Jump to content

జమ్మూ జిల్లా

అక్షాంశ రేఖాంశాలు: 32°44′N 74°52′E / 32.73°N 74.87°E / 32.73; 74.87
వికీపీడియా నుండి
జమ్మూ జిల్లా
బాహు పోర్టు, జమ్మూ
బాహు పోర్టు, జమ్మూ
జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో జమ్మూ జిల్లా
జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో జమ్మూ జిల్లా
Coordinates (జమ్మూ): 32°44′N 74°52′E / 32.73°N 74.87°E / 32.73; 74.87
దేశంభారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
విభాగంజమ్మూ విభాగం
ముఖ్య పట్టణంజమ్మూ
తహసీల్స్1. అక్నూర్, 2. బిస్నహ, 3. జమ్మూ, 4. రణబీర్ సింగ్ పోరా
Government
 • లోక్‌సభ నియోజకవర్గ కేంద్రంజమ్మూ
విస్తీర్ణం
 • మొత్తం2,336 కి.మీ2 (902 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం15,29,958
 • జనసాంద్రత650/కి.మీ2 (1,700/చ. మై.)
జనాభా
 • అక్షరాస్యత83.45%
 • లింగ నిష్పత్తి880
Time zoneUTC+05:30
Vehicle registrationJK-02
Websitehttp://jammu.nic.in/

జమ్మూ జిల్లా, జమ్మూ కాశ్మీరు, రాష్ట్రంలోని 20 జిల్లాలలో జమ్మూ జిల్లా ఒకటి. రాష్ట్రానికి ఇది శీతాకాలపు రాజధానిగా ఉంటుంది. వేసవిలో రాజధాని శ్రీనగర్కు మార్చబడుతుంది. ఈ జిల్లాలో అత్యంత పెద్ద నగరం జమ్ము.జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో ఇది అత్యంత జనసాంధ్రత కలిగిన ప్రాంతమని 2011 గణాంకాలు తెలియజేస్తున్నాయి.[1]

జిల్లా జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఈ జమ్మూ జిల్లా పరిధిలో మొత్తం 15,29,958 మంది జనాభా ఉండగా, వారిలో పురుషులు 8,13,821 మంది, మహిళలు 716,137 మంది ఉన్నారు. ఈ జిల్లా పరిధిలో 3,14,199 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ జిల్లా లేదా పట్టణ సగటు లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 880 మంది మహిళలు ఉన్నారు ఈజిల్లా జనాభా మొత్తంలో 50% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 50% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.జిల్లా సగటు అక్షరాస్యత రేటు పట్టణ ప్రాంతాలలో 88.5% ఉండగా,  గ్రామీణ ప్రాంతాల్లో 78.2%గా ఉంది. పట్టణ ప్రాంతాలలో లింగ నిష్పత్తి 1000:856 ఉండగా, గ్రామీణ ప్రాంతాలలో 1000:905 గా ఉంది.ఈ జిల్లా లేదా పట్టణ పరిధిలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1,67,363 (11%) మంది ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు మధ్య 93,242మంది మగ పిల్లలు ఉండగా, ఆడ పిల్లలు 74121 మంది ఉన్నారు. మొత్తం అక్షరాస్యత రేటు 83.45% ఉండగా పురుషుల అక్షరాస్యత రేటు 78.88%, మహిళా అక్షరాస్యత రేటు 69.15%గా ఉంది.[2]

జన సాంద్రత

[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం, జమ్మూ జిల్లా మొత్తం వైశాల్యం 2,342 చ.కి.మీ. జమ్మూ జిల్లా సాంద్రత చదరపు కిలోమీటరుకు 653 మంది. సుమారు 252 చదరపు కి.మీ. విస్తీర్ణం పట్టణ ప్రాంతంలో ఉండగా, 2,090 చదరపు కి.మీ. గ్రామీణ ప్రాంతంలో ఉంది.[2]

జిల్లా సంక్షిప్త సమాచారం

[మార్చు]

ఈ జిల్లా 2,336 చ.కి.మీ.విస్తీర్నంలో విస్తరించి ఉంది.జిల్లాలో 11 అసెంబ్లీ నియోజకవర్గాలు, 8 పట్టణ స్థానిక సంస్థలు, 771 గ్రామాలు, 21 తాలూకాలు, 20 బ్లాకులు, 296 పంచాయితీలు, 2,546విద్యా సంస్థలు,332 ఆరోగ్య కేంద్రాలు, 2533 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి.[3]

విభాగాలు

[మార్చు]

జమ్మూ జిల్లాలో 7 ఉప విభాగాలు (రెవెన్యూ డివిజన్లు) ఉన్నాయి.

రెవెన్యూ విభాగాలు

[మార్చు]
  • జమ్మూ సౌత్
  • జమ్మూ నార్త్
  • ఆర్ఎస్ పురా
  • మార్హ్
  • అఖ్నూర్
  • చౌకి చౌరా
  • ఖౌర్

మతాలు వారిగా ప్రజలు

[మార్చు]

జమ్మూ జిల్లాలోని 93% ప్రజలు హిందూ మతాన్ని అవలంబిస్తున్నారు. ఇతరులు ఇస్లాం, సిక్కు, క్రైస్తవ మతాలను అవలంబిస్తున్నారు.[2]

మతం మొత్తం పురుషులు స్తీలు
హిందువులు 1,289,240 (84.27%) 6,85,679 6,03,561
మస్లింలు 107,489 (7.03%) 56,927 50,562
క్రిష్టియన్లు 12,104 (0.79%) 6,455 5,649
సిక్కులు 114,272 (7.47%) 6,1,098 53,174
బౌద్ధులు 470 (0.03%) 266 204
జైనులు 1,987 (0.13%) 1,038 949
ఇతర మతాల వారు 321 (0.02%) 171 150
గుర్తించని మతాలువారు 4,075 (0.27%) 2,187 1,888

మూలాలు

[మార్చు]
  1. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. 2.0 2.1 2.2 "Jammu District Population Religion - Jammu and Kashmir, Jammu Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-09-25. Retrieved 2020-11-27.
  3. "District at a Glance | District Jammu | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-11-27.

వెలుపలి లంకెలు

[మార్చు]