Jump to content

బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)

వికీపీడియా నుండి
బిగ్‌బాస్
కార్యక్రమ 3వ సీజన్ లోగో
సమర్పణsee below
Voices ofరాధాకృష్ణ
Theme music composerఎస్. తమన్ (1-3)
మణిశర్మ (4&5)
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల5 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య396 (డిసెంబర్ 20, 2020 వరకు)
ప్రొడక్షన్
ప్రొడక్షన్ స్థానాలులోనావాల(1)
హైదరాబాదు (2-5)
కెమేరా సెట్‌అప్Multi-Camera
నిడివి90 నిముషాలు (సుమారు)
ప్రొడక్షన్ కంపెనీEndemol India
విడుదల
వాస్తవ నెట్‌వర్క్స్టార్ మా
వాస్తవ విడుదల16 జూలై 2017 (2017-07-16) –
ప్రస్తుతం
బాహ్య లంకెలు
Website

బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్. టి. ఆర్ నిర్వహించగా[1][2] 2018, జూన్ 10 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 30 తేదీనన ముగిసిన రెండవ సీజన్ ను నాని నిర్వహించాడు.[3][4] 2019, జూలై 21న ప్రారంభమై 2019, నవంబరు 3న ముగిసిన మూడవ సీజన్ ను అక్కినేని నాగార్జున నిర్వహించాడు. 2020, సెప్టెంబరు 6వ తేదీన ప్రారంభమైన నాలుగవ సీజన్ అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా నిర్వహించారు.ఈ సీజన్ డి‌సెంబర్ 20 వ తేదీ 2020న ముగి‌సింది. [5]

ప్రారంభం

[మార్చు]

బిగ్ బాస్ తెలుగు అనేది హిందీ బిగ్ బాస్ ఆధారంగా రూపొందించబడిన రియాలిటీ కార్యక్రమం. ఇది జాన్ డి మోల్ రూపొందించిన డచ్ బిగ్ బ్రదర్ ఫార్మాట్ ఆధారంగా రూపొందించబడింది. వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఇంటి సభ్యులు (పోటిదారులు) గా బిగ్ బాస్ నిర్మించిన ఇంట్లో కొద్ది రోజులు కలిసి ఉండాలి. ప్రతివారం, ఇంటి సభ్యులు తమ తోటి ఇంటి సభ్యులలో ఇద్దరిని నామినేట్ చేస్తారు, ఎక్కువ నామినేషన్లు పొందిన ఇంటి సభ్యులు ప్రేక్షకుల ఓట్లను పొందుతారు. తక్కువ ఓట్లు వచ్చిన ఇంటి సభ్యులు ఇంటినుండి వెళ్లిపోతారు. అలా ప్రతివారం ఒకరు వెళ్ళిపోతుంటారు. చివరికి మిగిలినవారు విజేతలవుతారు.

నిబంధనలు

[మార్చు]

అన్ని నిబంధనలు ప్రేక్షకులకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంటి సభ్యులు తెలుగు లో మాత్రమే మాట్లాడాలి. ఎల్లప్పుడూ లాపెల్ ధరించాలి. బిగ్ బాస్ చేత తొలగించబడేంత వరకు ఇంటి ప్రాంగణంలోనే ఉండాలి. వారు నామినేషన్ ప్రక్రియ గురించి ఎవరితోనూ చర్చించకూడదు. బిగ్ బాస్ అనుమతి లేకుండా నిద్రించకూడదు.

ఇల్లు

[మార్చు]

మొదటి సీజన్లోని ఇంటిని లోనావాలా వద్ద ఏర్పాటుచేయగా రెండవ, మూడవ సీజన్ల కోసం హైదరాబాదు లోని అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేశారు.

ప్రసారం

[మార్చు]

బిగ్ బాస్ తెలుగు స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతుంది, హాట్‌స్టార్‌లో కూడా చూడవచ్చు. ప్రతిరోజు వచ్చే ఎపిసోడ్లలో మునుపటి రోజు ఇంటిలో జరిగిన ప్రధాన సంఘటనలు ప్రసారం చేయబడుతాయి. ప్రతి శనివారం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో ఇంటి నుండి బయటకు వచ్చిన పోటీదారుడికి వ్యాఖ్యాతతో ముఖాముఖి ఉంటుంది.

సీజన్ వివరాలు

[మార్చు]
సీజన్ వ్యాఖ్యాత (నిర్వహణ) స్థానం ప్రారంభ తేది ముగింపు తేది రోజులు పోటీదారులు నగదు బహుమతి ప్రారంభ రేటింగ్ చివరి రేటింగ్స్ విజేత ద్వితీయ విజేత
1 జూనియర్ ఎన్. టి. ఆర్ లోనావాలా 16 జూలై 2017 24 సెప్టెంబరు 2017 70 16 50 lakh (US$63,000) 16.18 టీఆర్పి 14.23 టీఆర్పి శివ బాలాజీ ఆదర్శ్ బాలకృష్ణ
2 నాని హైదరాబాద్ 10 జూన్ 2018 30 సెప్టెంబరు 2018 112 18 15.0 టీఆర్పి 15.05 టీఆర్పి కౌశల్ మండా గీతా మాధురి
3 అక్కినేని నాగార్జున 21 జూలై 2019 3 నవంబరు 2019 105 17 17.92 టీఆర్పి 18.29 టీఆర్పి రాహుల్ సిప్లిగంజ్ శ్రీముఖి
4 6 సెప్టెంబరు 2020 20 డిసెంబర్ 2020 105 19 25 lakh (US$31,000) 18.5 టీఆర్పి 21.7 టీీఆర్పి అభిజీత్ దుద్దల ఆఖీల్ సార్థక
5 5 సెప్టెంబర్ 2021 19 డిసెంబర్ 2021 105 19 50 lakh (US$63,000) 18 టీఆర్పి 18.4 టీఆర్పి సన్నీ షణ్ముఖ్ జస్వంత్
6 4 సెప్టెంబర్ 2022 18 డిసెంబర్ 2022 105 21 10 lakh (US$13,000) 8.86 టీఆర్పి 8.17 టీఆర్పి ఎల్.వి. రేవంత్ శ్రీహన్
7 3 సెప్టెంబర్ 2023 17 డిసెంబర్ 2023 105 19 35 lakh (US$44,000) 18.1 టీఆర్పి 21.7 టీఆర్పి పల్లవి ప్రశాంత్ అమర్‌దీప్ చౌదరి
8 1 సెప్టెంబర్ 2023 TBA TBA TBA 50 lakh (US$63,000) TBA TBA TBA TBA

పోటిదారుల వివరాలు

[మార్చు]
గ్రూపు సీజన్ 1 సీజన్ 2 సీజన్ 3 సీజన్ 4 సీజన్ 5 సీజన్ 6 సీజన్ 7 సీజన్ 8
సినిమా నటుడు/నటి ఆదర్శ్ బాలకృష్ణ అమిత్ తివారి ఆలీ రెజా
అర్చన భానుశ్రీ హేమ
ధన్‌రాజ్ హిమజ
శివ బాలాజీ కౌశల్ మండా మహేష్ విట్టా
సమీర్ కిరీటి దామరాజు పునర్ణవి భూపాలం
జ్యోతి తేజస్వి మదివాడ రవికృష్ణ
దిక్షా పంత్ (వైల్డ్ కార్డ్) నందిని రాయ్ (వైల్డ్ కార్డ్) రోహిణి
ప్రిన్స్ సిసిల్(నటుడు) సామ్రాట్ రెడ్డి వరుణ్ సందేశ్
ముమైత్ ఖాన్
నవదీప్ (వైల్డ్ కార్డు) పూజ రామచంద్రన్ (వైల్డ్ కార్డు) వితిక షేరు
సంపూర్ణేష్ బాబు తనీష్
టెలివిజన్ వ్యాఖ్యాత కత్తి కార్తీక దీప్తి నల్లమోతు జాఫర్ బాబు
శివ జ్యోతి
శ్యామల శ్రీముఖి
శిల్పా చక్రవర్తి (వైల్డ్ కార్డు)
గాయకులు మధుప్రియ గీతా మాధురి రాహుల్ సిప్లిగంజ్
కల్పన రాఘవేందర్ రోల్ రిడా
సినీ విశ్లేషకులు/సామాజికవేత్త కత్తి మహేష్ బాబు గోగినేని తమన్నా సింహాద్రి (వైల్డ్ కార్డు)
నృత్య దర్శకులు - - బాబా భాస్కర్
సామాజిక మాధ్యమాల వ్యక్తులు - దీప్తి సునైన అశు రెడ్డి
సాధారణ వ్యక్తులు - గణేష్ -
సంజన అన్నే
నూతన్ నాయుడు
విజేత శివ బాలాజీ కౌశల్ మండా రాహుల్ సిప్లిగంజ్ అభిజీత్ దుద్దల సన్నీ ఎల్.వి. రేవంత్ పల్లవి ప్రశాంత్ TBA
ద్వితీయ విజేత ఆదర్శ్ బాలకృష్ణ గీతా మాధురి శ్రీముఖి అఖిల్ సార్థక్ షణ్ముఖ్ జస్వంత్ శ్రీహన్ అమర్‌దీప్ చౌదరి TBA

ఇతర వివరాలు

[మార్చు]
  1. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో 6వ వారం సమయంలో ప్రధాన వ్యాఖ్యాత అక్కినేని నాగార్జున తన 60వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా స్పెయిన్ కు వెళ్ళిన కారణంగా, ఆ వారం సినీనటి రమ్య కృష్ణ వ్యాఖ్యాతగా చేసింది.
  2. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో 2019 దసరా సందర్భంగా నాగార్జున, బంగార్రాజు గెటప్ లో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి, హౌస్ మేట్స్ తో ఫన్నీ టాస్క్ లు ఆడించాడు.

బిగ్‌బాస్ సీజన్ 7 విజేత

[మార్చు]

ఉల్టా - పుల్టా అంటూ 2023 సెప్టెంబరు 3న ప్రారంభమై 105 రోజులు సాగిన బిగ్‌బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ గెలుపొందాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Junior NTR's Bigg Boss Is The 'Most Expensive' Telugu Show. Details Here". Ndtv.com. Retrieved 24 August 2019.
  2. "'Bigg Boss Telugu' marks TV debut of Junior NTR as host, show goes on air from July 15". Economictimes.indiatimes.com. Archived from the original on 30 జూలై 2017. Retrieved 24 August 2019.
  3. "Bigg Boss Telugu season 2: Here's the list of expected contestants". The Times of India. Retrieved 24 August 2019.
  4. "Bigg Boss Telugu Season 2: Full and final list of contestants". Times Of India. 11 June 2018. Retrieved 24 August 2019.
  5. Samayam Telugu (5 September 2021). "Bigg Boss 5 Telugu Contestants Final List: బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఫైనల్ 17 మంది లిస్ట్.. పూర్తి వివరాలతో ఎప్పుడు? ఎక్కడ? ఎలా!!". Archived from the original on 5 సెప్టెంబరు 2021. Retrieved 5 September 2021.
  6. "Bigg Boss Telugu 7 winner Pallavi Prashanth receives bail; has an emotional reunion with housemates". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-12-25. Retrieved 2023-12-30.

ఇతర లంకెలు

[మార్చు]