Jump to content

అరుణాచల్ సరిహద్దు రహదారి

వికీపీడియా నుండి
అరుణాచల్ సరిహద్దు రహదారి
మార్గ సమాచారం
పొడవు1,748 కి.మీ. (1,086 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
పశ్చిమ చివరబొమ్‌డిలా
తూర్పు చివరచాంగ్లాంగ్ జిల్లాలో విజయనగర్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఅరుణాచల్ ప్రదేశ్
Major citiesనఫ్రా, సర్లి, హూరి, మెచుకా, టుటింగ్, హున్లి, హయులియాంగ్, హవాయి, మియావో, ఖర్సాంగ్
రహదారి వ్యవస్థ

అరుణాచల్ సరిహద్దు రహదారి(అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే - AFH) అరుణాచల్ ప్రదేశ్‌లోని భారత-చైనా LAC - మెక్‌మాన్ లైన్ సరిహద్దు వెంబడి 2-లేన్ చదును చేయబడిన-భుజం నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి. దీన్ని జాతీయ రహదారి -913 గా అధికారికంగా ప్రకటించారు. దీన్ని బొమ్‌డిలా-విజయనగర్ హైవే (BVH) అని కూడా అంటారు.

ఈ రహదారి రాష్ట్రానికి వాయవ్యంలో ఉన్న బోమ్‌డిలా ఎయిర్‌స్ట్రిప్ ALG & HQ ను ఆగ్నేయం లోని విజయనగర్ ఎయిర్‌స్ట్రిప్ ALG & హెచ్‌క్యూతో కలుపుతుంది. మార్గంలో నఫ్రా హెచ్‌క్యూ- సార్లి హెచ్‌క్యూ, హురి హెలిప్యాడ్ ALG & హెచ్‌క్యూ, నాచో హెచ్‌క్యూ, మెచుకా ఎయిర్‌స్ట్రిప్ ALG & హెచ్‌క్యూ, మోనిగాంగ్ హెచ్‌క్యూ, జిడో (ట్యూటింగ్ ఎయిర్‌స్ట్రిప్ ALG & హెచ్‌క్యూ), హున్లీ హెచ్‌క్యూ, హయులియాంగ్ ఎయిర్‌స్ట్రిప్ ALG హెచ్‌క్యూ, చెన్‌క్వెంటీ - హవాయి హెచ్‌క్యూ, మియావో హెచ్‌క్యూ ( మియావో-ఖర్సాంగ్ శాఖామార్గంతో సహా) లను కూడా కలుపుతుంది. 800 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ విభాగం, కొత్త సొరంగాలు & వంతెనల నెట్‌వర్కు కూడా ఇందులో భాగం.

1,748 కి.మీ.ల పొడవైన ఈ రహదారి నిర్మాణానికి రూ 27 వేల కోట్లు (6 అదనపు ఇంటర్-కారిడార్‌లను కూడా కలుపుకుని మొత్తం ఖర్చు రూ 40 వేల కోట్లు ) ఖర్చవుతుంది. కొన్ని ప్రదేశాలలో, ఈ రహదారి LAC నుండి 20 కి.మీ.సమీపంలో వెళ్తుంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ దీన్ని 9 ప్యాకేజీలలో నిర్మిస్తోంది. అన్ని ప్యాకేజీలు 2024-25 (2025 మార్చి) చివరి నాటికి ఆమోదించబడతాయి. 2027 మార్చి 31 నాటికి 2 సంవత్సరాలలో నిర్మాణం పూర్తవుతుంది.[1][2][3][4][5][6] మొత్తం మార్గంలో, 800 కి.మీ గ్రీన్ ఫీల్డ్ కాగా, మిగిలిన మార్గాన్ని ఉన్నతీకరించి, సొరంగాలు నిర్మిస్తారు.[7] చైనా సరిహద్దు వెంబడి ఉత్తర, తూర్పు అరుణాచల్‌లోని ఈ రహదారి, ట్రాన్స్-అరుణాచల్ హైవే (అరుణాచల్ మధ్యలో), అరుణాచల్ తూర్పు-పశ్చిమ కారిడార్ (దక్షిణ అరుణాచల్‌లో అస్సాం సరిహద్దులో పర్వత ప్రాంతాలలో) ప్రధాన రహదారులుగా విస్తరించి ఉంటుంది. లుక్ ఈస్ట్ కనెక్టివిటీ విధానంలో ఇది ఒక భాగం.[8]

చరిత్ర

[మార్చు]

2016 లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, అరుణాచల్ రాష్ట్ర ప్రభుత్వంలు అంగీకరించిన అమరిక ప్రకారం డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులను (DPR) సిద్ధం చేయాలని సరిహద్దు మౌలిక సదుపాయాలపై సాధికార కమిటీ MoRTH ని కోరింది. 2018 లో హోం మంత్రిత్వ శాఖ మరింత అనుసంధాన సౌకర్యం ఉండేలా అమరికను మెరుగుపరిచింది.[9][10] MORTH ఈ రహదారిని 3,600 కి.మీ.ల అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉన్న 29 కారిడార్‌లలో ఒకటిగా గుర్తించింది. ప్రతిపాదిత మార్గంలో "పెద్దగా ఆవాసాలు" లేనప్పటికీ, "చిన్న రహదారులు" మాత్రమే ఉన్నప్పటికీ, జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా (తరువాత ఇది భారతమాల ప్రాజెక్టులో భాగమైంది) చేపడుతుంది.[11]

ప్రయోజనాలు

[మార్చు]

భారత ప్రభుత్వం, మీడియాలోని వివిధ వర్గాలు ఈ రహదారిని నిర్మించడానికి క్రింది కారణాలను పేర్కొన్నాయి:[11][12][13][14]

  • ఈ రహదారి ఉపాధిని సృష్టిస్తుంది. చేరుకోవడానికి కష్టతరమైన ప్రాంతాల్లో పర్యాటకాన్ని పెంచుతుంది.
  • భారత భూభాగంలోకి చైనా చొరబాట్లను ఈ రహదారి నిలువరిస్తుంది. చైనా తన వైపున విస్తృతమైన రహదారులు, రైల్వేల నెట్‌వర్క్‌ను నిర్మించింది. దానితో పోలిస్తే భారతదేశం వైపున ఉన్న ప్రాంతం అంతగా అందుబాటులో లేనందున భారతదేశానికి భద్రతా ప్రమాదం ఉంది.

నిర్మాణం

[మార్చు]

దీన్ని క్రింది తొమ్మిది ప్యాకేజీలుగా నిర్మిస్తారు.[15] అన్ని అనుమతులు, భూసేకరణ క్రమంగా 2025 మార్చి నాటికి పూర్తవుతాయి. నిర్మాణం పూర్తిగా ప్రభుత్వ నిధులతో "ఇంజనీరింగ్ సేకరణ, నిర్మాణం" (EPC) పద్ధతిలో 2027 మార్చి నాటికి పూర్తవుతుంది.[9][10][16]

  • ప్యాకేజీ-1 నఫ్రా–లాడా, 141 కి.మీ. (నఫ్రా–డిబ్రిక్–సచుంగ్–లాడా): [15] పూర్తి బడ్జెట్ 2023 లో ఆమోదించారు.
  • ప్యాకేజీ-2 లాడా-సర్లి, 200 కి.మీ : [15] 106 కి.మీ బడ్జెట్ ₹ 2,249 కోట్లకు 2024 ఫిబ్రవరిలో ఆమోదించారు [16]
  • ప్యాకేజీ-3 సర్లి-తాలి, 201 కి.మీ (సర్లి-హురి–పార్సీ పార్లో–తాలి): [15]
    • సార్లి-హురి : 35 కి.మీ కోసం ₹626.92 కోట్ల బడ్జెట్ 2024 ఫిబ్రవరిలో ఆమోదించారు [16]
  • ప్యాకేజీ-4 తాలి–మెచుకా, 225 కి.మీ. (తాలి–తాలిహా–సియుమ్–మెచుకా): [15]
  • ప్యాకేజీ-5 మెచుకా–బైల్, 183 కి.మీ. (మెచుకా–టాటో–మోనిగాంగ్–టాటో–బైల్): [15]
  • ప్యాకేజీ-6 బైల్-హున్లీ, 230 కి.మీ (బైల్–మిగ్గింగ్–ట్యూటింగ్–సింగ–అనెల్యే–హున్లీ): [15]
  • ప్యాకేజీ-7 హున్లీ-హయులియాంగ్, 186 కి.మీ : [15]
  • ప్యాకేజీ-8: హయులియాంగ్–మియావో, 285 కి.మీ. (హయులియాంగ్–చాంగ్వింటి–హవాయి–మియావో): [15]
  • ప్యాకేజీ-9 మియావో–విజయనగర్, 157 కి.మీ. (మియావో–గాంధీగ్రామం–విజయనగర్): [15]
    • ఖర్సాంగ్-గాంధీగ్రామ్ : 61.5 కి.మీ.కు రూ. 1,015 కోట్ల బడ్జెట్ ఫిబ్రవరి 2024లో ఆమోదించారు. [16] [17]

మార్గం అమరిక

[మార్చు]

ఈ రహదారి తవాంగ్ జిల్లాలోని మాగో - థింగ్బు వద్ద ఉద్భవించి, మెక్ మహోన్ రేఖ వెంబడి అరుణాచల్ ప్రదేశ్ లోని క్రింది సరిహద్దు ప్రాంతాల గుండా వెళుతుంది: పశ్చిమ కమెంగ్ జిల్లా ; తూర్పు కమెంగ్ జిల్లా ; ఎగువ సుబన్‌సిరి జిల్లా ; పశ్చిమ సియాంగ్ జిల్లాలో మెచుకా ; ఎగువ సియాంగ్ జిల్లాలో ట్యూటింగ్ ; దిబాంగ్ వ్యాలీ జిల్లా ; దిగువ దిబాంగ్ వ్యాలీ జిల్లాలో దేశాలి ; అంజావ్ జిల్లాలోని చగ్లగం, కిబితు, డాంగ్, హవాయి; చాంగ్లాంగ్ జిల్లాలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మయన్మార్‌ల కూడలి అయిన విజయనగర్ వద్ద ముగుస్తుంది. [12] [18]

పశ్చిమం నుండి తూర్పు దిశగా జిల్లా వారీగా అమరిక: [9] [10]

  • పశ్చిమ కమెంగ్ జిల్లా (రాజధాని బొమ్డిలా )
    • బొమ్‌డిలా - విమానయాన మంత్రిత్వ శాఖ బొమ్‌డిలాకు ఈశాన్య దిశలో దిరాంగ్‌లో విమానాశ్రయాన్ని ప్లాన్ చేస్తోంది
    • థెంబాంగ్ హెచ్‌క్యూ, బోమ్‌డిలాకు ఉత్తరాన
    • నఫ్రా హెలిపోర్ట్ ALG & హెచ్‌క్యూ, థెంబాంగ్ & బోమ్‌డిలాకు తూర్పున.
    • డిషింగ్, నఫ్రా సర్కిల్‌లో నఫ్రాకు ఉత్తరాన
    • వోతుంగ్, నాఫ్రా సర్కిల్‌లో డిషింగ్‌కు ఈశాన్యంగా.
  • తూర్పు కమెంగ్ జిల్లా (రాజధాని సెప్పా )
    • వోతుంగ్ & నఫ్రాకు ఈశాన్యంగా లాడా సర్కిల్‌లో నిస్సాంగ్‌జాంగ్ .
    • లాడా హెలిపోర్ట్ ALG & HQ, జిల్లా HQ సెప్పాకు ఉత్తరాన
    • బమెంగ్ హెలిపోర్ట్ ALG & HQ, లాడాకు ఆగ్నేయంగా.
    • సావా హెలిపోర్ట్ ALG & HQ, బమెంగ్‌కు ఈశాన్యాన
    • చాయాంగ్తాజో హెలిపోర్ట్ ALG & HQ, సావాకు ఈశాన్యాన.

శాఖా మార్గాలు

[మార్చు]

తవాంగ్ నుండి భూటాన్‌లోని యోంగ్‌ఫుల్లా విమానాశ్రయం వరకు 100 కి.మీ పొడవైన పశ్చిమ శాఖను కూడా ప్రతిపాదించారు. ఈ విమానాశ్రయాన్ని భారతదేశం ఉన్నతీకరిస్తుంది. భారత సైన్యం, భూటాన్ సైన్యం సంయుక్తంగా ఉపయోగించుకుంటాయి.[19]

ఆరు ఇంటర్ కారిడార్ హైవేలు

[మార్చు]

అరుణాచల్ ప్రదేశ్ అంతటా మూడు క్షితిజ సమాంతర జాతీయ రహదారులైన ఫ్రాంటియర్ హైవే, ట్రాన్స్-అరుణాచల్ హైవే, ఈస్ట్-వెస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ హైవేల మధ్య అనుసంధాన లేమిని తొలగించడానికి, మొత్తం 2178 కి.మీ పొడవు గల ఆరు నిలువు, వికర్ణ జాతీయ రహదారుల కారిడార్‌లను నిర్మిస్తారు. దీనివలన భారత-చైనా LACలో భౌగోళిక వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతాలకు వేగంగా చేరుకునే సౌకర్యం కలుగుతుంది.[20][21]

పశ్చిమం నుండి తూర్పు వరకు ఈ ఆరు రహదారుల జాబితా.

ఇతర విస్తృత కనెక్టివిటీ

[మార్చు]

ఈ రహదారి, భూటాన్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌ల ట్రై-జంక్షన్ అయిన భైరబ్‌కుండ నుండి తూర్పు సియాంగ్ జిల్లాలోని రుక్సిన్ వరకు అరుణాచల్ ప్రదేశ్ పర్వత ప్రాంతాలలో ప్రతిపాదిత తూర్పు-పశ్చిమ పారిశ్రామిక కారిడార్ హైవేతో కలుస్తుంది. [22] ఇది ట్రాన్స్-అరుణాచల్ హైవేని కూడా కలుపుతుంది.

ఈ రహదారి బంగ్లాదేశ్-చైనా-ఇండియా-మయన్మార్ ఫోరమ్ ఫర్ రీజినల్ కోఆపరేషన్ (BCIM ఫోరమ్) ప్రతిపాదించిన BCIM ఎకనామిక్ కారిడార్ గుండా వెళుతుంది.[22][11] ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా నుండి చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లోని కున్మింగ్‌కు వెళ్తుంది. అలాగే ఈ రహదారి అరుణాచల్ ప్రదేశ్ గుండా మాత్రమే కాక, మణిపూర్, అస్సాం రాష్ట్రాల గుండా కూడా వెళుతుంది. [23]

ఇది దిబాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం గుండా వెళ్తుంది. దీనివలన పర్యావరణ సమస్యలు ఎదురు కావచ్చు.

పర్యాటకం

[మార్చు]
  • అరుణాచల్‌లోని రహదారుల వెంట స్వదేశ్ దర్శన్ టూరిస్ట్ సర్క్యూట్‌లు: 2015లో స్వదేశ్ దర్శన్ పథకం కింద, అరుణాచల్ ప్రదేశ్‌లో ఈ క్రింది రెండు టూరిస్ట్ సర్క్యూట్‌లను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఆమోదించింది: [24]
    • ₹49.77 కోట్ల వ్యయంతో అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే వెంబడి "భాలుక్‌పాంగ్-బోమ్‌డిలా-తవాంగ్ టూరిస్ట్ సర్క్యూట్" : "వసతి, ఫలహారశాల, దారి పక్కన ఉన్న సౌకర్యాలు, చివరి మైలు కనెక్టివిటీ, మార్గాలు, టాయిలెట్ వంటి సౌకర్యాలు సోరాంగ్ మొనాస్టరీ, లంపో, జెమ్‌టిత్‌లో నిర్మించారు. బుమ్లా పాస్, గ్రిట్సాంగ్, TSO సరస్సు, PTSO లేక్, థింగ్బు, గ్రెంఖా హాట్ స్ప్రింగ్, లుమ్లా, సెలా లేక్." జంగ్‌లో బహుళార్ధసాధక మందిరాన్ని నిర్మించారు.[24]
    • ₹97.14 కోట్ల వ్యయంతో ట్రాన్స్-అరుణాచల్ హైవే వెంబడి "నఫ్రా-సెప్పా-పప్పు-పక్కే లోయలు-సంగ్డుపోటా-న్యూ సగలీ-జిరో-యోమ్చా టూరిస్ట్ సర్క్యూట్": "హెలిప్యాడ్, దారి పక్కన సౌకర్యాలు, ట్రెక్కింగ్ ట్రైల్స్, రాఫ్టింగ్ సెంటర్ లాగ్ హట్స్, క్రాఫ్ట్ బజార్, ఎకో పార్క్, టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లు, పార్కింగ్, మల్టీపర్పస్ హాల్, ఫెస్టివల్ గ్రౌండ్ మొదలైనవి." నిర్మించారు. [24]

పురోగతి

[మార్చు]
  • 2016 డిసెంబరు : రూట్ సర్వే చేపట్టి, డిపిఆర్‌ను సిద్ధం చేయమని ప్రభుత్వం మోఆర్‌టిహెచ్‌ని కోరింది. [9] [10]
  • 2022 నవంబరు-డిసెంబరు : ఇప్పటికే 192 కి.మీ.ల దారి నిర్మాణం మొదలైంది. మొత్తం మార్గాన్ని జాతీయ రహదారి -913గా ప్రకటించారు. అన్ని అనుమతులు భూసేకరణ 2025 మార్చి నాటికి పూర్తవుతాయని, 2027 మార్చి నాటికి నిర్మాణం పూర్తవుతుందని MoRTH ప్రకటించింది.[9][10]
  • 2024 ఫిబ్రవరి : ఇప్పటి వరకు డిపిఆర్ పూర్తయిన తర్వాత మొత్తం 1,748 కి.మీలో దాదాపు 500 కి.మీల బడ్జెట్ ఆమోదించారు. [16]

ఇవి కూడా చూడండి

[మార్చు]
అరుణాచల్ ప్రదేశ్ కనెక్టివిటీ ప్రాజెక్టులు
ఈశాన్య కనెక్టివిటీ ప్రాజెక్టులు
జాతీయ రహదారులు

మూలాలు

[మార్చు]
  1. "Eye on China, govt plans a 1,700-km 'frontier highway'". Times of India. Retrieved 19 December 2022.
  2. "As LAC skirmishes increase, India to build a 1,700-km highway in Arunachal Pradesh". WION. Retrieved 19 December 2022.
  3. "Narendra Modi government to provide funds for restoration of damaged highways". Diligent Media Corporation Ltd. Retrieved 27 October 2014.
  4. Dash, Dipak Kumar. "Top officials to meet to expedite road building along China border". The Times of India. Retrieved 26 May 2019.
  5. "Indian Government Plans Highway Along Disputed China Border". Ankit Panda. thediplomat.com. Retrieved 27 October 2014.
  6. "Govt planning road along McMohan line in Arunachal Pradesh: Kiren Rijiju". Live Mint. 14 October 2014. Retrieved 2014-10-26.
  7. नॉर्थ ईस्ट में चीन के साथ लगी सीमा होगी और सुरक्षित, 27000 करोड़ खर्च कर बनेगा 1748 KM लंबा 'फंटियर हाईवे', News18, 19 Dec 2022.
  8. Arunachal Dy CM Lays Foundation Stone of Bridge over Bari River Archived 22 డిసెంబరు 2017 at the Wayback Machine, North East Today, 11 Dec 2017.
  9. 9.0 9.1 9.2 9.3 9.4 "Eye on China, govt plans a 1,700-km 'frontier highway'". Times of India. Retrieved 19 December 2022."Eye on China, govt plans a 1,700-km 'frontier highway'". Times of India. Retrieved 19 December 2022.
  10. 10.0 10.1 10.2 10.3 10.4 "As LAC skirmishes increase, India to build a 1,700-km highway in Arunachal Pradesh". WION. Retrieved 19 December 2022."As LAC skirmishes increase, India to build a 1,700-km highway in Arunachal Pradesh". WION. Retrieved 19 December 2022.
  11. 11.0 11.1 11.2 Dash, Dipak Kumar. "Top officials to meet to expedite road building along China border". The Times of India. Retrieved 26 May 2019.Dash, Dipak Kumar. "Top officials to meet to expedite road building along China border". The Times of India. Retrieved 26 May 2019.
  12. 12.0 12.1 "Indian Government Plans Highway Along Disputed China Border". Ankit Panda. thediplomat.com. Retrieved 27 October 2014."Indian Government Plans Highway Along Disputed China Border". Ankit Panda. thediplomat.com. Retrieved 27 October 2014.
  13. 13.0 13.1 "Govt planning road along McMohan line in Arunachal Pradesh: Kiren Rijiju". Live Mint. 14 October 2014. Retrieved 2014-10-26."Govt planning road along McMohan line in Arunachal Pradesh: Kiren Rijiju". Live Mint. 14 October 2014. Retrieved 26 October 2014.
  14. "Why India is planning a new road near the China border". BBC News. BBC. 16 October 2014. Retrieved 27 October 2014.
  15. 15.00 15.01 15.02 15.03 15.04 15.05 15.06 15.07 15.08 15.09 Frontier Highway, MoRTH, accessed 8 Feb 2024.
  16. 16.0 16.1 16.2 16.3 16.4 Sources said so far the ministry has approved works for around 500 km of the 1,748 km, Times of India, 6 Feb 2024.
  17. NewsDesk, T. N. M. (12 February 2024). "Centre approves another Rs 2378.72 crore for construction of Frontier Highway in Arunachal". thenewsmill.com. Retrieved 16 February 2024.
  18. "China warns India against paving road in Arunachal". Ajay Banerjee. tribuneindia.com. Retrieved 2014-10-26.
  19. "Dantak". Border Roads Organisation. Government of India. Archived from the original on 27 September 2011. Retrieved 1 November 2011.
  20. Arunachal Pradesh: Inter-corridors between two highways proposed, Economic Times, 20 Oct 2022.
  21. 21.0 21.1 21.2 21.3 21.4 21.5 21.6 Centre Clears Construction Of 6 Corridors In Arunachal Near China Border, NDTV, 20 Oct 2022.
  22. 22.0 22.1 22.2 "Narendra Modi government to provide funds for restoration of damaged highways". Diligent Media Corporation Ltd. Retrieved 27 October 2014."Narendra Modi government to provide funds for restoration of damaged highways". Diligent Media Corporation Ltd. Retrieved 27 October 2014.
  23. "Why India is planning a new road near the China border". BBC News. BBC. 16 October 2014. Retrieved 27 October 2014."Why India is planning a new road near the China border". BBC News. BBC. 16 October 2014. Retrieved 27 October 2014.
  24. 24.0 24.1 24.2 Two important North East Circuits under Swadesh Darshan Scheme of Central Tourism Ministry inaugurated in Arunachal Pradesh today, PIB India, 15 Nov 2018.
  25. "Top officials to meet to expedite road building along China border". ipanewspack.com. Archived from the original on 23 October 2014. Retrieved 27 October 2014.