చక్రధారి శతకము
చక్రధారి శతకము | |
---|---|
కవి పేరు | పింగళి వేంకట సుబ్రహ్మణ్య కవి |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మకుటం | చక్రధారీ! |
పద్యం/గద్యం | పద్యములు |
ఛందస్సు | సీసపద్యము |
ముద్రణా శాల | వాణీ ముద్రాక్షరశాల, బెజవాడ |
శతకాలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. వివిధ శతక పద్యాలు జనసామాన్యం నోళ్లలో నాని జాతీయాలు, సామెతల స్థాయిలో నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎందరో తెలుగు కవులు శతకాలు రచించారు. ఆ కోవలోనిదే ఈ చక్రధారి శతకం. "చక్రధారీ!" అనే మకుటంతో ఈ పద్యాలను పింగళి వేంకట సుబ్రహ్మణ్య కవి రచించారు.
ఈ శతకం గుండవరపు మల్లికార్జునరావు గారి ద్రవ్యసహాయముతో 1933 సంవత్సరంలో బెజవాడలోని వాణీ ముద్రాక్షరశాల యందును, 1935 సంవత్సరంలో గుంటూరు వాణీ ముద్రాక్షరశాల యందు ముద్రించబడింది.
కొన్ని పద్యాలు
[మార్చు]సీ. శ్రీజనార్ధనశౌరి సిరియు భూదేవియు
చేరియిర్వంకల సేవజేయ
వాణీశ్వరుడుగొల్వ వరశచీపతివేడ
శ్రీరతీపతిమ్రొక్క శీఘ్రముగను
సనకసాదులువచ్చి సంస్తుతింపవిశేష
ఖేచరాదులువచ్చి కీర్తినెన్న
మౌనివరులువచ్చి మధురభాషలుబల్క
సాధువాదములెల్ల సందడింప
లోకపాలురు మొదలు సు శ్లోకులెల్ల
ప్రాకటంబుగ గొనియాడ భక్తకోటి
కేవిపత్తులు రానీక నెపుడుబ్రోచు
చక్రధారీశ్రి తమనోబ్జ చయవిహారి.