విఠలేశ్వర శతకము
విఠలేశ్వర శతకము | |
కృతికర్త: | కూరెళ్ల విఠలాచార్య |
---|---|
ముద్రణల సంఖ్య: | 5000 |
ముఖచిత్ర కళాకారుడు: | కూరెళ్ళ శ్రీనివాస్ |
దేశం: | భారత దేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | గేయ కవిత్వం |
ప్రచురణ: | మిత్రభారతి(నల్లగొండ) |
విడుదల: | ఏప్రిల్ 2000 |
ప్రచురణ మాధ్యమం: | పుస్తకము |
పేజీలు: | 76 |
విఠలేశ్వర శతకమును రచించినది నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామ మధురకవి డా. కూరెళ్ల విఠలాచార్య.[1]
ఉదాహరణకు కొన్ని పద్యములు
[మార్చు]001
[మార్చు]శ్రీయన నేమియో సుగుణ
శీలుని పుర్రెను గూడద్రిప్పు, ఆ
శ్రీయే 'అ ఆ' లు రాని ఎటు
సెల్లని పుల్లని మంత్రిసేయు, ఆ
శ్రీయే పరాభవంబొసగు
శ్రీయే మహావిభవంబునిచ్చు, ఆ
శ్రీయే ప్రియంబు నీకయిన
చిత్రమదేమిటొ? విఠ్ఠలేశ్వరా!
002
[మార్చు]పొట్టిగ నుండు వాణ్ణి, పెను
పొట్టను గల్గిన వాణ్ణి, ఎట్టి ఇ
క్కట్టుల నైన భక్తితొ ఒ
కానొక మారుభజిస్తే చాలు పో
గొట్టెడు వాణ్ణి, పాయసము
కుడ్ముల కే ముదమొందువాణ్ణి, జే
కొట్టి నుతించి మ్రొక్కెదను
కోర్కెలు దీర్చగ విఠలేశ్వరా !
003
[మార్చు]అమ్మ సరస్వతిన్ హృదయ
మందు తలంచిన చాలునయ్య, ద
ద్దమ్మయు కూడా పెద్దన పి
తామహు మాడ్కి కవిత్వమల్లి లో
కమ్మున మెప్పు పొందును, బి
కారియు కూడా యశస్సుగాంచు, ని
క్కమ్మిది భారతీకృప జ
గమ్మున ఓ ప్రభు విఠ్ఠలేశ్వరా !
004
[మార్చు]ఎందరు మాదు స్వేచ్ఛకయి
ఎంతతపించిరొ ? నిండు జీవితం
బెందరు ధారవోసిరొ? బ్రి
టీషుల హింసకు పాత్రులైనవా
రెందరొ ? వారే మా అమర
వీరులు యోధులు ఇంటివేల్పు లా
అందరకేను నా హృదయ
మారగ మ్రొక్కెద విఠ్ఠలేశ్వరా !
005
[మార్చు]దేవుడ దేవుడా యనుచు
తీర్థము క్షేత్రము లెన్నొ తిర్గితిన్
దేవుడ దేవుడా యనుచు
దేశ విదేశమతాల నడ్గితిన్
దేవుడ దేవుడా యనుచు
దేబెగ బాబల నెంతొ వేడితిన్
దేవుడ! కానిపించవు ఇ
దెక్కడి న్యాయము ? విఠ్ఠలేశ్వరా !
006
[మార్చు]పదవులు వద్దు, పైసలును
వద్దు, పసిండియు వద్దు, గొప్ప సం
పదయును వద్దు, ప్రాభవము
వద్దు, ప్రశంసలు వద్దు, ఏ మహా
సదనము వద్దు, భోగములు
సౌఖ్యము వద్దు, మరేది వద్దు, నీ
దు దయయే నాకు కావలెను
స్త్రోత్రము చేసెద విఠ్ఠలేశ్వరా !
007
[మార్చు]తల్లి తెలుంగు మానుకొని
తత్తర బిత్తర వచ్చిరాని ఆ
కుళ్లును ఇంగిలీసు కల
గూరను పిచ్చిగ పచ్చిపచ్చిగా
కల్లలు మాట లాడు మొన
గాండ్రిల ందరొ వెళ్ళి మంచి మా
పల్లె జనాల ముంచిరిగ
పాప మదేమన విఠ్ఠలేశ్వరా !
మూలాలు
[మార్చు]- ↑ krishna (2017-08-21). "తెలంగాణ ఆధునిక కవిత". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-09-01. Retrieved 2021-09-01.