Jump to content

మంగ్లీ (సత్యవతి)

వికీపీడియా నుండి
(మంగ్లీ(సత్యవతి) నుండి దారిమార్పు చెందింది)
మంగ్లీ (సత్యవతి చౌహన్ )
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తిన్యూస్ ప్రజెంటర్, వ్యాఖ్యాత, నటి
క్రియాశీల సంవత్సరాలు2014 -ప్రస్తుతం
బంధువులుఇంద్రావతి చౌహాన్ (చెల్లెలు) [1]

మంగ్లీ వర్థమాన టీవీ వాఖ్యాత, జానపద, సినీ గాయని, సినీ నటి. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[2] మంగ్లీని తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి (ఎస్‌వీబీసీ) ఛానల్ సలహాదారుగా 2022 నవంబర్ లో ఏపీ ప్రభుత్వం నియమించింది. ఆమె రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటుంది.[3][4]

సంగీత నాటక అకాడమీ ఆమెను ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారంతో, న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 2024 నవంబరు 24న సత్కరించింది.[5]

జననం, బాల్యం

[మార్చు]

మంగ్లీ నెల్లూరు నగరంలో జీనిగల వారి వీధి నందు కాళహస్తి గృహనామములో పేద బంజారా కుటుంబంలో పుట్టింది. తాండలోనే 5వ తరగతి చదివింది. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు గర్ల్స్ హై స్కూల్ లో చదివింది. ఆర్డీటీ (Rural Development Trust) సంస్థ ద్వారా చదువుకొని పాటలు పాడటం నేర్చుకుంది. ఆదే సంస్థ సలహాతో, ఆర్థిక సహాయంతో తిరుపతిలో కర్నాటక సంగీతం నేర్చుకుంది. వారి ఆర్థిక సహాయంతోనే పదో తరగతి తర్వాత ఎస్. వి. విశ్వవిద్యాలయంలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ డిప్లోమా కోర్సులో చేరింది.[6]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆర్డీటీ చొరవతో సంగీతం పై పట్టు పెంచుకొని తిరుపతి లోని సంగీత విద్యాలయంలో పూర్తి మెళకువలు నేర్చుకుంది. ఆ తరువాత తన కెరియర్ మొదలు పెట్టి తెలంగాణ లో పల్లె పాటలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది. మొదట జానపద గీతాలతో కెరియర్ మొదలు పెట్టిన మంగ్లీ.. తీన్మార్ పొగ్రాంతో టీవీ ఛానల్స్ లోకి ఎంటర్ అయి జనాలకు పరిచయమైంది.

మంగ్లీ గా

[మార్చు]

ఒకసారి వి6 టీవీ చానెల్ లో 'మాటకారి మంగ్లీ' అనే కార్యక్రమం మొదలైంది. ఆ తర్వాత చేసిన 'తీన్మార్' తీన్మార్ న్యూస్ తో మంగ్లీ పేరు తెలంగాణాలోని గడప గడపకీ చేరింది. అప్పుడే ఎంటర్ టైన్మెంట్ యాంకర్ గా నేషనల్ టీవీ అవార్డు గెలుచుకుంది. కానీ ఇంత పేరు వచ్చినా తనకు ఇష్టమైన సంగీతానికి దూరమవుతున్నానన్న బాధ వుండేది. అందుకే టివీ నుండి బయటకు వచ్చి 'మైక్' టీవీ యూట్యూబ్ చానల్ లో చేరడం జరిగింది. అప్పుడే తెలంగాణా ఆవిర్భావ సందర్భంగా పాడిన "రేలా......రేలా....రే." పాట మంగ్లీని సెలబ్రటీ సింగర్ ని చేసింది. ఆ తర్వాత సినిమా పాటల రచయిత కాసర్ల శ్యామ్ ద్వారా సినిమా పాటలు కూడా పాడింది. అలా సినిమాలలో పాటలు పాడిన మంగ్లీ 'గోర్ జీవన్' అనే లంబాడీ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. లంబాడా ఆడ పిల్లల్ని కాపాడుకోవాలంటూ సందేశమిచ్చే చిత్రం అది.[7]

నటించిన సినిమాలు

[మార్చు]

పాడిన పాటల జాబితా

[మార్చు]

మంగ్లీ పాడిన పాటల జాబితా ఇది:

సంవత్సరం ఛానలు పాట సంగీతం సాహిత్యం సహగాయకులు యూట్యూబ్‌లో వీక్షణలు
2018 మైక్ టీవీ బతుకమ్మ పాట బొబ్బిలి సురేష్ డా. నందిని సిధారెడ్డి 50+ లక్షలు
2018 మైక్ టీవీ గణేశ్ చతుర్థి అమీన్ కాసర్ల శ్యామ్ 20+ లక్షలు
2018 ఆదిత్య మ్యూజిక్ చూడే (శైలజారెడ్డి అల్లుడు సినిమా) కాసర్ల శ్యామ్‌ 16+ లక్షలు
2018 మైక్ టీవీ బోనాలు పాట బొబ్బిలి సురేష్ మట్ల తిరుపతి మట్ల తిరుపతి 100+ లక్షలు
2018 RTV బంజారా బంజారా తీజ్ పాట (గూగర బండలేనా) కళ్యాణ యాకూబ్ నాయక్ 34+ లక్షలు
2018 మైక్ టీవీ తెలంగాణ స్థాపక దినోత్సవం పాట బొబ్బిలి నందన్ డా. కందికొండ జంగిరెడ్డి 97+ లక్షలు
2018 మైక్ టీవీ కెసిఆర్ పాట రవివర్మ పోతేదార్ డా. కందికొండ 10 లక్షలు
2018 మైక్ టీవీ ఉగాది పాట బొబ్బిలి నందన్ డా. కందికొండ 45+ లక్షలు
2018 RTV బంజారా బంజారా పాట (బాపు వీరన్న కురవి వీరన్న) కళ్యాణ యాకూబ్ నాయక్ 42+ లక్షలు
2018 మైక్ టీవీ సమ్మక్క సారక్క మీనాక్షి భుజంగ్ డా. కందికొండ శిశిర 100+ లక్షలు
2018 మైక్ టీవీ సంక్రాంతి పాట బొబ్బిలి నందన్ డా. కందికొండ ర్యాపర్:మేఘ్-అహ్-వాట్(మేఘరాజ్) 22+ లక్షలు
2018 మ్యాంగో మ్యూజిక్ పార్వతి తనయుడవో (నీదీ నాదీ ఒకే కథ సినిమా) బొబ్బిలి సురేష్ డా. కందికొండ రంజని శివకుమార్ సిద్ధారెడ్డి, నరేష్,బొబ్బిలి సురేష్, శంకర్ బాబు 3+ లక్షలు
2017 మైక్ టీవీ తెలుగు మహాసభలు బతుకమ్మ పాట 2.5+ లక్షలు
2017 ఐ డ్రీమ్ బతుకమ్మ పాట పుల్లిగిళ్ళ ప్రమోద్ తైదల బాపు పుల్లిగిళ్ళ ప్రమోద్ 38+ లక్షలు
2017 తెలుగు వన్ ప్రత్యేక బతుకమ్మ పాట పోలం సత్య సాగర్ పోలం సత్య సాగర్ రాహుల్ సిప్లిగంజ్ 35+ లక్షలు
2017 మైక్ టీవీ బతుకమ్మ పాట బొబ్బిలి సురేష్ మిట్టపల్లి సురేందర్ సాకేత్ 300+ లక్షలు
2017 ఫ్యూచర్ ఫిల్స్మ్ అమ్మవా రాతిబొమ్మవా (జానపద గీతం) ముస్తఫా 110+ లక్షలు
2017 మైక్ టీవీ రేలా రే రేలా రే బొబ్బిలి నందన్ డా. కందికొండ లిప్సిక 160+ లక్షలు

సినిమా పాటలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాట(లు) భాష స్వరకర్త(లు) రచయిత(లు) సహ ఆర్టిస్ట్(లు)
2018 శైలజారెడ్డి అల్లుడు "శైలజా రెడ్డి అల్లుడు చూడండి" తెలుగు గోపీ సుందర్ కాసర్ల శ్యామ్
నీది నాదీ ఒకే కథ "పార్వతి తనయుడవో" సురేష్ బొబ్బిలి డా.కందికొండ రంజని శివకుమార్ సిద్దారెడ్డి, నరేష్, సురేష్ బొబ్బిలి, శంకర్ బాబు
2019 జార్జ్ రెడ్డి "వాడు నడిపే బండి" సురేష్ బొబ్బిలి మిట్టపల్లి సురేందర్
2020 అలా వైకుంఠపురములో "రాములో రాములా" ఎస్ఎస్ థమన్ కాసర్ల శ్యామ్ అనురాగ్ కులకర్ణి
నాగ భైరవి "రావే భైరవి" గోపీ సుందర్ రామజోగయ్య శాస్త్రి
2021 ఏ 1 ఎక్స్‌ప్రెస్ "సీటు సిరగడ" హిప్హాప్ తమిజా హిప్హాప్ తమిజా, వంశీ వికాస్ హిప్ హాప్ తమిజా, ప్రణవ్ చాగంటి
సీటీమార్ "జ్వాలా రెడ్డి" మణి శర్మ కాసర్ల శ్యామ్ శంకర్ బాబు
లవ్ స్టోరీ "సారంగ దరియా" పవన్ సి సుద్దాల అశోక్ తేజ [1]
రంగ్ దే "ఊరంతా" దేవి శ్రీ ప్రసాద్ శ్రీ మణి
రాబర్ట్ (D) "కన్నె అదిరింది" అర్జున్ జన్య కాసర్ల శ్యామ్
రాధా కృష్ణ "నిర్మలా బొమ్మ" ఎం.ఎం.శ్రీలేఖ సుద్దాల అశోక్ తేజ
అల్లుడు అదుర్స్ "రంబా ఊర్వసి మేనక" దేవి శ్రీ ప్రసాద్ శ్రీ మణి వేదాల హేమచంద్ర
క్రాక్ "భూమ్ బద్దాల్" ఎస్ఎస్ థమన్ శ్రీ మణి సింహా, శ్రీ కృష్ణుడు
జెట్టీ "జిల్ జిల్" కార్తీక్ కొండకండ్ల కాసర్ల శ్యామ్ కార్తీక్ కొండకండ్ల, వినాయక్, వెంకీ
గల్లీ రౌడీ "చాంగురే ఐటమ్ సాంగ్రీ" సాయి కార్తీక్ భాస్కరభట్ల సాయి కార్తీక్, దత్తు
పెళ్లి సందడి "బుజ్జులుబుజ్జులు" ఎంఎం కీరవాణి చంద్రబోస్ బాబా సెహగల్
ఏక్ లవ్ యా "యెన్నెగు హెన్నిగు" కన్నడ అర్జున్ జన్య ప్రేమ్ కైలాష్ ఖేర్
పుష్ప: ది రైజ్ (డి) "ఊ అంతియా ఊ ఊ అంతియా" దేవి శ్రీ ప్రసాద్ వరదరాజ్ చిక్కబళ్లాపుర
2022 రౌడీ బాయ్స్ "బృందావనం" తెలుగు దేవి శ్రీ ప్రసాద్ సుద్దాల అశోక్ తేజ కోరస్ (దీప్తి సురేష్, అభినయ షెన్‌బగరాజ్, పద్మజ శ్రీనివాసన్, అపర్ణ హరికుమార్)
గోల్​మాల్ తమిళం అరుల్దేవ్ వివేకా
హీరో "బుర్ర పాడవుతాదే" తెలుగు జిబ్రాన్ భాస్కరభట్ల అనురాగ్ కులకర్ణి
సెహరి "వరుణ్ జీవితం" ప్రశాంత్ ఆర్ విహారి ప్రణవ్ చాగంటి ప్రణవ్ చాగంటి
10వ తరగతి డైరీలు "యెన్నెనో అందాల బంగారు చిలుక" సురేష్ బొబ్బిలి చైతన్య ప్రసాద్
విక్రాంత్ రోనా (డి) "రా రా రక్కమ్మా" బి. అజనీష్ లోక్‌నాథ్ రామజోగయ్య శాస్త్రి నకాష్ అజీజ్
ట్రిపుల్ రైడింగ్ "యట్టా యట్టా" కన్నడ సాయి కార్తీక్ చందన్ శెట్టి చందన్ శెట్టి
దిల్పసంద్ "రామ రామ రామ" కన్నడ అర్జున్ జన్య చేతన్ కుమార్
శివ ౧౪౩ "నాంతక్ బా" కన్నడ అర్జున్ జన్య అనిల్ కుమార్ అనిరుద్ధ శాస్త్రి, సంతోష్ వెంకీ, చేతన్ నాయక్
ధమాకా "జింతాక్" తెలుగు భీమ్స్ సిసిరోలియో కాసర్ల శ్యామ్ భీమ్స్ సిసిరోలియో
"దండకడియాల్" భీమ్స్ సిసిరోలియో భీమ్స్ సిసిరోలియో, సాహితీ చాగంటి
వేద "గిల్లకో శివ" కన్నడ అర్జున్ జన్య వి.నాగేంద్ర ప్రసాద్
లైక్ చేయండి, షేర్ చేయండి & సబ్‌స్క్రైబ్ చేయండి "ఏమంతి నబయా" తెలుగు ప్రవీణ్ లక్కరాజు పెంచల్ దాస్ కోరస్ (అరుణ్ కౌండిన్య, శివ కుమార్, లోకేశ్వర నాదస్వరం: మాంబలం శివకుమార్)
2023 మైఖేల్ "పమ్మరే" తెలుగు చంద్రబోస్ సామ్ సిఎస్
బలగం "ఊరు పల్లెటూరు" తెలుగు భీమ్స్ సిసిరోలియో కాసర్ల శ్యామ్ రామ్ మిరియాల
దాస్ కా ధమ్కీ "ఓ డాలర్ పిల్లగా" తెలుగు లియోన్ జేమ్స్ పూర్ణాచారి దీపక్ బ్లూ
భోలా శంకర్ "జం జం జజ్జనక" తెలుగు మహతి స్వర సాగర్ కాసర్ల శ్యామ్ అనురాగ్ కులకర్ణి
జవాన్ "జిందా బందా" హిందీ అనిరుధ్ రవిచందర్ ఇర్షాద్ కమిల్, వసీం బరేల్వి అనిరుధ్ రవిచందర్
"వంద ఎడమ" "దుమ్మే ధూళిపేలా" తమిళ తెలుగు వివేక్ చంద్రబోస్
తెప్ప సముద్రం[8] "యాడున్నాడో" తెలుగు పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్) పూర్ణ చారి
2024 జితేందర్ రెడ్డి లచ్చిమక్క[9] తెలుగు గోపీ సుందర్ గోసాల రాంబాబు
మెకానిక్ రాకీ గుల్లెడు గుల్లెడు[10] జేక్స్ బిజోయ్ సుద్దాల అశోక్ తేజ

పురస్కారాలు

[మార్చు]
  1. తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2020 మార్చి 8.[11]
  2. సంగీత నాటక అకాడమి ఆమెను ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారంతో 2024 నవంబరు 24న సత్కరించింది.

మూలాలు

[మార్చు]
  1. 10TV (10 December 2021). "సమంత ఐటమ్ సాంగ్ పాడిన మంగ్లీ చెల్లెలు.. ఆమె గురించి తెలుసా..? most awaited song of the year pushpa samtha item song sung by folk singer mangli sister indravathi chouhan" (in telugu). Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. ఈనాడు, ప్రధానాంశాలు (8 March 2020). "30 మంది మహిళలకు పురస్కారాలు". Archived from the original on 8 March 2020. Retrieved 9 March 2020.
  3. TV9 Telugu (22 November 2022). "సింగర్ మంగ్లీకి అరుదైన గౌరవం.. ఎస్‌వీబీసీ ఛానెల్ సలహాదారుగా నియామకం." Archived from the original on 22 November 2022. Retrieved 22 November 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Zee News Telugu (21 November 2022). "మంగ్లీకి అరుదైన గౌరవం.. దశ మార్చేసిన 'జగనన్న' సాంగ్!". Archived from the original on 22 November 2022. Retrieved 22 November 2022.
  5. "Singer Mangli: సింగర్ మంగ్లీకి అరుదైన గౌరవం | Sensational Singer Mangli gets rare honor in Delhi avm". web.archive.org. 2024-11-25. Archived from the original on 2024-11-25. Retrieved 2024-11-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. ఈనాడు, సినిమా (4 March 2020). "ఆ పాట తర్వాతే తొలి సారి ఫ్లైట్‌ ఎక్కాను." www.eenadu.net. Archived from the original on 9 March 2020. Retrieved 9 March 2020.
  7. "మంగ్లీ". ఈనాడు ఆదివారం 19, జనవరి. 2020.
  8. 10TV Telugu (20 September 2023). "'తెప్ప సముద్రం' సినిమా నుంచి.. మంగ్లీ పాడిన పాట విడుదల." (in Telugu). Archived from the original on 21 September 2023. Retrieved 21 September 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  9. Chitrajyothy (18 April 2024). "'జితేందర్ రెడ్డి' ఇంట్లో పెళ్ళి.. మంగ్లీ పాట పాడితే ఎట్టుండాల! | Lachhimakka Song From Jithender Reddy Movie Out KBK". Archived from the original on 18 April 2024. Retrieved 18 April 2024.
  10. NT News (7 August 2024). "మంగ్లీ మ్యాజికల్ వాయిస్‌.. విశ్వక్‌సేన్ మెకానిక్‌ రాకీ గుల్లెడు గుల్లెడు సాంగ్ ప్రోమో". Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.
  11. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 March 2020). "ఉమెన్‌ సేఫ్టీ స్టేట్‌ తెలంగాణ : మంత్రులు". Archived from the original on 9 March 2020. Retrieved 9 March 2020.