అర్వాల్ జిల్లా
అర్వాల్ జిల్లా | |
---|---|
దస్త్రం:Son River Arwal బీహార్.jpg | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | మగధ |
ముఖ్యపట్టణం | అర్వాల్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 638 కి.మీ2 (246 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 7,00,843 |
• జనసాంద్రత | 1,100/కి.మీ2 (2,800/చ. మై.) |
• Urban | 51,849 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 67.44% |
Time zone | UTC+05:30 (IST) |
Website | http://arwal.bih.nic.in/ |
బీహార్ రాష్ట్రంలోని జిల్లాల్లో అర్వాల్ జిల్లా ఒకటి. అర్వాల్ ఈ జిల్లా ముఖ్యపట్టణం. ఇది అంతకుముందు జెహానాబాద్ జిల్లాలో భాగంగా ఉండేది.
2011 నాటికి ఇది బీహార్లో అత్యల్ప జనాభా కలిగిన జిల్లాల్లో షేఖ్‌పురా, శివ్‌హర్ జిల్లాల తరువాత మూడవ స్థానంలో ఉంది. [1] అర్వాల్ జిల్లా బీహార్లో చాలా చిన్న జిల్లా. ప్రాధమిక ఆర్థిక రంగంలో ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు.
చరిత్ర
[మార్చు]భౌగోళికం
[మార్చు]అర్వాల్ జిల్లా విస్తీర్ణం 638 చ.కి.మీ. [2] ఇది కెనడా లోని ఫోలే ద్వీప జనాభాకు సమానం. [3] పురాతన శివాలయానికి ప్రసిద్ధి చెందిన మెహందియా లోని మధుషర్వా మేలా అర్వాల్ జిల్లాలోదే.
అర్వాల్ జిల్లాకు పాట్నా, ఔరంగాబాద్, జహానాబాద్, భోజ్పూర్ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.
మొత్తం | గ్రామీణ
జనాభా |
పట్టణ
జనాభా | |
---|---|---|---|
మొత్తం | 7,00,843 | 700,843 | 0 |
పురుషులు | 3,63,497 | 363,497 | 0 |
స్త్రీలు | 3,37,346 | 337,346 | 0 |
భాష
[మార్చు]2011 జనగణన సమయానికి జిల్లా జనాభాలో 86,53% మంది మగాహి భాష, 8.11% మంది హిందీ, 4.96% ఉర్దూ వారి మొదటి భాషగా మాట్లాడుతున్నారు. [4]
జనాభా
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం అర్వాల్ జిల్లా జనాభా 7,00,843, [1] ఇది భూటాన్ జనాభాకు, [5] అమెరికా లోని ఉత్తర డకోటా రాష్ట్రానికీ సమానం. [6] జనాభా పరంగా భారతదేశ జిల్లాల్లో జిల్లాది 502 వ స్థానం. జిల్లాలో జనసాంద్రత 1,099/ చ.కి.మీ. 2001-2011 దశాబ్దంలో జనాభా వృద్ధి రేటు 19.01%. లింగ నిష్పత్తి 927, అక్షరాస్యత 69,54%.
రవాణా సౌకర్యాలు
[మార్చు]ఈ జిల్లాకు రైలు మార్గం లేదు. సరిహద్దు జిల్లాల నుండి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7.
- ↑ "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11.
Foley Island 638km2
- ↑ 2011 Census of India, Population By Mother Tongue
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Bhutan 708,427
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2013-10-19. Retrieved 2011-09-30.
North Dakota 672,591