చైత్రమాసము
Appearance
(చైత్రము నుండి దారిమార్పు చెందింది)
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
చైత్ర మాసము తెలుగు సంవత్సరంలో మొదటి నెల. పౌర్ణమి రోజున చిత్త నక్షత్రము (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల చైత్రము. ఇంగ్లీషు క్యాలెండరు ప్రకారం సాధారణంగా మార్చి-ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఈ నెలతో దక్షిణ భారతదేశంలో వసంత ఋతువు ప్రారంభం కావడం వల్ల ఈ ప్రాంతంలో చాలా చెట్లు కొత్తగా చిగురించడం, పూతపూయడం మొదలు పెడతాయి. ఇంకా ఈ ప్రాంతంలో చలికాలం ముగియడంతో వాతావరణం నులివెచ్చగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
విశేషాలు
[మార్చు]- చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రాత్రులు వసంత నవరాత్రాలుగా జరుపుకుంటారు.
- మధురకవి ఆళ్వారు తిరుక్కోలూరు అనే దివ్యదేశంలో చైత్రమాసంలో చిత్రా నక్షత్రములో ఒక బ్రాహ్మణ కుటుంబములో జన్మించారు.
- 1608 : చైత్ర శుద్ధ నవమి (శ్రీరామ నవమి) రోజు సమర్ద రామదాసు జన్మించారు.
- సా.శ. 1897 : హేవిలంబి సంవత్సరంలో తిరుపతి వేంకట కవులు గుంటూరులో అవధానము జరిపారు.[1]
చైత్రము పండుగలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 67. Retrieved 27 June 2016.[permanent dead link]