వాడుకరి చర్చ:K.Venkataramana/పాత చర్చ 1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాత చర్చ 1

K.Venkataramana/పాత చర్చ 1 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:51, 21 అక్టోబర్ 2012 (UTC)

వ్యాసాలు

జె.వి. సోమయాజులు గారిని గురించిన వ్యాసాన్ని బాగా విస్తరించినందుకు ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 07:21, 12 నవంబర్ 2012 (UTC)

మెయిల్ కి సమాధానం

మీరు పంపిన మెయిల్ అందినది. మీలాంటి ఉపాధ్యాయుల సహాయం వికీపీడియాకు చాలా అవసరం. మీకు నచ్చిన కొన్ని శాస్త్ర వ్యాసాలను అభివృద్ధి చేయండి. ఏమైనా సహాయం కావలిస్తే తెలియజేయండి. నా ఫోన్ నంబర్. 9246376622Rajasekhar1961 (చర్చ) 07:16, 14 నవంబర్ 2012 (UTC)

భౌతిక శాస్త్ర నిఘంటువు లో మొదట భౌతికశాస్త్రానికి సంబంధించిన పదాలను అక్షర క్రమంలో చేర్చి ఆ తర్వాత ఒక్కొక్క దాని గురించి తెలుగులో రచనలు చేయడం మంచి ఆలోచన. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 14:30, 17 నవంబర్ 2012 (UTC)
పరమాణు సంఖ్య వ్యాసంలోని దోషాల్ని చర్చ పేజీలో వివరంగా తెలియజేయండి. సమంజసమైతే సరిచేద్దాము. ఇంతకు ముందు రాసింది "ఏ కారణం లేకుండగా మార్చడం రచయితల మధ్య స్పర్థలకు కారణం అవుతుంది.Rajasekhar1961 (చర్చ) 12:53, 18 నవంబర్ 2012 (UTC)
తరంగం వ్యాసం బాగుంది. నిర్వచనం ఇతర అతిముఖ్యమైన సమాచారాన్ని టూకీగా మొదటి పేరాలో వ్రాయాలి. తర్వాత సమాచారాన్ని విభాగాలుగా చేసి విస్తరించండి.Rajasekhar1961 (చర్చ) 15:12, 18 నవంబర్ 2012 (UTC)
ఆమ్లాలు-క్షారాలు వ్యాసం మొదలుపెట్టారు కదా. ఇప్పటికే ఆమ్లం మరియు క్షారం వ్యాసాలు ఉన్నాయి. మొత్తం సమాచారాన్ని ఈ రెండు వ్యాసాల మధ్య విభజించి చేర్చండి.Rajasekhar1961 (చర్చ) 04:59, 20 నవంబర్ 2012 (UTC)
మీ సమాధానం మంచిగా ఉన్నది. కొన్ని సవరణలు చేశాను. ఉపోద్ఘాతంలో రెండింటికీ ఉన్న ముఖ్యమైన భేదాల్ని వ్రాస్తే బాగుంటుంది. మీరన్నట్లు ఆమ్లం మరియు క్షారం వ్యాసాల్ని కూడా విస్తరించండి. ఇక ఓం మరియు అష్టకం వ్యాసాల్లో భౌతికశాస్త్రం అని విభాగం చేర్చి అక్కడ మీ దగ్గర ఉన్న శాస్త్ర విషయాల్ని చేర్చండి. తర్వాత అవసరమైతే వాటిని వేరుచేయవచ్చును.Rajasekhar1961 (చర్చ) 13:22, 20 నవంబర్ 2012 (UTC)
  • కె వి . రమణగారూ ! మీ వంటి విస్హయ జ్నానం ఉన్నవారు తెవికికి రావడం ముదావహం. మీ నుండి విద్యార్ధులకు అవసరమైన విలువైన వ్యాసాలను అందిస్తారని ఆశిస్తున్నాను--t.sujatha (చర్చ) 16:03, 31 డిసెంబర్ 2012 (UTC)

బొమ్మల అప్లోడ్

మీరు బొమ్మలను అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆ పేర్లు ఇదివరకే ఉంటే కొత్త పేరుతో అప్లోడ్ చేయండి. లేనిచో అదివరకే ఉన్న బొమ్మపై కొత్త బొమ్మ ఓవర్ టేక్ చేసినట్లవుతుంది. ఉదా:కు మీరు అప్లోడ్ చేసిన సినీ నటుడు కృష్ణ బొమ్మను దస్త్రం:Krishna.jpg పేరుతో అప్లోడ్ చేశారు. కాని ఆ పేరుతో 2005లోనే వైజాసత్యగారు కృష్ణా జిల్లా మండలాలకు సంబంధించిన బొమ్మను అప్లోడ్ చేసి ఉన్నారు. దీనితో కృష్ణా జిల్లా మండలాల బొమ్మ ఉండాల్సిన అన్ని వ్యాసాలలో కృష్ణ నటుడి బొమ్మ వచ్చి చేరింది. దాన్ని వెనక్కి చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు అప్లోడ్ చేసే బొమ్మలు స్వయంగా తీసినవే ఇక్కడ చేర్చండి. అంత అవసరమైతే తప్ప ఇతర వెబ్ సైట్ల బొమ్మలు తెవికీలో చేర్చే అవసరం ఉండరాదు. తర్వాత దీనివల్ల ఇబ్బందులు రావచ్చు. ఈ విషయాన్ని గమనించండి, లేనిచో నిర్వాహకులే కాపీరైట్ బొమ్మలను తొలిగించగలరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:00, 27 నవంబర్ 2012 (UTC)

దిద్దుపాటు

మీ స్పందనకు దన్యవాదాలు.నేను కూడా శ్రీ కాకుళంలో 15 సం.లువున్నాను.పాలగిరి (చర్చ) 06:42, 30 నవంబర్ 2012 (UTC)

ఆవర్తన పట్టిక గూర్చి

గౌరవనీయులు చంద్రకాంతవావు గార్కి నమస్కారములు. నేను ఆవర్తన పట్టిక అనే అంశంపై విస్తృత సమాచారంతో పేజీ తయారుచేయదలచితిని. కాని ఆ పేజీ ని మెండలీఫ్ ఆవర్తన పట్టిక దారి మార్పు చేసారు. కాని మొట్టమొదటి మూలకాల ఆవర్తన పట్టిక ను తయారు చేసినవాడు మెండలీఫ్. అందువల్ల ఆయన ఆవర్తన పట్టికకు ఒక పేజీ ఉండాలి. ఆ పేజీని కూడా విస్తరించవలసి యున్నది. అదే విధం గా మెండలీఫ్ ఆవర్తన పట్టిక లోని అనేక లోపాలను సరిచేస్తూ విస్తృత ఆవర్తన పట్టిక నేడు ఉపయోగిస్తున్నాం. దీనిని మోస్లే తయారుచేసాడు. అందు వల్ల మీరు దారిమార్పు ను తొలగించడానికి అనుమతిస్తే ఆవర్తన పట్టిక అనే వ్యాసాన్ని అభివృద్ధి చేయుదును. విస్తృత ఆవర్తనపట్టిక నేడు రసాయన శాస్త్రం అభ్యసించు విద్యార్థులకు చాలా అవసరమని నా అభిప్రాయం.(Kvr.lohith (చర్చ) 13:21, 1 డిసెంబర్ 2012 (UTC))

లోహిత్ గారు, మీరు కోరిన విధంగా నేను దారిమార్పు తొలిగించాను. ఆవర్తన పట్టిక వ్యాసంలో మీరు సమాచారం చేర్చి వ్యాసం పొడిగించండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:18, 1 డిసెంబర్ 2012 (UTC)
ఆవర్తన పట్టిక లేదా మెండలీఫ్ ఆవర్తన పట్టిక రెండింటికీ ఒక వ్యాసము మరియు విస్తృత లేదా అధునిక ఆవర్తన పట్టికకు ఒక వ్యాసము ఉంటే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 05:20, 6 డిసెంబర్ 2012 (UTC)

బీటా

బీటా పేజీ దారి మార్పు పేజీ కాదు. అయోమయ నివృత్తి పేజీ. మీరు తయారుచేసిన బీటా కణం వ్యాసం ఏ మార్పూ లేకుండా అలానే ఉన్నది. Rajasekhar1961 (చర్చ) 05:20, 6 డిసెంబర్ 2012 (UTC)

ఆకురాతి గోపాలకృష్ణ గారు నా అభ్యర్ధనపై రాసిన 'తెలిసినడుచుకొమ్ము తెలుగు బిడ్డ' 103 పద్యాల శతకం పూర్తయ్యింది.పద్యాలను మునుపటిలాగా పేర్చగలరు.--Nrahamthulla (చర్చ) 15:20, 13 డిసెంబర్ 2012 (UTC)


అడ్డుకొలతపై చర్చ

వృత్త కేంద్రం గుండా పోవు జ్యా ను వ్యాసం అనుట సమంజసము. అడ్డుకొలత అనిన అర్థవంతంగా ఉండదు.( కె.వి.రమణ- చర్చ 13:01, 12 డిసెంబర్ 2012 (UTC))

ఈ వ్యాసమును తొలగించండి లేదా వివరణనివ్వండి

ఈ పేజీ అడ్డుకొలత అని మొదలుపెట్టారు. దానికి వృత్త వ్యాసము యొక్క నిర్వచనం యిచ్చారు. ఉన్న విషయం సంగ్రహం. అందువల్ల ఈ వ్యాసం గూర్చి వివరణనివ్వాలి. లెదా తొలగించాలి. కె.వి.రమణ- చర్చ 16:35, 13 డిసెంబర్ 2012 (UTC)

వివరణ

వ్యాసం (అయోమయ నివృత్తి) వ్యాసం - Essay వ్యాసం (అడ్డుకొలత) - Diameter వ్యాసం అంటే ఒక విషయంపై వివరణాత్మకమైన రచన. వ్యాసం అన్నది ఈ క్రింది వాటిని కూడా సూచించవచ్చు: వ్యాసం (అడ్డుకొలత), వృత్తపు మధ్య రేఖ.


http://www.dictionary.tamilcube.com/telugu-dictionary.aspx లింకు నందు గల అర్థాలు

Diameter : అడ్డుకొలత , వ్యాసము , గోళము యొక్క మధ్యరేఖ .వ్యాసరేఖ . the wheel was one yard in * ఆ చక్రముయొక్క అడ్డుకొలత .వకగజము , అనగా వక గజము యెత్తు . what was the * of the ball ? ఆ గుండు యొక్క అడ్డుకొలత యెంత .

నేను తప్పులు రాసి ఉంటే అవి సరి చేయండి. కొన్ని తప్పులు ఉన్నాయని అది తొలగించమని ప్రతిపాదించటం కొత్త పేరుతో వ్యాసాలు సృష్టించటం మొదలు పెడితే వికీ అనే పేరుకే అర్థాలు మారిపోతాయి కదా.

అడ్డుకొలత అనే పేరు సరి అయినదిగా లేకపోతే సరియైన పేరును సూచించండి.

అడ్డుకొలతలో నేను వ్రాసిన సమాచారం

ఒక వృత్తం యొక్క చుట్టుకొలతను పరిధి అంటారు. ఆ వృత్తం యొక్క పరిధి లోపల ఒక అంచు నుంచి మరొక అంచుకు కేంద్ర బిందువు గుండా వెళ్ళే సరళ రేఖను అడ్డుకొలత అంటారు. అడ్డుకొలతను వ్యాసం అని కూడా అంటారు. అడ్డుకొలతను ఆంగ్లంలో డయామీటర్ అంటారు. వృత్తం యొక్క పొడవైన చోర్డ్స్ (తీగలు) గా అడ్డుకొలతలు ఉంటాయి. డయామీటర్ అనే ఆంగ్ల పదం వృత్తం లోపల అడ్డు కొలతలు అనే అర్థాల నిచ్చే డయా మరియు మెట్రాన్ అనే గ్రీకు భాష పదాల నుండి ఉద్భవించింది. ఆధునిక వాడుకలో డయామీటర్ యొక్క పొడవును డయామీటర్ (వ్యాసం యొక్క పొడవును వ్యాసం) అని పిలుస్తున్నారు.YVSREDDY (చర్చ) 09:07, 22 డిసెంబర్ 2012 (UTC)

దిద్దుబాటు

రమణగారు, దర్గామిట్ట కతల వరుస క్రమాన్నిసరిదిద్దినందుకు ధన్యవాదాలుపాలగిరి (చర్చ) 14:18, 23 డిసెంబర్ 2012 (UTC)

మూస:చెట్లనుండి వచ్చే నూనెగింజలు

రమణగారు,మీరు చెట్లగింజలనుండి వచ్చే నూనెగింజలు మూసలో మొక్కలనుండి వచ్చునూనెలను కూడా చేర్చినారు.మొక్కలనుండి వచ్చు నూనెలు వేరు,ఇవి ఎక్కువగా వ్యవసాయ పంటలు(ఉదా:వేరుశనగ,నువ్వులు,పొద్దుతిరుగుడు,కుసుమ,ఆవాలు సోయా తదితరాలు)మొక్కలలోకూడా నూనెకొరకై పండించేవి కొన్నేయైతే,ఉప ఉత్పత్తిగా వచ్చేవి(గింజలలలోనయితే పత్తిగింజలనూనె,పోగాకు నూనెల్ తదితరాలు, పళ్లలోనయితే పుచ్ఛ, వెర్రిపుచ్చ, మామిడిపిక్కలనూనె, లాంటివి,కొన్ని కూరగాయల నుండి ఉప ఉత్పత్త్తి, బెండ,గోగు,మిరప)అన్నింటిని ఒకే గాట కట్టెయ్యకండి.మూసలను అవసరాన్ని బట్టి నిర్వాహకులు చేస్తారు. పాలగిరి (చర్చ) 12:40, 25 డిసెంబర్ 2012 (UTC)

రమణ గారు,నాకు కూడా మూసల గురించి పెద్దగా తెలియదు.రాజశేఖరురారుకాని,మరెవ్వరైన చెయ్యగలరుపాలగిరి (చర్చ) 14:05, 25 డిసెంబర్ 2012 (UTC)

పేజీ తొలిగింపులు

అనామక సభ్యులు సృష్టించే చెత్త పేజీలను తొలిగించడానికి మీరు ఆ వ్యాసాలలోనే పైన {{తొలగించు|కారణం}}మూస ఉంచితే సరిపోతుంది. దీనికై ప్రత్యేకంగా చర్చాపేజీలో వ్రాయనవసరం లేదు. చర్చ జరిగే అవకాశమున్న వాటికే చర్చాపేజీలు ఉపయోగించండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:06, 25 డిసెంబర్ 2012 (UTC)

మూసలలో తొలగించు మూస గురించి

రమణ గారికి, ఆంగ్ల వికీపీడియా నుండి తీసుకొన్న కొన్ని మూసలు సంపూర్తిగా ఉన్నను అసంపూర్తిగా కనపడతాయి, వాటి ప్రయోజనం వాడినప్పుడు మాత్రమే తెలుస్తుంది. వాటిలో తొలగించు మూస ఉంచటం వలన ప్రయోజనం లేకపోగా ఆ మూసలున్న పేజీల అసలు రూపురేఖలు మారి చదివేవారికి చాలా చీకాకును కలిగిస్తాయి అర్థం చేసుకోగలరు. మీ YVSREDDY (చర్చ) 15:52, 5 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మూస పేరుమార్పు

రమణ గారు, ఒకపనిచేద్దాం.ఎలా మూస సృష్టించారు కనుక,దాన్ని తొలగించకుండ చెట్లనుండి వచ్చే నూనెగింజలు శీర్షికను శాకనూనెలు(vegetable oils) అని మార్చెయ్యండి.అప్పుడు ఈ మూసలో అన్ని చెట్లగింజలనుండి వచ్చేనూనెలను,నూనెగింజలు పుటలో వున్న నూనెపేర్లు యధావిదిగా చేర్చవచ్చును.పాలగిరి (చర్చ) 23:23, 25 డిసెంబర్ 2012 (UTC)

ఉష్ణమాపకాలు

  • రమణగారు,

మీస్పందనకు ధన్యదాదాలు,మరియు నూతనసంవత్సరశుభాకాంక్షలు.మీరన్నట్లుగా ఉపశీర్షికతో రాస్తాను.ప్రస్తుతం రాస్తున్న వ్యాసాలు పూర్తికాగానే ప్రారంభిస్తాను.పాలగిరి (చర్చ) 04:14, 1 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఉష్ణము

ఉష్ణము వ్యాసంలో పాదాక్షరాలు సరిగానే ఉన్నాయి. ఎడిట్ బాక్స్ తెరిచినప్పుడు మైన్ మెనూ లో శీర్షాక్షరాలు మరియు పాదాక్షరాలు వున్నాయి. వాటిని ఉపయోగించండి.Rajasekhar1961 (చర్చ) 09:58, 2 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రమణగారు,

మీ స్పందనకు ధన్యవాదం.నాదగ్గర సమాచారమున్నంత వరకు చేర్చుతుంటాను.మీరు చాలాఎక్కువ ఆసక్తి తీసుకొని బౌతిక,రసాయనిక శాస్త్రాలకు సంబంధించిన సమాచారం చేర్చుచున్నందులకు అభినందనలు.మీలాంటి అధ్యాపకుల చొరవ,రచనలు తెవికికి ఎంతో ఉపయోగకరం. పాలగిరి (చర్చ) 02:06, 5 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రచ్చబండ గూర్చి

చంద్రకాంతరావు గారికి నమస్కారములు,
తెవికీ లో రచ్చబండ లో కొన్ని చర్చలు ఉంచినపుడు వాటిలో క్రియాశీలక సభ్యులు కూడా కొంతమందే పాల్గొనుచున్నారు. చర్చ జరగవలసిన అంశం "రచ్చబండ" లో చేర్చినపుడు వాడుకరులందరికీ సదరు విషయం మెయిల్ రూపంలో వెళితే మరికొంతమంది పాల్గొను అవకాశం కలుగునని నా అభిప్రాయం. రచ్చబండ వేదికను ఒక చర్చా వేదికగా కాక ప్రచారానికి కొందరు సందేశాలు యిచ్చుటకు కొందరు వినియోగిస్తున్నారు. ఇది సరియైనదేనా?( కె.వి.రమణ- చర్చ 03:52, 10 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

సామాజిక అంశాలు చర్చించవచ్చా?తెవికి వ్యాసాలపైన మాత్రమే చర్చలు ఉండాలా? కె.వి.రమణ- చర్చ 04:42, 10 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
1)రమణ గారు, తెవికీ అనేది ఎవరికి వారు స్వచ్ఛందంగా చేసే కార్యక్రమం కాబట్టి ఎవరినీ బలవంతం చేయడం గాని వత్తిడి చేయడం గాని చేసే అవసరం లేదు. కాబట్టి వారికి మెయిల్ పంపి చర్చలలో పాల్గొనేటట్లు చేసే అవసరం లేదనుకుంటాను (సెట్టింగ్ లో కొద్దిగా మార్చుకుంటే చాలు వారి చర్చా పేజీలో ఇతరులు దిద్దుబాటు చేసినప్పుడు మాత్రం మెయిల్ వస్తుంది). చర్చలలో సభ్యులు అరుదుగా పాల్గొనమనేది మొదటి నుంచి ఉన్నదే. రాజశేఖర్ గారు లాంటి వారు రోజూ ఎన్నో దిద్దుబాట్లనూ చేసే సమయంలో కూడా చర్చలలో చాలా అరుదుగా పాల్గొన్నారు. అంతేకాకుండా చర్చలలో పాల్గొనడానికి ఇష్టపడనని అతను స్వయంగా చెప్పారు కూడా. చురుకైన సభ్యులు దిద్దుబాట్లు చేస్తున్నారంటే రచ్చబండ కాని ఇతర చర్చాపేజీలు కాని తప్పకుండా వీక్షిస్తున్నారనే అనుకోవచ్చు. చర్చలలో పాల్గొనకపోవడం వారి ఇష్టం. అసలు దిద్దుబాటు చేయని వారు కూడా రోజూ తెవికీలో జరిగే పరిణామాలు చూస్తుంటారు. జనవరి 2013 మాసంలో ఇప్పటివరకు (9 రోజులలో) రచ్చనుబండకు 628 వీక్షణలు జరిగాయి (చూడండి)
2)రచ్చబండను ప్రచార వేదికగా ఉపయోగించడం తప్పే. ఇదివరకు కూడా కొందరు కొత్త సభ్యులు ప్రచారంకోసం ఉపయోగించ ప్రయత్నించారు. అలాంటి సమాచారాన్ని ఎవరైనా సరే వెంటనే తొలిగించవచ్చు.
3)తెవికీలో సామాజిక సమస్యలు చర్చించడానికి అవకాశం లేదు. ఎందుకంటే తెవికీ సామాజిక ఉద్ధరణ సంస్థ కాదు, మనం సంఘసంస్కర్తలము కాము (ఇక్కడ మాత్రమే). అయితే సామాజిక అంశాలకు సంబంధించిన వ్యాసాల చర్చలలో భాగంగా ఇలాంటివి కూడా చర్చలలో వచ్చాయి, వస్తుంటాయి కాని వీటిని వ్యాసాలకే పరిమితం చేయాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:53, 10 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందన

రమణగారు,

సభ్యునిగా చేరిన మూడు నెలలలోపు భౌతిక,రసాయనికశాస్త్రవ్యాసాలుచేర్చి వెయ్యి దిద్దుపాట్లుచేసినసందర్భంలో అభనందనలు.పాలగిరి (చర్చ) 01:07, 11 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నా తరపున మీ కృషికి అభివందనలు. --అర్జున (చర్చ) 05:58, 15 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Hello, and welcome to Wikipedia! We welcome and appreciate your contributions, such as వీలునామా, but we regretfully cannot accept copyrighted text or images borrowed from either web sites or printed material. This article appears to contain material copied from http://manakilaw.blogspot.in/2010/05/blog-post.html, and therefore to constitute a violation of Wikipedia's copyright policies. The copyrighted text has been or will soon be deleted. While we appreciate contributions, we must require all contributors to understand and comply with our copyright policy. Wikipedia takes copyright violations very seriously, and persistent violators are liable to be blocked from editing.

If you believe that the article is not a copyright violation, or if you have permission from the copyright holder to release the content freely under license allowed by Wikipedia, then you should do one of the following:

It may also be necessary for the text be modified to have an encyclopedic tone and to follow Wikipedia article layout. For more information on Wikipedia's policies, see Wikipedia's policies and guidelines.

If you would like to begin working on a new version of the article you may do so at this temporary page. Leave a note at Talk:వీలునామా saying you have done so and an administrator will move the new article into place once the issue is resolved. Thank you, and please feel welcome to continue contributing to Wikipedia. Happy editing! అర్జున (చర్చ) 04:50, 14 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

2012 లోమీ కృషికి అభివందనలు

--అర్జున (చర్చ) 07:06, 15 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

చిత్రాలు చేర్చుట

మీ స్వంతచిత్రాలు కామన్స్ ప్రాజెక్టులో చేర్చితే అన్ని ప్రాజెక్టులలో వాడుకోవటానికి సౌకర్యంగావుంటుంది గమనించగలరు.--అర్జున (చర్చ) 05:44, 21 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నేను భౌతిక శాస్త్ర అంశాలపై కొన్ని చిత్రాలను పవర్ పాయింట్ లొ తయారు చేసి కొన్ని వ్యాసాలలో చేర్చాను. వాటిని కామన్స్ లో ఎలా చేర్చాలో నాకు తెలియదు. మీరు చేర్చినా అభ్యంతరం లేదు. లేదా ఎలా చేర్చాలో తెలియజేయగలరు. (రమణ గారి సమాధానం నా పేజీనుండి అతికించబడింది.)
వికీపీడియాలో లాగానే చేర్చవచ్చు. కామన్స్ లోని లింకు ప్రకారం ప్రయత్నించండి. చిత్రాన్ని వాడుకోవటంలో ఏమాత్రం తేడావుండదు. ఎక్కించు ప్రక్రియలోని చివరి తెరలో వాడకోటానికి ఉదాహరణలు కనబడతాయి. --అర్జున (చర్చ) 07:34, 21 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]


రచ్చబండలో చర్చ

రమణగారు,

రచ్చబండలోని,నా వ్యాఖ్యకు ,మీరిచ్చిన వివరణకు,నా ప్రతి స్పందన వ్రాసాను.దయచేసి చదవండి.మీరు ఇంకా రచనలు చెయ్యాలని ఆకాంక్షిస్తూ.మీపాలగిరి (చర్చ) 06:29, 23 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]


రమణగారు, మీ స్పందనకు ధన్యవాదాలు.తెవిలో ఎవ్వరో ఒక్కరు వ్రాయడంకాదు,వ్రాస్తున్న విషయము పై పట్టువున్నవాళ్ళు రాస్తేనే,వ్యాసంలో విషయముంటుంది,లేనిచో వ్యాసం తేలిపోతుంది.తెలుగు వీకిని అభివృద్ధి పరచవలసిన అవసరం మీలాంటి సామాజిక సృహ వున్నవాళ్లు చక్కగా చెయ్యగలరు.మనచేతికున్న ఐదు వేళ్లుఒకేలా వుండవు.అలాగే సభ్యులందరు ఒకేలా వుండరు.మీలాంటికొందరు సలహలను స్వీకరించి ఏమైన తేడాలుంటే సరిద్దుకుంటారు,మరికొందరు తత్తిమా సభ్యులెంతమంది చెప్పిన మంకుపట్టుతో తమపద్ధతి మార్చుకోరు(అతనెవ్వరో మీకుతెలుసు).కాని వారికోసమని మీలాంటి విజ్ఞతకల్గినవారు రచనలు మానివెయ్యరాదు.ప్రస్తుతం రసాయనిక,బౌతికశాస్త్రాలకు సంబంధించి వివరణాత్మక వ్యాసాలు తక్కువ వున్నాయి,వున్నవాటిలో లోపాలున్నాయి.కాబట్టి మీరు ఆలోటు భర్తిచెయ్యాలి-చెయ్యగలరుకూడా.లక్షలాది విద్యార్థులకు,అసక్తి గలవారికి ఉపయోగపడతాయి.పిల్లలకుపాఠాలు చెప్పిన మీ అనుభవం మీనుండి చక్కని వ్యాసాలను రాయడానికి దోహదపడుతుంది,మాలాంటి వారికి సాధ్యకానిదది.ఇలాంటి ఇబ్బంది కరమైనవాటిపై కలసి స్పందిద్దాం.All the best.పాలగిరి (చర్చ) 08:18, 23 జనవరి 2013 (UTC)

ఎలక్ట్రో ప్లేటింగ్

ఎలక్ట్రో ప్లేటింగ్ వ్యాసం మొదలుపెట్టారు. కానీ ఇప్పటికే ఒక పెద్ద వ్యాసం విద్యుత్ లేపనం పేరుతో యాంత్రికంగా ఆంగ్ల వ్యాసం అనువదించబడినది. మీదగ్గరి సమాచారం ఈ పెద్ద వ్యాసంతో కలిపి; ఆ విస్తృత వ్యాసాన్ని సరిదిద్దగలరేమో ప్రయత్నించండి.Rajasekhar1961 (చర్చ) 09:18, 25 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ఇదివరకు ఉన్న వ్యాసాన్ని పరిశీలించని కారణంగా కొత్త వ్యాసాన్ని మొదలుపెట్టడం జరిగినది. మీ సూచన మేరకు ఈ వ్యాసాన్ని విద్యుత్ లేపనం కి దారిమార్పు చేశాను. యాంత్రిక అనువాదాన్ని సరిచేయ ప్రయత్నిస్తాను.( కె.వి.రమణ- చర్చ 10:49, 25 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
ఈ పెద్ద యాంత్రిక వ్యాసాన్ని మీరు శుద్ధిచేశారు. అందుకు ధన్యవాదాలు. ఇలాంటివి మరికొన్ని పెద్ద వ్యాసాలు ఉన్నాయి. మీకు సంబంధించిన భౌతికశాస్త్ర వ్యాసాల్ని మీరు శుద్ధిచేయగలరా. తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 07:43, 26 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం

కె.వి రమణ గారికి స్వాగం. తెవికీలో మీవంటి విద్యావంతుల రాక ముదావహం. భతికడాస్త్ర! గురించి మీవంటి వారు నాణ్యమైన ఉపయుక్తమైన వ్యాసాలాను అందించగలరని ఆశిస్తునాను. చర్చలలో మీరు చూపితున్న సంఉఅమనానికి ధన్యవాదాలు. మీ పేజీ చూసాను. మీ ఆశయా.ఉ బాగున్నాయి. మీరు మీరనుకున్నట్లు మీకు అనుభవమున్న రంగానికి సంబంధం ఉన్న వ్యాసాలను అందించండి. ఇప్పటి వరకు ఉన్న వ్యాసాలను సవరించండి. వికిపీడియా వ్యాసాలను ఎవరైనా సవరించవచ్చని మీకు తెలిసిన విషయమే కదా.

--t.sujatha (చర్చ) 15:15, 25 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

డ్రై సెల్ వ్యాసం

డ్రై సెల్ అనగా ఒక రకమైన బ్యాటరీ గురించిన పెద్ద వ్యాసం ఉన్నది. దానిని చూసి సరిచేయండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 08:16, 26 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్జల ఘటం తెలుగు పేరు బాగున్నది. డ్రై సెల్ పేరుతో వున్న వ్యాసాన్ని నిర్జల ఘటం కు దారిమార్చండి.Rajasekhar1961 (చర్చ) 10:44, 26 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

బొంగరము

బొంగరము మరియు బొంగరాల ఆట వ్యాసాల్ని విలీనం చేశాను. అందులోని సమాచారాన్ని ఒక పద్ధతిలో ఏర్పాటుచేసి వికీకరణ మూసను తొలగించండి.Rajasekhar1961 (చర్చ) 06:36, 29 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఏకవాక్య వ్యాసాలు

మీరు తయారుచేసిన ఏకవాక్య వ్యాసాల్ని దయచేసి ఒక పెద్ద వ్యాసంలో చేర్చండి. లేదా విస్తరించండి.Rajasekhar1961 (చర్చ) 07:09, 29 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

విక్షనరీ

రమణగారు, మీరు విక్షనరీలో మీకుతెలిసినపదాలను ఎటువంటి సందేహాలను లేకుండచేర్చవచ్చును.సృష్టిస్తేనే పదాలు ఏర్పడుతాయి.మీరు భౌతిక రసాయనికసాశ్త్రానికి సంబంధించిన పదాలను,మరి ఇతర ఆంగ్లపదాలను ,తెలుగు పదాలకు ఇతరభాషాపదాలు తెసివున్నచో కూడా చేర్చవచ్చును.అన్ని వివరాలు తెలియనవసరంలేదు.మీకు తెసినంతవరకు చేర్చుకుంటూ పోవడమే.ప్రస్తుతం విక్షనరీలో రచనలుచేస్తున్న సభ్యులం తక్కువమందేవున్నాము.మీకుస్వాగతం.పాలగిరి (చర్చ) 21:03, 29 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మేళకర్త రాగాలు వ్యాసంలో మీ మార్పుల రద్దు విషయమై

[మేళకర్త రాగాలు వ్యాసంలో మీ మార్పులు] నా దిద్దుబాటుకు కష్టంగా ఉన్నాయి. జాబితాలో రోజుకు కొన్ని వ్యాసాలు పూరిస్తున్నాను. పైగా ఆ జాబితా పట్టిక రూపంలో ఉండటానికి కాదు. దయచేసి కింద ఉన్న ఆవృతాల పట్టికలకు మీ మార్పులు ఆపాదించండి. ఈ జాబితాను మరో రెండు వారాల వరకూ జాబితాగానే ఉంచండి. రహ్మానుద్దీన్ (చర్చ) 09:59, 30 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పాస్కల్

పాస్కల్ వ్యాసంలో కొంతైనా సమాచారాన్ని చేర్చండి. పేజీ ఖాళీగా ఉన్నది.Rajasekhar1961 (చర్చ) 10:33, 30 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం

నమస్కారం రమణ గారూ, శాస్త్రీయ విషయాలపై తెలుగు వ్యాసాలు వ్రాస్తున్న మీ కృషి చాలా అభినందనీయం. మీలాంటి వారు తెవికీకి చాలా అవసరం. జీవశాస్త్రంతో చాలా పరిచయమున్నా, తెలుగులో వ్రాసే అంత పరిభాష నాకు లేదు --వైజాసత్య (చర్చ) 06:25, 31 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

లుంగీ లో చిత్రాల సవరణ

లుంగీ లో చిత్రాలని నా అభ్యర్థన మేరకు సవరించినందుకు ధన్యవాదాలు శశి (చర్చ) 04:26, 8 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

కాటన్ మరణతేది

రమణగారు,

నేను జీవిత విశేష పట్టికమాత్రమే చేర్చాను.పట్టికలో మరణించిన సంవత్సరమును మాత్రమే వ్రాసాను.మరణతేది నేను చేర్చిందికాదు.మీవద్ద సరియైనతేది వున్నచో మార్చండి.పాలగిరి (చర్చ) 16:16, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పైకప్పు పంఖా

సుల్తాన్ ఖాదర్ గార్కి నమస్కారములు, మీరు సీలింగ్ ఫ్యాన్ యొక్క తెలుగు పేరు పైకప్పు పంఖా గా మార్చారు. సాధారణంగా పంఖా అనగా విసనగర్ర,వీవెన అనే అర్థం వస్తుంది. అది మన శక్తితో పనిచేస్తుంది. కాని సీలింగ్ ఫ్యాను అనునది విధ్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చి తిరిగి గాలినిచ్చే సాధనం. దీనిని పైకప్పు పంఖా అనవచ్చునా! కొన్ని ఆంగ్లపదములకు సరియైన తెలుగు పదములు లభించవు. ఇంచుమించు సమానార్థం ఇచ్చే అర్థాలు లభిస్తాయి. కొన్ని అన్య భాషా పదములు జన సామాన్యంలో విరివిగా వాడేవి ఉంటాయి. వాటిని వాటిగానే చదవాలి గాని అచ్చమైన తెలుగులోనికి తర్జుమా చేయలేమని గమనించాలి. మనం వాడే "బస్సు" అనే పదం ఆంగ్ల పదమైనా దానిలాగానే చదవాలి కాని చతుష్చక్ర వాహనం అని అనిన ఎవరికీ అర్థం కాదు మరియు అటువంటి వాహనాలు అనేకం ఉంటాయి. కనుక కొన్ని పదాలు అన్యభాషా పదాలైనను వాటిని తర్జుమా చేయరాదని గమనించాలి.దీనిపై చర్చ జరపకుండా వ్యాస నామమును మార్చవచ్చునా?( కె.వి.రమణ- చర్చ 16:28, 13 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

నమస్తే రమణగారూ, తెవికీలో సాధ్యమైనంతవరకు తెలుగు పదాలు వాడితే సార్థకంగా ఉంటుంది. కొన్ని ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్థాలు లేని విషయం విదితమే. అలాగని మనం ప్రయత్నం ఆపకూడదు కదా. ఇటీవలే ప్రపంచ తెలుగు మహాసభలను జరుపుకొన్నాం. ఆంగ్ల పదాల వాడకం సాధ్యమైనంతగా తగ్గించాలని అనుకొన్నాం. ఈ ప్రయత్నంలో కొన్ని ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్థాలు పేర్కొనడం జరిగింది. ఇవి జన బాహుళ్యంలోకి వెళ్ళి ప్రజాదరణ పొందినపుడే కదా అందరికీ తెలిసేది. సీలింగ్ ఫ్యాన్ గురించి తెలుసుకోవడానికి తెవికీ వచ్చే వాళ్ళకు 'పైకప్పు పంఖా' వ్యాసం దారిమార్పు చేయబడుతుంది. ఈ విధంగా వారికి కావలసిన సమాచారం చేరవేయబడుతుంది. పంఖా పరిధిలోకి వివిధ రకాల విసనకర్రలు వస్తాయి. విద్యుత్ విసనకర్రల పరిదధిలోకి సీలింగ్ ఫ్యాన్ మరియు టేబుల్ ఫ్యాన్ వస్తాయి. బస్సు కు కూడా త్వరలోనే తెలుగు సమానార్థం వస్తుందని ఆశిస్తున్నాను. ఈనాడు పరిస్థితి ఎలా ఐనదంటే తెలుగు వాక్యాలలో తెలుగు పదాలను వెతుక్కొనే పరిస్థితి వస్తోంది. ఈ పరిస్థిని మరింత విషమంగా మారకుండా ఉండటానికి నావంతు కృషిగా సాధ్యమైనన్ని ఎక్కువ తెలుగు పదాలు వాడుతున్నాను. అలాగే చదువరులకు అసౌకర్యం కలుగకుండా ఆయా పదాలకు దారిమార్పులను ఏర్పాటు చేసి వ్యాసాలలో కూడా బ్రాకెట్లలో ఆంగ్ల సమానార్థాన్ని వివరిస్తున్నాను. ఈ వ్యాసానికి సీలింగ్ ఫ్యాన్ సరైన ఎన్నిక అని మీరు భావిస్తే నిరభ్యంతరంగా మార్చగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:19, 14 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు తెలుగు పదముల అభివృద్ధికి కృషిచేయటం తెలుగు వారు గర్వించదగ్గ విషయం. మీ వాదనతో ఏకీభవిస్తాను. "పైకప్పు పంఖా" శీర్షిక బాగుంది. దయచేసి "టెలివిజన్" కు సరైన తెలుగు పదం తెలుపగలరు. భౌతిక శాస్త్రం లో "టెలిస్కోప్" అనిన "దూరదర్శిని" అని అర్థం. మరి టెలివిజన్ వ్యాసం వ్రాయాలనుకుంటున్నాను. సహాయం చేయండి.  కె. వి. రమణ. చర్చ 14:24, 20 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రమణ గారూ, మీ ప్రోత్సాహానికి ధన్యవాదములు. పలు చర్చా వేదికలలో టెలివిజన్ వాడుక పదముగా దూరదర్శన్ గా పేర్కొనడం జరిగింది. స్వర్గీయ బూదరాజు రాధాకృష్ణ గారు కూడా దీనిని ధృవీకరించారు. కావున దీనిని వాడవచ్చు. ఇకపోతే "టెలిస్కోప్" కు కచ్చితమైన తెలుగు పదము దుర్భిణి . కావున దూరదర్శన్ సరైన పదమని నా భావన. అలాగే భౌతిక శాస్త్ర నిఘంటువులు తయారు చేస్తున్న మీ కృషి చాలా అభినందనకరం. మీరు పారిభాషిక పదకోశాలు కూడా తయారు చేయగలిగితే తెలుగు మాధ్యమం నుండి ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న లేదా చదివిన నా లాంటి ఎందరో విద్యార్థులకు మిక్కిలి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయంలో నా దగ్గర కొంత సమాచారం ఉన్నది. మీకు కావాలంటే తప్పక అందజేస్తాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:27, 20 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మీ సూచనకు ధన్యవాదాలు. మీ ఆలోచన బాగున్నది. భౌతిక శాస్త్రంలో గల తెలుగు పదములను సరియైన ఆంగ్ల పదములు ప్రస్తుతం అవసరం. మా పాఠశాలలలో నా విద్యార్థులు ఇంటర్మీడియట్ కి వెళ్ళేటప్పుడు భౌతిక,రసాయన శాస్త్రాలలో ఆంగ్ల పదములను ఒకేసారు అర్థం చేసుకోలేక పోవుట నేను గమనించితిని. వాటిని మీవంటి వారి సహకారంతో తయారుచేయగలనని తెలియజేస్తున్నాను.(  కె. వి. రమణ. చర్చ 15:42, 20 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

అనువాదం మరింత వాడుకగా ఉంటే బాగుంటుంది ...

>> కానీ ఈ-పుస్తకం అనునది ఏ అచ్చు పుస్తకమునకు తుల్యమైనది కాకుండా వ్యవస్థితమవుతుంది.

అనువాదం బాగుంది. అనువాదం చేసేటప్పుడు మీరయితే తెలుగులో ఎవరికన్నా అదే విషయాన్ని ఎలా నోటితో చెపుతారో అలా వ్రాయప్రయత్నించ చూడమని నా మనవి. అప్పుడు చాలా బాగా వస్తుంది అని నా ఉద్దేశ్యము. అన్యధా భావించరని ఆశిస్తూ..... Chavakiran (చర్చ) 17:44, 15 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నోబెల్ వ్యాసాలు

ఆల్ ఫ్రెడ్ నోబెల్ మరియు ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ అనే రెండు వ్యాసాలున్నాయి. వాటిని విలీనం చేయండి. నేను విస్తరిస్తాను.( కె.వి.రమణ- చర్చ 06:58, 17 ఫిబ్రవరి 2013 (UTC))


ఈ రెండింటిలో ఏది సరైన తెలుగు స్పెల్లింగ్ చెబితే దాని ప్రకారం విలీనం చేస్తాను.Rajasekhar1961 (చర్చ) 07:35, 19 ఫిబ్రవరి 2013 (UTC)
ఆల్ ఫ్రెడ్ నోబెల్ అనునది సరైనదిగా నాకు తోస్తున్నది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:30, 20 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మీ సూచన ప్రకారం ఆల్ ఫ్రెడ్ నోబెల్ సరియైనది.(  కె. వి. రమణ. చర్చ 15:37, 20 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

సహాయానికై ప్రశ్నల స్థానం సలహా

మీరడిగే ప్రశ్నలు సరియైన స్థానం ఎంపికచేసి ఒకే ఒక్కచోట వుంటే గందరగోళంలేకుండా వుంటుంది. అందరు స్పందించాలని కోరేటట్లయితే {{సహాయం కావాలి}} మూస చేర్చండి. ఒక వారం రోజులలో ఎవరూ స్పందించకపోతే వాడుకరి చర్చాపేజీలలో అసలు స్థానంలో వున్న ప్రశ్నకు లింకు ఇచ్చి, ప్రశ్నవున్న దగ్గరే స్పందించమని కోరండి. --అర్జున (చర్చ) 06:37, 21 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మర్యాద

నా పేజీలోని మర్యాదకు సూచనలు మీకు నచ్చినందుకు చాల సంతోషం. ఇవేవీ నేను వ్రాసినవీ కాదు. తెవికీకి కొత్తా కాదు వికీపీడియా:వికీ సాంప్రదాయం పేజీలో ఉన్నవే. వీటిని చదువరి గారు ఆంగ్ల వికీ నుండి అనువదించారు. ఇటీవల చర్చలను చూసిన నేను వీటిని మళ్లీ ఎత్తి చూపాలనే నా పేజీలో అతికించాను. ఇలాంటివి మరిన్ని మార్గదర్శకాలకు వికీపీడియా:సముదాయ పందిరి చూడండి. --వైజాసత్య (చర్చ) 04:41, 24 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పరికర సమాచారం తెలిపే మూస గూర్చి

అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు, వివిధ పరికరాలు భౌతిక శాస్త్రంలో ఉంటాయి. వాటి వివరాలను సంగ్రహంగా తెలిపే మూస ఏదైనా ఉన్నదా? పరికరం,ఆవిష్కర్త,ఉపయోగం, కనుగొనే సంవత్సరం,ఇతర పేర్లు,వంటి అంశాలతో ఏదైనా పరికర సమాచారం తెలిపే మూస ఏదైనా ఉంటె తెలియజేయండి.(  కె. వి. రమణ. చర్చ 09:38, 24 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

అభినందన

రమణగార్కి, సభ్యతంపొందిన 4నెలల9రోజులకే 2వేల దిద్దుబాట్ల మైలురాయిదాటి,మిగతా సభ్యులకు స్పూర్తిదాయిగా నిలచినందులకు అభినందనలు.ఇలాగే మునుముందు మీకు అనుభవమున్నరంగంకుచెందిన విలువైన వ్యాసాలు వికీలో రావాలని ఆకాంక్షిస్తూపాలగిరి (చర్చ) 02:37, 28 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

కస్తూరిబాయి గాంధీ

కస్తూరిబాయి గాంధీ మీద పెద్ద వ్యాసం ఉన్నది. దానిని వికికరిస్తే సరిపోతుంది. మీ విలువైన సమయం వృధా కాదు.Rajasekhar1961 (చర్చ) 16:16, 1 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వర్గం

రమణగారు,

వెల్డింగ్ పేరుతో ఒక వర్గం తయారు చేయగలరా?పాలగిరి (చర్చ) 01:18, 2 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సమావేశం/అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం

వికీపీడియా:సమావేశం/అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం సృష్టించాను. ఈ నెల రోజులు అందరూ వీలైనన్ని మహిళలకు సంబంధించిన వ్యాసాలను విస్తరించడం లేదా మొదలుపెడితే బాగుంటుంది. యాంత్రిక అనువాద వ్యాసాలు వర్గంలో కొందరు మహిళల మీద పెద్ద వ్యాసాలున్నాయి. వాటికి తీసుకొని సమాచారాన్ని సరిచేస్తే సరిపోతుంది.Rajasekhar1961 (చర్చ) 08:00, 5 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సాంకేతిక మూసలు

రేడియో అనే వ్యాసం యొక్క తెలుగుపేరు ఆకాశవాణి కి తరలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. (  కె. వి. రమణ. చర్చ 09:24, 24 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

టెలిఫోన్ అనే వ్యాసం యొక్క పేరును దూరవాణి అనిన బాగుంటుందేమో పరిశీలించగలరు.(  కె. వి. రమణ. చర్చ 09:30, 24 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు, వివిధ పరికరాలు భౌతిక శాస్త్రంలో ఉంటాయి. వాటి వివరాలను సంగ్రహంగా తెలిపే మూస ఏదైనా ఉన్నదా? పరికరం,ఆవిష్కర్త,ఉపయోగం, కనుగొనే సంవత్సరం,ఇతర పేర్లు,వంటి అంశాలతో ఏదైనా పరికర సమాచారం తెలిపే మూస ఏదైనా ఉంటె తెలియజేయండి(  కె. వి. రమణ. చర్చ 09:42, 24 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
రమణ గారూ, మీ సందేశానికి సమాధానమివ్వడంలో ఆలస్యమైంది. క్షంతవ్యడను. దూరదర్శన్ లాగానే ఆకాశవాణి పేరుతో ఆలిండియా రేడియో వ్యాసం ఉన్నది. కావున ఇక్కడ కూడా మనము దూరదర్శన్ వ్యాసం లాగానే ఆకాశవాణి వ్యాసానికి మార్పులు చేస్తే సరిపోతుందని నా అభిప్రాయం. ఇక మూస విషయానికి వస్తే గత వారం రోజులుగా అలాంటి మూస కోసం వెతికాను. కానీ నిరాశే ఎదురయ్యింది. ఈ విషయంలో మనమే రచ్చబండలో తోటి సభ్యులను అడిగి, ఒకవేళ మూస ఉంటే వాడుకోవడం కానీ లేకపోతే మన అవసరాలకు అనుగుణంగా కొత్తది సృష్టించుకోవడం కానీ చేద్దాం. మీ అభిప్రాయం తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:38, 7 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నా ఇసుకతిన్నెకి మీరు ప్రతిపాదించిన పేర్లు

నా ఇసుకతిన్నెకి మీరు పేర్లు ప్రతిపాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా దీని పై చాలా కృషి చేయవలసి ఉన్నది. దొరలు మన లాగా చలేస్తే ఒక దుప్పటి కప్పుకుపోవటం, వాన పడితే ఒక గొడుగు పట్టుకు పోవటం, ఎండ పెడితే బనీను తోనే బయటికి వెళ్ళటం చేయరు. (మనం తక్కువ అని వాళ్ళు ఎక్కువ అని చెప్పట్లేదు. వారి కి ఒక శైలి ఉంది అని మాత్రమే చెబుతున్నాను.) అక్కడి వాతావరణ పరిస్థితులని బట్టి, శుభాశుభాలకి వెళ్ళే సందర్భాన్ని బట్టి వారి వస్త్రధారణ ఉంటుంది. ఇవన్నీ క్రోడీకరించటానికి నాకు ఇంకా చాలా సమయమే పడుతుంది. ఈ లోపు మీరు ఇంకనూ వేరే పేర్లు ప్రతిపాదించ గలిగితే సంతోషం. శశి (చర్చ) 03:06, 9 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]