మురళీ శర్మ

వికీపీడియా నుండి
(మురళీశర్మ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మురళీ శర్మ
జననం (1972-08-19) 1972 ఆగస్టు 19 (వయసు 52)
వృత్తినటుడు
తల్లిదండ్రులు
  • వృజభూషణ్ (తండ్రి)
  • పద్మ (తల్లి)

మురళీ శర్మ ఒక భారతీయ సినీ నటుడు. తెలుగుతో బాటు పలు ఇతర భాషా చిత్రాలలో కూడా నటించాడు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలలో, పోలీసు అధికారి పాత్రలలో నటించాడు.[1][2]

నేపధ్యము

[మార్చు]

వీరిది తెలుగు కుటుంబమే. నాన్నగారి పేరు వృజు భూషణ్, అమ్మ పద్మ. వీళ్ళ అమ్మగారిది గుంటూరు. నాన్నగారి వ్యాపారరీత్యా ముంబాయిలో స్థిరపడ్డారు. అక్కడే పుట్టి పెరిగాడు. అక్కడే చదువుకొన్నాడు. ఆ రోజుల్లోనే నాటకాల్లో ప్రవేశించాడు. డిగ్రీ అయ్యాక టెలిఫోన్ ఆపరేటర్, ప్రొడక్షన్ మేనేజర్, పార్ట్ టైమ్ జర్నలిస్ట్‌గా ఉద్యోగాలు చేశాడు. ఎందులోనూ నెలకి మించి జీతం తీసుకోలేదు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగానే నెల దాటి జీతం తీసుకున్నాడు.[3]

సినీ రంగ ప్రవేశము

[మార్చు]

నటనపై ఆసక్తితో రోషన్ తనేజా ఇన్‌స్టిట్యూట్‌లో చేరి అక్కడ శిక్షణ తీసుకొన్నాడు. అక్కడే దీపక్ తిజోరి, విక్రమ్‌భట్‌లతో పరిచయం ఏర్పడింది. వాళ్లు నిర్మించిన టీవీ సీరియల్స్‌లో నటించాడు. విక్రమ్‌భట్ తన హిందీ చిత్రం 'రాజ్ 'లో అవకాశం ఇచ్చాడు. తర్వాత షారుఖ్‌ఖాన్ మైహూనా లో నటించాడు. ఇంకొన్ని హిందీ సినిమాలలో చేశాడు.

తెలుగులో తొలి అవకాశం

[మార్చు]

దర్శకుడు సురేందర్‌రెడ్డికి మక్బూబ్, అపహరణ్, బ్లాక్‌ఫ్రైడే సినిమాల్లో ఇతని నటన బాగా నచ్చింది. ఆయన ముంబాయి వచ్చినప్పుడు ఇతడిని పిలిపించి మాట్లాడారు. అతిథి సినిమాలో అవకాశం ఇచ్చాడు.[4]

నటించిన చిత్రాలు

[మార్చు]

తెలుగు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-02. Retrieved 2015-11-12.
  2. "Mahie Gill, Murali Sharma, Deepak Dobriyal are some of the new-age villians in Bollywood". Archived from the original on 2016-03-05. Retrieved 2015-11-12.
  3. Sakshi (30 August 2019). "జీవితం భలే మారిపోయింది". Archived from the original on 3 ఆగస్టు 2021. Retrieved 3 August 2021.
  4. Sakshi (22 April 2017). "నేను పక్కా క్రిమినల్‌!". Archived from the original on 3 ఆగస్టు 2021. Retrieved 3 August 2021.
  5. "Babu Bangaram Review". 123telugu. 12 August 2016.
  6. సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్‌' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 March 2020. Retrieved 2 April 2020.
  7. సాక్షి, సినిమా (28 February 2020). "'హిట్‌' మూవీ రివ్యూ". Sakshi. సంతోష్‌ యాంసాని. Archived from the original on 28 February 2020. Retrieved 29 October 2020.

బయటి లంకెలు

[మార్చు]