Jump to content

బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి

వికీపీడియా నుండి
బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి
జననంబెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి
1918 మాఘ పౌర్ణమి
వేంసూరు, ఖమ్మం జిల్లా, తెలంగాణ
మరణం1973 డిసెంబరు 19
ఖమ్మం జిల్లా, తెలంగాణ
ఇతర పేర్లుచంద్రమౌళిశాస్త్రి
ప్రసిద్ధితెలుగు కవులు, తెలుగు రచయితలు, తెలంగాణ స్వాతంత్ర్య పోరాట యోధుడు

తెలంగాణాలో వెలసిన సాహిత్యవేత్తలలో ప్రఖ్యాతుడు శ్రీ. బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి[1]. వీరు 1918 మాఘ పౌర్ణమినాడు ఖమ్మం జిల్లా, వేంసూరులో జన్మించారు.ఈయన రచనలలోనే కాక రాజకీయాలలో కూడా పాల్హొని ఖ్యాతి గాంచారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రాష్ట్ర సాహిత్య పురస్కారాన్ని పొందారు[2].

శ్రీ శాస్త్రిగారు తెలంగాణా స్వాతంత్రఉద్యమము లోనూ, రాష్ట్ర కాంగ్రెస్ లోను గ్రంధాలయ ఉద్యమములోను, ఆంధ్రమహాసభలలోను పాల్గొని ప్రధాన భూమిక వహించారు.

రాజకీయ జీవితంతోపాటు సాహిత్యం వ్యాసంగమును చేపట్టిన దిట్ట శ్రీ. బెల్లంకొండ. 1930 నుండీ భారతిలో రచనలు సాగించినారు.

రచనల జాబితా

[మార్చు]

వీరువ్రాసిన ఋతుపవన కావ్యానికి 1973వసం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి బహుమతి లభించింది.

నమోవాకం, కృష్ణవేణి, తరంగిణి-వారి ఇతర రచనలు.

ప్రతీకారం, పంచకల్యాణి-వీరిచే రచితమైన నాటక రాజములు.

కధాకళి, సశేషం-వీరి కధానికా సంకలనాలు.

శృంగారం-పోతన: వీరి విమర్సన వ్యాసములు.

19 వ శతాబ్ది ఆంధ్రవాజ్మయ చరిత్రను చిత్రించే గ్రంధరాజం నవోదయం:

ఇవేకాక చిరుగంటలు (బాలగేయాలు), ఉర్దూ కధానికలు, దశకుమారచరిత్ర మొదలైనవి పేర్కొనదగినవి.ఇంకా అనేక పత్రికలలో వ్రాసి ఖ్యాతి గడించిన సాహితీ బంధువు శ్రీ బెల్లంకొండ చంద్రమఊళి శాస్త్రిగారు.

ఈయన 19-12-1973 నాడు జీవత సాయుజ్యం చెందినారు. ఈయన తెలుగు సాహితీ లోకంలో చిరంజీవి.

మూలాలు

[మార్చు]
  1. "ఖమ్మం సాహిత్య చరిత్ర రచనకి ఇది శ్రీకారం!". సారంగ (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-03-31. Retrieved 2019-01-19.
  2. "chandramouli - Synonyms of chandramouli | Antonyms of chandramouli | Definition of chandramouli | Example of chandramouli | Word Synonyms API | Word Similarity API". wordsimilarity.com. Retrieved 2019-01-19.[permanent dead link]

మూలాలు

[మార్చు]


  • 1974 భారతి మాస పత్రిక.