రావి చెట్టు
రావిచెట్టు | |
---|---|
రావి చెట్టు ఆకులు, బోదె మొన దేరిన ఆకు ఆకారం గమనించండి. | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | ఫై. రెలిజియోసా
|
Binomial name | |
ఫైకస్ రెలిజియోసా |
రావిచెట్టు (ఆంగ్లం Sacred Fig also known as Bo) లేదా పీపల్ (హిందీ) లేదా అశ్వత్థ వృక్షము మర్రి జాతికి చెందిన ఒక చెట్టు. భారతదేశం, నేపాల్, దక్షిణ చైనా, ఇండో చైనా ప్రాంతాలలో ఈ చెట్టు అధికంగా పెరుగుతుంది. ఇది పొడి ప్రాంతలలోనూ, తేమ ప్రాంతాలలోనూ కూడా పెరిగే పెద్ద చెట్టు. ఇది సుమారు 30 మీటర్లు ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కాండం వ్యాసం 3 మీటర్ల వరకు పెరుగుతుంది. అశ్వత్థ పత్రి రావి చెట్టుకు చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమంలో ఈ ఆకు 19 వది.[1]
భ
[మార్చు]రావి చెట్టు ఆకులు మొన దేలి ఉంటాయి. 10-17 సెంటీ మీటర్ల వరకు పొడవు, 8-12 సెంటీ మీటర్ల వరకు వెడల్పు, 6-10 సెంటీ మీటర్ల వరకు petiole కలిగి ఉంటాయి. దీని పండు 1-1.5 సెంటీమీటర్ల వ్యాసం కలిగి, green ripening purple రంగులో ఉంటుంది.
ఆధ్యాత్మికాంశాలు
[మార్చు]వినాయక చవితి నాడు విఘ్నేశ్వరునికి ఇష్టమని చెప్పబడే 21 ఆకులతో స్వామివారికి పూజ చేస్తారు. ఆ 21 ఆకుల్లో అశ్వత్థ పత్రి (రావి ఆకు) కు స్థానం ఉంది. ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి అంటూ ఈ పత్రిని స్వామివారి విగ్రహంపై వేస్తారు. ఇక ఈ వృక్షమైతే హిందువులకు, బౌద్ధులకు, జైనులకు పవిత్ర వృక్షం. కృష్ణభగవానుడు తాను వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని అని చెప్పుకున్నట్టు భగవద్గీత ద్వారా తెలుస్తోంది.[2] యువరాజుగా ఉన్న సిద్ధార్థుడు జ్ఞానోదయం పొంది బుద్ధునిగా మారింది కూడా అశ్వత్థ వృక్షం కింద కావడంతో బౌద్ధంలో కూడా ఈ వృక్షానికి పవిత్ర స్థానం ఉంది.
రావి చెట్టు హిందువులకు, బౌద్ధులకు, జైనులకూ పవిత్రమైన చెట్టు. (వృక్షాలలో నేను అశ్వత్థ వృక్షాన్ని - భగవద్గీత). బుద్ధగయ లోని బోధివృక్షం క్రీ.పూ.288 నాటిదని అంచనా వేశారు. (పుష్పించే వృక్షాలలో వయసు అంచనా కట్టబడిన వాటిలో ఇది అత్యంత పురాతనమైనది కావచ్చును). సిద్ధార్ధుడు ఒక రావి చెట్టు క్రింద ధ్యానం చేసి జ్ఞానం పొందాడని అంటారు. ఇప్పటికీ రావిచెట్టు చాలా బౌద్ధ, హిందూ మందిరాలలో కానవస్తుంది. పెద్ద రావిచెట్ల క్రింద చిన్న చిన్న గుళ్ళు ఉండడం కూడా సాధారణం.
ఔషధ గుణాలు
[మార్చు]రావి మండలను ఎండబెట్టి.. ఎండిన పుల్లలను నేతితో కాల్చి భస్మం చేసి ఆ భస్మాన్ని తేనెతో కలి పి రోజూ సేవిస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి
సువాసన గుణం
[మార్చు]ఈ పత్రి సుగంధమూ, దుర్గంధమూ కాని విశిష్టమైన వాసనతో ఉంటుంది.
ఆయుర్వేదంలో
[మార్చు]ఆయుర్వేదంలో ఈ పత్రాలకు శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో స్థానం ఉంది.
ప్లక్స వృక్షం
[మార్చు]సంస్కృతంలో 'ప్లక్స'వృక్షం అనగా ఒక విధమైన రావి చెట్టు.[3], Ficus infectoria) అనే జాతిని సూచించేది. హిందూ శాస్త్ర గ్రంథాల ప్రకారం సరస్వతీ నది ప్లక్స వృక్షంనుండి నేలకు జాలువారింది.[4] [5] ఋగ్వేదంలో ప్లక్స ప్రశ్రవణం నుండి సరస్వతీ నది ఆరంభమైంది.[6]
మూలాలు
[మార్చు]- ↑ "వినాయకుడి పత్రిలతో కరోనా సంహారం!". web.archive.org. 2021-10-04. Archived from the original on 2021-10-04. Retrieved 2021-10-14.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ వృక్షాలలో నేను అశ్వత్థ వృక్షాన్ని - భగవద్గీత
- ↑ Macdonell and Keith (1912)
- ↑ D.S. Chauhan in Radhakrishna, B.P. and Merh, S.S. (editors): Vedic Sarasvati, 1999, p.35-44
- ↑ Pancavimsa Brahmana, Jaiminiya Upanisad Brahmana, Katyayana Srauta Sutra, Latyayana Srauta; Macdonell and Keith 1912
- ↑ Asvalayana Srauta Sutra, Sankhayana Srauta Sutra; Macdonell and Keith 1912, II:55
వెలుపలి లంకెలు
[మార్చు]- Keith and Macdonell. 1912. Vedic Index of Names and Subjects.
- Plaksa description
- Sacred fig description