1755
Jump to navigation
Jump to search
1755 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1752 1753 1754 - 1755 - 1756 1757 1758 |
దశాబ్దాలు: | 1730లు 1740లు - 1750లు - 1760లు 1770లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- మార్చి 12: న్యూజెర్సీ రాగి గని యజమాని ఆరెంట్ షూలేర్ ఒక మైన్ షాఫ్ట్ నుండి నీటిని బయటకు పంపుటకు న్యూకామెన్ ఇంజిన్‌ను వ్యవస్థాపించడంతో మొదటిసారిగా అమెరికన్ కాలనీలలో ఒక ఆవిరి యంత్రం ఉపయోగించబడింది. [1]
- ఏప్రిల్ 2: ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన కమోడోర్ విలియం జేమ్స్ నేతృత్వంలోని నావికాదళం తులజీ ఆంగ్రే కోట సువర్నదుర్గ్‌ను మరాఠాల నుండి స్వాధీనం చేసుకుంది.
- ఏప్రిల్ 15: శామ్యూల్ జాన్సన్ ఒక డిక్షనరీ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రచురించాడు (అతను ఈ పనిని తొమ్మిదేళ్ల క్రితం, 1746 లో ప్రారంభించాడు).
- జూన్ 5: స్కాటిష్ రసాయన శాస్త్రవేత్త జోసెఫ్ బ్లాక్, కార్బన్ డయాక్సైడ్ ను, మెగ్నీషియంనూ కనుగొన్నట్లు మెడికల్ సొసైటీ ఆఫ్ ఎడిన్బర్గ్కు ఒక కాగితంలో వివరించాడు. ఈ కాగితం 1756 లో ఎక్స్‌పెరిమెంట్స్ అపాన్ మెగ్నీషియా ఆల్బా, క్విక్‌లైమ్ అండ్ సం అదర్ ఆల్కలీన్ సబ్‌స్టన్సెస్ అనే పేరుతో ప్రచురించబడింది. [2]
- జూలై 17: గ్రేట్ బ్రిటన్ నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ కోసం భారతదేశానికి తిగివెళ్తున్న ఓడల కాన్వాయ్‌లో ప్రధాన ఓడ డోడింగ్టన్,పోర్ట్ ఎలిజబెత్ వద్ద ధ్వంసమైంది. దాని 270 మంది ప్రయాణికులు, సిబ్బందిలో 247 మంది మరణించారు. రాబర్ట్ క్లైవ్ పంపిన £ 33,000 విలువైన బంగారు నాణేల ఇనప్పెట్టె కూడా పోయింది. 1998 లో, 1,400 నాణేలను అమ్మకానికి పెట్టారు. 2002 లో ఒక భాగాన్ని దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి ఇచ్చారు. [3]
- నవంబర్ 1: 8.5 తీవ్రతతో వచ్చిన లిస్బన్ భూకంపం కారణంగా 40,000 మందికి పైగా మరణించారు. ఈ ప్రకంపన పోర్చుగల్ అట్లాంటిక్ తీరంలో స్థానిక సమయం ఉదయం 9:40 గంటలకు వచ్చింది. పోర్చుగల్, స్పెయిన్, మొరాకో తీరాలను తాకిన సునామికి కారణమైంది.
జననాలు
[మార్చు]- ఏప్రిల్ 10: శామ్యూల్ హనీమాన్, జర్మన్ హోమియోపతి వ్యవస్థాపకుడు (మ .1843)
- ఏప్రిల్ 11 – జేమ్స్ పార్కిన్సన్, ఇంగ్లీష్ సర్జన్, అపోథెకరీ, జియాలజిస్ట్, పాలియోంటాలజిస్ట్, రాజకీయ కార్యకర్త (మ .1824 )
- సెప్టెంబరు 25: రేమండ్, హైదరాబాదులోని గన్‌ఫౌండ్రీ స్థాపకుడు. (మ. 1798)
- నవంబర్ 2 – మేరీ-ఆంటోనిట్టే, ఫ్రాన్స్ రాణి (మ .1793 ) [4]
- నికోలస్ జాక్ కాంటె, ఫ్రెంచి చిత్రకారుడు, పెన్సిల్ ను కనిపెట్టాడు. (మ. 1805)
మరణాలు
[మార్చు]పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Paul R. Wonning, Colonial American History Stories, 1753–1763: Forgotten and Famous Historical Events (Mossy Feet Books, 2017)
- ↑ "Black (Joseph)", in Bibliotheca Osleriana: A Catalogue of Books Illustrating the History of Medicine and Science by Sir William Osler (McGill-Queen's University Press, 1969) p116
- ↑ "Sailing Ship Dodington (history)". Archived from the original on 2005-01-14. Retrieved April 2, 2012.
- ↑ "Marie-Antoinette | Facts, Biography, & French Revolution" (in ఇంగ్లీష్). Retrieved 22 March 2020.