పాలకొల్లు
పాలకొల్లు
క్షీరపురి, పాలకొలను | |
---|---|
పట్టణం | |
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పాలకొల్లు | |
Coordinates: 16°32′00″N 81°44′00″E / 16.5333°N 81.7333°E | |
దేశం | భారతదేశం |
Named for | పాల అభిషేకం |
Government | |
• Type | స్థానిక స్వపరిపాలన |
• Body | పాలకొల్లు పురపాలక సంస్థ |
• చైర్మన్ | వల్లభనేని నారాయణ మూర్తి |
విస్తీర్ణం | |
• పట్టణం | 24.68 కి.మీ2 (9.53 చ. మై) |
• Rank | 34వ (in state) |
Elevation | 1.5 మీ (4.9 అ.) |
జనాభా (2011) | |
• పట్టణం | 1,04,216 |
• Rank | ఆంధ్రప్రదేశ్ లో 34వ |
• జనసాంద్రత | 10,939/కి.మీ2 (28,330/చ. మై.) |
• Metro | 1,10,075 |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+05:30 |
PIN | 534 260 |
టెలిఫోన్ కోడ్ | +91–8814 |
Vehicle registration | AP–37 |
పాలకొల్లు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోన పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలానికి చెందిన పట్టణం, మండల కేంద్రం. పాలకొల్లు చుట్టుప్రక్కల భూములు సారవంతమైనవి. ఊరిచుట్టూ పచ్చని వరిచేలు, కొబ్బరితోటలు, చేపల చెరువులు కనిపిస్తాయి. పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం తరువాత పాలకొల్లు మూడవ అతిపెద్ద పట్టణంగా ఉంది.
పేరు వ్యుత్పత్తి
[మార్చు]పాలకొల్లుకు దుగ్ధోపవనపురం, ఉపమన్యుపురం అనేవి నామాంతరాలు. మహాభక్తుడైన ఉపమన్యుడు ఈ ప్రదేశంలో క్షీరాన్ని పొందడంతో ఉపమన్యుపురమనీ, పాలకొలను అనీ పేర్లు వచ్చాయంటారు. పాలకొలను అనే పేరు జనవ్యవహారంలో పాలకొల్లు అయింది. పాలకొల్లు అన్న పేరుకు సంస్కృతీకరణగా క్షీరారామం అన్న వ్యవహారం కూడా ఉంది.[1]
చరిత్ర
[మార్చు]వెలనాటి చోళరాజు భార్య గుండాంబిక సా.శ.1157లో పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయానికి అఖండదీపానికి దానం ఇచ్చింది. ఇక్కడి నాట్యమంటపానికి సా.శ.1276లో కోన గణపతిదేవ మహారాజు కంచు తలుపులు పెట్టించారు. 150 అడుగుల ఎత్తైన ఆలయ గోపురాన్ని సా.శ.1415న అల్లాడ రెడ్డిభూపాలుడు నిర్మించారని శిలాశాసనం పేర్కొంటోంది. చెళ్ళపిన్నమనేని నరహరినేని ఆలయ కళ్యాణమండపం నిర్మించారు. సౌ.శ.1777లో బచ్చు అమ్మయ్య మూడు వందల సంవత్సరాల నాడు ప్రారంభించిన గోపురాన్ని పూర్తిచేయించారు.
కుతుబ్ షాహీ పాలనలో పరిశ్రమలు
[మార్చు]వస్త్ర పరిశ్రమ కేంద్రంగా
[మార్చు]16, 17 శతాబ్దాల్లో గోల్కొండ కుతుబ్ షాహీ పాలనా కాలంలో పాలకొల్లు ప్రాంతంలో వస్త్ర పరిశ్రమ విలసిల్లేది. కాటన్, కాలికో, లుంగీలు, దుప్పట్లు తయారయ్యేవి. ప్రత్యేకించి రంగుల అద్దకంతో రూపొందిన వస్త్రాలు కూడా పాలకొల్లులో తయారుచేసేవారు. ఈ వస్త్రాలన్నీ మచిలీపట్నం రేవుకు చేరుకుని, అక్కడ నుంచి ఓడల ద్వారా వివిధ ప్రాంతాలకు వాణిజ్యానికి తరలివెళ్ళేవి.[2] 1770లో కృష్ణా, గోదావరి డెల్టాలను దెబ్బతీసిన పెద్ద కరువు వల్ల వ్యవసాయం, వ్యాపారం దెబ్బతిన్నాయి. ఈ కరువు పాలకొల్లు కేంద్రంగా సాగుతున్న వస్త్ర పరిశ్రమ మీదా వ్యతిరేక ప్రభావం చూపించింది. 18వ శతాబ్ది చివరి దశకాల్లో పాలకొల్లు ప్రాంతంలోని వస్త్ర పరిశ్రమ చాలా మందకొడిగా సాగిందని డచ్చి వారి నివేదికలు పేర్కొన్నాయి. 19వ శతాబ్దిలో ఇంగ్లాండు నుంచి వస్త్రాల దిగుమతులు ఊపందుకోవడంతో ఇతర కోరమాండల్ తీరానికి చెందిన వస్త్ర పరిశ్రమ కేంద్రాలతో పాటు పాలకొల్లు కూడా పూర్తిగా దెబ్బతింది. పాలకొల్లు వస్త్రాలు అమ్ముడయ్యే మార్కెట్ల సంగతి పక్కనపెడితే ఈ ప్రాంతంలోనే స్థానిక వస్త్రాలు వదిలిపెట్టి ఇంగ్లండు మిల్లు బట్టలు కట్టడం మొదలైంది. దీంతో వస్త్ర పరిశ్రమ కేంద్రంగా పాలకొల్లు స్థానం చెదిరిపోయింది.[3]
మేకుల తయారీ పరిశ్రమ
[మార్చు]కుతబ్ షాహీల పాలనలో పాలకొల్లులో ఇనుప మేకులు తయారుచేసే పరిశ్రమ సాగేది. ఇక్కడికి సమీపంలోని నరసాపురం నౌకా నిర్మాణ పరిశ్రమ విలసిల్లేది. సామాన్యంగా భారతదేశంలో ఇనుము లోటు ఉండడంతో ఇతర ప్రాంతాల్లో నౌకలు కేవలం చెక్కతోనే తయారుచేసేవారు. గోదావరి డెల్టా ప్రాంతంలో ఇనుము లభ్యతకు లోటులేకపోవడంతో నరసాపురంలో మాత్రం మేకులు, ఇతర ఇనప ఉపకరణాలు వాడి నిర్మించేవారు. ఈ స్థితిగతులు పాలకొల్లులో ఇనుప మేకుల పరిశ్రమకు వీలిచ్చాయి.[4]
భౌగోళికం
[మార్చు]జిల్లా కేంద్రమైన భీమవరంకు తూర్పుగా 24 కి.మీ దూరంలో వుంది. ఇక్కడనుండి నరసాపురం పట్టణానికి 9 కి.మీ. దూరం. ఇక్కడనుండి 7 కి.మీ. దూరంలో చించినాడ వద్ద వశిష్టగోదావరి నదిపై కట్టిన వంతెన తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలను కలుపుతుంది.
పరిపాలన
[మార్చు]పాలకొల్లు పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
గ్రేటర్ పాలకొల్లు
[మార్చు]పురపాలక సంఘానికి మూడు కిలో మీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలను విలీనం చేస్తున్నట్లు తీర్మానం కౌన్సిల్ ఆమోదించింది. ప్రస్తుతం 31వ వార్డులతో ఉన్న పురపాలక సంఘం సుమారు 1.29 లక్షల మంది జనాభాను కలిగి ఉంది. దానికితోడు పూలపల్లి, ఉల్లంపర్రు, పాలకొల్లు రూరల్ ఏరియా పంచాయతీల విలీనం జరిగితే గ్రేటర్ కార్పొరేషన్ (గ్రేటర్ సిటీ) అవుతుంది.[ఆధారం చూపాలి]
వాతావరణం
[మార్చు]నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సగటు అధిక °C (°F) | 27.7 (81.9) |
30 (86) |
32.8 (91.0) |
35 (95) |
37 (99) |
36.3 (97.3) |
32.4 (90.3) |
32.2 (90.0) |
32 (90) |
31 (88) |
28.8 (83.8) |
27.6 (81.7) |
31.9 (89.5) |
సగటు అల్ప °C (°F) | 19.2 (66.6) |
20.9 (69.6) |
22.8 (73.0) |
26 (79) |
27.8 (82.0) |
27.3 (81.1) |
25.6 (78.1) |
25.6 (78.1) |
25.6 (78.1) |
24.6 (76.3) |
21.1 (70.0) |
19.4 (66.9) |
23.8 (74.9) |
సగటు అవపాతం mm (inches) | 1 (0.0) |
6 (0.2) |
4 (0.2) |
7 (0.3) |
41 (1.6) |
145 (5.7) |
266 (10.5) |
190 (7.5) |
191 (7.5) |
286 (11.3) |
52 (2.0) |
19 (0.7) |
1,208 (47.6) |
Source: India Meteorological Department (climate data)[5] |
రవాణా సౌకర్యాలు
[మార్చు]పాలకొల్లు నుండి ఎటు వైపునకైనా ప్రయాణము చేయుట అతి సులభము.పాలకొల్లు డిపో కానప్పటికీ ఈ పట్టణం రవాణా నర్సాపురం, భీమవరం, తణుకు, రాజోలు డిపోల మధ్య నుండుట వలన నుండి ప్రతి పది నిముషములకు ఒక బస్సు పాలకొల్లు బస్టాండు నుండి బయలు దేరుతుంటుంది. ఇవేకాక పాలకొల్లు నుండి ప్రరిసరప్రాంతముల ప్రతి చిన్న గ్రామాలకు కూడా సర్వీసులు ఉన్నాయి.
విద్యా సౌకర్యాలు
[మార్చు]అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, దాసరి నారాయణరావు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, చాంబర్స్, కామర్స్ కళాశాల. వున్నాయి. ఇంకా పలు జూనియర్ కళాశాలలు, ఉన్నత పాఠశాలలున్నాయి.
ఉత్పత్తులు
[మార్చు]పరిశ్రమలు
[మార్చు]- నవారు లేదా నవ్వారు తయారీ : మంచాలకు ఉపయోగించు నవ్వారు తయారీ షావుకారు పేట అను ప్రాంతమందు ఎక్కువగా జరుగుతుంది. ఈ ప్రాంతంనుండి ఇతర ప్రాంతాలకు ఎగుమతి జరుగుతుంది.
- లేసు పరిశ్రమ: పాలకొల్లు కేంద్రంగా కొమ్ముచిక్కాలలో దాదాపు రెండువేలమంది పనిచేయు లేసు పరిశ్రమ ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన పీతాని సత్యనారాయణ తండ్రి పేరున స్థాపించిన 'పేతాని వెంకన్న' లేసు పరిశ్రమ పాలకొల్లులో అతిపద్ద పరిశ్రమ.
పర్యాటక ఆకర్షణలు
[మార్చు]క్షీరారామం
[మార్చు]ఆంధ్రప్రదేశ్‌లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో ఒకటైన క్షీరారామం పాలకొల్లులో వుంది. శ్రీరాముడు సీతమ్మ వార్ల స్వహస్తాలతో ప్రతిష్ఠితమైన ప్రసిద్ధ క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం ఇక్కడే ఉంది. ఇక్కడి మందిరాన్ని చాళుక్యుల కాలంలో, 10 - 11 శతాబ్దులలో నిర్మించారు. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. దీనికి కొద్ది దూరంలో ఒక చెరువు ఉంది. గోపుర నిర్మాణసమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మితమైన తరువాత దాని చుట్టూ మట్టినిపోస్తూ దానిపై రాకపోకలతో రెండవ అంతస్తు నిర్మాణం చేసేవారట ఆవిధంగా మట్టి తీయగా ఏర్పడిన చెరువు పేరు రామగుండం. ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తయిన, చోళ రాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాలలో ఇది ఒకటి.
ఇతర దేవాలయాలు
[మార్చు]- పాలకొల్లులో చిన్న గోపురం అని పిలువబడే మరొక ఆలయం ఉంది. ఇక్కడి మూలవిరాట్ కేశవస్వామి.
- అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి మందిరం ఉంది. ఇక్కడి బ్రహ్మోత్సవం ఊళ్ళో ఒక పెద్ద పండుగ. ఈ మందిరంలో ధనుర్మాసంలో జరిపే ప్రత్యేక పూజలు కూడా ప్రసిద్ధం.
- ఎడ్ల బజారు వద్ద గల శ్రీ కనకదుర్గమ్మవారి దేవస్థానం ఉంది. దసరా ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుపుతారు. నాటకాలు బుర్రకథలు,హరికథలు మొదలగునవి పదిరోజులు పాటు ప్రదర్శిస్తారు.
- పాలకొల్లు పట్టణ దేవత శ్రీ పెద్దింట్లమ్మ వారు. పాలకొల్లు వర్తకసంఘాల ఆధ్వర్యంలో పదిరోజులు జరిగే పెద్దింట్లమ్మ వారి ఉత్సవాలలో ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రఖ్యాత నాటక సమాజాల వారిచే నాటకాలు ప్రదర్శించబడును.
- పాలకొల్లు గ్రామ దేవత దేశాలమ్మ వారు.
ఇతర విశేషాలు
[మార్చు]- లలితకళాంజలి కళాక్షేత్రం : ప్రతి సంవత్సరం నాటకోత్సవాలు నిర్వహించి ఉత్తమ నాటకాలకు, ఉత్తమ నటీ నటులకు పురస్కారములతో సత్కరించటం జరుగుతున్నది.
- లయన్స్ క్లబ్, సంగీతకాడమీ: ఉచిత నేత్ర శస్త్ర చికిత్సా శిబిరాలు, వికలాంగులగు ఆర్థిక సహాయాలు, ఆధారంలేని స్త్రీలకు కుట్టు మిషన్లు పంపిణీ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంగీతాసక్తి ఉన్న వారికి శిక్షణ తరగతులు, పేద విద్యార్థులకు ఉచిత కంప్యూటరు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.
- మహిళామండలి: వీణ, గాత్రం, వేణువు, భరతనాట్యం, కూచిపూడి, చిత్రలేఖనం, కాక వృత్తి విద్యా కోర్సులైన టైలరింగ్, అద్దకం వంటి వాటిని నేర్పుతున్నారు.
- బాలకేంద్రం: బాలలకు కళా రూపాలైన భరతనాట్యం, చిత్రలేఖనం, సంగీతం లాంటివాటిలో శిక్షణ ఇస్తుంటారు. 1980 అక్టోబరు 2న ప్రారంభించిన ఈ బాలకేంద్రం దివంగత బొండాడ వెంకట్రామగుప్త కృసి ఫలితంగా పాలకొల్లుకు లభించింది. మహిళా మండలి భవనంలో కొంతభాగం దీనికి కేటాయించారు.
- ఆంధ్ర ప్రదేశ్ లో రక్షిత మంచి నీటి పథకం ద్వారా స్వాతంత్ర్యానికి పూర్వం నుండి మంచి నీరు సరఫరా జరిగిన అతి కొద్ది మునిసిపాలిటీలలో పాలకొల్లు మొదటి మునిసిపాలిటి.
- ఇక్కడ పూతరేకులు, సొనె పాప్పొది, బూందీ లడ్డు, జీడిపప్పు పాకం, హల్వాలు అత్యధికంగా ఎగుమతి అయ్యే మిఠాయిలు.[ఆధారం చూపాలి]
ప్రముఖులు
[మార్చు]- గజల్ శ్రీనివాస్, తెలుగులో గజల్ సంగీత, కవితా ప్రక్రియలకు మంచి ప్రజాదరణ కలిగించినవాడు
- మాండొలిన్ శ్రీనివాస్, సంగీత విద్వాంసుడు
- సత్తి గీత, ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లీట్
సినీరంగంలో ప్రముఖులు
[మార్చు]- దాసరి నారాయణరావు
- రవిరాజా పినిశెట్టి
- అల్లు రామలింగయ్య
- అల్లు అరవింద్
- కోడి రామకృష్ణ
- రేలంగి నరసింహారావు
- బన్నీ వాసు
- ప్రశాంత్ వర్మ
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ బదరీనాథ్, కానూరి (ఫిబ్రవరి 2012). "నాటి 'వేంగీ విషయం'లోని (నేటి ప.గో.జిల్లా) కొన్ని గ్రామ నామాలు-వివరణలు". సుపథ సాంస్కృతిక పత్రిక. 12 (2): 35.
- ↑ Joshi, P. M. (1941). "TEXTILE INDUSTRY AND TRADE OF THE KINGDOM OF GOLKONDA". Proceedings of the Indian History Congress. 5: 609–617. ISSN 2249-1937. Retrieved 24 April 2019.
- ↑ Subrahmanyam, Sanjay (1990). "Rural Industry and Commercial Agriculture in Late Seventeenth-Century South-Eastern India". Past & Present (126): 76–114. ISSN 0031-2746. Retrieved 24 April 2019.
- ↑ Subrahmanyam, Sanjay (1988). "A Note on Narsapur Peta: A "Syncretic" Shipbuilding Centre in South India, 1570-1700". Journal of the Economic and Social History of the Orient. 31 (3): 305–311. doi:10.2307/3632014. ISSN 0022-4995.
- ↑ climate data Information For Palakollu. "Palakollu". climate data. Retrieved April 17, 2018.
వెలుపలి లింకులు
[మార్చు]- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- మూలాలు చేర్చవలసిన పాఠ్యమున్న వ్యాసాలు
- మూలాలు చేర్చవలసిన పాఠ్యమున్న వ్యాసాలు from జులై 2022
- Commons category link is on Wikidata
- పశ్చిమ గోదావరి జిల్లా మండల కేంద్రాలు
- పశ్చిమ గోదావరి జిల్లా పట్టణాలు
- ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు
- పశ్చిమ గోదావరి జిల్లా పర్యాటక ప్రదేశాలు
- ప్రసిద్ధ శైవక్షేత్రాలు
- పాలకొల్లు
- Pages using the Kartographer extension