బాటా షూమార్ట్ కంపెనీ అధినేత థామస్ బాటా చెకొస్లోవేకియాలో మరణించాడు. ఈతని తండ్రి టోమస్ బాటా 1894లో బాటా షూ కంపెనీని స్థాపించాడు.
హైదరాబాదులోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇస్రో పరిధిలోకి తీసుకువచ్చారు. ఇదివరకు ఎన్.ఆర్.ఎస్.ఏ.అంతరిక్ష విభాగం అధీనంలో ఉండేది.
జపాన్ ప్రధానమంత్రి యసువొ ఫుకుడా పదవికి రాజీనామా చేశాడు. లిబరల్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఇతను ఎగువసభలో తన పార్టీకి మెజారిటీ లేకపోవడంతో చట్టాలు అమలుచేయడంలో ఇబ్బందులకు గురై రాజీనామా సమర్పించాడు.
జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని 4 విశ్వవిద్యాలయాలుగా విభజించే బిల్లును ఆంధ్రప్రదేశ్ విధానమండలి ఆమోదించింది.
ప్రపంచంలోనే అతిశక్తిమంతులైన 100 మంది జాబితాలో ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ సోదరులకు స్థానం లభించింది. వీరికి 67 వ స్థానం లభించగా, తొలి స్థానాన్ని రష్యా ప్రధానమంత్రి వ్లాదిమిర్ పుతిన్ పొందినారు.
అగ్రవర్ణ పేదలకు ఉన్నత విద్యలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.
లియాండర్ పేస్ అమెరికన్ ఓపెన్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల డబుల్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
ఫిఫా తాజా ర్యాంకింగ్‌లో భారత్ రెండు స్థానాలు పైకి ఎదిగి 151వ స్థానంలో నిలిచింది. ఆసియా దేశాల్లో భారత్ 24వ స్థానంలో ఉంది.
లియాండర్ పేస్ అమెరికన్ ఓపెన్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిట్ కైవసం చేసుకున్నాడు. కారా బ్లాక్ (జింబాబ్వే)తో జతకట్టిన పేస్ ఫైనల్లో 7-6(8-6), 6-4 స్కోరుతో లీజెల్ హ్యూబెర్, జేమీ ముర్రేలపై విజయం సాధించారు.
అమెరికన్ ఓపెన్ టెన్నిస్ డబుల్స్‌లో లియాండర్ పేస్ జోడి ఓటమి. చెక్ కు చెందిన లూకాస్ తో జతకట్టిన పేస్ ఫైనల్లో బ్రయాన్ సోదరులపై 6-7, 6-7 తేడాతో ఓటమి చెందాడు.
ప్రపంచం అంతమవుతందంటూ వచ్చిన వదంతులను పటాపంచలు చేస్తూ జెనీవాలో LHC(Large Hadron Collider) ను CERN ఆధ్వర్యంలో విజయంతం గా పరీక్షించారు. ఇందు లో వివిధ దేశాలకు చెందిన రెండు వేల మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.'బిగ్ బ్యాంగ్' ప్రయొగ ఫలితాలు వెలువడటానికి నెల రోజులు పడుతుంది.
థాయిలాండ్ ప్రధానమంత్రిగా పీపుల్ పవర్ పార్టీకి చెందిన సొంచాయ్ వాంగ్‌సవత్ ఎన్నికైనాడు.
సరిహద్దు భద్రతా దళం (BSF) డైరెక్టర్ జనరల్‌గా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఎం.ఎల్.కుమావత్ నియమితులయ్యాడు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ చైర్మెన్ ఎ.వి.ఎస్.రాజు అతిపెద్ద గ్రంథం రచించినందుకు గిన్నిస్‌బుక్‌లో పేరు సంపాదించాడు.
బీజింగ్‌లో పారాలింపిక్స్ క్రీడలు ముగిశాయి. 89 స్వర్ణాలతో సహా మొత్తం 211 పతకాలు సాధించి చైనా ప్రథమస్థానం పొదగా, బ్రిటన్, అమెరికాలు రెండో, మూడో స్థానాలలో నిలిచాయి.
ప్రపంచ మహిళల చదరంగం చాంపియన్‌షిప్ టైటిల్‌ను రష్యాకు చెందిన అలెక్సాండ్రా కోస్టెనిక్ గెలుచుకుంది.
ఢిల్లీలో మళ్ళి బాంబుపేలుళ్ళు జరిగి ఇద్దరు మృతిచెందారు, 20 మందికిపైగా గాయపడ్డారు.
మున్సిపల్, జిల్లా, మండల పరిషత్తు పాఠశాలలకు శాశ్వత గుర్తింపు కల్పిస్తూ ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) అద్యక్ష పదవి నుంచి కాకర్ల ప్రభాకర్‌ను తొలిగించాలని తానా పాలకమండలి నిర్ణయించింది.
చైనా టైకోనాట్ ఝూయ్ జియాంగ్ రోదసీ నడక చేయడంతో ఈ ఘనత సాధించిన మూడవ దేశంగా చైనా ఆవిర్బవించింది.
ఇరానీ ట్రోఫి క్రికెట్‌ను రెస్టాఫ్ ఇండియా విజయం సాధించింది. ఈ ట్రోఫీ రెస్టాఫ్ ఇండియా చేజిక్కించుకోవడం ఇది 21వ సారి. వదోదరలో జరిగిన ఫైనల్లో ఢిల్లీ జట్టుపై 187 పరుగుల ఆధిక్యతతో గెల్చింది.
ప్రముఖ సినీగాయకుడు మహేంద్ర కపూర్ ముంబాయిలో మరణించాడు.
ప్రముఖ హాలివుడ్ నటుడు పాల్ న్యూమన్ లాస్ ఏంజిల్స్ లో మరణించాడు.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అద్యక్షుడిగా శశాంక్ మనోహర్ నియమితులైనాడు. కార్యదర్శి పదవి ఎన్.శ్రీనివాసన్‌కు దక్కింది.