పిరుదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిరుదులు
మానవ స్త్రీ పిరుదులు.
ధమని superior gluteal artery, inferior gluteal artery
నాడి superior gluteal nerve, inferior gluteal nerve, cluneal nerves
MeSH Buttocks

శ్రోణి, పిర్రలు లేదా పిరుదులు (ఆంగ్లం: Buttocks) కాలికి పైన ముడ్డి వెనుక భాగంలో ఎత్తుగా ఉండే దిండ్లు లాంటి భాగములు. అనేక సంస్కృతులలో, పిర్రలు లైంగిక ఆకర్షణలో పాత్ర పోషిస్తాయి. దానినే గుద మైథునం అంటారు.

భాషా విశేషాలు[మార్చు]

తెలుగు భాషలో పిరుదు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] పిరు (పిరుదు) n. The back part or side. వెనుకప్రక్క, వెనుక, పశ్చాద్భాగము. adv. Behind, back. "నరుకుడు ననవుడు, పిరుసనకతడు." పిరుసనక without going back. పిరుండు లేదా పిరుడు అనగా The back side, the loins, వెనుకటిభాగము. Back, behind, వెనుక. "మాది పిరుంది దారంబు లీల." పిరుందికడ adv. Behind, at the back of, after, following. దాని పిరుందన్ at her heels. పిరుదుకొను v. a. అనగా To follow, వెంబడించు. పిరుతీయు, పిరుతివియు or పిరుతివుచు v. n. To draw back, shrink back, retreat. వెనుదీయు, పరాఙ్మంఖమగు. పిరుపడు, పిరుపోవు or పిరుచను v. n. To go back, to retreat, వెనుదీయు. To be afraid, భయపడు. పిరువెట్టు v. a. To slight, disregard. అనాదరించు.

నిర్మాణము[మార్చు]

పిరుదులు బలమైన గ్లుటియల్ కండరాలు (Gluteal muscles) (గ్లుటియస్ మాగ్జిమస్, గ్లుటియస్ మీడియస్, గ్లుటియస్ మినిమస్) వానిపై క్రొవ్వు పొరతో కప్పబడివుంటాయి. పైభాగం శ్రోణిఫలకంలో కలిసిపోగా క్రిందిభాగం గ్లుటియల్ మడతతో అంతమౌతుంది.

ప్రైమేట్స్ లో పిరుదుల మూలంగానే ఇతర జంవుతులవలె నాలుగు కాళ్ళమీద కాకుండా కూర్చొనడానికి తద్వారా శరీర భారాన్ని మోయడానికి అవకాశం కల్పించాయి. మానవ పురుషులలో కన్నా స్త్రీలలో పిరుదులు వెడల్పుగా, మందంగా, బలంగా ఉండి ఎక్కువ కొవ్వును కలిగివుంటాయి. ఆడ బబూన్ లలో పిరుదులు ఎరుపురంగులో ఉండి మగజీవులను ఆకర్షిస్తాయి.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పిరుదు&oldid=3945442" నుండి వెలికితీశారు