దాశరథీ శతకము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 63: పంక్తి 63:


[[వర్గం:శతకాలు]]
[[వర్గం:శతకాలు]]

[[en:Dasarathi Satakam]]

09:29, 6 అక్టోబరు 2009 నాటి కూర్పు

దాశరథీ శతకము శ్రీరాముని ప్రస్తుతిస్తూ కంచర్ల గోపన్న 17వ శతాబ్దంలో రచించిన భక్తి శతకము. ఈ శతకానికి దాశరథీ కరుణాపయోనిధీ అనే మకుటం అన్ని పద్యాలలో చివరగా వస్తుంది. దాశరథీ అనగా దశరథుని పుత్రుడైన శ్రీరాముడు.

ప్రారంభం

శ్రీ రఘురామ! చారుతుల - సీదళధామ శమక్షమాది శృం

గార గుణాభిరామ ! త్రిజ - గన్నుత శౌర్య రమాలలామ దు

ర్వార కబంధరాక్షస వి - రామ ! జగజ్జన కల్మషార్నవో

త్తారకనామ ! భద్రగిరి - దాశరథీ కరుణాపయోనిధీ

కొన్ని ఉదాహరణలు

రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో

త్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ స

త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమా

తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిథీ.


పరమదయానిధే పతితపావననామ హరే యటంచు సు

స్ధిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా

శిరమునదాల్తుమీరటకు జేరకుడంచు యముండు కింకరో

త్కరముల కాన బెట్టునట దాశరథీ కరుణాపయోనిధీ.


రాముఁడు ఘోర పాతక విరాముడు సద్గుణకల్పవల్లికా

రాముడుషడ్వికారజయ రాముడు సాధుజనావనవ్రతో

ద్దాముఁడు రాముడే పరమ దైవము మాకని మీ యడుంగు గెం

దామరలే భుజించెదను దాశరథీ కరుణాపయోనిధీ.


ఎంతటిపుణ్యమో శబరి యెంగిలిగొంటివి వింతగాదె నీ

మంతన మెట్టిదో యుడుత మైనిక రాగ్ర నఖాంకురంబులన్

సంతసమందఁ జేసితివి సత్కులజన్మము లేమి లెక్క వే

దాంతముగాదె నీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ.

ముగింపు

ఈ చివరి పద్యంలో కవి తన గురించి వివరాలు తెలియజేశాడు. తాను అల్లన లింగ మంత్రి గారి పుత్రుడిగా, అత్రిజ గోత్రం ఆది శాఖలో కంచెర్ల వంశంలో జన్మించినట్లుగా వివరించాడు.

అల్లన లింగమంత్రి సుతుడత్రిజ గోత్రజుడాదిశాఖ కం

చెర్ల కులోద్బవుం దంబ్రసిద్ధిడనై భవదంకితంబుగా

నెల్లకవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుడన్ జగ

ద్వల్లభ నీకు దాసుడను దాశరథీ కరుణాపయోనిధీ!

పూర్తి పాఠం