఉన్నందువలన జిల్లా పరిశ్రమల అభివృద్ధికి అనుకూల పరిస్థితులను కల్పిస్తుంది. అయినప్పటికీ కన్నూరు జిల్లా పారిశ్రామికంగా తగినంత అభివృద్ధి చెందలేదు. జిల్లాలో ఒక ప్రధాన, 5 చిన్నరహా పారిశ్రామిక వాడలు (ఇండస్ట్రియల్ ఎస్టేట్) ఉన్నాయి. దేశంలోని వల్లపట్నంలో కెల్ట్రాన్ కాంప్లెక్స్, మంగత్తుపరంబ, వెస్టర్న్ ఇండియా ప్లైవుడ్ ప్లైవుడ్ ఉన్నాయి. ఆసియాలో అతిపెద్ద వుడ్ ఆధారిత ప్లేవుడ్ పరిశ్రమల సమూహంగ వెస్టర్న్ ఇండియా ప్లైవుడ్ గుర్తించబడితుంది. జిల్లాలో కాటన్, వస్త్రతయారీ, ప్లైవుడ్ తయారీ సంబంధిత 12 మద్యతరహా సంస్థలు ఉన్నాయి.
చేనేత
[మార్చు]జిల్లాలో ప్రధానంగా చేనేత పరిశ్రమలు, బీడి తయారీ, కాయిర్ మొదలైన సంప్రదాయ పరిశ్రమలుగా ఉన్నాయి. వస్త్రతయారీ పరిశ్రమ మీద ఆధారపడి ఒక లక్ష మంది ప్రజలు జీవిస్తున్నారు. జిల్లాలో వస్త్రతయారీ పరిశ్రమకు 40% చిన్నతరహా యూనిట్లు ఉన్నాయి. వస్త్రతయారీ పరిశ్రమను జిల్లాలో జర్మన్ బసెల్ మిషన్ ప్రారంభించింది. 19వ శతాబ్దంలో కన్నూరులో మొదటి రెడీమేడ్ - గార్మెంటు యూనిట్ స్థాపించబడింది. ఇది జిల్లాలో 50,000 మందికి ఉపాధి సౌకర్యం కల్పిస్తుంది. జిల్లాలో దినేష్ బీడి ప్రముఖ కోపరేటివ్ బీడీ సంస్థగా గుర్తించబడుతుంది. ప్రైవేట్ యాజమాన్యంలో నిర్వహించబడుతున్న సాధుబీడి కంపెనీ ఉంది. సంప్రదాయ సాంకేతికతను ఉపయోగిస్తున్న కాయిర్ సంస్థలు 11,000 మందికి ఉపాధి కల్పిస్తుంది.
చిన్నతరహా పరిశ్రమలు
[మార్చు]జిల్లాలో 6934 చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో 202 సిక్ యీనిట్లు (9.3%) ఉన్నాయి. 4828 యూనిట్లు ఇప్పుడు శక్తివంతంగా పనిచేస్తున్నాయి. పాతిశ్రామిక అభివృద్ధికి అనుకూలంగా ఉన్న కన్నూరు, తలస్సేరి, పయ్యనూరు, తలిపరంబా, ఎరక్కాడు పారిశ్రామికాభివృద్ధి కేంద్రాలుగా గుర్తించబడుతున్నాయి.
జిల్లాలో పట్టణాలు
[మార్చు]కన్నూర్ జిల్లాలో పలు పట్టణాలు ఉన్నాయి.
మునిసిపాలిటీలు
[మార్చు]- తలస్సేరి
- మట్టనూరు
- పయ్యనూరు
- కూతుపరంబా
- తాలిపరంబా
- శ్రీకండపురం
- ఇరిట్టీ
- అంతూరు
- పానూర్
పంచాయితీలు
[మార్చు]- చెరుకున్నూరు
- పెరవూరు
- కెలకం
- వలపట్టణం
- పళయంగాడి
- చక్కరక్కల్
- చిరక్కల్ పుదియతెరు
- పిలతర
- అలకొడే (కన్నురు జిల్లా)
- పప్పినిస్సేరి
2001 - 2011 గణాంకాలు
[మార్చు]చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% p.a. |
1901 | 5,29,623 | — |
1911 | 5,65,261 | +0.65% |
1921 | 5,78,680 | +0.23% |
1931 | 6,62,715 | +1.37% |
1941 | 7,43,322 | +1.15% |
1951 | 9,04,470 | +1.98% |
1961 | 11,77,948 | +2.68% |
1971 | 15,52,809 | +2.80% |
1981 | 19,30,726 | +2.20% |
1991 | 22,51,727 | +1.55% |
2001 | 24,08,956 | +0.68% |
2011 | 25,23,003 | +0.46% |
2018 | 26,15,266 | +0.51% |
source:[5] |
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 25,25,637 [6] |
ఇది దాదాపు. | కువైట్ దేశ జనసంఖ్యకు సమానం.[7] |
అమెరికాలోని. | నెవాడా నగర జనసంఖ్యకు సమం.[8] |
640 భారతదేశ జిల్లాలలో. | 170 వ స్థానంలో ఉంది.[6] |
1చ. కి. మీ జనసాంద్రత. | 852 [6] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 4. 84%.[6] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 1133:1000 [6] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 95. 41%.[6] |
జాతీయ సరాసరి (72%) కంటే. | |
2001 గణాంకాలను అనుసరించి జనసంఖ్య | 24,12,365 [9] |
2001 గణాంకాలను అనుసరించి నగరీకరణలో | ప్రథమ స్థానం |
2011లో గణాంకాలను అనుసరించి నగరీకరణలో | 4 వ స్థానం (ఎర్నాకుళం, త్రిసూర్, కోళికోడ్) |
నగర నివాసితుల శాతం | 50. 35% (సంఖ్య 1, 212, 898) |
సంఖ్యలో నగరప్రజల | ద్వితీయ స్థానం (ప్రథమస్థానం ఎర్నాకుళం) |
హిందువుల శాతం | 61. 47% |
క్రైస్తవులు | 10. 84% |
ముస్లిముల సంఖ్య | 27. 63% |
2001 జిల్లాలోని పట్టణాల సంఖ్య | 45[10] |
2011 జిల్లాలోని పట్టణాల సంఖ్య | 67 (త్రిసూర్ 135) |
విభాగాలు
[మార్చు]కన్నూరు జిల్లాలో 7 పట్టణాలు ఉన్నాయి: కనూరు, కన్నూరు కంటోన్మెంటు, తలస్సేరి, పయ్యనూర్, థాలిపరంబా, కుతుపరంబా, మట్టనూరు.[9]
భాష
[మార్చు]కన్నూరు జిల్లాలో మలయాళం ప్రధానభాషగా ఉంది. స్వల్పంగా కన్నడం, కొంకణి, తులు, గుజరాతి, తమిళం మాట్లాడే ప్రజలు ఉన్నారు. ఆంగ్లో ఇండియన్ ప్రజలకు ఆగ్లం వాడుకభాషగా ఉంది. కన్ననొర్ ఇండో - పోర్చుగీస్ క్రియోల్ కూడా ఇప్పటికీ స్వల్పంగా వాడుకలో ఉంది. కేరళలో నగరీకరణం చెందిన జిల్లాలలో కన్నూరు 6 వ స్థానంలో ఉంది. జిల్లాలో 50% కంటే అధికంగా ప్రజలు నగరాలలో నివసిస్తుంటారు. నగరవాసుల సంఖ్యాపరంగా (12,12,898) కేరళ రాష్ట్రంలో ద్వితీయస్థానంలో ఉంది. మొదటిస్థానంలో ఎర్నాకుళం ఉంది.
పర్యాటకం
[మార్చు]కన్నూరు జిల్లాలోని కొన్ని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు ఈ దిగువ వివరింపబడ్డాయి.[11][12]
- వి- ప్రా కాయల్ ఫ్లోటింగ్ పార్క్. వయలపరా చెంబల్లికుండు.
- స్నేక్ పార్క్, పరాసినిక్కడవు.
- సెయింట్. ఆంగ్లో ఫోర్ట్. కన్నూర్.
- పైథల్మల హిల్స్, నడువిల్.
- పలక్కయం తట్టు, నడువి.
- ఎళిమల హిల్స్, పయ్యనూర్.
- మదయిప్పరా, పళయంగాడి.
- డిస్ట్రిక్ ఫాం, తాలిపరంబా.
- ఎలపీదిక, పెరవూర్.
- హాంగింగ్ బ్రిడిజ్, పెరలస్సేరి.
- హాంగింగ్ బ్రిడ్జ్, కుట్టియేరి.
- కంజిరకొల్లి జలపాతం, పయ్యావూర్.
- చతమంగళం (కన్నూర్)
ప్రయాణసౌకర్యాలు
[మార్చు]రహదారి మార్గం
[మార్చు]మాహే- తలపాడీ పశ్చిమ సముద్రతీరం జిల్లాలోని రహదారి మార్గానికి వెన్నెముక వంటిది. ఇక్కడ జాతీయరహదారి - 17 కన్నురు- మట్టనూరు - ఇరిట్టి రోడ్డు,పప్పినిస్సేరి- పిలథారా రోడ్డు, తలిపరంబ-శ్రీకండపురం రోడ్డు, పయ్యనూరు- మంగుళూరు (కర్నాటక), కోళికోడ్ కన్నురు నుండి 125 కి.మీ దూరంలో ఉన్నాయి. మట్టనూరు వద్ద కన్నూరు వమానాశ్రయం రానున్నది.
తలసేరి
[మార్చు]తలస్సేరి, కన్నురు, కోళికోడ్ జిల్లాలోని చిన్నతరహా నౌకాశ్రయాలుగా ఉన్నాయి. కన్నూరు పురాతన నౌకాశ్రయాలలో ఒకటి. సమీపంలో ఉన్న ఆల్- వెదర్ సీ పోర్ట్ మంగుళూరులో ఉంది. భూ అంతర్గత జలమార్గాలు పెరుంబ, తలిపరంబాలను అనుసంధానిస్తున్నాయి. దీనిని 1766లో కన్నూరు రాజా ఆరంభించాడు. 3 కి.మీ పొడవైన కాలువచు " సుల్తాన్ కాలువ " అంటారు. పశ్చిమంగా ప్రవహిస్తున్న నదులు జలమార్గ రవాణాకు ఉపకరిస్తున్నాయి. కుప్పం నది జలమార్గం పొడవు 244 కి.మీ, వలపట్టణం జలమార్గం పొడవు 55 కి.మీ, అంజరకండి జలమార్గం పొడవు 23 కి.మీ.
వాయుమార్గం
[మార్చు]2009లో " కన్నూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ " మట్టనూరు వద్ద నిర్మించాలని ప్రతిపాదించబడింది.
ఆర్ధికం
[మార్చు]కన్నూర్ జిల్లా " లాండ్ ఆఫ్ లూం "గా ప్రసిద్ధి చెందింది. జిల్లాలో నేత పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. జిల్లాలోని ఆలయాలలో పండుగలు కోలాహలంగా నిర్వహించబడుతుంటాయి. ఉత్తర కేరళాలో ప్రాధాన్యత కలిగిన తెయ్యం సంప్రదాయ నృత్యానికి జిల్లా కేంద్రంగా ఉంది. తెయ్యం అనుబంధిత కవ్వు అనే చిన్న మందిరాలు జిల్లా అంతటావిస్తరించి ఉన్నాయి.
వ్యవసాయం
[మార్చు]జిల్లాలో అత్యధిక ప్రజలకు నేరుగా అయినా పరోక్షంగా అయినా వ్యవసాయమే జీవనాధారం. జిల్లాలో వరి, కొబ్బరి, మిరియాలు, జీడిపప్పు, టాపికా, అరెకానట్, తోటల (రబ్బర్) పెంపకం మొదలైన పంటలు ప్రధానంగా ఉన్నాయి. 1767లో బ్రిటిషు ఇండియాకు చెందిన లార్డ్ బ్రౌన్ స్థాపించిన యాలుకల ఉత్పత్తి సంస్థ ఆసియాలో అత్యంత బృహత్తరమైనదిగా భావిస్తున్నారు. ఇది కన్నూర్ జిల్లాలోని అంజరకండిలో ఉంది.
పంటలు
[మార్చు]వార్షిక పంటలలో వరిపంట ప్రథమస్థానంలో ఉంది. పంటవిధానంలో చేపట్టిన పంటవిధానం ఫలితంగా గణనీయమైన వరిఉత్పత్తి సాధ్యమైంది. అయినప్పటికీ క్రమంగా వరిపంట పండించబడుతున్న భూమిశాతం క్షీణిస్తూ ఉంది. వరి పొలాలు ఇతర ఉపయోగాలకు ఉపయోగించబడుతున్నాయి. సరాసరిగా హెక్టారుకు 2, 146 కి. గ్రా పండించబడుతుంది. వరిపంట తరువాత స్థానంలో కొబ్బరి పంటకు ప్రాధాన్యత ఉంది. జిల్లా అంతటా కొబ్బరి విస్తారంగా పండించబడుతుంది. జిల్లా జీడిపప్పు పరిశ్రమకు ప్రసిద్ధిచెందింది. జీడిపప్పు పండించడంలోను, తయారీలోనూ జిల్లా ప్రధానపాత్ర వహిస్తుంది. జిల్లాలో అధికంగా ఉన్న ఉపయోగంలేని బీడుభూములను జీడిమామిడి పంటభూములుగా మార్చి జీడిపంటను అధికం చేయడం, సంబధిత పరిశ్రమలను అధికం చేయడానికి అవకాశాలు ఉన్నాయి.
మసాలాదినుసులు
[మార్చు]మసాలా దినుసులలో మిరియాలపంట ప్రధానపాత్ర వహిస్తుంది. మిరియాలపంట కొబ్బరిపంటకు అంతరపంటగా పండించబడుతుంది. కొండప్రాంతాలలో రబ్బర్ పంట, జీడిమామిడి అంతరపంటగా పండించబడుతుంది. తోటపంటలలో రబ్బర్ పంట పారిశ్రామికవాణిజ్య పంటగా ప్రాధాన్యత వహిస్తుంది. కన్నూరు జిల్లాలోని 55% రబ్బరు పంట ఇరిట్టీ తాలూకాలో పండించబడుతుంది. రబ్బరు పంట హెక్టారుకు 2000 - 4000 కి. గ్రా పండించబడుతుంది.
పరిశ్రమలు
[మార్చు]కన్నూఋ జిల్లా ఆరంభకాలం నుండి పారిశ్రామిక ప్రాధాన్యత కలిగి ఉంది. పంటపొలాలు, అనుకూలవాతావరణం, సుసంపన్నమైన అరణ్యసంపద, మత్స్య సమృద్ధి, ఖనిజ సంపద, రహదారి, రైలు, జలమార్గాల సౌకర్యం మొదలైన సహజససంపద, మానవాధారిత వనరులు జిల్లాకు విస్తారంగా పారిశ్రామికాభివృద్ధికి సహకరిస్తున్నాయి. జిల్లాలో కెల్టాన్ కాంప్లెక్స్, మంగత్తుపరంబ, వెస్టర్న్ ఇండియా ప్లైవుడ్, వలప్పట్టణం మొదలైన ప్రముఖ పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో 12 మద్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. పత్తి, వస్త్రాల తయారీ, ప్లైవుడ్ తయారీ వీటిలో ప్రధానంగా ఉన్నాయి.
చేనేత పరిశ్రమ
[మార్చు]జిల్లాలో చేనేత, బీడి, కొబ్బరినార ప్రధాన వాణిజ్య పరిశ్రమలుగా ప్రధాన్యత వహిస్తున్నాయి. టెక్స్టైల్ పరిశ్రమను ఆధారంచేసుకుని 1, 00, 000 మంది జీవిస్తున్నారు. జిల్లాలోని నిన్నతరహా పరిశ్రమలలో చేనేతపరిశ్రమలు 40% భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఇవి 19వ శతాబ్దంలో జర్మన్ బాసెల్ మిషన్లను ఉపయోగించింది. 19వ శతాబ్దం చివరినాటికి కన్నూరులో మొదటి రెడీమేడ్ దుస్తుల తయారీ యూనిట్, కుతుంపరంబాలో మొదటి హొసియరీ యూనిట్ స్థాపించబడ్డాయి. బీడీ పరిశ్రమద్వారా 50, 000 మందికి ఉపాధి లభిస్తుంది. జిల్లాలో ది దినేష్ బీడీ కోపరేటివ్, ప్రైవేటు యాజమాన్యం వహిస్తున్న సాధు బీడి ఉన్నాయి. టెకాయనార వ్యాపారం సంప్రదాయంలో భాగంగా ఉంటూ 11, 000 మందికి ఉపాధి కల్పిస్తుంది.
కుటీర పరిశ్రమలు
[మార్చు]జిల్లాలో 6, 934 చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో 202 (9. 3%) సిక్ (బలహీన) యూనిట్లు ఉన్నాయి. 4, 828 ఇతర యూనిట్లు పనిచేస్తున్నాయి. 162 ఇండస్ట్రియల్ సొసైటీలు 4 పవర్ లూం సొసైటీలు ఉన్నాయి. కన్నూరు, తలస్సేరి, పయ్యనూర్, తాలిపరంబా, ఎడక్కాడ్ అభివృద్ధి కేంద్రాలుగా గుర్తించబడుతున్నాయి.
వృక్షజాలం, జంతుజాలం
[మార్చు]కన్నూర్ జిల్లా వృక్షజాలంతో సుసంపన్నమై ఉంది. సముద్రతీరాలలో మినహా మిగిలిన ప్రాంతాలలో సహక్షమైన వృక్షజాలం దట్టంగా ఉంది. అనుకూలవాతావరణం వైవిధ్యమైన వృక్షజాలానికి సహకరిస్తుంది. సతహరితారణ్యంలో ప్సామ్మోఫైటె, మాంగ్రోవ్ వృక్షాలు కనిపిస్తుంటాయి.
తీరప్రాంతం
[మార్చు]సముద్రతీర ప్రాంతం సన్నగా ఉండి ఇందులో రెండవతరహా మట్టి (వదులుగా లేక గట్టిగా కాక మధ్యంతరం) ఉంటుంది. ఇది స్వల్పమైన వృక్షజాలానికి (ప్సామ్మోఫైటె) మాత్రం పెరగడానికి అనుకూలంగా ఉంది. స్వల్పంగా ఉండే చెట్లు చిన్నవిగా, పొట్టిగా ఉంటాయి. ఇక్కడ మాంగ్రోవ్ వృక్షాలు దర్శనం ఇస్తుంటాయి. నదీప్రవాహ ప్రాంతాలు, వెనుకజలాలు (బ్యాక్ వాటర్) ప్రాంతాలలో ఇవి కనిపిస్తుంటాయి. మానవ ఆక్రమణల కారణంగా సముద్రతీర ప్రాంతాలలో మార్పులు సంభవిస్తున్నాయి.
మిడ్ లాండ్
[మార్చు]జిల్లాలో ప్రధానభాగం మిడ్ లాండ్లో ఉంది. ఇక్కడ అనేక కొండలు, గుంటలు ఉంటాయి. ఇది ఎత్తుపల్లాలతో అసమానంగా ఉండి పశ్చిమ కనుమల నిటారైన పర్వతప్రాంతంలో కలిసిపోతుంది. ఇక్కడ మట్టి మధ్యంతరంగా ఉంటుంది. ఇక్కడ ఆకురాల్చు అరణ్యాలు, సతతహరితారణ్యం మిశ్రితమై ఉంటుంది. ఇక్కడ వార్షిక, బహువార్షిక మొక్కలు పెరుగుతుంటాయి.
పర్వత ప్రాంతం
[మార్చు]మిడ్‌లాండ్ ప్రాంతంలో పర్వతశ్రేణి క్రమంగా పశ్చిమకనుమల పర్వతాలలో కలిసిపోతాయి. ఇక్కడ మట్టి ఎరుపురంగులో, వదులుగా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా అరణ్యం నిండి ఉంటుంది. ఇక్కడ చెదురుమదురుగా టేకు, వెదురుపొదలు నిండి ఉంటాయి. క్రమంగా నాణ్యమైన అరణ్యప్రాంతం పచ్చికమైదాన ప్రాంతంగా మారుతూ ఉంది.
అరళం అభయారణ్యం
[మార్చు]అరళం అభయారణ్యం 55 చ. కి. మీ వైశాల్యంలో విస్తరించి ఉంది. ఇక్కడ అసమానమై ప్రాంతంలో విస్తరించి ఉన్న అరణ్యం, పశ్చిమ కనుమల కొండచరియలు విస్తరించి ఉన్నాయి. ఇది 1984లో స్థాపించబడింది. అభయారణ్యం ప్రధానకార్యాలయం కన్నూరు నగరానికి 55 కి. మీ దూరంలో ఉన్న చీన్నపట్టణం అయిన ఇరిట్టిలో ఉంది. అభయారణ్యం అరళంలో ఉన్న " సెంట్రల్ స్టేట్ ఫాం " ఆనుకుని ఉంది. అరళం అభయారణ్యం ముళకున్ను పంచాయితీలో ఉంది. ముళకున్ను పర్యాటకేంద్రంగా ఉంది.
ఉన్నత శిఖరం
[మార్చు]జిల్లా ప్రాంతం సముద్రమట్టానికి 50 నుండి 1145 మీ వరకు ఉంటుంది. జిల్లాలోని ఎత్తైన శిఖరం కట్టి బెట్టా ఎత్తు సముద్రమట్టానికి 1145 మీ ఎత్తులో ఉంటుంది. ఇది ఉష్ణమండల, అర్ధ సతతహరితారణ్యాలతో నిండి ఉంటుంది. అరళం అభయారణ్యంలో వైవిధ్యమైన వృక్షజాలం, జంతుజాలం ఉంటుంది. జింకల మందలు, ఏనుగులు, అడవి పందులు, దున్నపోతులు ఉంటాయి. చిరుత, అడవిపిల్లి, ఉడుతలు కూడా అరుదుగా కనిపిస్తుంటాయి.
విద్య
[మార్చు]14వ -15వ శతాబ్ధాలలో కోలాతిరి పాలనలో జిల్లాలో 1, 293 పాఠశాలలు, 187 హైస్కూల్స్ ఉన్నాయి. కేరళా మొత్తంలో తాలిపరంబా విద్యాకేంద్రంగా ప్రసిద్ధిచెందింది. ఆరంభకాలంలోనే ఇది ప్రజలను విద్యావంతులను చేసి, చైతన్యపరచి, సాంస్కృతికంగా అభివృద్ధి పరచడంలో విజయం సాధించింది. ఆరంభకాలంలో ఎళుతచ్చన్ ఆధ్వర్యంలో ఎలుత్తు పళ్ళి (గ్రామ పాఠశాల) నిర్వహించబడ్డాయి. ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రాథమిక విద్యను నేర్పించే వాడు. ఇక్కడ శిక్షణపొందిన తరువాత విద్యార్థులు ఆయుధాలను ప్రయోగించడం, జిమ్నాస్టిక్స్ శిక్షణకొరకు కళరి పాఠశాలలకు పంపబడ్డారు. తరువాత వారు చాక్కగా శిక్షణ పొందిన ఉపాద్యాయులవద్ద సంస్కృతం నేర్చుకోవడానికి వేదపాఠశాలకు పంపబడేవారు. కళరికి, వేద పాఠశాలలకు ఈ జిల్లా ప్రసిద్ధి చెందింది. కళరిపయట్రు కళలకు ఈ జిల్లా ప్రత్యేకత సంతరించుకుంది.
పశ్చిమదేశాల విద్యావిధానం
[మార్చు]16వ శతాబ్దం మద్యకాలం నుండి జిల్లాలో పాశ్చాత్యవిద్య ప్రవేశించింది. 1856 మార్చి 1న స్థాపించిన " బాసిల్ జర్మన్ మిడిల్ స్కూల్ " జిల్లాలో మొదటి పాశ్చాత్య పాఠశాలగా గుర్తించబడింది. తలస్సేరి వద్ద ఉన్న " బ్రెన్నెన్ స్కూల్ " స్థాపించబడింది. 1862లో మిస్టర్ బ్రెన్నెన్ (మాస్టర్ అటెండెంట్ ఆఫ్ తలస్సేరి " ఇచ్చిన డొనేషన్‌తో ఈ పాఠశాల స్థాపించబడింది.
కన్నౌర్ విశ్వవిద్యాలయం
[మార్చు]1996 కన్నౌర్ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. పయ్యనూర్ వద్ద 1999 లో పరియం మెడికల్ కాలేజ్ , 2006లో కన్నౌర్ మెడికల్ కాలేజ్ 500 పడకల సౌకర్యంతో " సూపర్ స్పెషల్ హాస్పిటల్ " స్థాపించబడింది.
కాలేజీలు
[మార్చు]- ఆర్ట్స్ అండ్ సైంస్ కాలేజ్ : గవర్నమెంట్ బ్రెన్ కాలేజ్, ఎస్. ఎన్. కాలేజ్ కన్నౌర్, పయ్యనూర్ కాలేజ్, సర్ సయద్ కాలేజ్, తాలిపరంబా, నిర్మలగిరి కాలేజ్ కుతుపరంబా, మహాత్మాగాంధి కాలేజ్, ఇరిట్టీ.
- ఇంజనీరింగ్ కాలేజ్ : గవర్నమెంటు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (కన్నౌర్), మలబార్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అంజరకండీ.[13] కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (తలస్సేరి), విమల్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ (చంపేరి), శ్రీ నారాయణ గురు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (పయ్యనూర్).
- కన్నూర్ జిల్లాలోని ధర్మశాల వద్ద 13వ " సెంటర్ ఫర్ నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ " కి ఆతిథ్యం ఇచ్చింది. పయ్యనూరులో ప్రఖ్యాతిగాంచిన " కాలడి శంకారాచార్య సంస్క్రీట్ యూనివర్శిటీ " రీజనల్ సెంటర్ స్థాపించబడింది.
క్రీడలు
[మార్చు]జిల్లాలో అంతర్జాతీయంగా క్రీడారంగంలో గుర్తింపు పొందిన క్రీడాకారులు ఉన్నారు. స్వాతంత్రానికి ముందుగా సైనికకేంద్రాలలో ఉన్న ఆంగ్లేయులు హాకీ, క్రికెట్, ఫుట్ బాల్ మొదలైన క్రీడలను ప్రవేశ్పెట్టారు. ఫోర్ట్ మైదానం, పోలీస్ మైదానం యువకులకు క్రీడలలో శిక్షణపొందడానికి విస్తారమైన అవకాశాలు జల్పించాయి. ఆకాలంలోనే సి. డి. ఆర్. ఇ. ఫుట్ బాల్ టీం, హాకీటీం ఏర్పాటుచేయబడ్డాయి. అదే సమయంలో కళరిపయట్రు మొదలైన సంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ కళలు కూడా జిల్లాలో సుసంపన్నంగా ఉన్నాయి.
స్వతత్రం తరువాత
[మార్చు]స్వతంత్రం తరువాత ఫుట్ బాల్ క్లబ్ జిల్లా అంతటా క్రీడాస్పూర్తి కలిగించడంలో విజయం సాధించింది. జిల్లాలో కన్ననోర్ స్పిరిటెడ్ యూత్స్, లక్కీ స్టార్ కన్ననోర్, ది బ్రదర్స్ క్లబ్ కన్ననోర్, జింఖనా క్లబ్ కన్ననోర్ ప్రాబల్యత కలిగి ఉన్నాయి. జిల్లాలో గుర్తింపు పొందిన డీ. క్రజ్, సోమన్, దాసన్, వి. పి. సత్యన్, గోల్‌కీపర్ ముస్తాఫా మొదలైన క్రీడాకారులు ఉన్నారు. శ్రీ నారాయణా కాలేజ్(తొట్టడా) క్రీడాకారుల నర్సరీగా భావించబడుతుంది.
దేవానంద్
[మార్చు]వీరిలో కాలేజ్, విశ్వవిద్యాలయ స్థాయిలో బి. దేవానంద్ కేఫ్టాన్ స్థానానికి ఎదిగాడు. దేవానంద్ తరువాత ఇండియన్ యూత్ టీం తరఫున బ్యాంకాక్‌లో క్రీడలలలో పాల్గొన్నాడు. తరువాత దేవానందును టాటా ఫుట్ బాల్ టీంలో (ముంబయి]] ఆడాడానికి ఎన్నికచేయబడ్డాడు.
ఇతర క్రీడాకారులు
[మార్చు]జిల్లాలో క్రీడలలో రాణించిన క్రీడాకారులలో కేరళకు చెందిన మణి కేప్టన్ షిప్లో టీం " సంతోష్ కప్ " సాధించింది. డెంసన్ దేవదాస్ " స్పోర్టింగ్ క్లబ్ డీ గోవా " లీగ్, ఢిల్లీ డైనమోస్ (ఐ. ఎస్. ఎల్) తరఫున క్రీడలలో పాల్గొటున్నాడు. సి. కె. వినీత్ బెంగుళూరు ఎఫ్. సి తరఫున ఐ- లీగ్‌లో కన్నూర్ నుండి స్ట్రైకర్‌గా పాల్గొంటున్నాడు. వినీత్ కేరళా బ్లాస్టర్స్ టీం తరఫున ఇండియన్ సూపర్ లీగ్ క్రీడలలో పల్గొన్నాడు. కేరళ ఫుట్ బాల్‌కు ఒకప్పుడు కన్నూర్ మక్కాగా భావించబడింది.
జిమ్మీ జార్జ్
[మార్చు]జిమ్మీ జార్జ్ వెటరన్ వాలీబాల్ క్రీడాకారుడు. కణ్ణుర్ జిల్లాలో పుట్టి పెరిగి " ఇటాలియన్ క్లబ్ " తరఫున క్రీడలలో పాల్గొని ప్రపంచంలోని 10 మంది స్టైకర్లలో ఒకడుగా ఎన్నిక చేయబడ్డాడు.
హాకీ
[మార్చు]కన్నూర్, తలస్సేరిల నుండి మిలటరీ టీ తరఫున పలు హాకీ పోటీలలో పాల్గొన్నారు. క్రికెట్, బ్యాడ్మింటెన్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, రెస్ట్లింగ్, వాలీబాల్ మొదలైన క్రీడలు గ్రామీణ, నగర ప్రాంతాలలో ఆదరణ కలిగి ఉన్నాయి. గ్రామీణప్రాంతంలో యువకులు వాలీబాల్ అంటే ఆసక్తి కనబరుస్తున్నారు. కన్నూరుకు చెందిన మునుపటి ఇండియన్ హాకీ గోల్‌కీపర్ " మాన్యుయల్ ఫ్రెడరిక్ " కేరళా తరఫున క్రికెట్, హాకీ క్రీడలలో పాల్గొన్నాడు.
శిక్షణాలయాలు
[మార్చు]1976 లో పాఠశాలలలో క్రీడావిభాగాలు ఆరంభం అయ్యాయి. ఒక విభాగం కన్నూర్ జిల్లాలో కూడా ఆరంభించబడింది. క్రీడావిభాగాలు ప్రభుత్వ హైయ్యర్ సెకండరీ స్కూల్‌తో (కన్నూర్) అనుసంధానితమై ఉంది. కన్నూర్ జిల్లా పి. టి. ఉషా, ఎం. డి. వలసమ్మా మొదలైన అథ్లెట్లను తయారుచేసింది. లీలమ్మా థోమస్, మోలీ బెనెడిక్ట్ మొదలైన బ్రీడాకారిణులు బ్యాడ్మింటన్‌లో రాణించారు. అనితారత్నం, ఆనందవల్లి వాలీబాల్‌లో గుర్తింపు పొందారు. ఎ. డి. వలసమ్మా, మెర్సీ మాథ్యూలకు వేదికగా సహకరించింది. జిల్లాకు చెందిన బి. కె. బాలచంద్రన్, వి. పి. సత్యన్, డీ. క్రజ్, రాజన్, రమణన్, సుగునన్, సి. ఎం. చిదానందన్, బి. దేవానంద్, జార్జి మొదలైన క్రీడాకారులు ఫుట్ బాల్ లోను, ఒలింపియన్ మాన్యుయల్ ఫెడరిక్ (హాకీ) లోనూ పాల్గొన్నారు. క్రికెట్ క్రీడాకారులు వెస్ట్‌లైన్, లెస్లీ ఫోర్ట్ మైదానంలో శిక్షణ పొందారు.
బాడ్మింటన్
[మార్చు]" సౌత్ ఇండియన్ బ్యాడ్ మింటన్ " తరఫున టి. కె. రామక్రిష్ణన్, కుమరన్ పాల్గొన్న కారణంగా కన్నూర్ ప్రత్యేకత సంతరించుకుంది. వెయిట్ లిఫ్టింగ్‌లో ఎ. ఎం. భరతన్ (ఎర్లీ ఫిఫ్టీస్) చరిత్ర సృష్టించాడు. కన్నూర్‌కు చెందిన నెల్లియరీ క్రిష్ణన్ నాయర్ 1951 లో నిర్వహించబడిన ఆసియన్ క్రీడలలో పాల్గొని వెయిట్ లిఫ్టింగ్‌లో పాల్గొన్న మొదటి మలయాళీగా గుర్తింపు పొందాడు. అరియబంధు, తికండీ జిమ్నాసియం, పోతేరి జిమ్నాసియం, కణ్ణనోర్ బార్బెల్ క్లబ్ పురాతనకాలంలో వెయిట్ లిఫ్టింగ్, రెస్ట్లింగ్, బాక్సింగ్, బాడీబిల్డింగ్ కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి.
క్రికెట్
[మార్చు]క్రికెట్ క్రీడ మొదటిసారిగా కణ్ణుర్లో ఆరంభమైందని విశ్వసించబడుతుంది. యునైటెడ్ కింగ్డం ఇది ఆరంభించింది. అందువలన భారతదేశంలో క్రికెట్ జన్మస్థలం కన్నూర్ జిల్లా అని భావిస్తున్నారు. కొన్ని సంవత్సరాలకు ముందు జిల్లా క్రికెట్ అసోసియేషన్ 200 వ యానివర్సరీ జరిపుకుంది. ఇక్కడ నిర్వహించబడిన ఉత్సవానికి ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు " దిలీప్ వెంగ్‌సర్కార్ " పాల్గొన్నాడు.
ఆరాధనా ప్రదేశాలు
[మార్చు]కన్నూర్ జిల్లాలో పెద్దసంఖ్యలో ఆలయాలు, చర్చీలు, మసీదులు ఉన్నాయి. వీటిలో " పరాసినిక్కడవు " ఆలయం, ది తలాప్ ఆలయం, కొట్టియూర్ ఆలయం ప్రఖ్యాతి చెందాయి. చర్చిలలో బుర్నస్సేరి, తాలిపరంబా, తలస్సేరి చర్చిలు ప్రాబల్యత కలిగి ఉన్నాయి. ఆయిక్కర తాలిపరంబా, తలస్సేరిలో ఉన్న మసీదులు అత్యత విశాలమైనదిగా గుర్తించబడుతుంది.
ప్రముఖులు
[మార్చు]- పళసి రాజా - ప్రస్తుత కన్నూర్ ప్రాంతాన్ని పాలించిన రాజు.
- ఎ. కె. గోపాలన్ - రాజకీయవాది, కమ్యూనిస్ట్ నాయకుడు, లోక్ సభ మొదటి ప్రతిపక్షనాయకుడు.
- ఎ. కె. నయనార్- గతంలో 3 మార్లు కేరళ ముఖ్యమంత్రి పదవి వహించాడు.
- కె. కరుణాకరన్ - గతంలో కేరళ ముఖ్యమంత్రి పదవి వహించాడు. కాంగ్రెస్ నాయకుడు.
- ఇ. అహ్మద్ - గత రాష్ట్ర రైల్వే మంత్రి.
- కండపల్లి రామచంద్రన్ - పోర్ట్ ఆఫ్ కేరళ మంత్రి.
- కండనపల్లి రామచంద్రన్-
- కావ్యామాధవన్- సినిమా నటి.
- కైతప్రం దామోదరన్ నంబూద్రి- లిరిక్ రచయిత, సంగీత దర్శకుడు, గాయకుడు, మాటలరచయిత, కర్నాటక గాయకుడు.
- కె. పి. పి. నంబియార్. - పారిశ్రామిక మంత్రి.
- ఎం. వి. రాఘవన్ - గత మంత్రి
- పి. కె. శ్రీమతి- ఎం. పి. -
- పినరాయి విజయన్ - గత సి. పి. ఎం. జనరల్ సెక్రెటరీ, కేరళ ముఖ్యమంత్రి.
చలన చిత్ర కళాకారులు
[మార్చు]- శ్రీనివాసన్ - నటుడు.
- ఎం. ఎన్. నంబియార్. - నటుడు.
- షమ్నా కాసిం - నటుడు.
- వినీత్ శ్రీనివాసన్ - నటుడు.
- ధ్యాన్ శ్రీనివాసన్ - నటుడు.
- వినీత్ కుమార్- నటుడు.
- వినీత్- నటుడు.
- గీతూ మోహన్ దాస్- నటుడు.
- నివేద్ థోమస్ - నటుడు.
- శ్రుతి లక్ష్మీ- నటుడు.
- మంతా మోహందాస్ - నటుడు.
- సనూప్ సంతోష్ - నటుడు.
- సంవృతా సునీల్ - నటుడు.
- మంజు వారియర్ - నటి
- సలీం - అహమద్ - చిత్రదర్శకుడు, చిత్ర నిర్మాత, మాటల రచయిత.
- కన్నూర్ రాజన్ - సంగీత దర్శకుడు
- కె. రాఘవన్ - సంగీత దర్శకుడు.
రచయితలు
[మార్చు]- సుకుమార్ అళికోడే - రచయిత.
- సంజయన్ - రచయిత.
- పద్మనాభన్ - రచయిత
క్రీడాకారులు
[మార్చు]- వి. పి. సత్యన్- ఫుట్ బాల్ ప్లేయర్.
- జిమ్మీ జార్జ్ - వాలీ బాల్ ప్లేయర్.
- తిను లుక్కా - అథ్లెట్.
- మూర్కొత్ రామున్ని - ఫైటర్ పైలట్
- సి. పి. కృష్ణన్ నాయర్ - లీలా గ్రూప్ హోటెల్ వ్యవస్థాపకుడు.
- రోనాల్డ్ లింస్డేల్ పెరియరా - అడ్మిరల్
- మట్టనూర్ శంకరన్ కుట్టి - పర్క్యూషనిస్ట్.
- సి. కె. లక్ష్మణన్ - మొదటి మలయాళీ ఒలింపియన్.
చలన చిత్రాలు
[మార్చు]- తట్టాతిన్ మరయదు.
- ఒరు వడక్కన్ మరయదు.
- మలర్వాడి ఆర్ట్స్ క్లబ్
- వీండుం కన్నూర్.
- మకల్కు
- బల్రాం వర్సెస్ తారాదాస్
- కన్నూర్ డీలక్స్
- ఇరువట్టం మనవాట్టి
- వెల్లిమూంగ
- అయల్ కథ ఎళుదుకయను
మూలాలు
[మార్చు]- ↑ "List of Districts in Kerala - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-06-10.
- ↑ "Untitled Document". web.archive.org. 2014-07-25. Archived from the original on 2014-07-25. Retrieved 2023-06-03.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Arakkal royal family". Archived from the original on 2012-06-05. Retrieved 2016-12-30.
- ↑ "Pazhassi Raja Museum and Art Gallery, Kozhikode - Kerala Tourism". Archived from the original on 15 నవంబరు 2013. Retrieved 5 April 2015.
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in.
- ↑ 6.0 6.1 6.2 6.3 6.4 6.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Kuwait 2,595,62
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Nevada 2,700,551
- ↑ 9.0 9.1 Indian Census
- ↑ [1]
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2010-11-28. Retrieved 2014-06-30.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-25. Retrieved 2014-06-30.
- ↑ "Malabar Institute of Technology Anjrakandy". Archived from the original on 18 మే 2015. Retrieved 15 May 2015.