రామచంద్రాపురం (బిఎచ్ఇఎల్)
రామచంద్రాపురం | |
— రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో రామచంద్రాపురం స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°18′N 78°10′E / 17.30°N 78.17°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి |
మండలం | రామచంద్రాపురం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 15,381 |
- పురుషుల సంఖ్య | 8,085 |
- స్త్రీల సంఖ్య | 7,296 |
- గృహాల సంఖ్య | 3,919 |
పిన్ కోడ్ | 508114. |
ఎస్.టి.డి కోడ్ |
రామచంద్రాపురం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురం మండలానికి చెందిన జనగణన పట్ణణం.రెవెన్యూ గ్రామం.[1][2] రామచంద్రాపురం సంగారెడ్డికి 35 కి.మీ దూరంలో ఉంది. రామచంద్రపురం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో పరిధిలో ఒక భాగంగా ఉంది.ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థ వెస్ట్ జోన్, 13 వ సర్కిల్, 115 వవార్డు పరిధికి చెందింది.[3]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[4]
మెదక్ జిల్లా నుండి సంగారెడ్డికి
[మార్చు]రామచంద్రాపురం గతంలో మెదక్ జిల్లా, సంగారెడ్డి రెవెన్యూ డివిజను, ఇదే పేరుతో ఉన్న రామచంద్రాపురం మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి రెవెన్యూ డివిజను పరిధిలోకి రామచంద్రాపురం కేంద్రగా ఉన్న మండలాన్ని చేర్చుతూ 2016 అక్టోబరు 11 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా- మొత్తం 15,381 అందులో పురుషులు 8,085 కాగా, స్త్రీలు 7296 మంది ఉన్నారు. రామచంద్రపురం పట్టణ పరిధిలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1468 మంది ఉన్నారు.[5] ఇది రామచంద్రపురం (సిటి) మొత్తం జనాభాలో స్త్రీలు సెక్స్ నిష్పత్తి 9.54%గా ఉంది. స్త్రీ సెక్స్ నిష్పత్తి రాష్ట్ర సగటు 993 కు వ్యతిరేకంగా 902 గా ఉంది.బాలల లైంగిక నిష్పత్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939 తో పోలిస్తే 947 గా ఉంది. పురుషుల అక్షరాస్యత 93.73% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 83.11%.టౌన్ పరిధిలో మొత్తం 3,919 గృహాలకు పైగా పరిపాలనను కలిగి ఉంది.వీటికి నీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి ప్రాథమిక సౌకర్యాల బాధ్యత రామచంద్రాపురం పురపాలక సంఘం వహిస్తుంది. పట్టణ పరిధిలోని రహదారుల నిర్వహణ, కొత్తవాటిని నిర్మించడానికి దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి పురపాలక సంఘానికి అధికారం ఉంది.[5]
బస్తీదవాఖానాల ప్రారంభం
[మార్చు]టీ డయాగ్నసిస్ ద్వారా 57 రకాల పరీక్షలు ఉచితంగా చేయడంకోసం రామచంద్రాపురం గ్రామ పరిధిలోని ఎస్.ఎన్ కాలనీ, బొంబాయి కాలనీ, ఎల్ఐజీ భారతీ నగరి కాలనీల్లో ఏర్పాటు చేసిన బస్తీదవాఖానాలను 2022, ఫిబ్రవరి 19న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు ప్రారంభించాడు. ఈ దవాఖానాలలో నిపుణులైన ఎంబీబీఎస్ డాక్టర్, స్టాఫ్ నర్సు, ఇతర సిబ్బంది ఉంటూ వైద్య సేవలు అందించడంతోపాటు పాము కాటు, కుక్క కాటు, డెంగ్యూ, మలేరియా సహా అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయి.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Sangareddy.pdf
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2022-01-17. Retrieved 2020-09-28.
- ↑ "GHMC Prepars Draft Plan for Delimitation of Wards". The New Indian Express. Retrieved 2020-06-29.
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2022-08-15.
- ↑ 5.0 5.1 "Ramachandrapuram Census Town City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-29.
- ↑ telugu, NT News (2022-02-19). "పేదల కోసమే బస్తీ దవాఖానాలు : మంత్రి హరీశ్‌రావు". www.ntnews.com. Archived from the original on 2022-02-19. Retrieved 2022-02-19.
- ↑ Velugu, V6 (2022-02-19). "బస్తీ దవాఖానల్లో 57 రకాల పరీక్షలు ఉచితం". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-19. Retrieved 2022-02-19.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)