Jump to content

ఆల్ ఇండియా గణతంత్ర పరిషత్

వికీపీడియా నుండి
ఆల్ ఇండియా గణతంత్ర పరిషత్
Chairpersonరాజేంద్ర నారాయణ్ సింగ్ డియో
స్థాపన తేదీఅక్టోబరు 1950; 74 సంవత్సరాల క్రితం (1950-10)
రద్దైన తేదీ1962; 62 సంవత్సరాల క్రితం (1962)
రంగు(లు)  మెజెంటా
ECI Statusరద్దైన పార్టీ

ఆల్ ఇండియా గణతంత్ర పరిషత్ (అఖిల భారత గణతంత్ర పరిషత్, గణతంత్ర పరిషత్) అనేది 1950 నుండి 1962 వరకు తూర్పు భారతదేశంలోని ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ. పూర్వపు సంస్థానాల మాజీ పాలకులు, పెద్ద భూస్వాములచే 1950లో ఈ రాజకీయ పార్టీ స్థాపించబడింది.[1] రాజేంద్ర నారాయణ్ సింగ్ డియో దీనికి అధ్యక్షుడయ్యాడు. 1962లో పార్లమెంటరీ ఎన్నికల తరువాత, ఈ రాజకీయ పార్టీ స్వతంత్ర పార్టీలోని ఒరిస్సా యూనిట్‌లో విలీనం చేయబడింది.[2]

నేపథ్యం

[మార్చు]

ఈ పార్టీ మూలాలను సంబల్‌పూర్‌లో ప్రధాన కార్యాలయంతో 1948 అక్టోబరులో స్థాపించబడిన కోశల్ ఉత్కల్ ప్రజా పరిషత్[3] లో గుర్తించవచ్చు. ప్రజా పరిషత్ మొదటి సమావేశం 1948 అక్టోబరు 8, 9, 10 తేదీలలో సంబల్‌పూర్‌లోని బలిబంధలో జరిగింది. 1950 అక్టోబరులో బోలంగీర్‌లో జరిగిన ప్రజా పరిషత్ వార్షిక సమావేశంలో అది గణతంత్ర పరిషత్ అనే పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది.[4]

ఎన్నికల్లో పోటీ

[మార్చు]

1951లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో ఈ పార్టీ మొత్తం ఓట్లలో 0.91%, లోక్‌సభలో 6 స్థానాలను గెలుచుకుంది.[5] 1952లో ఒరిస్సా శాసనసభకు జరిగిన మొదటి సాధారణ ఎన్నికలలో పార్టీ మొత్తం ఓట్లలో 20.5% ఓట్లు, శాసనసభలో 31 సీట్లు పొందింది.[6] దాని నాయకుడు శ్రద్ధాకర్ సుపాకర్ ప్రతిపక్ష నాయకుడయ్యాడు.[7] 1957లో ఒరిస్సా శాసనసభకు జరిగిన రెండవ సాధారణ ఎన్నికలలో, మొత్తం ఓట్లలో 28.74% ఓట్లు, శాసనసభలో 51 స్థానాలను పొందింది.[8] దాని నాయకుడు రాజేంద్ర నారాయణ్ సింగ్ డియో ప్రతిపక్ష నాయకుడయ్యాడు. మైనారిటీ కాంగ్రెస్ ప్రభుత్వం పతనం తర్వాత 1959, మే 22న కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాజేంద్ర నారాయణ్ సింగ్ డియో దాని ఆర్థిక మంత్రి అయ్యాడు. 1961 ఫిబ్రవరి 21న సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి రాష్ట్రపతి పాలన విధించబడింది.[7] 1961లో ఒరిస్సా శాసనసభకు జరిగిన మూడవ సాధారణ ఎన్నికలలో, మొత్తం ఓట్లలో 22.34%, శాసనసభలో 37 స్థానాలను పొందింది.[9] రాజేంద్ర నారాయణ్ సింగ్ డియో మళ్లీ ప్రతిపక్ష నాయకుడయ్యాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. Chandra, Bipan and others (2000). India after Independence: 1947-2000, New Delhi, Penguin Books, ISBN 0-14-027825-7, pp.135,216
  2. "Patna (Princely State)". Archived from the original on 22 May 2009. Retrieved 20 May 2010.
  3. Sethy, Rabindra Kumar (2003). Political Crisis and President's Rule in An Indian State. New Delhi: A.P.H. Publishing Corporation. p. 118. ISBN 81-7648-463-6.
  4. Sharma, Sadhna (1995). State Politics in India. New Delhi: Mittal Publications. pp. 276–7. ISBN 81-7099-619-8.
  5. "Statistical Report on General Elections, 1951 to the First Lok Sabha, Volume I" (PDF). Election Commission of India website. p. 50. Archived from the original (PDF) on 8 October 2014. Retrieved 21 May 2010.
  6. "Statistical Report on General Election, 1951 to the Legislative Assembly of Orissa" (PDF). Election Commission of India website. p. 8. Retrieved 21 May 2010.
  7. 7.0 7.1 7.2 "Brief History of Orissa Legislative Assembly Since 1937". Orissa Legislative Assembly website. Archived from the original on 9 January 2007. Retrieved 21 May 2010.
  8. "Statistical Report on General Election, 1957 to the Legislative Assembly of Orissa" (PDF). Election Commission of India website. p. 8. Retrieved 21 May 2010.
  9. "Statistical Report on General Election, 1961 to the Legislative Assembly of Orissa" (PDF). Election Commission of India website. p. 8. Retrieved 21 May 2010.