Jump to content

శ్రీ త్రిలింగరాజరాజేశ్వరస్వామి దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 18°46′29″N 79°31′18″E / 18.7747336°N 79.5215368°E / 18.7747336; 79.5215368
వికీపీడియా నుండి
శ్రీ త్రిలింగరాజరాజేశ్వారస్వామి ఆలయం
శ్రీ త్రిలింగరాజరాజేశ్వారస్వామి ఆలయం is located in Telangana
శ్రీ త్రిలింగరాజరాజేశ్వారస్వామి ఆలయం
శ్రీ త్రిలింగరాజరాజేశ్వారస్వామి ఆలయం
తెలంగాణ లో ప్రాంతం
భౌగోళికాంశాలు :18°46′29″N 79°31′18″E / 18.7747336°N 79.5215368°E / 18.7747336; 79.5215368
పేరు
ఇతర పేర్లు:త్రికూటాలయం
ప్రధాన పేరు :శ్రీ త్రిలింగరాజరాజేశ్వరస్వామి ఆలయం
ప్రదేశం
దేశం:భారత దేశము
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:పెద్దపల్లి
ప్రదేశం:జనగామ (గ్రా), గోదావరిఖని (ప), రామగుండం (మం)
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శ్రీ రాజరాజేశ్వర స్వామి (శివుడు)
ఇతిహాసం
నిర్మాణ తేదీ:సా.శ.. పన్నెండో శతాబ్దం

శ్రీ త్రిలింగరాజరాజేశ్వరస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని, పెద్దపల్లి జిల్లా, రామగుండం మండలం, జనగామ గ్రామంలో ఉన్న బహు పురాతన శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని 12 వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించారు.[1]

ఆలయ చరిత్ర

[మార్చు]

ఈ ఆలయాన్ని పురాతన గ్రామమైన జనగామలో 12 వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో జైనులు నిర్మించారు. ఈ ఆలయాన్ని 16 పోళ్ళతో, మొత్తం ఇసుకరాయితో నిర్మించారు. ఈ ఆలయం తూర్పున ఊర చెరువు, ఉత్తరాన గోదావరి నది ఉంది. ఈ నదిలో ఋషులు, మునులు ఈ ఆలయంలో ఉండే రహస్య మార్గం గుండా వెళ్లి స్నానం ఆచరించేవారట.

ఆలయ ప్రత్యేకతలు

[మార్చు]

ఈ ఆలయంలో ప్రతి రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజున, కార్తీక పౌర్ణమి రోజున మూడు రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాల జరుగుతాయి. ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు వస్తూ ఉంటారు.

రవాణా సౌకర్యం

[మార్చు]

ఈ ఆలయానికి రామగుండం మండలంలోని గోదావరిఖని పట్టణం నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

చిత్రమాలికలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "శ్రీ త్రిలింగరాజరాజేశ్వారస్వామి ఆలయం". 3 February 2019.[permanent dead link]