కామేశ్వరీ శతకము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కామేశ్వరీ శతకము
కవి పేరుతిరుపతి వేంకట కవులు
మొదటి ప్రచురణ తేదీ1925
దేశంభారతదేశం
భాషతెలుగు
పద్యం/గద్యంపద్యకావ్యం
మీడియా రకంముద్రణ
మొత్తం పద్యముల సంఖ్య107
మొత్తం పుటలు20
అంతర్జాలం లోవికీసోర్సు లో కామేశ్వరీ శతకము
కీర్తించిన దైవంకామేశ్వరి
ముద్రాపకుని పేరుచెలికాని లచ్చారావు
ముద్రణా శాలమినర్వా ప్రెస్, బందరు
శతకం లక్షణంభక్తిశతకం
కామేశ్వరీ శతకము.jpg

దివాకర్ల తిరుపతి శాస్త్రి (1872-1919), చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి (1870-1950) - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు. ఈ గ్రంథాన్ని తిరుపతి శాస్త్రి మరణానంతరం చెళ్ళపిళ్ల రచించారు. కానీ తన జంట కవిపై అభిమానంతో తిరుపతి వేంకటేశ్వరులన్న జంట పేరిటే ప్రచురించడం విశేషం. "కామేశ్వరీ" అను మకుటంతో రచించబడిన ఈ శతకంలో 107 శార్ధూల, మత్తేభ పద్యాలు ఉన్నాయి.

కొన్ని పద్యాలు[మార్చు]

మొదటి పద్యం[మార్చు]

శా. శ్రీరామారమణాదినిర్జరశిరస్సేవ్యంబు సంసారసౌ
ఖ్యారామాంకురదోహదంబు పరితాపాసార మత్యంతశో
భారమ్యంబు పరార్థదాయకము నీ పాదంబు మోదంబు కై
వారం గొల్తు నమస్కరింతు మది సంభావింతు గామేశ్వరీ. 1

చివరి పద్యం[మార్చు]

శా. శ్రీరంజిల్లెడిపద్యము ల్శతకమై చెన్నొంద నీమీద నే
నారంభించిన దాది ని న్నడుగునా యాకోర్కులన్ గొన్ని మున్
దీరన్ దీరుచునుండె దీర గల నీ తీ ర్కొంత మాచ్యార్థతన్
గూరె న్వచ్చెడి దాని సూచనలెఱుం గున్ గాదె? కామేశ్వరీ. 107

ముద్రణ[మార్చు]

దీని మూడవకూర్పు 1934 సంవత్సరంలో బందరు మినర్వా ప్రెస్ లో ముద్రించబడింది.

మూలాలు[మార్చు]

Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:


శతకములు
ఆంధ్ర నాయక శతకము | కామేశ్వరీ శతకము | కుక్కుటేశ్వర శతకము | కుప్పుసామి శతకము | కుమార శతకము | కుమారీ శతకము | కృష్ణ శతకము | గాంధిజీ శతకము | గువ్వలచెన్న శతకము | గోపాల శతకము | చక్రధారి శతకము | చిరవిభవ శతకము | చెన్నకేశవ శతకము | దాశరథీ శతకము | దేవకీనందన శతకము | ధూర్తమానవా శతకము | నరసింహ శతకము | నారాయణ శతకము | నీతి శతకము | భారతీ శతకము | భాస్కర శతకము | మారుతి శతకము | మందేశ్వర శతకము | రామలింగేశ శతకము | విజయరామ శతకము | విఠలేశ్వర శతకము | వేమన శతకము | వేంకటేశ శతకము | వృషాధిప శతకము | శిఖినరసింహ శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | శ్రీ కాళహస్తీశ్వర శతకము | శ్రీవేంకటాచల విహార శతకము | సర్వేశ్వర శతకము | సింహాద్రి నారసింహ శతకము | సుమతీ శతకము | సూర్య శతకము | సమాజ దర్పణం | విశ్వనాథ పంచశతి | విశ్వనాథ మధ్యాక్కఱలు | టెంకాయచిప్ప శతకము | శ్రీగిరి శతకము | శ్రీకాళహస్తి శతకము | భద్రగిరి శతకము | కులస్వామి శతకము | శేషాద్రి శతకము | ద్రాక్షారామ శతకము | నందమూరు శతకము | నెకరు కల్లు శతకము | మున్నంగి శతకము | వేములవాడ శతకము