Jump to content

మైనాకుడు

వికీపీడియా నుండి

మైనాకుడు లేదా మైనాకము అనేది రామాయణంలో ఒక పర్వతము. ఇతడు మేనక, హిమవంతుల కుమారుడు. ఇంద్రుడు పర్వతముల రెక్కలు కత్తిరిస్తున్నందుకు భయపడి ఇతడు దక్షిణ సముద్రములో దాక్కున్నాడు. హనుమంతుడు సముద్రమును దాటునపుడు మైనాకుడు పైకి వచ్చి తనపై కొంతసేపు విశ్రాంతి తీసుకొమ్మని కోరాడు. అతి ముఖ్యమైన కార్యం మీద వెళుతున్నందున ఎక్కువ సేపు ఆగకుండా అతన్ని ఆశీర్వదించి హనుమ ముందుకు సాగిపోయాడు.

హిమవంతునికి, మేరుపుత్రి అయిన మేనకకు పుట్టిన కుమారుడు. పూర్వము కృతయుగమున పర్వతములకు అన్నింటికి రెక్కలు ఉండేవి. అవి ఎప్పుడూ తిరుగుతూ ఉండినందున ప్రాణులకు మిక్కిలి భయము కలుగుతూ ఉండెను. అది నిలుపుటకై ఇంద్రుడు తన వజ్రాయుధముచే పర్వతముల రెక్కలు తెగగొట్టసాగెను. ఆ సమయమున వాయుదేవుని సహాయంతో మైనాకుడు తప్పించుకొని పోయి సముద్రంలో దాక్కున్నాడు. ఆ కృతజ్ఞతతో మైనాకుడు, వాయుపుత్రుడైన హనుమంతుడు సీతను వెతకడానికి లంకకు పోవుచు సముద్రమును దాటే సమయంలో, తనపై కొంతసేపు నిలిచి పొమ్ము అని సముద్రము నుంచి బయటికి వచ్చి హనుమంతుని ప్రార్థించెను. అది తనకు ప్రియము అయిన కార్యము అగుటచే ఇంద్రుడు మైనాకునితో స్నేహము చేసి అభయము ఇచ్చి పంపెను.[1]

మూలాలు

[మార్చు]
  1. పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య)
"https://te.wikipedia.org/w/index.php?title=మైనాకుడు&oldid=4403016" నుండి వెలికితీశారు