Jump to content

దేవరాజ్

వికీపీడియా నుండి
దేవరాజ్
జననం (1953-09-20) 1953 సెప్టెంబరు 20 (వయసు 71)
బానసవాడి, బెంగళూరు
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1986–ప్రస్తుతం
జీవిత భాగస్వామిచంద్రలేఖ[1]
పిల్లలుప్రజ్వల్ దేవరాజ్
ప్రణాం దేవరాజ్
తల్లిదండ్రులు
  • రామచంద్రప్ప (తండ్రి)
  • కృష్ణమ్మ (తల్లి)

దేవరాజ్ (జ. 1953 సెప్టెంబరు 20) ఒక దక్షిణ భారతీయ సినీ, నాటక రంగ కళాకారుడు. ఎక్కువగా కన్నడ సినిమాల్లో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా విభిన్నమైన పాత్రలు పోషించాడు. తమిళ, తెలుగు చిత్రాల్లో కూడా నటించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

దేవరాజ్ 1953 సెప్టెంబరు 20[2] న బెంగుళూరులోని లింగరాజపురం అనే ప్రాంతంలో రామచంద్రప్ప, కృష్ణమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని 3 నెలల వయసులో ఇతని తండ్రి మలేరియాతో మరణించాడు. ఆర్థిక కారణాల దృష్ట్యా ఇతడు 1976లో హెచ్.ఎం.టి. వాచ్ ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు. అక్కడ 9 సంవత్సరాలు పనిచేశాడు. అక్కడ ఇతని సహోద్యోగి గోవిందరాజ్ సలహామేరకు ఇతడు నాటకాలలో నటించడం ప్రారంభించాడు. మొదట ఇతడు ఆర్.నాగేష్ డ్రామా కంపెనీలో, తర్వాత బి.జయశ్రీ నాటకకంపెనీ స్పందనలో ఆ తర్వాత శంకర్ నాగ్ నాటక కంపెనీ సంకేత్‌లో పనిచేశాడు.[3] సినిమాలలో త్రిశూల అనే సినిమాతో అడుగుపెట్టాడు.

కుటుంబం

[మార్చు]

ఇతడు 1986లో సినీనటి చంద్రలేఖను వివాహం చేసుకున్నాడు. వివాహం తరువాత చంద్రలేఖ సినిమాలలో నటించడం మానివేసింది. వీరికి ప్రజ్వల్, ప్రణామ్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఇద్దరూ సినిమా రంగంలో చురుకుగా ఉన్నారు. ఇప్పటికే ప్రజ్వల్ సినిమాలలో హీరోగా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు.[4]

సినిమారంగం

[మార్చు]

దేవరాజ్ తొలిసారి సహాయనటుడిగా త్రిశూల అనే కన్నడ సినిమాలో నటించాడు. అయితే ఆ సినిమా విడుదలకాలేదు. ఇతడు 27 మావళ్ళిసర్కిల్ ఇతడు నటించి విడుదలైన తొలి సినిమా. అది మొదలు ఇతడు అనేక కన్నడ సినిమాలలో సహాయపాత్రలలో నటించాడు. 1990లో హత్యాకాండ అనే సినిమాలో నాయకపాత్రను పోషించాడు. ఇతడు కన్నడ, తెలుగు, తమిళ భాషలలో 200పైగా చలనచితాలలో నటించాడు.

తెలుగు సినిమాలు

[మార్చు]

ఇతడు నటించిన కొన్ని తెలుగు చలనచిత్రాలు:

సంవత్సరం సినిమా పాత్ర సహ నటులు దర్శకుడు
1989 భారతనారి జగన్ విజయశాంతి, వినోద్ కుమార్,మురళీమోహన్ ముత్యాల సుబ్బయ్య
1990 20వ శతాబ్దం సుమన్, సుమారంగనాథ్,లిజి కోడి రామకృష్ణ
1990 ప్రేమ యుద్ధం అక్కినేని నాగార్జున, అమల, మోహన్‌బాబు రాజేంద్రసింగ్ బాబు
1990 నేటి సిద్ధార్థ భిల్లూ కృష్ణంరాజు, అక్కినేని నాగార్జున, శోభన క్రాంతి కుమార్
1991 ఎర్ర మందారం జగ్గన్న దొర రాజేంద్రప్రసాద్, యమున, జయలలిత ముత్యాల సుబ్బయ్య
1993 బంగారు బుల్లోడు బాలకృష్ణ, రమ్యకృష్ణ, రవీనా టాండన్ రవిరాజా పినిశెట్టి
1994 అన్న రాజశేఖర్, గౌతమి, రోజా ముత్యాల సుబ్బయ్య
1994 ఎస్.పి.పరశురాం రాయప్ప చిరంజీవి, శ్రీదేవి, రంగనాథ్ రవిరాజా పినిశెట్టి
1994 ధ్వని శృతి, ప్రమీలా జోషి, సుందర్ రాజ్ వి.సోమశేఖర్
1999 సమరసింహారెడ్డి బాలకృష్ణ, సిమ్రాన్, అంజలా జవేరీ బి.గోపాల్
2002 నీలాంబరి రమ్యకృష్ణ, సుమన్, రంగనాథ్ సూర్య
2004 యజ్ఞం రెడ్డెప్ప గోపీచంద్, సమీరా బెనర్జీ, విజయ రంగరాజు రవి కుమార్ చౌదరి
2005 శ్రీ బిక్షపతి మంచు మనోజ్ కుమార్, తమన్నా, మోహన్‌బాబు దశరథ్
2006 రామ్ రహీమ్‌ నితిన్, జెనీలియా, కృష్ణంరాజు ఎన్.శంకర్
2007 యోగి ప్రభాస్, నయన తార, శారద వి. వి. వినాయక్
2007 ఎవడైతే నాకేంటి రాజశేఖర్, సంవృత, గిరిబాబు వి. సముద్ర
2007 లక్ష్యం డి.ఐ.జి.హరినారాయణ్ గోపీచంద్, జగపతి బాబు, అనుష్క శ్రీవాస్
2018 భరత్ అనే నేను శ్రీపతిరావు మహేష్‌బాబు, కైరా అద్వానీ, ప్రకాష్ రాజ్ కొరటాల శివ

మూలాలు

[మార్చు]
  1. Nina C George. "Long-lasting love". Deccanherald. Archived from the original on 26 ఆగస్టు 2014. Retrieved 12 June 2012.
  2. Devaraj. Weekend with Ramesh Season 2 - Episode 7 - January 16, 2016 - Full Episode. Zee Kannada. ozee.com. Event occurs at 3:38. Archived from the original on 28 జూన్ 2017. Retrieved 13 June 2017.
  3. "Friday Review Bangalore : Hero, villain, two in one". The Hindu. 23 June 2006. Archived from the original on 23 February 2014. Retrieved 12 June 2012.
  4. Sharadhaa, A (7 October 2014). "Devraj Brothers Share Screen Space". Archived from the original on 16 December 2014. Retrieved 3 November 2011.

బయటిలింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దేవరాజ్&oldid=4310262" నుండి వెలికితీశారు