సూరత్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1951 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
అక్షాంశ రేఖాంశాలు | 21°12′0″N 72°48′0″E |
సూరత్ గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇప్పటివరకు ఇక్కడ 15 సార్లు ఎన్నికలు నిర్వహించగా భారతీయ జనతా పార్టీ 7 సార్లు, కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, జనతా పార్టీ, కాంగ్రెస్ (ఓ) చెరోసారి విజయం సాధించాయి. పూర్వ ప్రధానమంత్రి మురార్జీ దేశాయ్ ఈ నియోజకవర్గం నుంచి వరసగా 5 సార్లు విజయం సాధించాడు. భాజపాకు చెందిన కాశీరాం రాణా వరసగా 6 సార్లు విజయం సాధించి డబుల్ హాట్రిక్ సృష్టించారు.
అసెంబ్లీ సెగ్మెంట్లు
[మార్చు]గెలుపొందిన లోక్‌సభ సభ్యులు
[మార్చు]ఇప్పటివరకు ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సభ్యులు, వారి పార్టీల వివరాలు:[1]
సంవత్సరం | పేరు | చిత్తరువు | పార్టీ | |
---|---|---|---|---|
1951 | కనయాలాల్ దేశాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1957 | మొరార్జీ దేశాయి | |||
1962 | ||||
1967 | ||||
1971 | భారత జాతీయ కాంగ్రెస్ (O) | |||
1977 | జనతా పార్టీ | |||
1980 | సి.డి.పటేల్ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1984 | ||||
1989 | కాశీరామ్ రాణా | భారతీయ జనతా పార్టీ | ||
1991 | ||||
1996 | ||||
1998 | ||||
1999 | ||||
2004 | ||||
2009 | దర్శన జర్దోష్ | |||
2014 | ||||
2019 | ||||
2024 | ముఖేష్ దలాల్[2][3][4] | భారతీయ జనతా పార్టీ |
2019 ఎన్నికలు
[మార్చు]2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి దర్శన విక్రమ్ జర్దోష్ 5,48,230 ఓట్ల తేడాతో గెలిచింది. దర్శన విక్రమ్ జర్దోష్ 74.00 శాతం ఓట్లతో 795,651 ఓట్లను, 247,421 ఓట్లు (23.14 శాతం) పొంది కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ పటేల్ (అధేవాడ) ను ఓడించింది.
2014 ఎన్నికలు
[మార్చు]2014 లోక్‌సభ ఎన్నికలలో, బిజెపి నుండి దర్శన విక్రమ్ జర్దోష్ సీటును గెలిచి, 75.75 శాతం ఓట్‌షేర్‌తో 718,412 ఓట్లను పొందింది. కాంగ్రెస్ అభ్యర్థి దేశాయ్ నైషద్‌భాయ్ భూపత్‌భాయ్ 185,222 ఓట్లు (19.53 శాతం) సాధించి రన్నరప్‌గా నిలిచారు. దర్శన విక్రమ్ జర్దోష్ 533,190 ఓట్ల తేడాతో దేశాయ్ నైషద్‌భాయ్ భూపత్‌భాయ్‌పై విజయం సాధించింది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Parliament Constituency wise Electors Detail, Polling Stations & EPIC - Loksabha Election 2009" (PDF). Chief Electoral Officer, Gujarat website. Archived from the original (PDF) on 2009-04-16. Retrieved 2011-09-20.
- ↑ Hindustan Times (22 April 2024). "BJP candidate Mukesh Dalal wins Surat Lok Sabha seat unopposed" (in ఇంగ్లీష్). Archived from the original on 22 April 2024. Retrieved 22 April 2024.
- ↑ The Hindu (22 April 2024). "BJP candidate Mukesh Dalal elected unopposed from Surat" (in Indian English). Archived from the original on 22 April 2024. Retrieved 22 April 2024.
- ↑ EENADU (22 April 2024). "ఎన్నికలకు ముందే భాజపాకు తొలి విజయం.. ఆ ఎంపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం." Archived from the original on 22 April 2024. Retrieved 22 April 2024.