కోహిర్‌

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కోహిర్‌
—  మండలం  —
మెదక్ జిల్లా పటములో కోహిర్‌ మండలం యొక్క స్థానము
మెదక్ జిల్లా పటములో కోహిర్‌ మండలం యొక్క స్థానము
కోహిర్‌ is located in Telangana
కోహిర్‌
ఆంధ్రప్రదేశ్ పటములో కోహిర్‌ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°35′57″N 77°42′50″E / 17.5991939°N 77.7138519°E / 17.5991939; 77.7138519
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా మెదక్
మండల కేంద్రము కోహిర్‌
గ్రామాలు 23
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 60,638
 - పురుషులు 30,462
 - స్త్రీలు 30,176
అక్షరాస్యత (2011)
 - మొత్తం 56.85%
 - పురుషులు 66.56%
 - స్త్రీలు 46.63%
పిన్ కోడ్ {{{pincode}}}

కోహిర్‌ (ఆంగ్లం: Kohir), తెలంగాణ రాష్ట్రములోని మెదక్ జిల్లాకు చెందిన ఒక మండలము. కొహిర్ జహీరాబాదు నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు కోహిర్ హైదారాబాదు సంస్థానంలోని బీదర్ జిల్లాలో భాగంగా ఉండేది. పూర్వం ఈ ఊరికి ఓంకారము లేదా అహంకారపట్టణం అనే పేరు ఉండేది. ముస్లిం పాలనలో ఇది కోహిర్ గా నామకరణం చేయబడింది. కోహిర్ పట్టణంలో అనేక మసీదులతో పాటు ఇద్దరు మహమ్మదీయ సంతుల దర్గాలు కూడా ఉన్నాయి. ప్రసిద్ధ హజరత్ అలీ దర్గాలో ప్రతి సంవత్సరం అక్టోబరు-నవంబరు కాలంలో ఉరుసు నిర్వహిస్తారు. ఈ ఉరుసుకు సుమారు ఐదు వేల దాకా భక్తులు హాజరౌతారు.[1] బహుమనీ సుల్తానుల పాలనలో కట్టించిన జమా మసీదు చెప్పుకోదగిన కట్టడం.[2] కోహిర్ అనగానే ఎర్రమట్టి కట్టిన ఇళ్ళు, ఎర్రమట్టి రోడ్లు, ఎర్రని రంగు రాళ్ళు జ్ఞప్తికి వస్తాయి. అంతా ఎరుపు మయమైన ఈ పరిసరాల వళ్ళే కోహిర్ (స్థానిక మాండలికంలో ఎర్రటి వజ్రం అని అర్ధం) అన్న పేరువచ్చింది ఈ ఊరికి. పేరుకు తగ్గట్టుగానే ఈ పాటిమట్టిని నీళ్లతో కలిపితే వజ్రంలా దృఢంగా ఉండే అనేక అంతస్తుల ఇళ్ళు కట్టగల పదార్థం తయారౌతుంది. కోహిర్ మట్టి ఇళ్ళు ఈ ప్రాంతపు తీవ్రవాతావరణాన్ని బాగా తట్టుకొని దృఢంగా ఉన్నాయి. ప్రధానంగా ముస్లింలు నివాసముంటున్న ఈ గ్రామంలో నిజాం కాలంలో కట్టిన హవేలీలు అనేకం ఇప్పటికీ నివాసయోగ్యంగా ఉన్నాయి.[3]

కోహిర్ పట్టణంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి, వారం వారం జరిగే మార్కెట్, వ్యవసాయ సరఫరా కేంద్రం, ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల మరియు మండల కార్యాలయం వంటి సదుపాయాలు ఉన్నాయి.⌊⌊⌊M7⌋⌋⌋⌋ కోహిర్ మామిడిపండ్లకు, జామ పండ్లకు ప్రసిద్ధి. కోహిర్ పేరు మీద కోహిర్ అనే మామిడిరకం మరియు జామరకం కూడా ఉన్నాయి.[4]

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 60,638 - పురుషులు 30,462 - స్త్రీలు 30,176

మూలాలు[మార్చు]


Medak.jpg

మెదక్ జిల్లా మండలాలు

మనూరు | కంగిటి | కల్హేరు | నారాయణఖేడ్ | రేగోడు | శంకరంపేట (ఎ) | ఆళ్ళదుర్గ | టేక్మల్ | పాపన్నపేట | కుల్చారం | మెదక్ | శంకరంపేట (ఆర్) | రామాయంపేట | దుబ్బాక | మీర్‌దొడ్డి | సిద్దిపేట | చిన్న కోడూరు | నంగనూరు | కొండపాక | జగ్దేవ్ పూర్ | గజ్వేల్ | దౌలతాబాదు | చేగుంట | యెల్దుర్తి | కౌడిపల్లి | ఆందోళ్‌ | రైకోడ్‌ | న్యాల్కల్ | ఝారసంగం | జహీరాబాద్ | కోహిర్‌ | మునుపల్లి | పుల్కల్లు | సదాశివపేట | కొండాపూర్‌ | సంగారెడ్డి | పటాన్ చెరువు | రామచంద్రాపురం | జిన్నారం | హథ్నూర | నర్సాపూర్ | శివంపేట | తూప్రాన్ | వర్గల్‌ | ములుగు

"https://te.wikipedia.org/w/index.php?title=కోహిర్‌&oldid=2101605" నుండి వెలికితీశారు