Jump to content

తెలంగాణ రాజకీయాలు

వికీపీడియా నుండి

తెలంగాణ, 2014 జూన్ 2న భారతదేశ 29వ రాష్ట్రంగా ఏర్పాటయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ భాగంగా ఉన్న తెలంగాణ, తెలంగాణ ఉద్యమంతో కొత్త రాష్ట్రంగా అవతరించింది. 2001 తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ శాసనసభలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

తెలంగాణ ఉద్యమం

[మార్చు]

తొలిదశ తెలంగాణ ఉద్యమంలో మర్రి చెన్నారెడ్డి, ఉద్యమ నాయకత్వంకోసం తెలంగాణ ప్రజాసమితి అనే పార్టీని ఏర్పాటుచేశారు. 1969 నవంబరులో, పార్టీలో చీలిక కారణంగా తెలంగాణ ఉద్యమం క్షీణించింది. రెండేళ్ళ తరువాత తెలంగాణ ప్రజాసమితి పార్టీని రద్దుచేసి మళ్ళీ కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు.[1]

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించాడు. 2009, 2009 నవంబరున కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ చంద్రశేఖర్ రావు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు.[2] దాంతో తెలంగాణవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వివిధ సంస్థలు ఉద్యమంలో పాల్గొన్నాయి.[3] సమ్మెల కారణంగా చాలా ఆర్థిక కార్యకలాపాలను నిలిచిపోయినందున, భారతీయ జనతా పార్టీ మద్దతుతో 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభ,[4] రాజ్యసభ[5] లలో తెలంగాణ బిల్లు ఆమోదించబడింది. 2014, మార్చి 4న భారత ప్రభుత్వం జూన్ 2ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా ప్రకటించింది.[6]

ఎన్నికలు

[మార్చు]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడటానికి కొంతకాలం ముందు 2014, ఏప్రిల్ 30న 2014 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరిగాయి. 2014, మే 16న వెలువడిన ఫలితాలలో తెలంగాణా రాష్ట్ర సమితి తెలంగాణలో మొత్తం మెజారిటీ సాధించడంతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2014, జూన్ 2న తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 2018 డిసెంబరు 7న జరిగిన 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఘనవిజయం సాధించి, డిసెంబరు 13న కేసీఆర్ ముఖ్యమంత్రిగా రెండవసారి పదవీబాధ్యతలు చేపట్టాడు.

భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండగా, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్, భారతీయ జనతా పార్టీ మొదలైనవి ఉన్నాయి.

ప్రధాన రాజకీయ పార్టీలు

[మార్చు]

ఇతర రాజకీయ పార్టీలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "APonline - History and Culture - History-Post-Independence Era". aponline.gov.in. Archived from the original on 20 December 2013. Retrieved 21 January 2022.
  2. "KCR to launch fast on Nov. 29". The Hindu. India. 17 November 2009. Archived from the original on 21 November 2009. Retrieved 21 January 2022.
  3. "OU turns hotspot of students' angst". The Hindu. India. 3 December 2009. Archived from the original on 6 December 2009. Retrieved 21 January 2022.
  4. "Telangana bill passed in Lok Sabha; Congress, BJP come together in favour of new state". Hindustan Times. Archived from the original on 18 February 2014. Retrieved 21 January 2022.
  5. "Rajya Sabha passes Telangana bill". Hindustan Times. Archived from the original on 21 February 2014. Retrieved 21 January 2022.
  6. "Notification" (PDF). The Gazette of India. Government of India. 4 March 2014. Retrieved 21 January 2022.