Jump to content

బీసీ కుల, చేతివృత్తులకు ఆర్థికసాయం

వికీపీడియా నుండి
బీసీ కుల, చేతివృత్తిలకు ఆర్థికసాయం
బీసీ కుల, చేతివృత్తులకు ఆర్థికసాయం పథకాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రాంతంమంచిర్యాల, తెలంగాణ
ప్రధాన వ్యక్తులుబీసీ కుల, చేతివృత్తుల వారు
స్థాపన2023, జూన్ 09
వెబ్ సైటుబీసీ కుల, చేతివృత్తులకు ఆర్థికసాయ వెబ్‌సైట్‌
నిర్వాహకులుముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం

బీసీ కుల, చేతివృత్తులకు ఆర్థికసాయం అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం.[1] బీసీ కులవృత్తులు నిర్వహించుకొనే చేతివృత్తిదారులు తమకు వృత్తి పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.[2]

దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను మొదట మండల మున్సిపాలిటి స్థాయిలో అధికారులు పరిశీలించి, తరువాత కలెక్టర్ అధ్యక్షతన ఏర్పడే ఎంపిక కమిటీ పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ప్రతినెలా 27 తేదీ నుంచి ఇంఛార్జి మంత్రుల ఆమోదంతో మరుసటి నెల 4వ తేదీ వరకు లబ్ధిదారుల జాబితాను ఖరారు చేసి ఆయా గ్రామ, మండల స్థాయిల్లో, వెబ్సైటులో పొందుపరుస్తారు. ఎంపికైన లబ్దిదారులకు ప్రతినెల 15న వన్ టైమ్ బెనిఫిట్ గా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. వచ్చిన డబ్బును లబ్ధిదారుడు తన ఇష్టం మేరకు ఎలాంటి ఉపకారణాలైన కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది.[3]

ప్రారంభం

[మార్చు]

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 2023, జూన్ 9న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ పథకాన్ని మంచిర్యాలలో ప్రారంభించి, లబ్దిదారులలో కొందరికి ఆర్థికసహాయ చెక్కులను అందజేశాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, బీసి సంక్షేమ శాఖామంత్రి గంగుల క‌మ‌లాక‌ర్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌, ఆదిలాబాదు ఎమ్మెల్యే జోగు రామ‌న్న‌, ఖానాపూర్ ఎమ్మెల్యే ఆజ్మీరా రేఖా నాయ‌క్‌తోపాటు జిల్లా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[4][5]

మార్గదర్శకాలు, ఎంపిక ప్రక్రియ

[మార్చు]

బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారులలో 18-55 ఏళ్ళ వయస్సు ఉండి, వారి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ ఆర్థిక సాయం అందించబడుతుంది. రేషన్‌కార్డు, కుల, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోను దరఖాస్తు చేసుకున్న తరువాత, మండలస్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో మున్సిపల్‌ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించి, జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీకి నివేదిస్తారు. ఆ కమిటీ అర్హులను గుర్తించి జాబితాను సిద్ధం చేసి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదం తీసుకోని, ఎంపికైన లబ్ధిదారుల జాబితాను ఆన్‌లైన్‌లో ప్రకటించి, లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు నేరుగా లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఆ నిధులతో పనిముట్లు, ముడిసరుకును కొనుగోలు చేసిన తరువాత, ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో యూనిట్ల గ్రౌండింగ్‌ను పర్యవేక్షిస్తారు.[6]

వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

[మార్చు]

బీసీ కుల, చేతివృత్తులకు ఆర్థికసాయంకు దరఖాస్తు చేసుకోవడానికి ఏర్పాటుచేసిన https://tsobmmsbc.cgg.gov.in Archived 2023-06-11 at the Wayback Machine అనే వెబ్‌సైట్‌ ను 2023, జూన్ 6న తెలంగాణ సచివాలయంలో తెలంగాణ బీసి సంక్షేమ శాఖామంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించాడు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కార్పొరేషన్‌ ఎండీ మల్లయ్యభట్టు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.[2]

నిధులు

[మార్చు]

బీసీ కుల, చేతివృత్తులకు ఆర్థికసాయం పథకానికి తొలివిడతగా బీసి కమీషన్ నుండి 400 కోట్లు మంజూరు చేస్తూ 2023 జూలై 6న ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసింది.[7]

కులాలు

[మార్చు]

తొలి దశలో ఈ క్రింది వృత్తుల వారికి అవకాశం కల్పించారు.

  1. నాయి బ్రాహ్మణ
  2. రజక
  3. సగర/ఉప్పర
  4. కుమ్మరి/శాలివాహన
  5. అవుసల
  6. కంసాలి
  7. కమ్మరి
  8. కంచరి
  9. వడ్ల/వడ్రంగి/శిల్పిలు
  10. కృష్ణ బలిజ పూసల
  11. మేదర
  12. వడ్డెర
  13. అరెకటిక
  14. మేర
  15. ఎంబీసీల

పథకం అమలు

[మార్చు]

మైనారిటీ ఆర్థిక సహాయం

[మార్చు]

రాష్ట్రంలోని బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకు కూడా ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2023 జూలై 23న మైనారిటీలకు ఆర్థికసాయానికి సంబంధించిన ఉత్తర్వులు జారీచేసింది.[13] అందుకు అనుగుణంగా పథకం కింద లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా ముస్లీం మైనారీటీలకు, తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా క్రైస్తవ మైనారిటీ వారికి పథకం అమలు చేయబడుతుంది.[14]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ABN (2023-06-08). "బీసీ కుల వృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సహాయం". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-06-08. Retrieved 2023-06-11.
  2. 2.0 2.1 "1 Lakh for BCs: రూ.లక్ష ఆర్థిక సాయం.. ప్రక్రియ ప్రారంభం". EENADU. Archived from the original on 2023-06-07. Retrieved 2023-06-11.
  3. Chary, Maheshwaram Mahendra (2023-06-18). "1 Lakh For BCs : గుడ్ న్యూస్... లక్ష సాయం నిరంతర ప్రక్రియ - ప్రతి నెల 15న ఆర్థిక సాయం అందజేత". Hindustantimes Telugu. Archived from the original on 2023-06-18. Retrieved 2023-07-12.
  4. telugu, NT News (2023-06-09). "CM KCR | కుల‌వృత్తుల‌కు ఆర్థిక సాయం ప‌థ‌కాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-06-10. Retrieved 2023-06-10.
  5. Velugu, V6 (2023-06-10). "ధరణి పోతే దళారీ రాజ్యం వస్తది". V6 Velugu. Archived from the original on 2023-06-10. Retrieved 2023-06-10.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  6. telugu, NT News (2023-06-07). "Rs.1 Lakh aid for BCs | ఈ నెల 20 వరకు బీసీలకు లక్ష సాయం దరఖాస్తులు.. ఇవీ మార్గదర్శకాలు". www.ntnews.com. Archived from the original on 2023-06-07. Retrieved 2023-06-11.
  7. "రూ.లక్ష సాయం పథకానికి రూ.400 కోట్లు". EENADU. 2023-07-12. Archived from the original on 2023-07-12. Retrieved 2023-07-12.
  8. "సిద్దిపేటకు మరో వరం.. గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి హరీశ్ రావు". Samayam Telugu. Archived from the original on 2023-08-14. Retrieved 2023-08-14.
  9. "KTR: 50 ఏళ్లు అధికారం ఇచ్చినా ఏమీ చేయని వారిని పట్టించుకోవద్దు: కేటీఆర్‌". EENADU. Archived from the original on 2023-08-09. Retrieved 2023-08-12.
  10. "అర్హులందరికీ బీసీ బంధు పథకం ఆర్థిక సాయం అందుతుంది: కేటీఆర్‌". Prajasakti (in ఇంగ్లీష్). 2023-08-08. Archived from the original on 2023-08-09. Retrieved 2023-08-12.
  11. ABN (2023-08-12). "బీఆర్‌ఎస్‌ పేదల పార్టీ". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-08-14. Retrieved 2023-08-14.
  12. "అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కెసిఆర్ లక్ష్యం… హ‌రీష్ రావు". Prabha News (in ఇంగ్లీష్). 2023-08-12. Archived from the original on 2023-08-12. Retrieved 2023-08-14.
  13. Ashok (2023-07-23). "మైనారిటీలకు రూ. లక్ష ఆర్థిక సహాయం... ఉత్తర్వులు జారీ". Mana Telangana. Archived from the original on 2023-07-26. Retrieved 2023-07-26.
  14. "Telangana Govt. to give ₹1 lakh financial assistance to minorities with 100% subsidy". The Hindu. 2023-07-23. ISSN 0971-751X. Archived from the original on 2023-07-23. Retrieved 2023-07-26.

బయటి లింకులు

[మార్చు]