Jump to content

దక్షిణ కొరియా

వికీపీడియా నుండి
대한민국
大韓民國
దేహన్ మింగుక్
కొరియా గణతంత్రం
Flag of దక్షిణ కొరియా - South Korea దక్షిణ కొరియా - South Korea యొక్క Coat of arms
జాతీయగీతం
Aegukga (애국가; 愛國歌)
Patriotic Hymn
దక్షిణ కొరియా - South Korea యొక్క స్థానం
దక్షిణ కొరియా - South Korea యొక్క స్థానం
రాజధాని
అతి పెద్ద నగరం
సియోల్
37°35′N 127°0′E / 37.583°N 127.000°E / 37.583; 127.000
అధికార భాషలు కొరియన్
ప్రభుత్వం Presidential రిపబ్లిక్
 -  President Moon Jae-in
 -  Prime Minister Kim Boo-kyum
Establishment
 -  Liberation declared మార్చి 1 1919 (de jure
 -  Liberation ఆగస్టు 15 1945 
 -  First Republic ఆగస్టు 131948 
 -  ఐక్యరాజ్యసమితి గుర్తింపు డిసెంబరు 12 1948 
విస్తీర్ణం
 -  మొత్తం 99,646 కి.మీ² (108వ)
38,492 చ.మై 
 -  జలాలు (%) 0.3
జనాభా
 -  February 2007 అంచనా 49,024,737 (25వ)
 -  జన సాంద్రత 480 /కి.మీ² (19వ)
1,274 /చ.మై
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం $1.196 trillion[1] (11th)
 -  తలసరి $24,500 (34వ)
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) Increase 0.912 (high) (26th)
కరెన్సీ South Korean won (KRW)
కాలాంశం Korea Standard Time (UTC+9)
 -  వేసవి (DST) not observed (UTC+9)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ en:.kr
కాలింగ్ కోడ్ +82
1 Cell phone system CDMA
2 Domestic power supply 220V/60 Hz, CEE 7/7 sockets

దక్షిణ కొరియాను అధికారికంగా కొరియా గణతంత్రం[2] అంటారు. కొరియన్ ద్వీపకల్ప దక్షిణ ప్రాంతంలో ఉన్న సౌత్ కొరియా సార్వభౌమాధికారం కలిగిన దేశం. కొరియా అనే పేరు గొరియో అనే పదము నుండి వచ్చింది. గొరియా మధ్య యుగంలో ఈ ప్రాంతాన్ని పాలించిన ఒక సామ్రాజ్యం. దక్షిణ కొరియా పడమర భాగంలో చైనా, తూర్పున జపాన్, ఉత్తరంలో ఉత్తర కొరియా ఉన్నాయి. దక్షిణ కొరియా ఉత్తర సమశీతోష్ణ మండలంలో ప్రధానంగా పర్వతాలతో నిండి ఉంది. దక్షిణ కొరియా వైశాల్యం 99,392 చదరపు కిలోమీటర్లు, జనసంఖ్య 5 కోట్లు, రాజధాని, అతి పెద్ద నగరం సియోల్. సియోల్ నగర జనాభా 98 లక్షలు.

పురాతత్వ పరిశోధకులు కొరియన్ ద్వీపపకల్పంలో దిగువ రాతియుగ కాలం నుండి మానవులు నివసించడం ఆరంభమైనదని భావిస్తున్నారు. క్రీ.ఫూ 2333 లో కొరియా ద్వీపకల్పాన్ని దన్-గన్ల చేత కనిపెట్టబడడంతో కొరియా చరిత్ర ఆరంభం అయింది. సా.శ. 668 లో కొరియాలోని 3 రాజ్యాలను సమైక్య సిల్లా సామ్రాజ్యంగా మార్చబడిన తరువాత గొరియో సామ్రాజ్యంగా (918-1392) వరకు పాలించబడింది. తరువాత జోసియన్ సామ్రాజ్యంగా (1392-1910) పరిపాలించబడింది. 1910లో ఇది జపాన్ సామ్రాజ్యంతో చేర్చబడింది. రెండవప్రపంచ యుద్ధానంతరం 1948లో కొరియా సోవియట్ భూభాగం, యు.ఎస్ భూభాగంగా విభజించబడింది. ఐక్యరాజ్యసమితి కొరియా రిపబ్లిక్‌ మాత్రమే చట్టబద్ధమైన దేశం అని ప్రకటించినప్పటికీ సోవియట్ రష్యా ప్రతీకారంగా ఉత్తరకొరియాలో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసింది.

1950లో ఉత్తర కొరియా సేనలు దక్షిణ కొరియాలో ప్రవేశించడంతో కొరియన్ యుద్ధం ఆరంభం అయింది. యు.ఎస్, చైనా, సోవియట్, ఇతరదేశాల జోక్యంతో మూడు సంవత్సరాల కాలం సాగిన యుద్ధం ముగింపుకు వచ్చింది. ఇరు కొరియా దేశాల నడుమ నిర్మించబడిన కోటలు ప్రపంచంలోనే అత్యధిక బలమైనవని భావించబడుతున్నాయి. తరువాత దశాబ్దాలలో దక్షిణ కొరియా ఆర్థికంగా గుర్తించతగినంతగా అభివృద్ధి చెందింది. తరువాత దక్షిణ కొరియా ఆర్థికవ్యవస్థ ప్రపంచలో ప్రధానమైనదిగా మారింది. 1987లో ప్రజాప్రభుత్వం స్థానంలో సైనికపాలన చోటుచేసుకుంది. ప్రస్తుతం దక్షిణ కొరియా తుపాకి నియంత్రిత చట్టాలను అమలు చేస్తుంది. అందువలన దక్షిణ కొరియాలో ప్రజలు అతితక్కువ తుపాకీ అనుమతులను కలిగి ఉన్నారు.

దక్షిణ కొరయాలో అధ్యక్షపాలనా విధానం అనుసరించబడుతుంది. దక్షిణ కొరియా ప్రజల జీవనప్రమాణం అత్యున్నత స్థాయిలో ఉంది. తైవాన్ఆసియాలో ఆసియాలో నాగవస్థానంలో ఉంది. ఆర్థికంగా తైవాన్ ఆసియాలో నాలుగవ స్థానంలో ఉంది. అలాగే ప్రపంచన్లో 15 వ స్థానంలో ఉంది. తైవాన్ కొనుగోలుశక్తి ప్రపంచంలో 12 వ స్థానంలో ఉంది. ఎగుమతులు, ఎలెక్ట్రానిక్ ఉత్పత్తులు, ఆటోమొబైల్స్, నౌకలు, యంత్రాలు, పెట్రోలియం రసాయనాలు, రోబోటిక్ ఉత్పత్తులు, ఎగుమతులు ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

విభజనకు ముందు

[మార్చు]

కొరియా పురాణాలను అనుసరించి క్రీ.పూ 2333 లో దన్‌గన్‌లు కోసియన్ సామ్రాజ్య స్థపించడంతో కొరియా చరిత్ర ఆరంభం అయిందని తెలుస్తుంది. అయితే కోసియన్‌కు బదులు గోజోసియన్ అనే పదాన్ని వాడుతుంటారు. సా.శ. 14 వ శతాబ్దంలో మరొక సామ్రాజ్యం స్థాపించబడడమే ఇందుకు కారణం. వారి భాషలో గో - అంటే పూర్వము, ముందు, పాత అని అర్ధం. గొజోసియన్ సామ్రాజ్యం విస్తరిస్తూ ఉత్తర కొరియా ద్వీపకల్పం, మంగోలియన్ సామ్రాజ్యంలో కొంత భాగం తనలో కలుపుకున్నది. చైనా హాన్ సామ్రాజ్యంతో అనేక పోరాటాలు జరిగిన తరువాత పతనమై వాటి స్థానంలో 3 స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించడంతో కొరియా చరిత్ర మొదలైంది.

సామాన్య శకంలో బైయో, డాంగీ, సంహాన్ సమాఖ్య ఈ ద్వీపకల్పం, దక్షిణ మంచూరియాలను ఆక్రమించింది. గోగురియో, బేక్‌జె,, సిల్లా వంటి నినిధ భూభాగాలు ద్వీపకలల్పాన్ని స్వాధీనం చేసుకొని మూడు కొరియన్ రాజ్యాలుగా అభివృద్ధి అయ్యాయి. మూడు రాజ్యాలను సిల్లా సమైక్యత తరువాత ద్వీపకల్పం ఉత్తర దక్షిణ భూభాగాల గుర్తించబడింది. కొరియా ద్వీపకల్పం లోని అత్యధిక భాగం సిల్లా ఆధిపత్యంలో ఉండగా బాల్హీ గోగురియో యత్తరభాగాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు.

సమైక్య సిల్లా సామ్రాజ్యంలో కవిత్వం, లలితకళలు ప్రోత్సహించబడ్డాయి. ఈ కాలంలో కొరియా, చైనాల మధ్య ప్రశాంతవాతావరణం నెలకొన్నది. అయినప్పటికీ అంతర్గత ఘర్షణ కారణంగా సిల్లా సామ్రాజ్యం బలహీనపడింది. సిల్లా సామ్రాజ్యం క్రీ.పూ 935 లో గొరియో ఆక్రమణకు గురైంది. ఉతారదిశలో పొరుగున ఉన్న బాల్హే గొగరియో పాలకుడిగా వచ్చాడు.ఆయన పాలనా కాలంలో మంచూరియాలోని అత్యధిక భాగం, సుదూర రష్యా తూపు భూభాగం ఆయన నియంత్రణలో ఉండేది. క్రీ.పూ 926 నాటికి గొగరియా సామ్రాజ్యం కైతాన్ దాడొతో పతనం అయింది. 926 లో గొరియో సామ్రాజ్యానికి చెందిన చక్రవర్తి టాయిజో ద్వీపకల్పానిని సమైక్యపరిచాడు. గొరియోలో ఉన్నత సంస్కృతి వర్ధిల్లింది. సా.శ. 1377 నాటికి ప్రపచంలో మొదటి అచ్చుయంత్రం తయారు చేయబడింది. లోహంతో తయారు చేయబడిన ఈ అచ్చుయంత్రం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించగలిగినది. 13వ శతాబ్దంలో మంగోలియన్లు గొరియో సామ్రాజ్యానిని బలహీనపరిచారు. తరువాత 13 సంవత్సరాల నిరంతర వరుస యుద్ధాల తరువాత గొరియా మంగోలియన్ల సామాంతరాజ్యంగా కొరియాద్వీపకల్పంలో పాలన కొనసాగించింది. మంగోలియన్ సామ్రాజ్యపతనం తరువాత పలు అంతర్ఘత ఘర్షణల తరువాత జరరల్ యీ సియాంగై తిరుగుబాటు అనంతరం 1392లో జోసియన్ సామ్రాజ్యం ఆవిర్భవించింది.

టాయిజో కొరియా ద్వీపకల్పానికి జోసియన్ అని నామకరణం చేసి రాజద్ధానిని హాన్‌సెంగ్ నగరానికి మార్చాడు. తరువాత 200 సంవత్సరాల కాలం జోసియన్ సామ్రాజ్యం ప్రశాంతంగా కొనసాగింది. సెజోంగ్ చక్రవర్తి 15వ శతాబ్దంలో హాంగుల్ లిపిని రూపొందుంచాడు.దేశంలో కంఫ్యూజియనిజం ప్రభావవంతం అయింది. 1592-1598 మధ్య కాలంలో జపాన్ కొరియా మీద దజ్ండయాత్ర చేసింది. టయోటోమీ హైడియోషి నాయకత్వంలో దాడిచేసిన జపాన్ సైన్యాలను చైనాకు చెందిన మింగ్‌శాంగ్ సామ్రాజ్య సైనిక దళాల మద్దతుతో కొరియా సైన్యాలు అడ్డగించాయి. జాపాన్ సాగించిన వరుస దాడులు విజయవంతంగా సాగినా చివరకు యుద్ధం నిలిపి శాంతి ఒప్పందం మీద సంతకం చేయవలసిన నిర్బందానికి లోంనైంది. చివరకు చైనాకు చెందిన మింగ్‌శాంగ్ సామ్రాజ్యంతో శాతి ఒప్పందంతో యుద్ధం ముగింపుకు వచ్చింది. ఈ యుద్ధంలో అడ్మిరల్ యీ సన్-సిన్, ప్రఖ్యాత టర్టిల్ షిప్ ఖ్యాతిని వెలిగులోకి తీసుకు వచ్చింది. 1620-1630 జోసియన్ మంచూ దాడులతో బాధపడింది. మంచూరియా వరుస దాడుల అనంతరం జోదియన్ సామ్రాజ్యంలో 200 సంవత్సరాలకాల శాంతి కొనసాగింది. యాంగ్జియో, జియాంగ్జో జోసియన్ సామ్రాజ్యంలో కొరియన్ శిల్పకళా వైభవం విల్లసిల్లడానికి కృషిచేసారు.

ఏమైనప్పటికీ జోసియన్ సంరాజ్యపు తరువాత కాలం విదేశీవ్యవహారాలు చైనవరకే పరిమితమై మిగిలిన ప్రపంచంతో ఒంటరిగా మిగిలి పోయింది. జోసియన్ సాంరాపు ఈ ఒంటరి తనం జోసొయన్ సామ్రాజ్యానికి " హెర్మిట్ కింగ్డం " అనే పేరు తీసుకువచ్చింది. జోసియన్ సామ్రాజ్యం చేసిన ప్రయత్నాల కారణంగా పాశ్చాత్యదేశాల సామ్రాజ్యవిధానం నుండి జోసియన్‌ను రక్షించినా స్వేచ్ఛా విఫణి విధానం అవలభించవలసిన వత్తిడి నుండి మాత్రం జోసియన్ సంరాజ్యం తప్పించుకోలేక పోయింది. సినో జపాన్ యుద్ధం, రుస్సో జపాన్ యుద్ధానంతరం జోసియన్ సామ్రాజ్యం జపను వశమైది. (1910-1945). రెండవప్రపంచ యుద్ధానంతరం లొంగుబాటు తరువాత జపాన్ జోసియన్ సంరాజ్యాన్ని అమెరికా సోవియట్ లకు స్వాధీనం చేసింది. అప్పటికే ఉత్తర కొరియా సోవియట్ ఆధీనంలోను దక్షిణ కొరియా అమెరికా స్వాధీనంలోను ఉంది.

విభజన తరువాత.

[మార్చు]

1943 లో క్లైరో డిక్లరేషన్ ద్వారా సమైక్య కొరియా ఆరంభ ప్రణాళికను వెలుపరచినప్పటికీ సన్యుక్తరాష్ట్రాలు, సోవివియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అధికమౌతున్న కారణంగా చివరకు రెండు దేశాల ప్రభుత్వాల స్థాపన చేయవలసిన పరిస్థితి ఎదురైంది. 1948 నాటికి రెండు దేశాలకు వారి వారి ప్రత్యేకగుర్తింపుతో కొరియాలో రెండు రాజకీయ శక్తులు ఉత్తర కొరియా, దక్షిణ కొరియాగా ఆవిర్భవించాయి. ఉత్తర కొరియాలో సోవియట్ యూనియన్ మద్దతుతో గత జపానీ వ్యతిరేక గొరిల్లా ఉద్యమకారుడైన కిమ్-ఇల్‌సంగ్ అధికారానికి వచ్చాడు. దక్షిణ కొరియాలో సంయుక్త రాష్ట్రాల ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఎన్నికలలో కొరియా రిపబ్లిక్ ప్రకటినబడింది. అలాగే దక్షుణ కొరియాలో సింగ్‌మన్ రీ ప్రథమ అధ్యక్షుడిగా ఎన్నికచేయబడ్డాడు. తరువాత డిసెంబరు మాసంలో ఐక్యరాజ్యసమితి సభలో దక్షిణ కొరియా కొరియాలోని ఏకైక చట్టబద్ఫ్హమైన రాజ్యంగా ప్రకటించబడింది. 1950 జూన్ 25 ఉత్తర కొరియా దక్షిణ కొరియా మీద దండయాత్రతో మొదటి ప్రవ్చన్న యుద్ధం అయిన కొరియన్ యుద్ధం ఆరంభం అయింది. ఆసమయంలో సోవియట్ యూనియన్‌ ఐక్యరాజ్యసమితిని భహిష్కరించింది. సోవియట్ యూనియన్ ఉత్తరకొరియా సైన్యాలతో కలిసి సమైక్య ఉత్తర కొరియా సైన్యం రూపుదిద్దుకున్నది. ఉత్తర కొరియాకు సోవియట్ యూనియన్, చైనా మద్దతు ఇచ్చింది. తరువాత ఉత్తర కొరియా సైన్యాలతో మిలియన్ల చైనా సైన్యం ఐక్యం అయింది. రెండు వైపులా బ్రహ్మాండ మైన సైనిక బలం చేరిన కారణంగా ఉత్తర, దక్షిణ కొరియాలలోని పౌరులకు యుద్ధంలో తారస్థాయిలో నష్టం వాటిల్లింది. చివరకు యుద్ధం స్థభించి పోయింది. 1953లో రెండు వైపులా సంతకాలు లేకుండా తాత్కాలిక సంధి ఏర్పడింది. ఇరుదేశాల సరిహద్దులలో సైన్యం వెనుకకు తీసుకొనబడినా రెండు దేశాలమధ్య ఉద్రిక్తత మాత్రం అలాగే ఉంది. ఈ యుద్ధంలో దాదాపు 12 లక్షల ప్రాణాలు కోల్పోయారు.

1960 లో విద్యార్థిఉద్యమం అధ్యక్షుడు సింగ్‌మన్ రాజీనామాకు దారితీసింది. దేశంలో కొంత కాలం రాజకీయ అస్థిరత చోటుచేసుకుంది. ఈ అస్థిరతతో బలహీనపడిన ప్రభుత్వం అశక్తతను ఆసరాగా తీసుకుని జనరల్ పార్క్ జంగ్- హీ సైనికచర్య తీసుకున్నాడు. తరువాత అధ్యక్షస్థానాన్ని అలంకరించిన పార్క్ 1979 లో హత్యచేబడే వరకు పాలన సాగించాడు. రాజకీయ అణిచివేతలు ఒకవైపు సాగుతున్నా ఎగుమతుల అవకాశాలు దేశం ఆర్థికరంగాన్ని అభివృద్ధి పధంలో నడిపించింది. జాలిలేని సైనిక్ డైరెక్టరుగా పార్క్ ఈ ఆర్థిక పరిణామాలను విమర్శింవినా ఆయన పాలనా కాలంలో ఆర్థికాభివృద్ధి మాత్రం గుర్తించతగినంతగా జరిగింది. ఆయన పాలనా కాలంలో ప్రభుత్వం దేశీయరహదారి ప్రణాళిక, సియోల్ భూగర్భ మార్గం, ఆర్థికాఅభివృద్ధికి తెరతీయబడింది.

పార్క్ హత్య కారణంగా కొరియాలో తిరిగి రాజకీయ అస్థిరత చోటుచేసుకుంది. రాజకీయ అస్థిరతను తప్పించడానికి ముందుగా అణిచివేతకు గురైన ప్రతిపక్ష నాయకులు అధ్యక్షస్థానాన్ని భర్తీచేయాలని కోరుకున్నారు. 1979 డిసెంబరు 20న జనరల్ చున్ డూ-హాన్ నాయకత్వంలో ఆక్రమణ జరిగింది. ఆక్రమణ తరువాత చున్ డూ-హాన్ అధికారం స్వాధీనం చేసుకున్నాడు. మే 17 న చున్ డూ-హాన్ దేశమంతా దేశంలో అప్పటివరకు అమలులోలేని మార్షల్ లా అమలుచేయమని మంత్రివర్గం మీద వత్తిడి చేసాడు. మార్షల్ లా సాయంతో విశ్వవిద్యాలయాలను మూసి వేయబడ్డాయి, రాజకీయ కాత్యక్రమాలు నిషేధించబడ్డాయి అలాగే ప్రచారమాధ్యమం నియంత్రించబడింది. చున్ డూ-హాన్ ఆధిపత్యం ఎదిరిస్తూ స్వాతంత్ర్యం కోరుతూ దేశమంతా తిరుగుబాటు చెలరేగింది. ప్రత్యేకంగా గ్వాంగ్‌జూలో ఉద్రికత తీవ్రమైనది. గ్వాంగ్‌జూలో తిరుగుబాటు అణిచివేయడానికి చున్ ప్రత్యేక సైనిక బృందాలను పంపాడు.

చున్ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రవేశపెట్టి 1987 వరకు అధ్యక్షపాలన సాగించాడు. జూన్ 10 న స్వాతంత్ర్యోద్యమంలో సియోల్ విశ్వవిద్యాలయ విద్యార్థిపార్క్ జంగ్-చుల్ మరణంతో దేశమంతటా స్వాతంత్ర్యోద్యమ మంటలు ఉవ్వేత్తున పైకి లేచాయి. తుదకు ది డెమొక్రటిక్ జస్టిస్ పార్టీ నాయకుడు రో టీ ఊ చేసిన ప్రకటనలో అధ్యక్ష ఎన్నికల ప్రతిపాదన చోటుచేకున్నది. రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకుల ( కిం డీ -జంగ్, కిం యంగ్ శాం ) నడుమ స్వల్ప ఆధిక్యంతో రో విజయం సాధించాడు.

1988 లో సియోల్ వేసవి ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. తరువాత 1996లో దక్షిణ కొరియా ఆ సంస్థ ఎకనమిక్ కో -అపరేషన్ డెవలెప్మెంట్‌ సభ్యదేశంగా మారింది. ఆసియన్ ఆర్థిక మాంద్యం దక్షిణ కొరియా ఆర్థికరంగం మీద కొంత ప్రతికూల ఫలితాలను చూపినప్పటికీ దేశం ఆర్థికాభివృద్ధి నిరంతరంగా కొనసాగింది. 2000 నాటికి అధ్యక్షుడు కిం డీఈ -జంగ్ " సన్ సైన్ పాలసీ " విధానం కారణంగా ఉత్తరకొరియా రాజధాని నగరమైన పియాంగ్‌యంగ్ లో నార్త్- సౌత్ సమ్మిట్ జరిగింది. తరువాత అదే సంవత్సరం కొరియాలో శాంతి స్థాపన, స్వాతంత్ర్య స్థాపన జరగడానికి కృషిచేసినందుకు నోబుల్ పీస్ ప్రైజ్ (నోబుల్ శాంతి బహుమతి ) అందుకున్నాడు. అయినప్పటికీ ఫలితం లేని ఈ శాంతి ప్రయత్నాలు ప్రజల అంగీకారాన్ని పొందని కారణంగా 2012 అధ్యక్ష ఎన్నికలలో మునుపటి సియోల్ మేయర్ కంసర్వేటివ్ పార్టీ సభ్యుడు పార్క్ గియన్-హే అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు.

2002 లో దక్షిణ కొరియా, జపాన్ సన్యుక్తంగా ఎఫ్.ఐ.ఎఫ్.ఎ వరల్డ్ కప్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చారు. అయినప్పటికీ లియాన్ కూర్ట్ మీద అధికారం విషయంలో దక్షిణ కొరియా, జపాన్ మధ్య ఘర్షణలు తలెత్తాయి. .

విదీశీసంబంధాలు

[మార్చు]

దక్షిణాసియా 188 దేశాలతో దౌత్యసంబంధాలను కలిగి ఉంది. ఉత్తర కొరియాతో సహా 1991 నుండి దక్షిణ కొరియాకు ఐక్యరాజ్య సమితి సభ్యత్వం ఉంది. 2007 జనవరి 1 దక్షిణ కొరియా విదేశాంగ మంత్రికి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ- జనరల్ పదవి లభించవచ్చని విశ్వసించారు. దక్షిణ కొరియా ఆసియన్ దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకొన్నది. ఆసియన్ సమ్మిటులో పాల్గొనడం, ఆసియన్ ప్లస్ త్రీకి పరిశీలనకు పంపడం వంటి కార్యక్రమాల ద్వారా సంబంధాలను మెరుగుపరచుకోవడంలో భాగమే. 2010లో దక్షిణ కొరియా, యురోపియన్ యూనియన్ స్వేచ్ఛా విఫణి ఒప్పందం మీద సంతకం చేసాయి. వాణిజ్య సరిహద్దులను తగ్గించడానికి దక్షిణ కొరియా కెనడా, న్యూజిలాండ్‌లతో ఒప్పందం చేసుకున్నది. 2009 లో ఒ.ఇ.సి.డి డెవలెప్మెంట్ అసిస్టెంస్ కమిటీ (ఆపత్సమయ సహాయక దేశాలు) తో చేతులు కలిపింది. దక్షిణ కొరియా జి-20 సమ్మిటుకు ఆతిథ్యం ఇచ్చింది.

యురోపియన్ యూనియన్

[మార్చు]

చారిత్రకంగా కొరియా చైనాతో సబంధాలను నిలిపివేసింది. దక్షిణ కొరియా రూపుద్దికొనడానికి ముందు జపాన్ ఆక్రమణ సమయంలో కొరియన్ స్వాతంత్ర్య పోరాటవీరులు చైనా సైనికులతో కలిసి పనిచేసారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత చైనా మావోఇజాన్ని ఆదరించిన తరువాత దక్షిణ కొరియా అమెరికాతో సంబంధాలను కోరుతూ చైనాతో సంబంధాలకు ముగింపు పలికింది. పి.ఆర్.సి కొరియన్ యుద్ధసమయంలో ఉత్తరకొరియాకు యుద్ధసామాగ్రి సరఫరా, మానవశక్తి సరఫరా ద్వారా సహకరించింది. తరువాత దక్షిణ కొరియా పి.ఆర్.సి ల మధ్య సబంధాలు పూర్తిగా మూసుకు పోయాయి. 1992 ఆగస్టు 24 న దక్షిణ కొరియా మైరియు చైనా దేశాలు తమ మధ్య ఉన్న నౌకా నిషేధం తొలగిస్తూ ఒప్పందం మీద సంతకం చేసాయి. రిపబ్లిక్ ఆఫ్ కొరియా పి.ఆర్.సి సంబంధాలను అభివృద్ధిచేసుకోవడానికి రిపబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్) తో ఉన్న అధికారిక సబంధాలను నిలిపివేసింది. పి.ఆర్.సి తైవాన్ సార్వభౌమత్వాన్ని అంగీకరించకపోవడమే ఇందుకు కారణం.

జపాన్

[మార్చు]

రెండవప్రపంచ యుద్ధం ముగింపుకు వచ్చే వరకు దక్షిణ కొరియా, జపాన్ మధ్య ఎటువంటి అధికారిక దౌత్యసంబంధాలు లేవు. రెండవ ప్రపంచయుద్ధం ముగిసిన తరువాత 1965లో దక్షిణ కొరియా జపాన్, రిపబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్) మధ్య దౌత్య సంబంధాలను స్థాపించడానికి జరిగిన ఒప్పందం మీద సంతకం చేసింది. పలు కొరియన్, జపాన్ వివాదాలు పరిష్కరించకుండా ఉన్నందున కొరియన్ ప్రజలలో జపాన్ వ్యతిరేకత అత్యధికంగా ఉంటూవచ్చాయి. వాటిలో అత్యధికం జపాన్ దురాక్రమణ, పాలనా సమయంలో ఆవిర్భవించాయి. రెండవప్రపంచ యుద్ధం సమయంలో 1,00,000 మంది కొరియన్లు జపాన్ వత్తిడితో బలవంతంగా జపాన్ సామ్రాజ్య సైన్యంలో పనిచేయవలసి వచ్చింది. కంఫర్ట్ వుమన్ పేరుతో కొరియన్ స్త్రీలు జపాన్ సైన్యానికి బానిసలుగా సేవలు చేయవలసిన పరిస్థితి ఎదురైంది.

జపానీయుల యుద్ధనేరాల వలన బాధించబడిన కొరియన్లు యుద్ధంలో మరణించిన యుద్ధవీరులను గౌరవించడానికి జపాన్ రాజకీయ నాయకులు కొరియాకు వచ్చిపోవడం అసహనానికి గురిచేసింది. రెండవప్రపంచ యుద్ధంలో జపానీయుల చర్యలను గురించిన విషయాలను అదనంగా చేర్చి జపానీ పాఠ్యపుస్తకాలు తిరగ వ్రాయబడడం, లియాన్ కోర్ట్ రాక్స్ భూవివాదాలు (జపాన్ అధికారిక నామం టకేషిమా, కొరియన్ అధికారిక నామం డొకోటో ) కొరియన్, జపాన్ సంబంధాలను సమస్యాత్మకం చేసాయి. చివరికి టకేషిమా/డొకోటో భూభాగం మీద హక్కులు రెండుదేశాలకు ఇవ్వబడ్డాయి. చిన్న ద్వీపలు కొరియా స్వాధీనంలోకి వచ్చాయి. కొరియా వాటిని సరిహద్దు రక్షణకు వినియోగించింది. ఫలితంగ జపాన్ ప్రధానమంత్రి జునిచిరో కియోజుమీ యాసుకునీకి పలుమార్లు విజయం చేసాడు. గత అధ్యక్షుడైన రాహ్ మూ-హైన్ దక్షిణ కొరియా, జపాన్ సమావేశాలన్నింటినీ రద్దు చేసాడు.

ఉత్తర కొరియా

[మార్చు]

ఉత్తర, దక్షిణ కొరియాలు రెండు మొత్తం ద్వీపకల్పం, పరిసర ద్వీపాలమీద అధికారికంగా సార్వభౌమాధికారం సాధించాయి. ఇరు దేశాలమధ్య రగులుకున్న విద్వేషాలు చివరకు 1950-1953 వరకు సాగిన కొరియన్ యుద్ధానికి దారితీసింది. తరువాత దక్షిణ కొరియా, ఉత్తర కొరియాలు యుద్ధవిరమణ ఒప్పందం మీద సంతకం చేసాయి. 2007 అక్టోబరు 4న రోహ్ మూ-హుయన్, ఉత్తర కొరియన్ నాయకుడు జాంగ్-ఇల్ ఎనిమిది ముఖ్యాంశాలు కలిగిన శాశ్వత శాంతి ఒప్పందం, ఉన్నత స్థాయి చర్చలు, పరస్పర ఆర్థిక సహకారం వాయు, రహదారి మార్గాల పునరుద్ధరణ, సమైక్య ఒలింపిక్ చీరింగ్ స్క్వాడ్ రూపొందించడం మీద సంతకం చేసారు.

1993,1998, 2006, 2009 లలో ఉత్తర కొరియన్ ప్రభుత్వం చేసిన మిస్సైల్ పరిశోధన కారణంగా రాజీ ప్రయత్నాలు సందిగ్ధంలో పడ్డాయి. 2009లో దక్షిణ, ఉత్తర కొరియాల మధ్య సంబంధాలలో ఘర్షణలు తలెత్తాయి. మిస్సైల్స్‌ను నిర్వీర్యం చేయమని ఉత్తర కొరియాను కోరారు. ఈ సంఘర్షణలు చివరికి మునుపటి ఒప్పందాలు ఉత్తరకొరియాను దక్షిణకొరియాతో చేసిన ఒప్పందాలకు ముగింపు పలికి తమ ఉపగ్రహ స్థాపనలో దక్షిణ కొరియా, అమెరికాలు జోక్యం చేసుకోకుండా బెదిరించింది. . ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఇప్పటికీ సాంకేతిక యుద్ధం కొనసాగిస్తున్నది. కొరియన్ యుద్ధం తరువాత ఇరు దేశాల మీద తిరిగి శాంతి ఒప్పందాలు జరగనే లేదు. ఇరుదేశాలు తమ మధ్య ఉన్న ప్రపంచంలో అత్యంత బలమైన సరిహద్దులలు సంరక్షిస్తూ ఉన్నాయి. 2009 మే 27న ఉత్తర కొరియా ప్రచార మాద్యమం ద్వారా ఇరుదేశాల మధ్య జరిగిన యుద్ధవిరమణ ఒప్పందానికి కాలం చెల్లినదని దేశరక్షణ కొరకు అణుఆధాల సేకరణ తప్పనిసరి అని ప్రకటించింది. 2010 మార్చి మాసంలో దక్షిణ కొరియా యుద్ధనౌక చియోనాన్ మునిగిపోవడం ఇరు దేశాల మధ్య ఘర్షణను మరింత క్లిష్టతరం చేసింది. ఈ సంఘటనకు కారణం ఉత్తరకొరియా అని కచ్చితంగా చెప్పింది ఉత్తర కొరియా దానిని నిరాకరించింది. 2010 మే మాసంలో దక్షిణ కొరియా ఆధ్యక్షుడు మియాంగ్-బ్యాక్ ఉత్తరకొరియాతో ఉన్న వాణిజ్య సంబంధాలను సియోల్ రద్దుచేస్తుందని ప్రకటించాడు. సమష్టి కియోసాంగ్ పారిశ్రామిక ప్రణాళిక, మానవీయ సహాయం విడిచి మిగిలిన ఆర్థిక, దౌత్య సంబంధాలు వెనుకకు తీసుకొనబడ్డాయి. ఉత్తర కొరియా కూడా ముందుగానే దక్షిణ కొరియాతో ముందున్న అన్ని ఒడంబడికలను రద్దుచేస్తామని అలాగే కియోసాంగ్ పారిశ్రామిక ప్రణాళికలో పనిచేస్తున్న దక్షిణ కొరియన్లని తరిమివేస్తామన్న బెదిరింపులను వెనుకకు తీసుకుని దక్షిణ కొరియాతో ముందున్న ఒప్పందాలను కొనసాగించింది. అయినప్పటికీ ఇరుదేశాల నడుమ నెలకొన్న సైనిక చర్యల ఫలితంగా కియోసాంగ్ పారిశ్రామిక ప్రణాళిక భూభాగంలో పెట్టుబడులు, శ్రామికశక్తి క్షీణిస్తూ వచ్చింది. ఇజ్రాయేలు దేశంలోలా దక్షిణ కొరియన్లు పొరుగు దేశాల దాడి నుండి రక్షించుకోవడానికి గ్యాసుమాస్కులను మాత్రం ఏర్పాటు చేసుకో లేదు.

  • 2009 నవంబరులో దక్షిణ కొరియా జరిపిన కాల్పుల కారణంగా గస్తీ చేస్తున్న ఉత్తరకొరియా యుద్ధనౌక అగ్నికి ఆహుతి అయింది.
  • 2010 మార్చి 26 న దక్షిణకొరియా యుద్ధనౌక చియోనాన్ సముద్రంలో మునిగిన సమయంలో 40 మంది నావికులు మరణించారు.
  • 2010 మే 20 న ఉత్తరకొరియా తమ యుద్ధనౌకను ముంచిందని ప్యానెల్ నిందించింది. పియాంగ్‌యాంగ్ వాటిని నిరాకరించింది.
  • 2010 జూలై-సెప్టెంబరు దక్షిణ కొరియా, యు.ఎస్ సన్యుక్తంగా సైనికవున్యాసం వంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాయి. యు.ఎస్ దక్షిణ కొరియాకు సహాయం అధికం చేసింది.
  • 2010 సెప్టెంబరు 29న ఉత్తరకొరియా తండ్రిని అనుసరించి కుమారుడు అధికారం చేపట్టిన సంఘటనను ఘనంగా నిర్వహించింది.
  • 2010 అక్టోబరు ఇరుదేశాల మధ్య ఉన్న సరిహద్దుల వద్ద దక్షిణ కొరియా, ఉత్తరకొరియాల మధ్య కాల్పులు జరిగాయి.

సంయుక్త రాష్ట్రాలు

[మార్చు]

రెండవ ప్రపంచయుద్ధం తరువాత జపాన్ వలసరాజ్యం నుండి విడుదల కావడానికి దక్షిణకొరియాకు అమెరికా అలాగే ఉత్తర కొరియాకు సోవియట్ యూనియన్ ప్రోత్సాహమిచ్చాయి. మూడు సంవత్సరాల అమెరికా పాలన తరువాత దక్షిణకొరియా ప్రభుత్వస్థాపన జరిగింది. కొరియన్ యుద్ధం ఆరంభం కాగానే అమెరికన్ సైన్యాలు దక్షిణ కొరియాకు మద్దతుగా సైన్యాలను పంపింది. అమెరికా దక్షిణకొరియాకు ఉత్తర కొరియా దండెత్తిన సమయంలోనూ, తరువాత చైనా దండయాత్రలోనూ సైన్యాల మద్దతు ఇచ్చింది. తరువాత అమెరికా దక్షిణ కొరియాలు పరస్పర సైనికమద్దతు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం అనుసరించి యుద్ఫ్హవాతావరణం ఏర్పడితే రెండుదేశాలు ఒకటిగా స్పందించాలన్న నిబంధన చోటుచేసుకున్నది. ఈ ఒప్పందానికి కట్టుబడి 1967లో వియత్నాం యుద్ధసమయంలో అమెరికాకు మద్దతుగా దక్షిణకొరియా సైన్యం పంపింది. ది యు.ఎస్ ఎయిత్ ఆర్మీ, యు.ఎస్ ఎయిర్ ఫోర్స్, యు.ఎస్ నావల్ ట్రీటీ ఆఫ్ కొరియా దక్షిణ కొరియాలో నిలుపబడ్డాయి. ఉత్తరకొరియా పట్ల అనుసరిస్తున్న విధానాల విషయంలోనూ, న్యూక్లియర్, రాకెట్ తయారీ పరిశ్రమల స్థాపన విషయంలోనూ ఇరు దేశాల విభేదాలు ఉన్నప్పటికీ రెండుదేశాల నడుమ ఆర్థిక, దౌత్య, సైనిక సంబంధాలు బలంగా ఉన్నాయి. గతంలో దేశంలో అమెరికన్ వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రస్తుతకాలంలో అది క్రమంగా తగ్గుతూ వస్తుంది. 2007 లో రిపబ్లిక్ కొరియా-యునైటెడ్ స్టేట్స్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై ఇరుదేశాలు సంతకం చేసాయి. అయినప్పటికీ అది అమలుచేయడంలో తిరిగి తిరిగి జాప్యం జరిగింది. రెండు దేశాల చట్టసభలలో ఈ తీర్మానం అంగీకారం లభించకపోవడమే ఇందుకు కారణం. 2011 అక్టోబరు 12 న అమెరికన్ చట్టసభలో ఈ ఒప్పందం అంగీకరించబడిన తరువాత మార్చి 15 నుండి ఈ వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చింది.

రక్షణదళం

[మార్చు]

దక్షిణకొరియా చారిత్రకంగా దీర్ఘకాల దండయాత్రలు, ఉత్తరకొరియా పరిష్కరించబడని వివాదాల కారణంగా దేశం జి.డి.పిలో 2.6% రక్షణవ్యవస్థ కొరకు వ్యయం చేయబడుతుంది. ప్రభుత్వధనంలో 15% (జి.డి.పిలో ప్రభుత్వ భాగం 14.967% ) రక్షణవ్యవస్థ కొరకు ఖర్చుచేయబడుతుంది. నిర్భంధ సైనిక శిక్షణ కారణంగా 6.50,000 సభ్యులు కలిగిన దక్షుణకొరియా కార్యశీలక సైనిక దళం ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది. అలాగే 32,00,000 సభ్యులున్న దక్షిణ కొరియా రిజర్వ్ సైనిక దళం ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. దక్షిణ కొరియా రక్షణ వ్యవస్థ ప్రణాళిక ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది. ది రిపబ్లిక్ కొరియా రెగ్యులర్, రిజర్వ్ సైనిక దళం సంఖ్య 37,00,000. కొరియా మొత్తం జనసంఖ్య 5 కోట్లు. కొరియా సరాసరి సైనికదళసంఖ్య ద్వితీయ స్థానంలో ఉంది. దిడెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాది ప్రథమస్థానం.

దక్షిణకొరియా కాల్బలం (ఆర్.ఒ.కె.సి, ), నావికదళం (ఆర్.ఒ.కె.ఎన్), వాయుసేన (ఆర్.ఒ.కె.ఎం.సి), రిజర్వ్ దళాలు కలిసి కొరియన్ సైనిక భూభాగంలో కేంద్రీకృతమై ఉంటాయి. దక్షిణ కొరియన్ పురుషులందరూ 21 మాసాల నిర్బంధ సైనికసేవ చేయాలని కోరబడతారు. ముందు మిశ్రిత కొరియన్ జాతివారికి నిర్బంధ సైనికసేవ చేయాలన్న నియమం నుండి మినహాయింపు ఉన్నప్పటికీ 2011 నుండి అది రద్దు చేయబడింది.

అదనంగా ఒక సంవత్సరానికి దక్షిణకొరియా సైన్యంలో 21 మాసాల నిర్బంధ సైనిక సేవలకు నియమించబడుతున్నారు. అమెరికా అందిస్తున్న ప్రణాళికా సాయంతో దక్షిణ కొరియాలో ఉన్న అమెరికన్ దళాలకు దక్షిణ కొరియా ఖర్చుచేస్తున్న ధనం 1.68 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. తన స్వంత సైనికవ్యవస్థకు దక్షిణ కొరియా ఖర్చు చేస్తున్న ధనం 29.6 ట్రిలియన్లు. అమెరికన్ సైన్యాలకు సహకరించడానికి దక్షిణ కొరొయా సైనికదళాలను అవసరమైనప్పుడంతా పంపుతూ ఉంటుంది. అమెరికా సబంధం ఉన్న 50 యుద్ధాలకు దక్షిణకొరియా అమెరికతో చేరి యుద్ధంలో పాల్గొన్నది. అమెరికా సబంధిత యుద్ధాలలో పాల్గొనడానికి ఆస్ట్రేలియా, ఫిలిప్పైంస్, న్యూజిలాండ్, దక్షిణవియత్నాం సైనికదళాతో చేర్చి దక్షిణకొరియా 3,25,517 సైనిక దళాలను పపింది. 2004లో వియత్నాం యుద్ధంలో పాల్గొనడానికి దక్షిణవియత్నాం సైనిక దళాలకు సహాయంగా 50,000 మంది సైనికులను పపింది. 2004లో ఇరాక్ యుద్ధం తరువాత ఉత్తర ఇరాక్ పునర్నిర్మాణ కార్యక్రమాల కొరకు సంకీర్ణ సైనికదళాలతో పనిచేయడానికి కొరియన్ సహాయక బృందాలు పంపబడ్డాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికా, బ్రిటన్ తరువాత అధికసంఖ్యలో పాల్గొన్నది కొరియన్ బృందాలే. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళాలకు సహకరించడానికి, తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడానికి దక్షిణ కొరియా 2001లో మిడిల్ ఈస్ట్‌కు 24,000 మందిని, 2007లో లెబనాన్‌కు 1,800 మందిని పంపింది.

దక్షిణ కొరియా రక్షణకొరకు అమెరికా గుర్తించతనంత సైనికదళాలను దక్షిణకొరియాకు పంపింది. అకెరికా దక్షిణకొరియాకు దాదాపు 28,500 మంది సైనికోద్యోగులను పంపింది. వారిలో చాలామంది ఒక సంవత్సరం ఉద్యోగపర్యటనకు ఒంటరిగా పింపబడుతుంటారు. ప్రధానంగా అమెరికన్ కాల్బలం, వాయుసేన ఎయిత్ యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ & సెవెంత్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ది యు.ఎస్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన వారిని యు.ఎస్ ఫోర్సెస్ కొరియాకు పంపబడుతుంటారు.

భౌగోళికం, పరిసరాలు, వాతావరణం

[మార్చు]

భౌగోళికం

[మార్చు]

కొరియాద్వీపకల్పంలో దక్షిణభాగంలో దక్షిణకొరియా ఉపస్థితమై ఉంది. ఆసియా ప్రధానభూభాగానికి దక్షిణకొరియా 1,100 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్వతాలతో నిండిన ఈ ద్వీపకల్పం పడమరదిశలో ఎల్లో సీ, జపాన్ (తూర్పు) సముద్రం ఉన్నాయి. దక్షిణ దిశలో కొరియా స్ట్రెయిట్ తూర్పున చైనా సముద్రం ఉన్నాయి. దక్షిణ కొరియా మొత్తం వైశాల్యం 1,00,032 చదరపుకిలోమీటర్లు.

దక్షిణ కొరియా నాలుగు ప్రధాన భూభాగాలుగ విభజించబడి ఉంటుంది. తూర్పుదిశలో ఉన్నతమైన పర్వతాలు ఇరుకైన మైదానాలు ఉన్నాయి. పడమరదిశలో విశాలమైన సముద్రతీర మైదానాలు, రోలింగ్ హిల్స్, నదీముఖద్వారాలు ఉన్నాయి. ఆగ్నేయదిశలో పర్వతాలు, లోయలు ఉన్నాయి. దక్షిణదిశలో నెక్డాంగ్ నది యొక్క విశాలమైన ముఖద్వారం ఉంది. దక్షిణకొరియా భూభాగం వ్యవసాయానికి సహకరించని పర్వతాలతో నిండి ఉంటుంది. దేశాంలో సాధారణ సమతల భూమి మొత్తం 30% మాత్రమే ఉంటుంది. అతి చిన్నవి, నిర్జనమైనవి అయిన దాదాపు 3,000 దీవులు ఉన్నాయి. దక్షిణకొరియాకు 100 కిలోమీటర్లదూరంలో జెయూ-డి దీవి ఉంది. 1,845 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన జెయూ-డి దేశంలోని అతిపెద్ద దీవి. అలాగే జెయూ-డి దీవి దేశంలో అత్యంత ఎత్తైనది. విశాలమైన హల్లాసన్ అగ్నిపర్వతం ఎత్తు 1,950 మీటర్లు. తూర్పున చివరిగా ఉన్న దీవి ఉలెంగ్డో, లియాన్‌కోర్ట్ రాక్స్ ఉన్నాయి. దక్షిణ దిశ చివరిలో మారాడో, సొకోటా రాక్స్ ఉన్నాయి. దక్షిణకొరియాలో 20 కి పైగా జాతీయ ఉద్యానవనాలు, ప్రకృతిసహజ ప్రదేశాలు ఉన్నాయి.

వాతావరణం

[మార్చు]

దక్షిణకొరియా ఆర్ధ్ర ఖండాంతర శీతోష్ణస్థితి, ఆర్ధ్ర ఉష్ణమండల శీతోష్ణస్థితి కలిగి ఉంటుంది. దక్షిణకొరియాలో తూర్పాసియా వర్షపాతకాలానుగుణంగా వేసవికాలంలో అధికవర్షపాతం ఉంటుంది. ఈ వర్షపాతం జూన్మాసంలో ఆరంభమై జూలై మాసానికి వరకు కొనసాగుతుంది. అత్యంత శీతలంగా ఉండే చలికాలంలో లోతట్టు ప్రాంతంలో ఉష్ణోగ్రత -20 ° సెంటీగ్రేలుంటుంది. సియోల్ నగరంలో -7 నుండి 1 ° సెంటీగ్రేలుంటుంది. ఆగస్టు మాస సరాసరి ఉష్ణోగ్రత 22-30 ° సెంటీగ్రేలుంటుంది. దక్షిణ తీరంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి పర్వతప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. దేశంలో అధిక భూభాగంలో వేసవి ఉష్ణోగ్రతలు ఆర్ధత కలిగిన వేడిమితో 30° సెంటీగ్రేలుంటుంది. దక్షిణకొరియా శీతోష్ణస్థితి నాలుగు వైవిధ్యతలను కలిగి ఉంటుంది. వసంతం, వేసవి, ఆకురాలుకాలం, శీతాకాలం. మార్చి నుండి మే ఆరంభంలో చివరలో వసంతం మొదలౌతుంది, మే మధ్య నుండి సెప్టెంబరు ఆరంభం వరకు మాసనంలో వేసవి మొదలౌతుంది, సెప్టెంబరు మద్య నుండి నవంబరు ఆరంభం వరకు ఆకురాలు కాలం ఉంటుంది, శీతాకాలం నవంబరు మద్య నుండి మార్చి వరకు ఉంటుంది. వేసవిలో ఆరంభమయ్యే వర్షాలు సెప్టెంబరు వరకు కొనసాగుతాయి.సియోలులో సరాసరి వర్షపాతం 1,370 మిల్లీమీటర్లు ఉంటుంది. బ్యూసన్ వర్షపాతం 1,470 ఉంటుంది. అప్పుడప్పుడూ వచ్చే తుఫానులు ఈదురుగాలులు వరదలకు కారణం ఔతుంటాయి.

పర్యావరణం

[మార్చు]

దక్షిణకొరియా అభువృద్ధి ప్రారంభమైన మొదటి 20 సంవత్సరాల కాలంలో పర్యావరణ పరిరక్షణకొరకు స్వల్పంగా ప్రయత్నాలు చేయబడ్డాయి. అనియంత్రిత పారిశ్రామికాభివృద్ధి, నగరాభివృద్ధి కారణంగా అడవుల నరికివేత, సాంగ్డో టైడల్ ఫ్లాట్ వంటి చిత్తడినేలల నశింపజేయడం వంటి చర్యలు అనివార్యం అయ్యాయి. అయినప్పటికీ ఈ సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం 84 వందల కోట్ల ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం విద్యుచ్చక్తి ఉత్పత్తి, పచ్చదనం అభివృద్ధి.

దక్షిణకొరియా మొత్తం జి.డి.పిలో 2%తో రూపొందించిన ఈ పచ్చదనం ఆధారిత ఆర్థికవ్యూహం దక్షిణకొతియా ఆర్థికరంగంలో సమగ్రమైన మార్పులు రావడానికి కారణం అయింది. పచ్చదనం పెంపొందించే ప్రయత్నాలలో దేశం అంతటా ద్విచక్రవాహనాల వాడకం అధికం చేయడం, సూర్య అరియు పవన శక్తిని వాడుకోవడం, చమురుతో నడిచే వాహనాల వాడకం తగ్గించడం, సూర్యరస్మి వాడకాన్ని ప్రోత్సహించడం, పర్యావరణ అనుకూలిత సాంకేతికత వాడకం అధికరించడం వంటి ప్రయత్నాలు చేపట్టారు. విద్యచ్చక్తి వాడకం తగ్గించడానికి దేశంలో ఇప్పటికే అనేక ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బ్రాడ్ బాండ్ సేవలకంటే 10 రెట్లు వేగవంతమైన అంతర్జాల సేవలందించడానికి దేశం ఇప్పటికే సిద్ధంగా ఉంది.

ప్రస్తుతం సియోలులో కుళాయిలద్వారా లభ్యమౌతున్న శుద్ధజలాలు త్రాగడానికి సురక్షితమైనవిగా భావిస్తున్నారు. నగరాఫ్హికారులు " అరిసు" అనే పేరుతో ఒప్పందదారులద్వారా ఈ ప్రణాళికను అమలుచేసి నగరవాసుల త్రాగునీటి అవసరాలను తీర్చి తృప్తిపరుస్తున్నారు. అరణ్యాలను అభివృద్ధిచేసే ప్రయత్నాలను కూడా ప్రారంభించారు. మరొక పలుకోట్ల విలువచేసే ప్రణాళిక " చియాంగియోచియాన్ " పునరుద్ధరణ. సియోల్ నగరకేంద్రం (డౌన్ టౌన్) గుండా ప్రవహించే ఈ పిల్లకాలువ గతలో మోటర్ యంత్రాలద్వారా అతిగా జలవినియోగం చేయడం ఎండిపోయింది. మరొక ప్రధాన సవాలు వాయుకాలుష్యం, ఆమ్ల వర్షాలు, సల్ఫర్ ఆక్సైడ్స్, సంవత్సర పసుపు దుమ్ము తుఫానులను ఎదుర్కొనడం. ప్రధాన వాయుకాలుష్యానికి కారణమైన చైనాకు సమీపంలో దక్షిఅకొరియా ఉండడమే ఇందుకు కారణం.

దక్షిణకొరియా అంటార్కిటికా -ఎంవిరాన్మెంటల్ ప్రొటోకాల్, అట్లాంటిక్ ట్రీటీ, బయోడైవర్సిటీ ట్రీటీ, కియోటో ప్రొటోకాల్ డిసర్టిఫికేస్గన్, ఎండేంజర్ స్పెసీస్, ఎంవిరాన్మెంటల్ మోడిఫికేషన్, హజార్డస్ వేస్ట్స్, లా ఆఫ్ ది సీ, మేరిన్ డంపింగ్, కాంంఫరెంసివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్, షిప్ పొల్యూషన్, ట్రాపికల్ టింబర్ 83, ట్రాపికల్ టింబర్ 94, వెట్ లాండ్స్ అండ్ వేలింగ్ లలో సభ్యత్వం కలిగి ఉంది.

ఆర్ధికరంగం

[మార్చు]

దక్షిణ కొరియా వాణిజ్య ఆధారిత ఆర్థికకరంగం జి.డిపి పరంగా ప్రపంచంలో 15వ స్థానంలో ఉంది. అలాగే కొనుగోలుశక్తి 12వ స్థానంలో ఉంది. అలాగే దక్షిణ కొరియా ఆర్థికరంగం జి-20 అంతర్జాతీయంగా ఆర్థికరంగాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఒ.ఇ.సి.ఇడి సభ్యత్వం ఉన్న దక్షిణకొరియా ఉన్నత అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. అధికంగా పరిశ్రలున్న దేశాలలో దక్షిణకొరియా ఒకటి. అభివృద్ధి చెందిన 12 దేశాలలో దక్షిణకొరియాది ప్రథమ స్థానం అయితే మిగిలిన 11 దేశాలు దక్షిణకొరియా స్థాయికి దూరంగానే ఉన్నాయి. 1960 నుండి 1990 మద్యకాలంలో వేగవంతంగా అభివృద్ధిచెందిన దేశాలలో దక్షిణ కొరియా ఒకటి. 2000 నుండి అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందిన దేశాలైన హాంకాంగ్, సింగపూర్, తైవానులతో కలిసి దక్షిణకొరియా కుడా గుర్తింపు పొందింది. ఈ నాలుగు దేశాలు ఆర్థికపరంగా ఆసియన్ టైగర్లుగా గుర్తింపు పొందాయి. ఈ అభివృద్ధిని దక్షిణకొరియా హాన్ నది అద్భుతంగా వర్ణిస్తుంది. దక్షిణకొరియా ఆర్థికకరంగం అంతర్జాతీయ వాణిజ్యం మీద అధికంగా ఆధారపడుతూ ఉంది. 2010లో అసియాలో అధికంగా ఎగుమతి చేసిన దేశాలలో దక్షిణ కొరియా 6వ స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా 10వ స్థానంలో ఉంది.

2010లో దక్షిణకొరియా రాజధాని నగరంలో జి.20 సమావేశాలకు దక్షిణకొరియా ఆతిథ్యం ఇచ్చింది. రెండురోజుల సమావేశాలు తమ ఆర్థికరంగాన్ని 31 ట్రిలియన్లకు తీసుకు పోగలదని సగర్వంగా చెప్పుకున్నారు. ఆర్థిక ప్రయోజనాలతో సహా దేశంలో 1,60,000 ఉద్యోగాలను ఉత్పత్తి చేయగదన విశ్వసించారు. అలాగే దేశం సావరిన్ క్రెడిట్ కూడా అభివృద్ధి ఔతుందని అనుకున్నారు. ఒక వైపు దక్షిణ కొరియా ఆర్థికరంగ అభివృద్ధి నిర్మాణాత్మకంగా స్థిరంగా ఉంది. ఉత్తరకొరియాతో ఉన్న వివాదాలు సైనిక సంక్షోభం కారణంగా దక్షిణ కొరియా ఫైనాంషియల్ మర్కెట్ మీద వ్యతిరేక ప్రభావం చూపెట్టింది. దక్షిణ కొరియా ఆర్థికరంగం అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం సమయలో నిలదొక్కుకున్నదని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నివేదికలో వెల్లడించింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకుని నిలబడిన అభివృద్ధి చెందుతున్న కొన్ని దేశాలలో దక్షిణకొరియా ఒకటి. 2010లో దక్షిణకొరియా అభివృద్ధి శాతం 6.2%. 2008లో ఆర్థికాభివృద్ధి 2.3. 2009 ఆర్థిక సంక్షోభ కాలంలో ఆర్థికాభివృద్ది 0.2%. 2009 నుండి దక్షిణకొరియా నిరుద్యోగ శాతం 3.6%గా ఉంటూ వస్తుంది.

రవాణా, విద్యుత్చ్చక్తి

[మార్చు]

దక్షిణకొరియాలో అత్యాధునిక రైలు సౌకర్యాలు ఉన్నాయి. అతివేగ రైళ్ళు, రహదారులు, బస్ మార్గాలు, వాయు మార్గాలున్నాయి. కొరియా ఎక్స్‌ప్రెస్‌వే కార్పొరేషన్ టోల్ రహదారులు, మార్గమద్యంలో అవసర సేవలు అనిదింస్తుంది. కొరియా ప్రధాన నగరాలలో కోరెల్ రైలు సర్వీసులు ఒకదానివెంట ఒకటిగా లభిస్తున్నాయి. దేశంలో జియోంగూ, డాంఘీ అనే రెండు మార్గాలు ఉన్నాయి. ఉత్తరకొరియాతో రవాణాసౌకర్యాలు తిరిగి పునరుద్ధరించబడ్డాయి. ది కొరియన్ హైస్పీడ్ రైలు సిస్టం, కెటి.ఎక్స్ జియాంగూ, హోనం లైన్ హైస్పీడ్ సర్వీసులను అందిస్తున్నాయి. ప్రధాననగరాలైన సియోల్, బూసన్, ఇంచియాన్, డీగూ, డీజియాన్, గ్వాంగ్జూ అనేవి నగర అతివేగ రైలు సర్వీసులు. పలు నగరాలలో అతివేగ బసు సర్వీసులు లభిస్తున్నాయి. దక్షిణకొరియాలోని పెద్దదైన విమానాశ్రయం ఇంచియాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2001లో నిర్మాణాన్ని పూర్తిచేసుకున్నాయి. 2007 నాటికి ఇక్కడ నుండి 3 కోట్ల మంది ప్రయాణించారు. ఇతర విమానాశ్రయాలు వరుసగా జింపో, బూసన్, జియూ. దేశంలో 7 దేశీయ విమానాశ్రయాలు, పెద్ద సంఖ్యలో హెలికాఫ్టర్లు ఉన్నాయి.

1962 లో స్థాపించబడిన కొరియన్ విమానాశ్రయాలు2008 లో 2,16,40,000 మంది ప్రయాణీకులకు సేవలందించింది. 2008లో స్థాపించబడిన ఎ సెకండ్ కారియర్, ఏసియన్ ఎయిర్‌లైంస్ దేశీయ, విదేశీ సర్వీసులను అందిస్తున్నాయి. దక్షిణకొరియా విమానాశ్రయాలు 297 అంతర్జాతీయ మార్గాలలో ప్రయాణ సౌకర్యాలు అందిస్తున్నాయి. జెయూ వంటి చిన్న విమానాశ్రయాలు తక్కువ చార్జీలతో దేశీయ సర్వీసులు అందిస్తున్నాయి. .

అణువిద్యుత్ ఉత్పత్తిలో దక్షిణకొరియా ప్రపంనచలో 5 వస్త్గానంలో ఉంది. అలాగే 2010 లో ఆసియాలో ద్వితీయ స్థానంలో ఉంది. దేశంలోని విద్యుత్తులో 45% అణువిద్యుత్తు నుండి లభిస్తుంది. అలాగే ఆధునిక పరిశోధనలు నిర్వహిస్తుంది. స్మాల్ మోడ్యులర్ రియాక్టర్, ఎ లిక్విడ్-మెటల్ ఫాస్ట్/ట్రాంస్మ్యుటేసన్ రియాక్టర్, ఎ హైటెంపరేచర్ హైడ్రోజన్ జనరేషన్ డిజైన్ వంటి రియాక్టర్ల తయారీ చేయబడుతున్నాయి. ఇంధన ఉత్పత్తి, చెత్త నిర్వహణ వంటివి అభివృద్ధి చెందాయి. దక్షిణకొరియా ఐ.టి.ఇ.ఆర్ సభ్యత్వం కలిగిఉంది. దక్షిణకొరియా న్యూక్లియర్ రియాక్టర్లను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. అలాగే యు.ఎ.ఇతో న్యూక్లియర్ నాలుగు అత్యాఫ్హునిక రియాక్టర్ల నిర్మాణం, నిర్వహణ ఒప్పందం చేసుకున్నది. జోర్డానుతో న్యూక్లియర్ రియాక్టర్ పరిశోధన ఒపాందం చేసుకున్నది. అర్జెంటీనాతో హెవీ వాటర్ న్యుక్లియర్ నిర్మాణం బాగుచేయడం ఒప్పందం చేసుకున్నది. 2010 లో దక్షిణకొరియా, టర్కీ రెండు న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణానికి చర్చలు జరుపుతున్నది. దక్షిణకొరియా అర్జెంటీనా కొరకు లైట్ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్ తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది.

తనతానుగా యురేనియం నిల్వచేసుకోవడానికి లేక సాంప్రదాయకంగా యురేనియం ఉత్పత్తి చేయగల సాంకేతికాభివృద్ధి చేసుకోవడానికి దక్షిణకొరియా అనుమతించబడలేదు. యు.ఎస్ రాజకీయ వాత్తిడే ఇందుకు కారణం. న్యూక్లియర్ జనరేటిన్ టెక్నాలజీ, రియాక్టర్ల ఉత్పత్తిలో దక్షిణకొరియా విజయం సాధించింది.

సైంస్, టెక్నాలజీ

[మార్చు]

అంతరిక్ష పరిశోధనలు

[మార్చు]

1992 నుండి దక్షిణకొరియా 10 ఉపగ్రాహాలను అంతరిక్షానికి పపింది. అన్ని విదేశీ రాకెట్ల సాయంతో ఓవర్సీస్ లంచ్ ప్యాడ్స్ మూలంగా పంపబడ్డాయి. రష్యాభాగస్వామ్యంలో ఒక భాగంగా 1999లో అరిరాంగ్-1, 2006లో అరిరాంగ్-2 పంపబడ్డాయి. 2008లో ఏప్రిల్ మాసంలో మొదటిసారిగా కొరియన్ పౌరుడైన యీ సో-యియోన్ అంతరిక్షంలో ఉన్న రష్యన్ సోయుజ్ టి.ఎం.ఎ -12 వ్యూమనౌకకు పంపబడ్డాడు.

2009లో జియోలనం - డు లోని గోహెయంగ్ వద్ద మొదటి కొరియన్ అంతరిక్షకేంద్రమైన నేరో స్పేస్ సెంటర్ స్థాపించబడింది. మొదటి ప్రయత్నంగా 2009 లో నేరో -1 అంతరుక్షానికి పంపినప్పుడు అది విఫలమైంది. 2010లో జరిగిన ప్రయత్నం కూడా విఫలమైంది. అయినప్పటికీ మూడవప్రయత్నంగా 2013 లో నేరో 1 ఉపగ్రహాన్ని అంతరిక్షానికి విజయవంతంగా పంపగలిగారు. 2018లో నేరో-2 ఉపగ్రహాన్ని అంతరిక్షానికి పంపడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.

దక్షిణకొరియా స్వంత ఉపగ్రహం రాకెట్లు నిర్మించాలన్న ప్రయత్నం సంయుక్తరాష్ట్రాల వ్యతిరిక్త కారణంగా తీవ్రమైన వివాదాద్పదమైన విషయంగా మారింది. దక్షిణకొరియా రాకెట్ నిర్మాణం, మిస్సైల్ నిర్మాణం అతి రహస్యంగా ఉంచబడడమే ఇందుకు కారణం. మిస్సైల్ కాత్యక్రమంలో బాలిస్టిక్ రహస్యచర్యలతో సంబంధం ఉందా అన్న భీతి నెలకొన్నది. యు.ఎస్, దక్షిణకొరియా మిస్సైల్ నిర్మాణం, పరిశోధనలు విధులను కొరియా అతిక్రమించకూడదని పేర్కొని ఉన్నందున అందుకు కొరియా అంగీకరించినందున ఈ నిర్మాణకార్యక్రమాలు రహస్యంగా ఉంచబడ్దాయి. దక్షిణ కొరియా ఎం.టీ.సి.ఆర్ ద్వారా రష్యా నుండి మిస్సైల్ నిర్మాణానికి అవసరమైన సాంకేతికపరమైన సలహా సహాయాలు అందుకున్నది. యూనివర్సల్ రాజెట్ మోడెల్‌లో కె.ఎస్.ఎల్.వి ఉపగ్రహ ప్రయోగాలు రెండు విఫల్స్మయ్యయి. రష్యన్ అంగార రాకెట్ మొదటి స్థాయి రష్యాచేత నిర్మించబడింది. రెండవ స్థాయి దక్షిణకొరియా పూర్తి చేసింది.

రొబోట్స్

[మార్చు]

2003 నుండి నేషనల్ ఆర్ & డీ ప్రాజెక్టులలో రోబోటిక్స్ చేర్చబడ్దాయి. 2009లో ప్రభుత్వం రొబోట్ థీం పార్కులను నిర్మిస్తానని ప్రకటించింది. ఇంచియాన్, మాసన్ ఈ పార్కులను ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులతో నిర్మించాలని నిశ్చయించబడింది.

2005లో కొరియా అడ్వాంస్డ్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెండవ నడిచే మానవుడి ఆకారంతో రొబోటును (హెచ్.యు.బి.ఒ) నిర్మించింది. 2006లో మే మాసంలో ఇంస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ బృందం మొదటి కొరియన్ అండ్రాయిడ్ ఇ.వి.ఆర్-1 రొబోటును నిర్మించింది. తరువాత అధిక క్లిష్టతరమైన అభివృద్ధి చెందిన సాంకేతిక నైపుణ్యంతో పలు రొబోట్ల నిర్మాణం జరిగింది. తరువాత నమూనాలు 2010లో నాటికి వెలువడగలవని విశ్వసించారు. 2010 నాటికి ఆంగ్లం బోధించే ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి ఆంగ్లం బోధించగలిగిన రొబోటులను నిర్మించి ప్రవేశపెట్టలని ప్రణాళిక చేయబడింది. ఈ రొబోట్లను 2013 నాటికి అధికమైన ప్రిస్కూల్, కిండర్ గార్టెన్ పాఠశాలకు అందించాలని యోచించింది. రొబోట్లను వినోదకేంద్రాలలో కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. 2004 నుండి రొబోట్ టెక్నాలజీని ప్రోత్సహిస్తూ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

బయోటెక్నాలజీ

[మార్చు]

Since the 1980s, the Korean government has invested in the development of a domestic biotechnology industry, and the sector is projected to grow to $6.5 billion by 2010.[124] The medical sector accounts for a large part of the production, including production of hepatitis vaccines and antibiotics. Recently, research and development in genetics and cloning has received increasing attention, with the first successful cloning of a dog, Snuppy (in 2005), and the cloning of two females of an endangered species of wolves[which?] by the Seoul National University in 2007.[125] The rapid growth of the industry has resulted in significant voids in regulation of ethics, as was highlighted by the scientific misconduct case involving Hwang Woo-Suk.

సంస్కృతి

[మార్చు]

దక్షిణకొరియా ఉత్తరకొరియాతో తన సంప్రదాయక సంస్కృతిని పంచుకుంటుంది. 1945 నుండి కొరియా ద్వీపకల్పం రెండుగా విడిపోయిన నాటి నుండి రెండు కొరియాలు రెండు ప్రత్యేక సంప్రదాయరీతులను ఏర్పరచుకున్నాయి. చారిత్రకంగా కొరియా సంస్కృతి మీద పొరుగున ఉన్న చైనా ప్రభావం అత్యధికంగా ఉంది. అయినప్పటికీ దక్షిణ కొరియా పొరుగుదేశమైన బృహత్తరమైన చైనాదేశ సంస్కృతికి భిన్నమైన సంస్కృతిని తనకంటూ ప్రత్యేకంగా ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ది సౌత్ కొరియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ పర్యాటకం సంప్రదాయక కళలను అలాగే ఆధునిక కళారూపాలను ప్రోత్సహిస్తుంది. సస్కృతిక సంస్థల స్థాపన, అభ్యశించడానికి అవసరమైన వసతులను కల్పిస్తున్నది. దక్షిణకొరియా పారిశ్రామికీకరణ, నగరాభివృద్ధి కార్యక్రమాలు కొరియన్ ప్రజాజీవితంలో పలు మార్పులను తీసుకువచ్చింది. ఆర్థికస్థితిలో మార్పులు, జీవితశైలి నగరాలలో ప్రజలు కేంద్రీకృతం కావడానికి దారి తీసింది. ప్రత్యేకంగా రాజధాని నగరమైన సియోల్ గృహాలలో భిన్నవయస్కులు నివసించడం అనే సంస్కృతి నుండి లఘు కుటుంబాలలా విడిపోవడానికి దారి తీసింది.

చైనా నుంచి ఉమ్మడి కొరియాకు బౌద్ధమతం సా.శ.374లో ప్రాకింది. చైనాకు అప్పటికే భారతదేశం నుంచి పలువురు భిక్షువులు వెళ్ళి అందించిన బౌద్ధం 4వ శతాబ్ది నాటికి కొరియా చేరింది. సా.శ.374 ఆతో, షర్తో అనే ఇద్దరు బౌద్ధ భిక్షువులు అప్పటి రాజధాని పినాంగ్ పట్టణానికి చేరుకున్నారు. మతానందుడు అనే బౌద్ధుడు అనుచరులతో సహా కొరియా రాజ్యానికి ఆహ్వానింపబడి ప్రచారం చేశారు. 5వ శతాబ్దికి కొరియాలోని సిల్లరాజపుత్రికకు యోగశక్తితో, వైద్యనిపుణతతో చికిత్స చేసిన భిక్షువు తాంత్రికబౌద్ధాన్ని వ్యాపించారు. ఆపైన 50ఏళ్ళకల్లా కొరియా రాజవంశీకులు బౌద్ధదీక్ష స్వీకరించారు. దానితో మరి నాలుగు శతాబ్దాల్లో రాజాదరణతో కొరియాలో బౌద్ధం విలసిల్లి 10వ శతాబ్ది నాటికి మతం దేశవ్యాప్తమైన అభివృద్ధికి నోచుకుందిదానితో మరి నాలుగు శతాబ్దాల్లో రాజాదరణతో కొరియాలో బౌద్ధం విలసిల్లి 10వ శతాబ్ది నాటికి మతం దేశవ్యాప్తమైన అభివృద్ధికి నోచుకుంది[3].

కళలు

[మార్చు]

దక్షిణకొరియా కళలు అత్యధికంగా బుద్ధిజం, కంఫ్యూజియనిజంతో ప్రభావితమై ఉంటాయి. వాటిని అనేక సంప్రదాయక చిత్రాలు, శిల్పాలు, సెరామిక్స్, కళాప్రదర్శనలలో దర్శించవచ్చు. జోసియంస్ బీక్‌జా, బంచియాంగ్, గోరియోస్ సెలాండన్ వంటి కొరియన్ పాటరీ, పార్సిలియన్ కళాఖండాలు ప్రపంచప్రసిద్ధి చెందాయి. యుద్ధం తరువాత కొరియన్ కళలు 1960, 1970 లలో చాక్కగా అభివృద్ధి చెందాయి. ఆ సమయంలో దక్షిణకొరియా కళాకారులు మనిషికి ఊహకు అందని విషయాలు గణిత సంబంధిత ఆకారాలు చోటుచేసుకున్నాయి. మనిషికి, ప్రకృతికి మద్య ఉన్న అనుసరణీయ బంధాన్ని కళలలో పొందుపచడం అభిమాన విషయమైనది. 1980లలో సాంఘిక అసమానతలు, సాంఘిక విషయాలు చోటుచేసుకున్నాయి. దక్షిణకొరియా కళలమీద అంతర్జాతీయ సంఘటనలు ప్రభావితం చూపాయి. అలాగే దక్షిణ ఆఫ్రికన్ కళారంగంలో వైవిధ్యం చోటుచేసుకున్నది. 1988లో ఒలింపిక్ సాంస్కృతిక ఉద్యానవనం, గ్వాంగ్జూ బైన్నేల్, 1975లో వెనిస్‌లో జరిగిన కొరియన్ పెవెల్లియన్ మొదలైనవి గుర్తించతగిన సంఘటనలు.

నగర నిర్మాణం

[మార్చు]

దక్షిణకొరియన్ చరిత్రలో సంభవించిన నిరంతరదాడులు వైవిధ్యమైన పాలనల కారణంగా ననిర్మాణం, విధ్వశం దేశంలో మారిమారి సంభవించాయి. ఫలితంగా నిర్మాణశైలిలో, దిజైన్లలో వినూతనత చోటుచేసుకున్నది. కొరియన్ నిర్మాణశైలి మీద వారికి ప్రకృతితో ఉన్న అనుబంధం అధికంగా కనిపిస్తుంది. ఉన్నతవర్గీయులు నిర్మించే గృహాలు పెద్దవిగా పెంకులతో కప్పబడిన పైకప్పులతో ఉంటాయి. సంప్రదాయక నిర్మాణశైలి ప్రభుత్వనిర్మాణాలు, ప్రజలు ఒకటిగా కూడే ప్రదేశాలు, హనాక్ అని పిలువబడే సంరక్షిత గృహాలలో కనిపిస్తుంది. అలాగే ప్రత్యేకంగా నిర్మించబడిన హహూ జానపద గ్రామంలో కూడా సంప్రదాయక నిర్మాణశౌలి చూడవచ్చు.

19వ శతాబ్దం చివరినాటికి దక్షిణకొరియాలో పాశ్చాత్య నిర్మాణశైలి పరిచయం అయింది. చర్చిలు, విదేశీదౌత్యకాత్యాలయాలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయ భవనాలు ఆధునిక శైలిలో నిర్మించబడ్దాయి. సమీపజ్ంలోనే ఉన్న జపాన్ 1910 నుండి కొరియాను పాలించిన కాలంలో జపాన్ కొరియన్ నిర్మాణశైలిలో కూడా కలుగజేసుకుని కొరియాలో జపానీ శైలి నిర్మాణాలు చోటుచేసుకోవడానికి కారణం అయింది. కొరియన్ యుద్ధం, ప్రజలలో తలెత్తిన జపాన్ వ్యతిరేకత కారణంగా అనేక భవనాలు ధ్వంసం చేయబడి అ స్థానంలో ఆధునిక భవనాల నిర్మాణం జరిగింది. యుద్ధానతరం కొరియన్ నిర్మాణశైలిలో ఆధునికత ప్రవేశించి సరికొత్త నిర్మాణయుగానికి నాంది పలికింది. 1970 - 1980 మద్య సాధించిన ఆర్థిక ప్రగతి ప్రేరణతో నిర్మాణాలలో సరికొత్త ఆధునిక శైలి చోటుచేసుకుంది. 1988 సియోల్ ప్లింపిక్స్ తరువాత దక్షిణకొరియా లాండ్‌స్కేప్‌లో కూడా వైవిధ్యమైన శైలికి సాక్ష్యంగా నిలిచింది. సమకాలీన నిర్మాణప్రయత్నాలు సంప్రదాయం, ఆధునికత మద్య సమతుల్యత, ప్రకృతితో అనుబంధం, సాధించాలని ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ వేగవంతంగా నగరమయమౌతున్న నిర్మాణాలు కూడా నగరూపురేఖలలో అనూహ్యమార్పులను తీసుకువస్తుంది.

ఆహారం

[మార్చు]

హాంగక్ యోరి అనబడే కొరియన్ ఆహారశైలి మీద శతాబ్ధాల కాలం కొనసాగిన సాంఘిక, రాజకీయాల ప్రభావం అత్యధికంగా ఉంది. భూభాగాలను అనుసరించి పదార్ధాలు ఆహారాలు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం దేశంలో గుర్తించతగినంతగా వైవిధ్యమైన ఆహారాలు విస్తరించాయి. కొరియన్ రాజకుటుంబ ఆహారాలలో ఒకప్పుడు ప్రత్యేక ప్రాంతీయ ఆహారసంస్కృతి ఉండేది. సాధారణ కుటుంబాలలో ఆహారం, రాజకుటుంబీకుల ఆహారం పద్ధతులలో ఒకవిధమైన సంప్రదాయక ఐక్యత కనిపిస్తుంది.

కొరియన్ ఆహారాలలో బియ్యం, నూడిల్స్, తోఫూ, కూరగాయలు, చేపలు, మాసం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుని ఉన్నాయి. సంప్రదాయక కొరియన్ భోజనాలలో అన్నముతో పలు ఉప ఆహార పదార్ధాలు ఉంటాయి. ప్రతిభోజనంతో పలు బంచన్, కించి, మసాలు అధికంగా చేర్చిన కూర, కొరియాలో ప్రసిద్ధి చెందిన ఒక ఆహార పదార్థం సాధారణంగా ప్రతిభోజనంలో అన్నంతో చేర్చి వడ్డించబడితుంది. సాధారణంగా కొరియన్ భోజన తయారీలో సీసం నూనె, డూఎనాంగ్, సోయాబీన్ పేస్ట్, సోయా సాస్, ఉప్పు, తెల్లగడ్డలు, గోచుజంగ్ ( కారమైన మిరియాల పేస్ట్) అధికంగా ఉపయోగిస్తుంటారు. కొరియన్ భోజనాలలో సూపులను భోజనంలో ఒక భాగంగా వడ్డించబడతాయి. భోజనానికి ముందు కాని తరువాత కాని వీటిని వడ్డించరు.సెల్ ఫిష్, కూరగాయలతో చేసిన గక్ అనబడే సూప్ కొరియాలో సుప్రసిద్ధం. రెస్టారెంట్లలో తరచుగా అందించబడే టాంగ్ సూపులో తక్కువ నీటిని చేర్చి చిక్కగా తయారు చెయ్యబడితుంది. మరొక విధమైన సూపు జిజిగీ. వేడివేడిగా కారం, మిరియాల పొడితో చేసిన అధిక మసాలతో కూడిన ఒక స్ట్యూ కూడా కొరియన్ ప్రదిద్ధ వంటకాలలో ఒకటి. చాతిత్రకంగా కొరియాలో కుక్క మాసం ప్రజాదరణ పొందిన మాంసాహారలలో ఒకటి. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని పలు రెస్టారెంట్లలో కుక్క మాసంతో చేచిన ఆహారాలు లభ్యమౌతున్నాయి.

సమకాలీన సంగీతం, దూరదర్శన్, చలనచిత్రాలు

[మార్చు]

Contemporary music, film and television[edit] See also: Korean wave In addition to domestic consumption, South Korean mainstream culture, including televised drama, films, and popular music, also generates significant exports to various parts of the world. This phenomenon, often called "Hallyu" or the "Korean Wave", has swept many countries in Asia and other parts of the world.[184]

South Korean girl group Girls' Generation Until the 1990s, trot and ballads dominated Korean popular music. The emergence of the rap group Seo Taiji and Boys in 1992 marked a turning point for Korean popular music, also known as K-pop, as the group incorporated elements of popular musical genres of rap, rock, and techno into its music.[185] Hip hop, dance and ballad oriented acts have become dominant in the Korean popular music scene, though trot is still popular among older Koreans. Many K-pop stars and groups are also well known abroad, especially in other parts of Asia. Since the success of the film Shiri in 1999, Korean film has begun to gain recognition internationally. Domestic film has a dominant share of the market, partly because of the existence of screen quotas requiring cinemas to show Korean films at least 73 days a year.[186] Korean television shows, especially the short form dramatic mini-series called "dramas", have also become popular outside of Korea, becoming another driving trend for wider recognition. The trend has caused some Korean actors to become better known abroad. The dramas are popular mostly in Asia. The stories have tended to have a romance focus, such as Princess Hours, You're Beautiful, My Name is Kim Sam Soon, Boys Over Flowers, Winter Sonata, Autumn in My Heart, Full House, City Hunter, All About Eve and Secret Garden. Historical/fantasy dramas have included Dae Jang Geum, The Legend, Dong Yi and Sungkyunkwan Scandal.

సాంకేతిక సంస్కృతి

[మార్చు]

South Korean corporations Samsung and LG were ranked first and third largest mobile phone companies in the world in the first quarter of 2012, respectively.[188] An estimated 90% of South Koreans own a mobile phone.[189] Aside from placing/receiving calls and text messaging, mobile phones in the country are widely used for watching Digital Multimedia Broadcasting (DMB) or viewing websites.[190] Over one million DMB phones have been sold and the three major wireless communications providers SK Telecom, KT, and LG U+ provide coverage in all major cities and other areas. South Korea has the fastest Internet download speeds in the world, with an average download speed of 17.5 Mbit/s.[191]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-07-03. Retrieved 2007-09-04. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. https://www.pmindia.gov.in/te/news_updates/కొరియా-గణతంత్రం-అధ్యక్షు/
  3. రామారావు, మారేమండ (1947). భారతీయ నాగరికతా విస్తరణము (1 ed.). సికిందరాబాద్, వరంగల్: వెంకట్రామా అండ్ కో. Archived from the original on 6 మార్చి 2016. Retrieved 9 December 2014. {{cite book}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)