గొర్తి సత్యమూర్తి
గొర్తి సత్యమూర్తి | |
---|---|
జననం | వెదురుపాక, (తూ.గో.జిల్లా రాయవరం మండలం) | 1954 మే 24
మరణం | 2015 డిసెంబరు 14 చెన్నైలోని తన స్వగృహం | (వయసు 61)
మరణ కారణం | గుండెపోటు |
వృత్తి | సంగీత దర్శకత్వం, గాయకుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కథ, కథనం, మాటలు, నవలా సాహిత్యం |
జీవిత భాగస్వామి | శిరోమణి |
పిల్లలు | దేవీశ్రీప్రసాద్, పద్మిని, సాగర్ |
నోట్సు | |
రచయితగా దాదాపు 30 సంవత్సరాల అనుభవం |
గొర్తి సత్యమూర్తి ప్రముఖ సినిమా రచయిత. 90కిపైగా చిత్రాలకు రచయితగా పనిచేశారు.[1] నాలుగు వందల సినిమాలకు పైగా మాటలు అందించాడు.[2] ఈయన దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు అయిన దేవి శ్రీ ప్రసాద్ తండ్రి.
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలంలోని వెదురుపాక. రామచంద్రపురంలో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ విద్యా కళాశాలలో బి.ఎడ్ చదువుకొని అధ్యాపక వృత్తిని చేపట్టారు.[3]
రచయితగా
[మార్చు]సాహిత్యం పట్ల సత్యమూర్తికి ఉన్న అభిలాష ఆయన్ని రచనా వ్యాసంగం వైపు నడిపించింది. చైతన్యం అనే నవలతో సాహిత్యప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన కలం నుంచి అనేక నవలలు, కథా సంకలనాలను వెలువడ్డాయి. ఆయన రచనల్లో పవిత్రులు, పునరంకితం, ఎదలోయల నిదురించే, దిగంబర అంబరం, అధర గరళం సాహిత్యాభినులను విశేషంగా అలరించాయి. మానవ సంబంధాల్లోని అంతఃసంఘర్షణ కథావస్తువుగా చేసుకొని తన రచనా ప్రక్రియను కొనసాగించారు. సత్యమూర్తి రచనల్లో భావుకత ఎక్కువగా కనిపిస్తుంది. కథా, నవలా రచయితగా సత్యమూర్తికి లభించిన పేరు ప్రఖ్యాతులు ఆయన్ని సినీ రంగం వైపు మళ్లించాయి.[4]
సినిమా రంగంలో
[మార్చు]రామానాయుడు నిర్మాతగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన దేవత చిత్రంతో సత్యమూర్తి కథా రచయితగా సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఈ చిత్ర విజయంతో తెలుగు సినీ పరిశ్రమలో ఆయన పేరు మారుమ్రోగిపోయింది. బావా మరదళ్లు, కిరాయి కోటిగాడు, అభిలాష, ఛాలెంజ్, జ్వాల, భలేదొంగ, మాతృదేవోభవ, కాంచన సీత, చంటి, పెదరాయుడు, శ్రీనివాస కళ్యాణం, నారీనారీనడుమ మురారి, బంగారు బుల్లోడు, పెళ్ళి, న్యాయం కోసం, ఖైదీ నెంబర్ 786, శత్రువు, రౌడీ అన్నయ్య, అమ్మదొంగా వంటి చిత్రాలు సత్యమూర్తికి తిరుగులేని గుర్తింపును తెచ్చిపెట్టాయి. చిరంజీవి సినీ కెరీర్‌లో సత్యమూర్తి కీలక పాత్ర పోషించారు. వీరిద్దరి కలయికలో వచ్చిన అభిలాష, ఖైదీ నెం 786, ఛాలెంజ్, జ్వాల చిత్రాలు చక్కటి ప్రజాదరణను చూరగొన్నాయి.[5]
సినిమాలు
[మార్చు]రచించిన సినిమాలు
[మార్చు]- మధుమాసం (2007) (సంభాషణలు)
- సుభాష్ చంద్ర బోస్ (2005) (కథ)
- గుడుంబా శంకర్ (2004) (సంభాషణలు)
- అంజి (2004) (సంభాషణలు)
- జానీ (2003) (సంభాషణలు)
- ఫూల్స్ (2003/I) (సంభాషణలు)
- పెళ్ళాం ఊరెళితే (2003) (కథ)
- టక్కరి దొంగ (2002) (రచన)
- డాడీ (2001/I) (సంభాషణలు)
- మృగరాజు (2001) (రచన)
- వంశీ (2000) (రచన)
- అన్నయ్య (2000) (సంభాషణలు)
- రాజకుమారుడు (1999) (Hindi version)
- పెళ్ళి సందడి (1996) (రచన)
- అదిరింది అల్లుడు (1996) (రచన)
- అమ్మోరు (1995) (సంభాషణలు)
- అల్లరి ప్రేమికుడు (1994) (రచన)
- మెకానిక్ అల్లుడు (1993) (రచన)
- అశ్వమేధం (1992) (రచన)
- దొంగ పోలీస్ (1992) (సంభాషణలు, స్క్రిప్టు)
- ఘరానా మొగుడు (1992) (సంభాషణలు)
- రౌడీ అల్లుడు (1991) (రచన)
- క్షణ క్షణం (1991) (సంభాషణలు)
- రాజా విక్రమార్క (1990) (రచన)
- యముడికి మొగుడు (1988) (రచన)
- దొంగ మొగుడు (1987) (సంభాషణలు)
- ఒక రాధ ఇద్దరు కృష్ణులు (1985) (సంభాషణలు)
- రుస్తుం (1984) (రచన)
- గూండా (1984) (సంభాషణలు) (కథ)
- అభిలాష (1983/I) (సంభాషణలు)
- కిరాయి రౌడీలు (1981) (రచన)
- కొండవీటి సింహం (సంభాషణలు)
- న్యాయం కావాలి (1981) (సంభాషణలు)
- మోసగాడు (1980) (సంభాషణలు) (కథ)
- గోపాలరావు గారి అమ్మాయి (1980) (సంభాషణలు)
- ఎదురీత (1977) (సంభాషణలు)
- కల్పన (1977) (సంభాషణలు)
- జ్యోతి (1976) (సంభాషణలు)
- దేవుడు చేసిన పెళ్ళి (1974) (సంభాషణలు)
కుమారులు
[మార్చు]తన కుమారులు ఇద్దరూ సినీ రంగంలోనే స్థిరపడి మంచి పేరు సంపాదించుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో, పాటలతో తెలుగు, తమిళ సినీపరిశ్రమలో తనదైన ముద్ర వేశాడు. మరో కుమారుడు సాగర్ నేపథ్య గాయకుడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ Tollywood writer Satyamurthy passes away[permanent dead link]
- ↑ ప్రముఖ రచయిత సత్యమూర్తి ఇకలేరు[permanent dead link]
- ↑ దేవుని స్క్రీన్‌ప్లేలో మనమంతా పాత్రధారులం - సినీ రచయిత సత్యమూర్తి April 9, 2012[permanent dead link]
- ↑ సత్యమూర్తి ఇకలేరు 12/15/2015 12:18:47 AM[permanent dead link]
- ↑ రచయిత గొర్తి సత్యమూర్తి మృతి ![permanent dead link]
- ↑ "సత్యమూర్తి, శ్రీనివాస్ చక్రవర్తి ఇకలేరు december 14th, 2015 at 8:10 am". Archived from the original on 2015-12-24. Retrieved 2016-01-25.