ఫిబ్రవరి 2008
స్వరూపం
వర్తమాన ఘటనలు | 2008 ఘటనలు నెలవారీగా - | జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు | వికీపీడియా ఘటనలు | 2007 ఘటనలు |
- ఫిబ్రవరి 29, 2008
- 2008-09 సంవత్సరపు భారతదేశపు ఆర్థిక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి చిదంబరం లోక్‌సభలో ప్రవేశపెట్టినాడు.
- నూతన బడెట్లో వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 1,10,000 నుంచి రూ.1,50,000 లకు పెంచబడింది.
- ఫిబ్రవరి 28, 2008
- పర్యాటక రంగంలో సాధించిన అభివృద్ధికై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 2007-08 అవార్డు లభించింది.
- మహానది నదీపరీవాహక్షేత్రంలో రిలయెన్స్ ఇండస్ట్రీ చమురు నిక్షేపాలను కనుగొంది.
- చెన్నై మహానగర పోలీసు శాఖను రెండుగా విభజించాలని నిర్ణయించారు.
- ఫిబ్రవరి 27, 2008
- ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు బ్రాడ్హక్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటన.
- నేపాల్ రాజ్యాంగ సభకు ఏప్రిల్ 10న జరగబోతున్న ఎన్నికలకు 2,219 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. (యాహూ తెలుగు)
- ఫిబ్రవరి 26, 2008
- లాలూ ప్రసాద్ యాదవ్ వరుసగా ఐదవసారి లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టాడు.
- ఆస్ట్రేలియాలో జరుగుతున్న ముక్కోణపు క్రికెట్ పోటీలో భారత్ శ్రీలంకను ఓడించి ఫైనల్లోకి
- ఫిబ్రవరి 25, 2008
- క్యూబా అధ్యక్షుడిగా ఫిడెల్ కాస్ట్రో సోదరుడు రావుల్ క్యాస్ట్రో ఎన్నికయ్యాడు.
- మధ్య ప్రదేశ్ లోని అమర్ఖంఠక్లో ఇందిరా గాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రకటన.
- ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో భారత్‌కు చెందిన ఆనంద్పవార్ టైటిల్ సాధించాడు.
- దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా పదవి స్వీకరించిన లీ మ్యుంగ్.
- సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హంస్రాజ్ ఖన్నా మృతి.
- ఫిబ్రవరి 24, 2008
- అసోంలో సోనపూర్ వంతెనపై నుంచి బస్సు పడి 18 ప్రయాణీకుల మృతి.
- భారత వైమానిక దళంలో శిక్షణ నిమిత్తం బీదర్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో బ్రిటన్ తయారుచేసిన అధునాతన జెట్ ట్రైనర్ హక్ శిక్షణ విమానాన్ని ప్రవేశపెట్టారు.
- ఇరాక్ ఉత్తర ప్రాంతంలో టర్కీ వైమానిక దాడి, 35 కుర్దిష్ తిర్గుబాటుదారుల మృతి.
- ఫిబ్రవరి 23, 2008
- త్రిపురలో శాసనసభ ఎన్నికల పోలింగ్ జరిగింది.
- మహాత్మాగాంధీ తనకు స్ఫూర్తి ప్రదాత అని అమెరికాలో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీలో ఉన్న బారక్ ఒబామా ప్రకటన.
- దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంటును నార్త్‌జోన్ 17వ సారి కైవసం చేసుకొంది.
- హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనానికి సెంచూరియన్ బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ఆమోదం.
- ఫిబ్రవరి 22, 2008
- సెర్బియాలో అల్లర్లు. అమెరికా దౌత్యకార్యాలయానికి ఆందోళనకారులు నిప్పంటించారు.
- ఫిబ్రవరి 21, 2008
- కక్ష్యలో నియంత్రణ కోల్పోయిన కృత్రిమ ఉపగ్రహాన్ని అమెరికా పేల్చివేసింది.
- 2007 సంవత్సరపు సాహిత్య అకాడమీ అవార్డులకు గాను 24 రచయితలు ఎంపికయ్యారు.
- ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్‌లో భారత క్రికెట్ జట్టు రెండో స్థానంలో నిలిచింది.
- ముంబయి ట్రాన్స్‌హార్బర్ లింక్ ప్రాజెక్టు (22 కిలోమీటర్ల పొడవైన రోడ్డు, రైల్వే బ్రిడ్స్ నిర్మాణపు) పనులను రిలయన్స్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది.
- ఫిబ్రవరి 20, 2008
- నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆమోదం తెలిపింది.
- బిసిసీఐ ఏర్పాటు చేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ల వేలం ప్రారంభం. మహేంద్రసింగ్ ధోనిని చెన్నై ఫ్రాంచైజ్ 6 కోట్ల రూపాయల బిడ్‌తో దక్కించుకుంది.
- భారత్ లో తొలి భూగర్భ పైప్‌లైన్ నిర్మాణం ముంబాయిలో ప్రారంభించారు.
- ఫిబ్రవరి 19, 2008
- పాకిస్తాన్ ఎన్నికలలో దివంగత బెనజీర్ భుట్టోకు చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.
- ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటే అత్యున్నత వ్యవస్థ అని లోకసభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ అభిప్రాయం వ్యక్తంచేశాడు.
- 1959 ఞుంచి అధికారంలో ఉన్న క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో పదవికి రాజీనామా.
- ఆస్ట్రేలియాలో జరుగుతున్న ముక్కోణపు క్రికెట్ టోర్నమెంటులో శ్రీలంకపై భారత్ విజయం
- ఫిబ్రవరి 18, 2008
- నేపాల్ రాజధాని నగరం ఖాట్మండ్‌లో మైనారిటీల సమ్మె వల్ల ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడి రవాణా వ్యవస్థ స్తంభించింది.
- కొసావో స్వాతంత్ర్యం ప్రకటించుకోవడాన్ని తిరస్కరించిన సెర్బియా.
- ప్రముఖ బెంగాలీ సినీ దర్శకుడుశ్యాం బెనగల్‌కు రావి నారాయణ రెడ్డి అవార్డు ప్రదానం.
- ఫిబ్రవరి 17, 2008
- ఆస్ట్రేలియాలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సీరీస్‌లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఫైనల్లోకి ప్రవేశించింది.
- అఫ్ఘనిస్తాన్ లోని కాందహార్‌లో జరిగిన ఆత్మాహుతి బాంబుదాడిలో 80 మంది మృతి.
- ఒడిషాలో నక్సలైట్లు జరిపిన దాడితో రాష్ట్రమంతటా హైఅలెర్ట్ ప్రకటించిన ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం.
- భారత్ టాప్- 3 రియాల్టీ మార్కెట్ల్లో ఒకటిగా అవతరించినట్లు అసోసియేషన్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇన్ రియల్ ఎస్టేట్ నివేదిక వెల్లడించింది.
- ఫిబ్రవరి 16, 2008
- రూ.1,00,436 కోట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి రోశయ్య శాసనసభలో ప్రవేశపెట్టాడు.
- 2006లో సోనియా గాంధీ బెల్జియం పర్యటనలో ఆ దేశ రెండో అత్యున్నత పురష్కారమైన ఆర్డర్ ఆఫ్ లియోపోల్డ్ అవార్డును స్వీకరించినందుకు ఎన్నికల సంఘం నోటీసు జారీచేసింది.
- ఐసిసి తాజా ర్యాంకింగ్‌లో భారత్ నాలుగవ స్థానంలో నిలిచింది. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‌లో సచిన్ టెండుల్కర్ ఏడవ స్థానంలో నిలిచాడు.
- ఫిబ్రవరి 15, 2008
- బంగ్లాదేశ్‌కు చెందిన బంగాలీ రచయిత్రి తస్లీమా నస్రీన్ వీసాను కేంద్రం పొడిగించింది.
- దోహాలో జరిగిన ఆసియన్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అంజు బాబీ జార్జ్ లాంగ్‌జంప్‌లో రజతపతకాన్ని సాధించింది.
- ఆస్ట్రేలియా పాకిస్తాన్ పర్యటన నుంచి తప్పుకుంటే తీవ్రపరిణామాలు తలెత్తుతాయని బిసిసీఐ హెచ్చరిక.
- తొమ్మిదిసార్లు గ్రాండ్‌స్లాం మహిళల టైటిళ్ళ విజేత మోనికా సెలెస్ టెన్నిస్ నుంచి రిటైర్మెంట్.
- ఫిబ్రవరి 14, 2008
- నియోజకవర్గాల పునర్విభజనను కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది. జార్ఖండ్, అసోం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ 5 రాష్ట్రాలు మినహా మిగితా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పునర్విభజన పూర్తయింది.
- మలేషియాలో మార్చి 8న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది.
- ముంబయిలో జరిగిన తొలి మహిళా ఛాలెంజర్ ట్రోఫీలో భారత్ ఏ జట్టు విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది.
- ఫిబ్రవరి 13, 2008
- మచిలీపట్నం తీరానికి 50 కి.మీ.దూరంలో కృష్ణా-గోదావరి బేసిన్ లో మొట్ట మొదటి సారిగా గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రకటన.
- హైదరాబాదులో 20 ఎకరాల స్థలంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్న గూగుల్ సంస్థ.
- పాకిస్తాన్ అన్వాయుధాలు మోసుకెళ్ళగల ఘజ్ఞవీ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించింది. దీని పరిధి 290 కిలోమీటర్లు.
- ఫిబ్రవరి 12, 2008
- భారత పర్యటనకు విచ్చేసిన రష్యా ప్రధానమంత్రి జుబ్కోవ్.
- వివాదంలో చిక్కుకున్న సంజయ్ దత్-మాన్యతల వివాహం.
- కాన్బెర్రా వన్డేలో భారత్ పై శ్రీలంక 8 వికెట్లతో విజయం సాధించింది. శ్రీలంక ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ దిల్షాన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
- బహ్రెయిన్ మెరుగైన జీతం కోసం 1900 మంది భారతీయ కార్మికులు సమ్మె ప్రారంభించారు.
- అప్ఘనిస్థాన్‌లో పాకిస్తాన్ రాయబారిగా పనిచేస్తున్న తారీఖ్ అజీజుద్దీన్ అదృశ్యం.
- 2008లో వాతావరణ మార్పులపై చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాబ్కి మూన్ విజ్ఞప్తి.
- ఫిబ్రవరి 11, 2008
- ముంబయిలో చెలరేగిన అలర్లకు చర్యగా మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్‌థాకరేపై, సమాజ్‌వాదీ పార్టీ ముంబయి అధ్యక్షుడు అబూఅజ్మీలపై పోలీసులు కేసులు నమోదు.
- తొలిగించిన న్యాయమూర్తులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తే పాకిస్తాన్లో న్యాయవాదులు న్యాయస్థానాలను బహిష్కరించారు.
- భారత్, అమెరికా సంబంధాలు మరింత బలపడనున్నాయని భారత్‌లోని అమెరికా రాయబారి డేవిడ్ ముల్ఫోర్డ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
- అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున పోటీలో ఉన్న బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్‌పై ఆధిక్యం.
- కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖపట్నం స్టీల్ ప్లాంట్) కు ఇ-గవర్నెన్స్ అవార్డు.
- పారిస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌ను రష్యా అగ్రశ్రేణి క్రీడాకారిణి అన్నా చక్వతడ్జే కైవసం.
- బాంబే స్టాక్ ఎక్ఛేంజి సూచీ సెన్సెక్స్‌లో మళ్ళీ భారీ పతనం. 834 పాయింట్లు తగ్గి 16631 పాయింట్లకు దిగజారింది. ఇది మొత్తం సుచీలో 4.8% తగ్గుదల.
- చైనాలో 92% గ్రామాలకు విస్తరించిన బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం.
- ఫిబ్రవరి 10, 2008
- ఒసామా బిల్ లాడెన్ పాకిస్థాన్ నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని అమెరికా ప్రకటన.
- న్యూజీలాండ్‌లో దేశీయ విమానం హైజాక్ చేయడానికి ప్రయత్నించిన మహిళ అరెస్ట్.
- ముంబయిలో జరిగే నిర్మాణ పనుల్లో ఇతర రాష్ట్రాల వారిని పనిచేయనీయబోమని శివసేన పార్టీకి చెందిన ఉద్ధవ్ థాకరే ప్రకటన.
- కిడ్నీ రాకెట్ కుంభకోణం నిందితుడు డాక్టర్ అమిత్కుమార్న్య్ భారత సి.బి.ఐ బృందం నేపాల్ నుంచి ఢిల్లీ తీసుకొనివచ్చింది.
- దక్షిణ భారతదేశంలో వ్యాపార అభివృద్ధి కోసం ప్రతిపాదించిన చెన్నై-బెంగుళూర్-ముంబయి త్రికోణ కారిడార్‌కు ప్రభుత్వం అమోదం.
- ఉత్తర ప్రదేశ్ లోని అన్పారాలో 500 మెగావాట్ల సామర్థ్యం గల 2 విద్యుత్ ప్రాజెక్టులు ప్రారంభించడానికి భారత ప్రభుత్వరంగ సంస్థ బి.హెచ్.ఇ.ఎల్‌కు రూ.3390/-కోట్ల ఆర్డర్ దక్కింది.
- ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన సిడ్నీ వన్డేలో ఆస్ట్రేలియా పై 5 వికెట్ల తేడాతో భారత్ గెలుపు. ఇషాంత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు.
- ఫిబ్రవరి 9, 2008
- ప్రముఖ సంఘసేవకుడు బాబా ఆమ్టేగా పేరుగాంచిన మురళిదాస్ దేవదాస్ ఆమ్టే తన ఆశ్రమం ఆనంద్‌వన్‌లో మరణం.
- అరుణాచల్ ప్రదేశ్ పై చైనా చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైట్స్ ఇష్యూ ఈ నెల 18వ తేదీన ప్రారంభం కావచ్చని బ్యాంక్ అధికార వర్గాల సమాచారం.
- పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఎ.బి.బి.లిమిటెడ్ కు 330 కోట్ల రూపాయల సబ్ స్టేషన్ల నిర్వహణ ఆర్డర్లు
- పశ్చిమ బెంగాల్ లోని బర్న్ పూర్ వద్ద గల ఐ.ఐ.ఎస్.సి.ఓ.స్టీల్ ప్లాంట్ లో నిర్వహణ కోసం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి లార్సన్ అండ్ టుబ్రో లిమిటెడ్ కు రూ.1107 కోట్ల ఆర్డర్లు లభించాయి.
- ఫిబ్రవరి 8, 2008
- ద్రవ్యోల్బణం రేటు 4.11%కి పెరిగింది. గత 6 మాసాలలో ఇదే అత్యధిక పెరుగుదల రేటు.
- సిండికేట్ బ్యాంకు ఎస్.ఎం.ఎస్. బ్యాంకింగ్ సౌకర్యాన్ని ఖాతాదారులకు కల్పించింది.
- అవినీతి ఆరోపణలలో చిక్కుకున్న టాంజానియా ప్రధానమంత్రి ఎడ్వర్డ్ లోవస్సా రాజీనామా.
- ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ-20 ఫైనల్ మ్యాచ్ ముంబాయిలో జరపాలని నిర్ణయం.
- ఫిబ్రవరి 7, 2008
- జన్యు పరిశోధనలపైహైదరాబాద్ లో బయో ఏసియా 2008 సదస్సు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ చే ప్రారంభం.
- సియట్ అంతర్జాతీయ క్రికెట్ టీం ర్యాంకింగ్స్‌లో భారత జట్టు 89 పాయింట్లతో తొలి స్థానంలోనిలిచింది. బ్యాట్స్మెన్లలో శ్రీలంకకు చెందిన మహేల జయవర్థనే ప్రథమ స్థానంలోను, భారత్‌కు చెందిన సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీలు ద్వితీయ, తృతీయ స్థానాలలో ఉన్నారు.
- ఆంధ్రప్రదేశ్‌లో 12 పార్టీలకు రాజకీయ పార్టీలుగా గుర్తింపు లభించింది.
- ఫిబ్రవరి 6, 2008
- పాకిస్తాన్ అణ్వాయుధాలు సురక్షితంగా లేవని అమెరికా నిఘాసంస్థల హెచ్చరిక.
- 1999లో భారత విమానాన్ని హైజాక్ చేసిన తీవ్రవాదులకు సహాయం చేశారనే నేరం నిర్ధారణ కావడంతో ముగ్గురికి జీవిత ఖైదు పాటియాలా కోర్టు తీర్పు ఇచ్చింది.
- పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రాంతంలోని విద్యా సంస్థల్లో విద్యార్థులు సెల్‌ఫోన్ వాడడానికి ప్రభుత్వం నిషేధించింది.
- అమెరికా అధ్యక్ష పదవిలో నిలబడే డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి పదవికై జరిగిన ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ఒబామాపై ఆధిక్యం సాధించింది.
- ఫిబ్రవరి 5, 2008
- అత్యధిక విదేశీ మారక నిల్వలు కలిగిన దేశాల్లో భారత్ నాలుగవ స్థానం పొందినది. చైనా, జపాన్, రష్యాలు ఈ విషయంలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
- వన్డే క్రికెట్లో సచిన్ టెండుల్కర్ 16000 పరుగులు పూర్తి చేసిన ఘనతను పొందినాడు. వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇదివరకే ఇతని పేరిటే ఉంది.
- ఫిబ్రవరి 4, 2008
- ఆఫ్రికా లోని ర్వాండా, కాంగో దేశాలలో భూకంపం సంభవించి సుమారు 40 మంది మృతి.
- పన్నులతో స్థూల జాతీయోత్పత్తి నిష్పత్తి 11.8%కు పెరుగుతుందనికేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం ప్రకటన.
- ఫిబ్రవరి 3, 2008
- ఆఫ్రికా దేశమైన కెన్యాలో శాంతి స్థాపనకు ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య అంగీకారం కుదిరింది.
- రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్) పశ్చిమ బెంగాల్లో గ్రామీణ టెలిఫోన్ పథకాన్ని ప్రారంభించింది.
- ఫిబ్రవరి 2, 2008
- కర్ణాటకలో తొలి లగ్జరీ రైలు గోల్డెన్ ఛారియట్ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చే ప్రారంభం.
- జమ్మూ కాశ్మీర్ లోని గుల్మార్గ్ లో ఫిబ్రవరి 17 నుంచి ఐదవ జాతీయ హిమోత్సవాలు జరుపనున్నట్లు గుల్మార్గ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వాహకుల ప్రకటన.
- భారత్‌కు చెందిన ఎన్ఎస్ జలాశ్వ నౌకలో గ్యాస్ లీకై ఐదుగురు నావికులు మృతి చెందినట్లు నౌకాదళ అధికారుల ప్రకటన.
- రామసేతును భారతీయ వారసత్వ సంపదగా ప్రభుత్వం ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్.
- ఫిబ్రవరి 1, 2008
- అంతర్జాతీయ స్థాయి ఎయిర్ షో అక్టోబర్ 15 నుంచి మూడు రోజులపాటు హైదరాబాదులో జరపాలని కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ణయించింది.
- దుబాయి పాలకుడు షేక్ మహమ్మద్ బిన్రషీద్ అల్ మగ్దూం తన కుమారుడు హందన్ను యువరాజుగా ప్రకటించాడు.
- అంతర్జాతీయ స్థాయి ఇంటర్నెట్ సంస్థ యాహును 44.6 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి మైక్రోసాప్ట్ సంసిద్ధత.