నాగ్దా
నాగ్దా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో, చంబల్ నది బేసిన్లో ఉన్న పారిశ్రామిక పట్టణం. 2020 మార్చిలో నాగ్దా ముఖ్యపట్టణంగా నాగ్దా జిల్లాను ఏర్పాటు చేసారు. [1] ఇది పశ్చిమ మధ్యప్రదేశ్ లోని మాళ్వా ప్రాంతంలో, చంబల్ నది ఒడ్డున ఉంది.
జనాభా
[మార్చు]భారత జనగణన లెక్కల ప్రకారం, [2] 2011 లో నాగ్డా జనాభా 1,00,039. వీరిలో పురుషులు 51,373, స్త్రీలు 48,666 ఉన్నారు.
నాగ్డాలో అక్షరాస్యుల సంఖ్య 71,472. వీరిలో 40,073 మంది పురుషులు, 31,399 మంది మహిళలు ఉన్నారు. పట్టణంలో అక్షరాస్యత రేటు 80.71%. ఇది జాతీయ సగటు 74.04% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 88.43% కాగా స్త్రీల అక్షరాస్యత 72.62%. నాగ్డా జనాభాలో 11.48% మంది అరేళ్ళ లోపు పిల్లలు. [3]
2011 జనాభా లెక్కల ప్రకారం, నాగ్డా నగరంలో హిందూ మతస్థులు 81.68%. ఇస్లాం రెండవ అత్యంత ప్రాచుర్యం పొందిన మతం. సుమారు 14.58% మంది దీనిని అనుసరిస్తున్నారు. పట్టణంలో క్రైస్తవ మతాన్ని 0.81%, జైన మతాన్ని 2.09%, సిక్కు మతాన్ని 0.53%, బౌద్ధమతాన్ని 0.53% మంది పాటిస్తున్నారు. సుమారు 0.00% మంది ఇతర మతావలంబికులు. సుమారు 0.29% మంది 'ప్రత్యేకంగా మతమంటూ లేదు' అని పేర్కొన్నారు.
రవాణా సౌకర్యాలు
[మార్చు]రైలు
[మార్చు]ఇది, పశ్చిమ రైల్వేలో ఢిల్లీ-ముంబై ప్రధాన మార్గాన్ని భోపాల్‌తో అనుసంధానించే మార్గంలో ఒక ముఖ్యమైన జంక్షన్ స్టేషను. జైపూర్, ముంబై, ఢిల్లీ, భోపాల్ లకు వెళ్లే అన్ని రైళ్ళకు ఇది ఒక ముఖ్యమైన స్టాప్. నాగ్డా జంక్షన్ గుండా వెళ్ళే ప్రధాన మార్గాలు: ముంబై- కోట జంక్షన్ ద్వారా ఢిల్లీ లైన్ (బ్రాడ్ గేజ్ లైన్).
విమానసేవలు
[మార్చు]సమీప విమానాశ్రయం ఇండోర్ లోని దేవి అహిల్యా బాయి హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం, 110 కి.మీ. దూరంలో ఉంది.
రోడ్డు
[మార్చు]నాగ్డాకు జావోరా ద్వారా జాతీయ రహదారి 79 తో కనెక్టివిటీ ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ Jun 12, Sagar Choukse | TNN | Updated; 2019; Ist, 22:38. "| Indore News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-09-14.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "Nagda City Census 2011 data". www.census2011.co.in.
- ↑ "Nagda City Population Census 2011-2019 | Madhya Pradesh". www.census2011.co.in. Retrieved 2019-04-11.