చెన్నకేశవ శతకము
Jump to navigation
Jump to search
చెన్నకేశవ శతకము | |
---|---|
కవి పేరు | రామడుగు సీతారామశాస్త్రి |
దేశం | భారత దేశము |
భాష | తెలుగు |
మకుటం | చెన్నకేశవా! |
పద్యం/గద్యం | పద్యములు |
ఛందస్సు | వృత్తములు |
మొత్తం పద్యముల సంఖ్య | 100 |
మొత్తం పుటలు | 34 |
శతకం లక్షణం | భక్తి శతకం |
చెన్నకేశవ శతకం రామడుగు సీతారామశాస్త్రి రచించిన శతకం. ఇది 1944లో ముద్రించబడింది.
విశేషాలు
[మార్చు]శతకాలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. వివిధ శతక పద్యాలు జనసామాన్యం నోళ్లలో నాని జాతీయాలు, సామెతల స్థాయిలో నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎందరో తెలుగు కవులు శతకాలు రచించారు. ఆ కోవలోనిదే ఈ శతకం. "చెన్నకేశవా!" అనే మకుటంతో ఈ పద్యాలను రచించారు.ఇందుకోసం నల్లమోతు కృష్ణయ్య ధనసహాయం చేయగా రచయిత పుత్రుడు రామడుగు సత్యనారాయణ శాస్త్రి సంపాదకత్వం వహించాడు. ఇది 1944లో ముద్రించబడినది.[1]
పద్యాలు
[మార్చు]- మొదటి పద్యం
శ్రీరమణీ మనః కుముద శీతమయూఖ! విరించిముఖ్య బృం
దారక వారచారుతర నవ్యకిరీటమణీ ఘృణీఝరీ
పూర విరాజమాన పదపుష్కరజాత! నమో స్తుతే లస
న్నీరదనీలగాత్ర! ధరణీభరణక్షమ! చెన్నకేశవా!
మూలాలు
[మార్చు]- ↑ రామడుగు సీతారామశాస్త్రి (1944). చెన్నకేశవ శతకం.