Jump to content

గందర్బల్ జిల్లా

వికీపీడియా నుండి
(గండెర్‌బల్ జిల్లా నుండి దారిమార్పు చెందింది)
గందర్బల్
జిల్లా
گاندربل
జిల్లా
సోనామార్గ్ చుట్టూ ఉన్న శిఖరాల వీక్షణలు, గందర్బాల్ జిల్లా, J&K, భారతదేశం
సోనామార్గ్ చుట్టూ ఉన్న శిఖరాల వీక్షణలు, గందర్బాల్ జిల్లా, J&K, భారతదేశం
జమ్మూ కాశ్మీరు పటంలో జిల్లా స్థానం
జమ్మూ కాశ్మీరు పటంలో జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
ప్రధాన కార్యాలయంగందర్బల్
Elevation
1,616 మీ (5,302 అ.)
జనాభా
 (2011)
 • Total2,97,003
భాషలు
 • అధికారం భాషఉర్దూ
Time zoneUTC+5:30 (IST)
ప్రాంతీయ ఫోన్ కోడ్01942
Vehicle registrationJK16
లింగ నిష్పత్తి869 /
అక్షరాస్యత59.99%

గందర్బల్ జిల్లా, జమ్మూకాశ్మీరు రాష్ట్రం లోని జిల్లా ఈ ప్రాంతం ఒకప్పుడు శ్రీనగర్ జిల్లాలోని 2 తహసీల్సు‌గా ఉండేవి.

చారిత్రిక ప్రదేశాలు

[మార్చు]

గండెర్‌బల్ ప్రాంతం కూడా మిగిలిన కాశ్మీర్ లోయ లోని ప్రాంతాల మాదిరిగా పలు తిరుగుబాట్లను చూసింది. ప్రస్తుతం ఈ జిల్లాలో నారనాగ్ ఆలయం కాక పురాతనమైన నిర్మాణాలు కాని పురాతత్వ ప్రదేశాలుగాని లేవు. సుల్తాన్ సికిందర్ కాలంలో ఈ ప్రాంతం లోని పురాతన స్మారకచిహ్నాలు అనేకం విధ్వశం చేయబడ్డాయి. ఒకప్పుడు బ్రహ్మాండమైన కళాత్మక నిర్మాణాలిప్పుడు శిథిలాలుగా మిగిలాయి.

ఖీర్ భవాని

[మార్చు]

ఖీర్ భవాని ఆలయం తుల్‌ముల్లా గ్రామం ద్వారా ప్రవహిస్తున్న పవిత్రమైన సెలఏరు పక్కన ఉంది. ఈ ఆలయం జిల్లా కేంద్రమైన గండర్‌బల్ పట్టాణానికి 5 కి.మి దూరంలో ఉంది. కాశ్మీరులోని ఇతర పురాతన ఆలయాలు విధ్వశానికి గురైనప్పటికీ ఇప్పటికీ ఈ ఆలయం తన సహజ పురాతన రూపం చెదరకుండా ఉంది. ఈ ఆలయం కాశ్మీరులోని పురాతన ఆలయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ఆలయంలోని ప్రధాన దైవం ఖీర్ భవాని (భవాని మాత).[1] ఖీర్ భవాని అమ్మవారిని దర్శించడానికి దేశం అంతటి నుండి యాత్రీకులు వస్తుంటారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మే మాసంలో ఒక వారం రోజులు నిర్వహించబడే ఉత్సవానికి వేలాది భక్తులు వస్తుంటారు.

నరనాగ్ ఆలయం

[మార్చు]

దేశంలో ముఖ్యమైన కళాత్మక ప్రదేశాలలో నరనాగ్ ఆలయం ఒకటి.[2] నరనాగ్ అనేది ఆలయాల సమూహం. ఇది హర్‌ముఖ్ పర్వతంలో శ్రీనగర్కు 50కి.మి దూరంలో ఉంది. 8వ శతాబ్దంలో లలితాదిత్య ముక్తాదిత్య ఈ ఆలయసముదాయ నిర్మాణం చేసాడని చరిత్రకారుల అంచనా. తరువాత ఈ ప్రదేశనికి విచ్చేసిన రాజా అవంతివర్మా భూత్షర్ వద్ద ఒక స్నానఘట్టం నిర్మించాడని భావిస్తున్నారు. ప్రస్తుత కాలంలో కూడా ఈ ఆలయ శిల్పకళావైభవం చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. మనోహరమైన ఆలయ కళావైభవం 8వ శతాబ్ధపు శిల్పకళా నైపుణ్యం ప్రపంచానికి తెలియజేస్తుంది. ఈ ఆలయప్రదేశంలో అదనంగా ఆక్రమణలు జరుగకుండా సమీపకాలంలో ప్రభుత్వం కట్టిదిట్టం చేసింది. ఆర్యసంప్రదాయంలో నిర్మించిన ఈ ఆలయం కాశ్మీరు లోయలో ఆర్యుల ఉనికికి నిదర్శనంగా నిలిచింది.

భౌగోళికం

[మార్చు]
గుండ్ గ్రామం

గందర్బల్ జిల్లా కేంద్రం [3] సముద్రమట్టానికి 1950 మీ ఎత్తులో శ్రీనగర్కు 21 కి.మీ దూరంలో ఉంది.గందర్బల్ జిల్లా సింధునది తీరం వరకు విస్తరించి ఉంది. సింధు నది ఈ జిల్లాకు ఇది సరిహద్దుగా ఉంది. జమ్మూ కాశ్మీరు జిల్లాలో 3 విద్యుదుత్పత్తి కేద్రాలు కలిగిన ఏకైక నదిగా సింధు నదికి ప్రత్యేకత ఉంది. ఈ నది 80% వ్యవసాయభూములకు సాగునీటిని అందిస్తుంది.[4] వ్యవసాయానికి నీరు పుష్కలంగా లభిస్తున్న కారణంగా జిల్లాలో తోటల పెంపకానికి ప్రోత్సాహం లభిస్తుంది.ఈ నదీ తీరంలో లభిస్తున్న ఇసుక అత్యంత విలువైనదిగా భావించబడుతుంది.

విభాగాలు

[మార్చు]

జిల్లా 3 తహసీల్సు‌గా విభజించబడింది:

  • గందర్బల్
  • కంగన్
  • లార్

అలాగే ఈ జిల్లా 4 బ్లాకులుగా (గందర్బల్ , ఒకూరా, లార్, కంగన్ గా విభజించబడి ఉంది.[5] ఒక్కో బ్లాకులో పలు పంచాయితీలు ఉన్నాయి. గందర్బల్ జిల్లాలో 2 అసెంబ్లీ నియోజక వర్గాలు (కంగన్, గందర్బల్ ) ఉన్నాయి.[6]

వాతావరణం

[మార్చు]

గందర్‌బల్ జిల్లాలో అసలైన కాశ్మీర్ వాతావరణం ఉంటుంది. జూలై మాసపు వేడిమికి సింధు నల్లాహ్ మీదిగా వీచే చల్లని సమీరం సేద తీరుస్తూ ఉంటుంది. అక్షాంశపరంగా కాశ్మీర్ లోయ ఆసియాలోని పెషావర్, బాగ్ధాద్, డమాస్కస్ మొరాకో లోని ఫెజ్: అమెరికాలోని సౌత్ కరోలినా ప్రాంతాలతో సమానంగా ఉన్నప్పటికీ కాశ్మీర్ వాతావరణం మాత్రం వీటీకి విభన్నంగా ఉంటుంది. " అని వాల్టర్ లారెంస్ తన పుస్తకం " ది వెల్లీ ఆఫ్ కాశ్మీర్ " లో పేర్కొన్నాడు. కాశ్మీర్ వాతావరణాన్ని ప్రజలు స్విడ్జర్లాండ్ వాతావరణంతో పోలుస్తుంటారు. ప్రతి 100 అడుగుల ఎత్తు ఒక సరికొత్త వాతావరణం, వృక్షజాలం కలిగి ఉంటుంది.

పర్యాటకం

[మార్చు]

గందర్‌బల్ జిల్లా సింధునల్లా మాత్రమే కాక అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి ఇది నిలయం. పర్యాటకరంగం అభివృద్ధికి అత్యంత అవకాశం ఉన్న ప్రదేశమిది. ప్రకృతి ఈ ప్రాంతానికి అసమానమైన సౌందర్యం ఇచ్చింది. రాష్ట్రంలోని సరసులలో అనేకం గందర్‌బల్‌లో ఉన్నందున దీనిని " సరోవరనగరం " అని కూడా అనవచ్చు. ఇక్కడ ఉద్రిక్త వాతావరణం లేని సమయంలో ఇక్కడకు వచ్చే విదేశీ పర్యాటకులకు ఈ సరోవరాలు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. 1990లో భారతీయ సైన్యం ఈ ప్రాంతాలను వ్యూహాత్మకంగా ఆక్రమించుకున్నాయి. తరువాత ఈ ప్రాంతం ప్రకృతికి భంగపరిచే కాంక్రీటు భవనాలవంటి నిర్మాణాలను ఆపివేయాలని సూచించింది.

సోనామార్గ్

[మార్చు]

ప్రపంచ ప్రసిద్ధమైన ఈ హిల్ స్టేషను సోనామార్గ్, శ్రీనగర్ కు 80 కి.మీ దూరంలో నల్లా సింధు తీరంలోఉంది. ఇది దేశంలోని ఉత్తమ ఆరోగ్యకేంద్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడి సహజ సౌందర్యదృశ్యాలు బాలీవుడ్ చిత్రాలలో చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఉన్న నల్లాహ్ సింధు మీద " ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్ ఆఫ్ రాఫ్టింగ్ " క్రీడలు నిర్వహించబడుతుంది. ఆల్ఫైన్ మైదానాలు, మంచుదుప్పటి కప్పుకున్న పర్వతశిఖరాలు, ఆరోగ్యవంతమైన పరిసరాలతో ఈ ప్రాంతం అత్యంత సుందరంగా ఉంటుంది. నిరంతరాయంగా ప్రవహిస్తున్న సింధునదీ జలాలు సోనామార్గ్ భూభాగాన్ని సహజ సౌందర్యాన్ని ద్విగుణీయం చేస్తూ ఉంది. ఇక్కడ కొత్తగా నిర్మించబడిన పలు హోటళ్ళు పర్యాటకులకు అత్యాధునిక సౌకర్యాలను అందిస్తుంది. సోనామార్గ్ నుండి విషంసర్, క్రిష్ణంసర్, గడ్సర్, గంగాబల్ వంటి ప్రదేశాలకు పర్వతారోహణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.

మానసబల్ సరసు

[మార్చు]

గండర్‌బల్ జిల్లాకు మానసబల్ సరోవరం ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉంది. ఇది జిల్లాకేంద్రం గండర్‌బల్ పట్టణానికి నైరుతీ దిశలో 12కి.మీ దూరంలో ఉంది. 5 కి.మి పొడవు, 1 కి.మి వెడల్పు ఉన్న ఈ సరసు జెహ్లం లోయలో శ్రీనగర్కు ఉత్తరదిశలో ఉంది. ఈ సరోవరానికి మానసరోవర్ సరోవరం నుండి మానసబల్ అనే పేరు వచ్చిందని విశ్వసిస్తున్నారు.[7] ఈ సరోవరం చుట్టూ 3 గ్రామాలు (జరోక్‌బల్,కొండబల్, (సరోవరానికి ఈశాన్యదిశలో ఉన్న ఈ గ్రామాన్ని కిల్న్ అని కూడా పిలుస్తుంటారు). 13మీ లోతైన ఈ సరసు కాశ్మీరు లోయలో అత్యంత లోతైన సరోవరంగా గుర్తింపు పొందింది. జూలై, ఆగస్ట్ మాసంలో ఈ సరసులో తామరపూలు అత్యధికంగా పుష్పించి ఈ సరసుకు మరింత సౌందర్యం తీసుకువస్తుంది. సరోవరతీరంలో నూర్జహాన్ నిర్మించిన గరోకా ( సముద్రపు వాకిలి) నుండి ఈ సరసు కనిపిస్తూ ఉంటుంది.[8]" గ్రౌండ్ ఆఫ్ అక్వాటిక్ బర్డ్స్ ఇన్ కాశ్మీర్ " గా పేరు పొందిన ఈ సరసు పక్షులను సందర్శించే వారుకి స్వర్గసీమ వంటిది. ఈ సరసుకు " సుప్రీం జెం ఆఫ్ కాశ్మీర్ " అనే పేరుకూడా ఉంది.[9][10] విపరీతంగా లభిస్తున్న తామర తూడులను కోసి విక్రయించబడుతున్నాయి. అలాగే ఈ తామరతూడులను ప్రాంతీయ ప్రజలు ఆహారంగా తీసుసుంటున్నారు..[7] శ్రీనగర్ నుండి 30కి.మీ రోడ్డుమార్గంలో షాదీపూర్, నాసిం మీదుగా ప్రయాణించి ఈ సరోవరం చేరుకోవచ్చు. కాశ్మీర్‌లో అతి పెద్ద సరసు అయిన వూలార్ సరస్సు నుండి సఫాపూర్ మీదుగా ప్రయాణించి ఈ సరోవరం చేరుకోవచ్చు.[7]

హర్‌ముఖ్

[మార్చు]
హర్ముఖ్ పర్వత ప్రాంతంలో గంగాబల్ సరస్సు

భారతీయ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ గండర్‌బల్‌లో హర్‌ముఖ్ (మౌంటు హర్‌ముఖ్, హర్‌ముఖ్ పర్వతం) ముందుకు చొచ్చుకు వచ్చున శిఖరం కలిగిన ఒక పర్వతం.[11] 5,148 మీటర్లు1(6,890 అడుగులు), హిమాలయ పర్వతావళిలో హర్‌ముఖ్ ఒక భాగం. ఈ పర్వతం దక్షిణభూభాగంలో నల్లాహ్ సింధు ఉత్తర భూభాగంలో నీలం నది ఉన్నాయి. ఇది గందర్‌బల్ సరసు నుండి ఆరంభం ఔతుంది.[12] నుండి కాశ్మీర్ లోయ నుండి కనిపిస్తుండే ఈ పర్వతం చేరడం చాలా ప్రమాదకరమైంది. ఈ పర్వతాన్ని ఇక్కడి నుండి అధిరోహించడం అసాధ్యం. దీనిని సాధారణంగా బండిపోరా నుండి అధిరోహిస్తుంటారు. 1856లో ఈ పర్వతశిఖరాన్ని మొదటిసారిగా అధిరోహించిన థోమస్ జార్జ్ (గ్రేట్ ట్రిగ్నోమెట్రిక్ సర్వేకి చెందిన పర్వతారోహకుడు) కరకోరం సర్వే నిర్వహించి ఈ సిఖరం స్కెచ్ రచించాడు.[13] తరువాతి కాలంలో హర్‌ముఖ్ పర్వతాన్ని ఇతర పర్వతారోహకులు అధిరోహించారు.[14]

గండర్‌బల్ సరసు

[మార్చు]

గంగాబల్ సరసు (ఉర్దు: ﮔﻨﮕﺒﻞ ﺟﮭﻴﻞ) ను గందర్‌బల్ సరసు అని కూడా పిలుస్తుంటారు. ఈ సరసు హముఖ్ (కాశ్మీర్ లోయ నుండి కనిపించే ఎత్తైన పర్వతశిఖరం ఇది) పర్వతం పాదభాగంలో ఉంది.[15] ఇది శ్రీనగర్కు ఉత్తరంలో ఉంది. ఇది ఎత్తైన ప్రదేశంలో ఉండే సరసు (ఒలిగోట్రోఫిక్ లేక్).[16] ఇది పలు విధాలైన చేపలకు పుట్టిల్లు.[17] వాటిలో బ్రౌన్ ట్రాట్ చేప ఒకటి.[18] ఈ సరసు పొడవు 2.5కి.మీ, వెడల్పు 1కి.మీ ఉంటుంది. ఈ సరసుకు వర్షం, గ్లాసియర్లు, సెలయేళ్ళు నీటిని అందిస్తున్నాయి. ఈ సరసు నిండిన సమయంలో సమీపంలో ఉన్న మరొక చిన్న సరసుకు నందకో సరసుకు .[19] ఆ వంగత్ నల్లా పై ద్వారా [20] సింధు నల్లాహ్‌కు నీరు చేరుతుంది. సింధు నల్లా జెహ్లం నదికి ప్రధాన ఉపనది. ప్రస్తుతం ఈ సరసులో ట్రాట్ చేపలు అధికంగా ఉన్నాయి.[21] శ్రీనగర్ నుండి గందర్‌బల్, నరనాగ్ మార్గంలో 45 కి.మీ ప్రయాణించి [22] 15 కి.మీ కొండ మార్గంలో నడచి ఈ సరసుకు చేరుకోవచ్చు.

విద్య

[మార్చు]
  • ఎస్.కె.యు.ఎ.ఎస్.టి, ఫిషరీస్, రంగిల్ ఫ్యాకల్టీ
  • ఎస్.కె.యు.ఎ.ఎస్.టి, (నిర్మాణంలో) అటవీ, బెన్‌హమా ఫ్యాకల్టీ
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గందర్‌బెల్
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కంగన్
  • హైడరియా మోడల్ స్కూల్, తుల్లా ముల్లా, గండర్‌బెల్
  • సైనిక్ స్కూల్, మనస్బల్
  • కిర్మానియా మోడల్ హై స్కూల్ బత్వినా గండర్‌బెల్
  • ఆలందార్ ఇ కాశ్మీర్ విద్యా సంస్థ
  • భూమి స్కూల్ డ్రీం
  • క్వాంరియా హయ్యర్ సెకండరీ స్కూల్
  • విజయ్ మెమోరియల్ స్కూల్
  • హిల్ టాప్ స్కూల్
  • పబ్లిక్ హై స్కూల్ వాల్టర్
  • పరిశుభ్రమైన హయ్యర్ సెకండరీ స్కూల్ గండర్‌బెల్ గండర్‌బల్.
  • న్యూ చిన్న హార్ట్స్ స్కూల్, డుబర్హమా.
  • ఆక్స్ఫర్డ్ హై స్కూల్, డుబర్హమా.
  • ప్రభుత్వం మధ్య స్కూల్, డుబర్హమా
  • ప్రభుత్వం శారీరక కాలేజ్, గండర్‌బెల్.
  • అబ్రార్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగ్ కంగన్.
  • జియా స్టిట్యూట్ బత్వినా గండర్‌బెల్.
  • 'గౌసియా ఇస్లామిక్ విద్యాసంస్థ బత్వినా.
  • ప్రభుత్వం బాయ్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ బత్వినా గండర్‌బెల్.

మూలాలు

[మార్చు]
  1. "Bhag-P 5.25.1". Archived from the original on 2012-03-20. Retrieved 2014-06-30.
  2. "Naranag temple in ruins". kashmirmonitor.org. Archived from the original on 2012-08-04. Retrieved 2012-04-25.
  3. "Falling Rain Genomics, Inc - Ganderbal". fallingrain.com. Retrieved 2012-04-24.[permanent dead link]
  4. "Agriculture directory of Ganderbal". diragrikmr.nic. Archived from the original on 2013-01-21. Retrieved 2012-04-25.
  5. Statement showing the number of blocks in respect of 22 Districts of Jammu and Kashmir State including newly Created Districts Archived 2008-09-10 at the Wayback Machine dated 2008-03-13, accessed 2012-04-24
  6. "ERO's and AERO's". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 2008-10-22. Retrieved 2012-04-24.
  7. 7.0 7.1 7.2 http://kashmir-tourism.com/jammu-kashmir-lakes-mansabal-lake.htm, Manasbal Lake
  8. http://www.indiainfoweb.com/jammu-kashmir/lakes/mansabal-lake.html Archived 2012-02-14 at the Wayback Machine Mansbal lake
  9. http://www.ilec.or.jp/database/asi/asi-57.html Archived 2012-03-03 at the Wayback Machine Manasbal Lake
  10. http://www.mascottravels.com/kashmirlakes.htm kashmir lakes
  11. "How high is Harmukh". wolframalpha.com. Retrieved 2012-04-24.[permanent dead link]
  12. "Geography of Kashmir". kousa.org. Archived from the original on 2012-10-30. Retrieved 2012-04-24.
  13. Curran, Jim (1995). K2: The Story of the Savage Mountain. Hodder & Stoughton. p. 25. ISBN 978-0340660072.
  14. "Rimo expeditions". rimoriverexpeditions.com. Archived from the original on 2012-06-28. Retrieved 2012-04-25.
  15. "Trekking Kashmir". gaffarakashmir.com. Archived from the original on 2013-03-13. Retrieved 2012-04-19.
  16. Raina, HS; KK Vass (May–June 2006). "Some biological features of a freshwater fairy shrimp, Branchinecta schantzi, Mackin, 1952 in the Northwestern Himalayas, India" (PDF). J. Indian Inst. Sci. 86: 287–291. Retrieved 21 February 2012.[permanent dead link]
  17. "Fishes and Fisheries in high altitude lakes, Vishansar, Gadsar, Gangabal, Krishansar". Fao.org. Retrieved 2012-04-19.
  18. Petr, T. (1999). Fish and fisheries at higher altitudes : Asia. Rome: FAO. p. 72. ISBN 92-5-104309-4.
  19. [1]
  20. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-07-10. Retrieved 2014-06-30.
  21. [2]
  22. "Jammu and Kashmir update". jammuandkashmirupdate.com. Archived from the original on 2012-03-29. Retrieved 2012-04-25.

సరిహద్దులు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]