కుమారీ శతకము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కుమారీ శతకము పక్కి వేంకట నరసయ్య రచించాడు. అతను 16 వ శతాబ్ద కాలంలో నివసించినట్లు తెలుస్తున్నది. ఈ కవి పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేసేవాడు. అతను శకుంతలా పరిణయం, అమరపద కల్పద్రుమము, నారాయణస్తవము, మదన నాయకా పరిణయం ఇలా ఎన్నో గొప్ప గ్రంథాలను రచించినట్లు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు రచించిన ‘కవుల చరిత్ర’ ద్వారా తెలుస్తున్నది.

సా.శ. 1869 లో ప్రథమ ముద్రణకు నోచుకోనిన ఈ శతకం నేటికీ ఎంతో ప్రజాదరణ పొందింది [1]

కొన్ని పద్యాలు[మార్చు]

పరపురుషులన్నదమ్ములు
వరుడే దైవమ్ము తోడి పడుచులు వదినల్
మరదండ్రు నత్తమామలు
దరదల్లియు తండ్రియనుచు తలపు కుమారీ!

కుమారీ! మగడు తప్ప పైమగ వారందరూ నీ అన్నదమ్ములుగా ఎంచుకో! నీ భర్త నీకు దేవుడనుకో! భర్త అక్కలూ, చెల్లెళ్ళూ నీ అక్కచెల్లెళ్ళుగా తలచుకో! నీ అత్త మామలను తల్లిదండ్రులుగా భావించి సమయానికి తగినట్లు వారిని సంరక్షణ చేస్తూ ఉండు.

పెనిమిటి వలదని చెప్పిన
పనియెన్నడు చేయరాదు బావలకెదుటన్
కనబడగరాదు; కోపము
మనసున నిడుకొనక యెపుడు మసలు కుమారీ!

కుమారీ! భర్త వద్దన్న పనియెప్పుడూ చెయ్యకూడదు. బావల యందు నిల్చునిగాని, కూర్చుండి గాని, మాటాడడం లాంటి పనులు చెయ్యవద్దు. ఎవరేమన్నా మనసులో కోపానిని చోటివ్వకూడదు. కోపం పాపపు పనులు చేయిస్తుంది. శాంతంగా మసలుతూ ఉండాలి

మూలాలు[మార్చు]

  1. "కుమారి శతకం | సాహితీ పూదోట". సిరిమల్లె (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-02-01. Retrieved 2021-04-05.
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: