Jump to content

వాడుకరి:రాకేశ్వర/ఛందస్సు

వికీపీడియా నుండి


అంగజాస్త్ర వృత్తము
గణములు - భ, మ, స, గ 1,2 పాదములకు మరియు మ, స, జ, గ-3,4 పాదములకు
యతిస్థానము - ఆఱవ అక్షరము
ఛందము - పంక్తిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 10
ప్రాసనియమము - కలదు
దాబలేంద్రోదారభమంబుల్
పూనిసగా ప్తిం బొంపిరివోవన్
జానార న్మసజంబు గస్థితం
బై నీజంజను నంగజాస్త్ర మై

అంతరాక్కర
గణములు - 1సూర్యగణము, 2ఇంద్రగణములు, 1చంద్రగణము
యతిస్థానము - నాల్గవ గణాధ్యక్షరం

ప్రాసనియమము - కలదు
లమిత్రుండు సురరాజణ యుగంబు
లశత్రునితోఁ జెంది కందళింప
రుఁ బ్రావళ్ళు నర్థంబు తిశయిల్ల
ల మగు నంతరాక్కర బ్ధిసంఖ్య

అంబుజ వృత్తము
ఛందము - సుప్రతిష్ఠాచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 5
గణములు - భ, వ
ఇంగు భకా
రంబును వకా
రంబును జుమీ
యంబుజ మగున్

అంబురుహము
గణములు - భ, భ, భ, భ, ర , స, వ
యతిస్థానము - 13
ఛందము - కృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 20
ప్రాసనియమము - కలదు
భాభరంబులపై సవలొందుచు భానువిశ్రమయుక్తమై
యీభువి నంబురుహంబనఁగాఁ జను నిందువంశనృపాగ్రణీ

శ్రీ మణీప్రియ మల్లియరేచ విశిష్టకల్పమహీజ భా,
భా,ర, స, నంబుల భాను విరామము ల్కనంబురుహంబగున్.


అజిత ప్రతాపము
స్వస్థానార్థసమ వృత్తము
గణములు - స, జ, స, స, బేసి పాదములకు,న, భ, జ, భ సరిపాదములకు
పాదాక్షరసంఖ్య - 12
ప్రాసనియమము - కలదు
సాగణావలిఁ బ్రసన్న నభా
గ్రరపంక్తి నభిరామరూపమై
జితప్రతాపచెలువారుఁ గృతి
న్వియవిక్రమణ విశ్వభూవరా

అపరాజితము
గణములు - న, న, ర, స, వ
యతిస్థానము - 9
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
రసలగముల్ దర్చిన సత్కృతిం
రఁగ నపరాజితంబు కవిస్తుతిన్

అర్కుటము
గణములు - న, జ, భ, జ, జ, వ

అలసగతి

అల్పాక్కర
గణములు - 3 గణములు,2 ఇంద్రగణములు,1 చంద్రగణము
యతిస్థానము - 3వ గణాద్యక్షరము
సునఃపతియుగము సోముండును
నెకంగఁ బ్రావళ్ళు నిండిమీఱ
నీయవిభవంబుగాంచునెప్డు
ణీయ మల్పాక్కము కృతుల
గమనిక - ఇది గీత పద్యము వలె నున్నది

అశ్వగతి
గణములు - భ,భ,భ,భ,భ,గ
యతిస్థానము - 10

అశ్వలలితము
గణములు - న, జ, భ, జ, భ, జ, భ, వ
యతిస్థానము - 12
ఛందము - వికృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 23
ప్రాసనియమము - కలదు
భజము ల్భజంబులకు నచ్చి భస్థలగయుక్తమై రవియతిం
బ్రనితమైన నశ్వలలితంబు రాజకులదీప ధీజననుతా

అశ్వవిలసితము

అష్టమూర్తి
గణములు - మ, న, త, స, ర, భ, జ, య

అసంబాధ
గణములు - మ, త, న, స, గ, గ
యతిస్థానము - 12
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు

ఆటవెలది
గణములు - బేసి పాదములలో3 సూర్యగణములు,2 ఇంద్ర గణములు, సరిపాదములలో 5సూర్యగణములు
యతిస్థానము - నాల్గవ గణాద్యక్షరం
ప్రాసయతి - చెల్లును
ప్రాస - లేదు .
నగణత్రయంబు నింద్ర ద్వయంబును
హంస పంచకంబు నాటవెలది

ఆపాతలిక

ఆర్య (వృత్తము)

ఆలోల
గణములు - మ, స, మ, భ, గ, గ
యతిస్థానము - 8
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు

ఇందువదన
గణములు - భ, జ, స, న, గ,
ఛందము - అతి జగతి
పాదాక్షర సంఖ్య - 13
యతిస్థానము - 9

ఇంద్రవంశము
గణములు - త, త, జ, ర
యతిస్థానము - 8
ఛందము - జగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 12
ప్రాసనియమము - కలదు
తా జ రా కల్పన నింద్రవంశకా
ఖ్యాతాఖ్య మయ్యెన్ బరగండభైరవా

న్మానధారీ ! తతజంబు రేఫతో
విన్మింద్రవంశాహ్వయ వృత్తమై చనున్.

ఇంద్రవజ్రము
గణములు - త, త, జ, గ, గ
యతిస్థానము - 8
ఛందము - త్రిష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 11
ప్రాసనియమము - కలదు
తాజగానిర్మితి నింద్రవజ్రా
నీతాఖ్య వర్తించు వినిర్మలోక్తిన్

త్తా, జ, గా సంగతి నింద్రవజ్రా
వృత్తంబగున్ సన్నుత - వృత్తరేచా !

ఇల

ఉత్కలిక

ఉత్పలమాల
గణములు - భ, ర, న, భ, భ, ర, ల, గ
యతిస్థానము - 10
ఛందము - కృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 20
ప్రాసనియమము - కలదు
భానుసమాన విన్ బరన భారలగంబుల గూడి విశ్రమ
స్థాము నందు బద్మజ యుతంబుగ నుత్పలమాలయై చనున్
ప'ద్మజయుగ్యతిన్ భరనభారలగంబులఁ జెంది సన్మనః
ప'ద్మవికాస హేతువగు ద్యము నుత్పలమాలయం డ్రిలన్

ఉత్సాహము
గీ
హగణనగణంబు లేడు గుర్వంతమగుచు
వి స్తరిల్లిన నుత్సాహవృత్తమయ్యె
దీనితుద గీతియొకఁడు సంధింప విషమ
సీస మిత్తెఱఁగెఱుఁగుట చెలువుమతికి

ఓసరించుఁ బజ్జ లజ్జ లుజ్జుగించు రాజులన్
వేసరించు గర్వపర్వవేషభూషితారులన్
వాసవానుకార వీరవర్య విశ్వభూప నీ
భాసురాసిధేనుకానుభావ మాహవంబులన్

ఉత్సుకము
గణములు - భ, భ, ర
ఛందము - బృహతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 9
ప్రాసనియమము - కలదు
త్సుక మౌ భభరంబులన్
త్సరి మాన విమర్థనా

ఉపజాతి
గణములు - ఒక పాదం త, త, జ, గ, గ (ఇంద్రవజ్రము) మరియు ఒకపాదం జ, త, త, గ, గ (ఉపేంద్రవజ్రం)
ఛందము -త్రిష్టుప్ ఛందము
యతిస్థానము - 8
యింద్రవజ్రాఖ్య ముపేంద్రవజ్ర
శ్రయంబు గాఁగా నుపజాతి మయ్యెన్

ఈ రెండు వృత్తంబులు నిందుఁగూడన్
సరోజనేత్రా ! యుపజాతి యయ్యెన్.
1, 3 పాదములు ఇంద్రవజ్ర మరియు 2,4 పాదములు ఉపేంద్రవజ్ర ఉండును.

ఉపేంద్రవజ్రము
గణములు - జ, త, జ, గ, గ
యతిస్థానము - 8
ఛందము - త్రిష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 11
ప్రాసనియమము - కలదు
పేంద్రవజ్రాహ్వయ మొప్పునిం పై
యుపేంద్రపుత్త్రా జతజోక్తగాలన్

ద్మ పద్మా ! జత ల్గగంబున్
పేంద్ర వజ్రాఖ్యము నొప్పు జెప్పన్.

ఉష్టిక్

ఊర్వశి
గణములు - న, త, త, ర, గ
యతిస్థానము - 8
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాసనియమము - కలదు

ఏకరూప

కందము
క..
కంము త్రిశర గణంబుల
నంము గా భ జ స నలముటవడి మూటన్
బొందును నలజల నాఱిట
నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్
క.
అందును గందంబులు నా
నందంబులు భజసనలగాఖ్యలచే వా
నిం గు నెఱుగం బ్రాసము
ముందుగ నిడి మూఁడు నైదు మూడున్నైదున్
క.
ఆదిమ వర్ణము వళి నిడు
పై దొరకినఁ గుఱుచయైన నట్టుల తత్త
త్పాదాదుల నిలుపందగు
గాదిలిగాఁ జెప్పఁ దలఁచు కందంబులన్
క.
నిడుదలగు పాదములకును
వడి నాలవగణము మొదల వలయు నిలుప న
క్కడలను గురువును మూఁడవ
యెడ నలజలలోన నొకటి నిడ బెడఁగడరున్
క.
\*ఇందు పుర బాణనగముల
కందువ జగణంబు నిలుపఁగా గా దెపుడుం
గందములకు నార్యాదుల
చందం బధికంబు వానిఁ జనుఁ దెలియంగన్

\*ఇందు=1, పుర=3, బాణ=5, నగములు=7
క.
కందము నర్థంబులతుద
నందినగురు వుడుపఁ బథ్య యగు నాఱవచోఁ
జెందిన జగణము లత్వముఁ
బొందిన నది యార్యయనఁగఁ బొసఁగుంగృతులన్
క.
క్రమమునఁ బథ్యార్యార్థము
లమరంగా వీడుపడిన నది గాథాభే
దముగాఁగం బరఁగు ప్రపం
చము తెనుఁగునఁ జెప్పరండ్రు చతురులు కృతులన్

కన్యావృత్తము
ఛందము - ప్రతిష్ఠాచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 4
ప్రాస నియమము - కలదు
పొత్తై మాగా
వృత్తిం గన్యా
వృత్తం బయ్యెన్
జిత్తం బారన్

కపాలి

కమలనగీతి

కమల విలసితము
గణములు - న, న, న, న, గ, గ
యతిస్థానము - 9
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు

కరిబృంహితము
గణములు - భ, న, భ, న, ర
యతిస్థానము - 13
ఛందము - అతిశక్వరి ఛందము
పాదాక్షరసంఖ్య - 15
ప్రాసనియమము - కలదు

కర్ణాటచతుష్పదము

కలరవము
గణములు - స, న, న, న, ల, గ
యతిస్థానము - 8
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు

కలహంసి
గణములు - త, య, స, భ, గ
యతిస్థానము -
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాసనియమము - కలదు

కలితాంతము
గణములు - త, ర, జ, వ
యతిస్థానము - 8
పాదమునకు 11 అక్షరాలు

కవికంఠభూషణము

కవిరాజవిరాజితము
గణములు - న, జ, జ, జ, జ, జ, జ, ల,గ
యతిస్థానము - 8,7,7 మఱియు ఇంకొక పక్షమున 8, 14
ఛందము - వికృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 23
ప్రాసనియమము - కలదు
క్రమున నొక్క నకారము నాఱుజకారములున్ బరగంగ వకా
మును నొడంబడి రా గవిరాజ విరాజిత మన్నది రామ నిభా

కిరీటము

కుటజగతి
గణములు - న, జ, మ, త, గ
యతిస్థానము -
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాసనియమము - కలదు


కుమారలలిత
గణములు - జ, న, గ
ఛందము - ఉష్ణిక్కుచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 7
ప్రాసనియమము - కలదు
కుమార లలితకున్ - సమగ్రజనగముల్

కుమారి
గణములు - న, జ, భ, జ, గ, గ
యతిస్థానము - 9
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు

కుసుమవిచిత్రము

కుసుమితలతావేల్లి తావృత్తము
గణములు - మ, త, న, య, య, య
యతిస్థానము - 11
ఛందము - ధృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 18
ప్రాసనియమము - కలదు
స్వశ్రేయస్సిద్ధిన్ మతనయయవ్యాప్తిచేఁ జర్మవాసో
విశ్రామం బొప్పగుం గుసుమిలతావేల్లితా వృత్తమయ్యెన్

కోమల వృత్తము
గణములు - న, జ, జ, య, -బేసి పాదములకు, జ, భ, స, జ,గ - సరిపాదములకు
సలలితరీతి నజాయగణంబుల్
చళుక్యభూప జభసజస్థగస్థితిన్
మలయుచు నర్థసమర్థతచేత
న్వెలుంగఁ గోమల మను వృత్త మొప్పగున్

కౌముది

క్రౌంచపదము
గణములు - భ, మ, స, భ, న, న, న, య
యతిస్థానము - 18
ఛందము - సంకృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 24
ప్రాసనియమము - కలదు
ప్రాంచిత తేజఃకుంచితవైరీ భమసభననన పరిచిత రీతిన్
అంచితమయ్యెం గ్రౌంచపదాఖ్యం బరుగతహరిదియతి నభివృత్తిన్

క్షమ
మారుపేరు - క్షప
గణములు - స, న, త, త, గ
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షర సంఖ్య - 13
యతిస్థానము - 8
ప్రాస నియమము - కలదు

క్ష్మాహారము

ఖచరప్లుతము
గణములు - స, భ, భ, మ, స, స, వ
యతిస్థానము - 12
ఛందము - కృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 20
ప్రాసనియమము - కలదు
భభముల్ మససంబు లగాప్తి న్నాగవిభూషణయుగ్యతిన్
శుభదమై ఖచరప్లుత మొప్పు న్సోమకులార్ణవచంద్రమా

గజవిలసితము

గీతాలంబనము
గణములు - త,జ,జ,న
ఛందము - త్రిష్టుప్ ఛందము
పాదాక్షరసంఖ్య -11

గోవృష
గణములు - మ, త, య, స, గ, గ
యతిస్థానము - 5
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు

గౌరి
గణములు - న, న, న, స, గ
ఛందము - అతి జగతీ ఛందము
పాదాక్షర సంఖ్య - 13
ప్రాసనియమము - కలదు

చంచరీకాతతి
గణములు - య, మ, ర, ర, గ
యతిస్థానము - 7

చంచరీకావళి
గణములు - మ, మ, ర, ర, గ
యతిస్థానము - 7
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షర సంఖ్య - 13
ప్రాస నియమము - కలదు

చంచరీకాతతి
గణములు - య, మ, ర, ర, గ
యతిస్థానము - 7
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షర సంఖ్య - 13
ప్రాసనియమము - కలదు

చంద్రకళ
గణములు - ర, స, స, త, జ, జ, గ
యతిస్థానము - 11
ఛందము - అతిధృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 19
ప్రాసనియమము - కలదు
వ్యక్తరీతి రసాతజజగ్రాత్త గకారనిరూఢిచే
క్త దిగ్విరమంబన నొప్పుం జంద్రకళాహ్వయమై ధరన్

చంద్రరేఖ

చంద్రలేఖ
గణములు - న, స, ర, ర, గ
యతిస్థానము - 7
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాసనియమము - కలదు

చంద్రవర్త్మ

చంద్రశ్రీ
గణములు - య, మ, న, స, ర, గ
యతిస్థానము - 11
ఛందము - అష్టిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 16
ప్రాసనియమము - కలదు
గుం జంద్రశ్రీదా హారవిరణాయత్తనమైనం
బ్రగాఢంబై యొప్పున్ య మ న స బద్ధాగ్రగాప్తిన్

చంద్రిక
గణములు - న, న, త, ర, గ
యతిస్థానము - 8
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షర సంఖ్య - 13
ప్రాస నియమము - కలదు

చంద్రిక
గణములు - న, న, ర, వ
యతిస్థానము - 7
ఛందము - త్రిష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 11
ప్రాసనియమము - కలదు
లితముగఁ జంద్రికాహ్వయం
రు ననరవాంక మై కృతిన్

చంపకమాల
గణములు - న, జ, భ, జ, జ, జ, ర
యతిస్థానము - 11
ఛందము - ప్రకృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 21
ప్రాసనియమము - కలదు
భజజ్జలరేఫలు పెనంగి దిశాయతి తోడ గూడినన్
త్రిగదభిష్టుతా బుధనిధీ విను చంపకమాలయై చనున్

చతుష్పద

చపల

చామరము

చిత్రపదము
గణములు - భ, భ, గ, గ
ఛందము - అనుష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 8
ప్రాసనియమము - కలదు
చిత్రపదం బన భాగా
చిత్రయతిప్రతిపత్తిన్

చౌపది
భ స గానల ములపైని గరంబు
న్నెసఁగఁగ మూఁడవయెడ విరమంబుం
బొసఁగినఁ జౌపదిఁబొలుచు రసంబుం
గసవరముగఁ దగుఁ ప్రాసంబున్

జఘనచపల

జలంధరము
గణములు - భ, భ, భ, జ, వ
యతిస్థానము - 11
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు

జలదము
గణములు - భ, ర, న, భ, గ
యతిస్థానము - 10
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాస నియమము - కలదు
ర నంబుల న్భగురు లెక్కుచు నిం
పై జియించె నేని జలదాహ్వయ మౌ

జలధరమాల
గణములు - మ, భ, స, మ
యతిస్థానము - 9
ఛందము - జగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 12
ప్రాసనియమము - కలదు
మాద్యత్ప్రీతిం జలధరమాలాభిఖ్యం
బ్రద్యోతించున్ మ భ స మ ద్రాప్తిన్

జలోద్ధతగతి
గణములు - జ,స, జ,స
ఛందము - జగతీ ఛందము
పాదాక్షర సంఖ్య - 12
ప్రాసనియమము - కలదు

తనుమధ్యావృత్తము
గణములు - త, య
ఛందము - గాయత్రీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 6
ప్రాసనియమము - కలదు
ప్పున్ తయ యుక్తిం
జెప్పం దనుమధ్యన్

తన్వి

తరలము
మారుపేరు - ధృవకోకిల
గణములు - న, భ, ర, స, జ, జ, గ
యతిస్థానము - 12
ఛందము - అతిధృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 19
ప్రాసనియమము - కలదు
రసంబులు జాగవర్గము చ్చి యీశ్వరవిశ్రమ
ప్రవమై తరలం బనంజను రాజవంశశిఖామణీ

తరళము
గణములు - భ, స, న, జ, న, ర
యతిస్థానము - 11
చారుభసన భూరి జన రసాంద్రగణములన్ దిగా
సా విరతినందముగ నిజంబు వరలి చెన్నగున్

తరువోజ
నలనామకంబులు నగణాంతములుగ నాలుగంఘ్రులయందు నాలుగుఁగూర్చి
వళులు మూఁడెడలను వరుసతో నిల్ప వలయు మూఁడవగణవర్ణంబు మొదల
నిలుపంగ నివ్విధి నిర్మించి విశ్వనృపతికి నిచ్చిన నింపుసొంపారుఁ
దలకొని తగఁబ్రాలు దంపెడిచోటఁ దరుణులచే సొంపుదనరుఁ దర్వోజ

తురగము

తురగవల్గితవృత్తము
గణములు - న, న, న, న, స, జ, జ, గ
యతిస్థానము - 15
ఛందము - ఆకృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 22
ప్రాసనియమము - కలదు
మెఱయు న న న న స జ జ గములను మేలుగా రచియించినన్
ఱలు మనుయతి వలనను దురగల్గితంబను వృత్తమై

తేటగీతి
గణములు - 1సూర్యగణము, 2 ఇంద్రగణములు, 2 సూర్యగణములు
ప్రాసనియమము - లేదు
యతిస్థానము - నాల్గవగణాద్యక్షరము
ప్రాసయతి - చెల్లును
సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు
దినకరద్వయంబు తేటగీతి

తోటకము
గణములు - స, స, స, స
యతిస్థానము - 9
ఛందము - జగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 12
ప్రాసనియమము - కలదు
సం బయి సాసససంభృతంమై
విచించినఁ దోటకవృత్తమగున్

తుదిదాఁక సకార చతుష్కముగా
విదితంబుగఁ దోటక వృత్తమగున్.

పాదపము
గణములు - భ,భ,భ,గ,గ
యతిస్థానము - 7
ఛందము - త్రిష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 11
ప్రాసనియమము - కలదు
కామితభత్రయ గాయుత మై వి
శ్రాపుఁ దోదక సంజ్ఞతఁ జెందున్

పాపవృత్తము భా భగగంబుల్
మోముతో నిరు మూఁడవిరామన్

తోదకము
గణములు - న, జ, జ, య
యతిస్థానము - 8
ఛందము - జగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 12
ప్రాసనియమము - కలదు
లిత మైన నజాయగణంబుల్
విసిత తోదకవృత్తముఁ జెప్పున్

రుహవక్త్ర ! న, జా, య గణంబుల్
వెయఁగఁ దోదక వృత్తముఁ జెప్పున్.

తోవకము
గణములు - భ, భ, భ, గ, గ
యతిస్థానము - 7
ఛందము - జగతీ ఛందము
పాదాక్షరసంఖ్య - 11
ప్రాసనియమము - కలదు
శ్రీయుత భ త్రయ సేవ్యగగంబుల్
తోజలోచన తోవకమయ్యెన్.

తామరసము

త్రిపద

త్రిపది
గణములు - 1వ పాదము 4 ఇంద్రగణములు మరియు2 వపాదము 2ఇంద్రగణములు, 2 సూర్యగణములు మరియు 3వపాదం

2ఇంద్రగణములు,1 సూర్యగణము
త్రిపదికి నొకయంఘ్రి నింద్రులు నలువురు
ద్యుపతులిద్దఱు సూర్యులిర్వు రౌల
ద్యుపతిద్వయార్కులునౌల

త్రిభంగి
ఉద్ధురమాలా వృత్తము
గణములు - న, న, న, న, న, న, స, స, భ, మ, స, గ
పాదమునకు మాత్రలు - చత్వారింశన్మాత్రాగర్భితపాదంబు
పాదాక్షరసంఖ్య - 34
లి న న న న స న ములు ససభమములు నతిసగయుక్తిఁ జరింపం బ్రసరింపం బాటివహింపం
జెలువుగనవకలి నిలుపఁగదగునెడ వెలయుఁద్రిభంగి సురక్తిం బదభక్తిం బ్రాసనియుక్తిన్

త్వరితపదగతి
గణములు - న, న, న, న, న, గ, గ
యతిస్థానము - 11
ఛందము - అత్యష్టిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 17
ప్రాసనియమము - కలదు
త్వరితపదగతి యనఁగఁ గు న న న నాగా
విరచితయు దశమయతి విలసితయు నైనన్

దండకము
హ-న-స-త వీనిలో ఏదో ఒక గణముతో దండకాన్ని పూర్తిచేసి చివర ఒక గురువుతో ముగించాలి
విద్వాంసు లెల్లన్ హ కారంబె కానీ న కారంబెకానీ స కారంబె కానీ వచింపం దగున్ముందుగా నిందు గాదేని యాదిం దకారంబు గల్పించి

యామీది వెల్లన్ దకారంబులే మెండుగా నిచ్చకు న్వచ్చు నందాక నిర్మించి గుర్వంతముం జేసినన్ దండకంబండ్రు కాదంబినీ నీలగోపాల బాలా

నమస్తే పునస్తేనమః

దుర్మిలా

దృతవిలంబితము
గణములు - న, భ, భ, ర
యతిస్థానము - 7
ఛందము - జగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 12
ప్రాసనియమము - కలదు
ద్రువిలంబితరూపితవృత్తిచేన్
బ్రతమయ్యె నభారగణంబులన్

దోధకము

ద్విపద
ఇంద్ర గణములు మూఁ డిన గణంబొకటి
చంద్రాస్య ! ద్విపదకుఁను చెప్పరేచ
ద్విదకు ద్విపదకుఁ దెగ జెప్పవలయు
నెపుడు సంస్కృతమున నితర భాషలను
తుల లోపలఁ బ్రాసతి దక్క సకల
తులు చెల్లును బ్రయో గాతి సారమున
ద్విద తో ద్విపద సంధిల నేకశబ్ద
పుడు రెంటను గూర్ప ది యయుక్తంబు

ద్విపది మంజరి
గణములు - 3 ఇంద్రగణములు, 1 సూర్యగణము
అన్యవివరములు - ద్విపదికి వళి,ప్రాస రెండూ ఉంటాయి. మంజరికి ప్రాస ఉండదు
క్రత్రయంబును వితృండుఁ బాద
విక్రీడితులు మృదుద్విపదికి నెపుడు
ళియుఁ బ్రాసంబును లయు దీనికిని
దు ప్రాసంబండ్రు రుస మంజరికి

ద్విరదగతి

ధరణి

ధరణిధరగతి

ధృతమధ్య

ధృవకోకిల
గణములు - న, భ, ర, స, జ, జ, గ
యతిస్థానము - 12
శువిలాస ముకుంద కేశవ శూలిభవ్య విరామమున్
రసంబులు జాగముల్ దగు వ్యమై ధృవకోకిలన్

నది
గణములు - న, న, త, జ, గ, గ
యతిస్థానము - 8
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు

నదీప్రఘోషము
గణములు - ర, ర, ర, ర, మొదటి పాదము మరియు జ, త, జ, ర మిగిలిన 3 పాదములు
ఛందము - స్వస్థాన విషమ వృత్తము
భారంబుల్మొగిం బ్రాగుపేతంబులై
రించుచుండం జతస్థరేఫలం
త్రిపాదంబులఁ ర్వునొప్పుఁగన్
దిరంబుగా మూఁట నదీప్రఘోషమై

నరేంద్ర

నర్కుటము
గణములు - న, జ, భ, జ, జ, వ
యతిస్థానము - 11
ఛందము - అత్యష్టిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 17
ప్రాసనియమము - కలదు
జభజముల్ జవంబులఁ దర్చిన నర్కుటక
ప్రజననమొప్పు దిగ్యతిని రాజకులాబ్ధిశశీ

నవనందిని
గణములు - స, జ, స, న, గ, గ
యతిస్థానము - 9
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య -14
ప్రాసనియమము - కలదు

నాందీముఖి
గణములు - న, స, త, త, గ, గ
యతిస్థానము - 8
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు

నాగరము

నారాచము

నారీనుతము

నారీప్లుతవృత్తము
స్వస్థానార్థసమ వృత్తము
గణములు - 1,3 పాదములు ఒకవిధంగా మ, త, త, గ, గ, అలానే 2,4 పాదములొకవిధంగా త, త, జ, గ, గ ఉంటాయి
యతి స్థానము - 1, 3 పాదములకు 7 వఅక్షరము, 2,4 పాదములకు 8 వ అక్షరము
దానోదార శ్రీమతా గానియుక్తిం
గానంగఁదాజస్థ గగప్రసక్తిన్
మానై' చాళుక్యక్షమాపాలరమ్య
స్థానంబునారీప్లుత సంజ్ఞమయ్యెన్

నారీ వృత్తము
ఛందము - మధ్యాచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 3
నారీవృ
త్తారంభం
బారు న్మా
కారం బై

నియోగిని

నిశా

పంక్తి
ఛందము - సుప్రతిష్ఠా చ్ఛందము
పాదాక్షర సంఖ్య -5

పంచచామరము
గణములు - జ, ర, జ, ర, జ, గ
యతిస్థానము - 10
త్వరాస దృగ్విధీయమాన దానతోయ శోషితాం
బురాశి వర్ధనాతి కృత్ప్రభూత కీర్తి మండల
స్ఫుత్సుధా మయూఖ వైరి భూమి భృచ్చిరోల్లస
త్కిరీట రత్న రాజితకాంతి దీపితాంఘ్రి పంకజా

పంచపది

ప్రణవము
గణములు - మ,న,య,గ
యతిస్థానము - 6
ఛందము - పంక్తిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 10
ప్రాసనియమము - కలదు
అందంబై మనయుగముల్ సొంపిం
పం ప్పొందక ణవం బయ్యెన్

పథ్య

పద్మకము
గణములు - న, భ, జ, జ, జ, గ
యతిస్థానము - 11
ఛందము - అష్టిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 16
ప్రాసనియమము - కలదు
జ జద్వయ గకార సనాతన విశ్రుతిం
బ్రవమై పరఁగు సత్కృతిఁ ద్మకకృత్తమై

పద్మనాభము
గణములు - త, త, త, త, త, త, త, గ, గ

పరావతి

పాలాశదళము
గణములు - న, న, న, న, న, గ, గ

పృథివీవృత్తము
గణములు - జ, స, జ, స, య, వ
యతిస్థానము - 12
ఛందము - అత్యష్టిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 17
ప్రాసనియమము - కలదు
సంబులు జసంబులున్ యవనిక్త రూపంబులై
పొసంగఁ బృథివీసమాఖ్యయగుఁ భూషవిశ్రాంతితోన్

ప్రగుణ వృత్తము
ఛందము - సుప్రతిష్ఠాచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 5
గణములు - స, గ, గ
ప్రాసనియమము - కలదు
ణాసక్తిం
సంయుక్తిన్
బ్రగుణాఖ్యంబై
గు నింపారన్

ప్రభాతము
గణములు - న, జ, జ, ర, గ
యతిస్థానము - 8
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాస నియమము - కలదు
మొల నజారగము ల్ప్రభాతసంజ్ఞం
బొవఁగ జేయు నపూర్వకల్పనోక్తిన్

ప్రమాణి
గణములు - జ, ర, వ
ఛందము - అనుష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 8
ప్రాసనియమము - కలదు
కారమున్ రకారమున్
కారముం బ్రమాణికిన్

ప్రమితాక్షరము
గణములు - స, జ, స, స
యతిస్థానము - 9
ఛందము - జగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 12
ప్రాసనియమము - కలదు
లక్రియాప్తిఁ బ్రమితాక్షర మై
రున్ సజస్థ స స యంత్రిత మై

ప్రహరణకలిత
గణములు - న, న, భ, న, వ
యతిస్థానము - 8
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
ప్రరణకలితంయి న స భ స వల్
హువిధయతులం బ్రథఁ జెలు వడరున్

ప్రహరణకలిత
గణములు - న, న, భ, న, ల, గ
యతిస్థానము - 8
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు


ప్రహర్షిణి
గణములు - మ, న, జ, ర, గ
యతిస్థానము - 8
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాసనియమము - కలదు
ప్రావీణ్యప్రదయొనరం బ్రహర్షిణిందాఁ
గావించున్ మ న జ ర వ్రజంబుధాత్రిన్

ప్రహేయము

ప్రియంవద
గణములు - స, భ, జ, ర
ఛందము - జగతీ ఛందము
పాదాక్షరసంఖ్య -12
ప్రాసనియమము - కలదు

ప్రియకాంత
గణములు - న, య, న, య, న, గ
యతిస్థానము - 11
ఛందము - అష్టిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 16
ప్రాసనియమము - కలదు
న యయుక్తిం దగ సగణంబున్ గురువొందున్
నితము దిగ్విశ్రమమును నించుం బ్రియకాంతన్

ఫలసదనము
గణములు - న, న, న, న, స, గ
ప్రాసనియమము - కలదు

బంధురము
గణములు - న, న, స, స, స, భ, భ, గ
ప్రాసనియమము - కలదు

బలభిన్మణి
గణములు - భ, స, న, న, గ
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షర సంఖ్య - 13
యతిస్థానము - 7
ప్రాసనియమము - కలదు

బింబము
చందము - ప్రతిష్ఠా చ్ఛందము
ప3దాక్షర సంఖ్య 0 4
ప్రాసనియమము - కలదు

భంభరగానము
గణములు - న, న, భ, భ, గ
యతిస్థానము - 8
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షర సంఖ్య - 13
ప్రాసనియమము - కలదు

భద్రకము
గణములు - భ, ర, న, ర, న, ర, న, గ
భద్రకము
గణములు - ర, న, ర
ఛందము - బృహతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 9
ప్రాసనియమము - కలదు
ద్రకంబు రనరంబులన్
ద్ర విశ్వనృపమన్మథా

భద్రిణీవృత్తము
గణములు - భ, ర, న, ర, న, ర, న, గ
యతిస్థానము - 12
ఛందము - ఆకృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 22
ప్రాసనియమము - కలదు
భాదిరనత్రయంబు గురు యుక్తమై గిరిశవిశ్రమప్రకటమై
మేదిని నొప్పు భద్రిణికి నందు మేరునగధీర విశ్వనృపతీ

భాస్కరవిలసితము
గణములు - భ, న, జ, య, భ, న, న, స, గ, గ
యతిస్థానము - 13
ఛందము - అభికృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 25
ప్రాసనియమము - కలదు
సాసహితయతి సంగతవృత్తి స్సంచిత భ న జ య భ న న స గం బుల్
పౌవకులజలరాశిమృగాంకా భాస్కరవిలసిత మన విలసిల్లున్

భుజంగప్రయాతము
గణములు - య, య, య, య
యతిస్థానము - 8
ఛందము - జగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 12
ప్రాసనియమము - కలదు
భుజంగప్రయాతంబు పొం దారు నందం
స్రంబుగా నయ్యయాయంబు లొందన్

భుజంగవిజృంభితము
గణములు - మ, మ, త, న, న, న, ర, స, వ
యతిస్థానము - 10
ఛందము - ఉత్కృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 26
ప్రాసనియమము - కలదు
ధీవైదగ్ధ్య శ్రీవిక్రాంతా దిగిభదశమపదవిరతిన్ భుజంగవిజృంభితం
బై విశ్రాంతుల్ దైవాఱం జెన్నగు మ మ త న న ర స హారియై లగసంయుతిన్

భుజగశిశిరుతము
గణములు - న, న, య
ఛందము - బృహతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 9
ప్రాసనియమము - కలదు
భుగశిశురుత మయ్యెన్
జు ననయ ములచేతన్

భూతిలకము
గణములు - భ, భ, ర, స, జ, జ, గ
యతిస్థానము - 10
ఛందము - అతిధృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 19
ప్రాసనియమము - కలదు
భూతిలకం బగు భా ర సంబులఁ బొంది జా గ ము లుండినన్
భూపతిస్ఫుట విశ్రమంబున భూప విశ్వనరేశ్వరా

భూనుతము
గణములు - ర, న, న, భ, గ, గ
యతిస్థానము - 10
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
అంమై ర న న భ తతి నంది గగంబుల్
పొందఁగా బదగతిఁగని భూనుతమయ్యెన్

భోగినివిలసితము

భ్రమరవిలసితము

మంగళమహాశ్రీ
గణములు - భ, జ, స,న, భ, జ, స, న, గ, గ
యతిస్థానము - 9,17
ఛందము - ఉత్కృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 26
ప్రాసనియమము - కలదు
త్తుగను రత్నముల ప్తదశమంబునను ద్యతులు మంగళమహాశ్రీ
వృత్తమున కౌభజసవృత్తిన భజల్మనలపై గురులురంగనృపధీరా

మంజరి

మంజుభాషిణి
గణములు - స, జ, న జ, గ, గ
యతిస్థానము - 9
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
యంబుగాఁగఁ సజసంబుతో జగం
బులు మంజుభాషిణికిఁ బొందు నందమై

మందాక్రాంత
గణములు - మ, భ, న, త, త, గ,గ
యతిస్థానము - 11
ఛందము - అత్యష్టిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 17
ప్రాసనియమము - కలదు
కాంతా కాంతా మభనతతగా క్రాంత సంక్రాంత మందా
క్రాంతంబయ్యెన్ విరమదశమాక్రాంతి విశ్రాంత మైనన్

మణికమలవిలసితము
గణములు - స, స, స, స, గ, గ

మణిగణనికరము
గణములు - న, న, న, న, స
యతిస్థానము - 9
ఛందము - అతిశక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 15
ప్రాసనియమము - కలదు
సత న న న నగణము లెసఁగం
రియతిఁ గని మణిణనికర మగున్

మణిభూషణము
గణములు - ర, న, భ, భ, ర
యతిస్థానము - 10
ఛందము - అతిశక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 15
ప్రాసనియమము - కలదు
విశ్వభూప మణిభూషణవృత్త మనంజనున్
శ్వదుక్త ర న భా ర దిశాయతిఁగూడినన్

మణిమాల
గణములు - స, జ, స, జ, స, జ, స
యతిస్థానము - 10
ఛందము - ప్రకృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 21
ప్రాసనియమము - కలదు
రుసన్ సజత్రితయము న్బ్రసక్త సగణంబుతోడ నొనరం
రఁగున్ దిగంతవిరతిం బ్రధానపదమై చళుక్యమదనా

మణిరంగము
గణములు - ర,స,స,గ
పాదాక్షరసంఖ్య -10
యతిస్థానము - 6

మత్త
గణములు - భ, మ, స, గ
యతిస్థానము - 7
ఛందము - పంక్తిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 10
ప్రాసనియమము - కలదు
శైశ్రాంతిన్ మభగలోలిం
గ్రాన్ మత్తాఖ్యను నుపట్టున్

మత్తకోకిల
గణములు - ర, స, జ, జ, భ, ర
యతిస్థానము - 11
ఛందము - అత్యష్టిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 17
ప్రాసనియమము - కలదు
త్తయౌ రసజాభరల్ భవసంఖ్య విశ్రమ మొప్పినన్
త్తకోకిల వృత్తమౌన సమానరంగనృపాలకా

మత్త మయూరము
గణములు - మ, త, య, స, గ
యతిస్థానము - 8
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాసనియమము - కలదు
సంబోదార్థంబై వలన్మత్త మయూరా
ఖ్యం బింపొప్పారున్ మతయాగ్య్రాత్త సగాప్తిన్
మత్తమయూరము
గణములు - న, న, భ, భ, గ
ఛందము - అతి జగతి
పాదాక్షర సంఖ్య - 13
ప్రాసనియమము - కలదు
యతిస్థానము - 8

మత్తహంసిని
గణములు - జ, త, స, జ, గ
యతిస్థానము - 7
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాసనియమము - కలదు

మత్తాక్రీడ

మత్తేభవిక్రీడితము
గణములు - స, భ, ర, న, మ, య, వ
యతిస్థానము - 14
ఛందము - కృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 20
ప్రాసనియమము - కలదు
లువొందన్ సభరల్ నమల్యవల తోనంగూడి మత్తేభ మిం
లరారున్ బదునాలు గౌ విరతి చే నానందరంగా ధిపా

మథ్యాక్కర

మదనదర్పణము

మదనము
గణములు - త, భ, జ, జ, గ, గ
యతిస్థానము - 9
ఛందము - శక్వరి చ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
దైతేయ భంజన ! హరీ ! , భ, జా, గగంబుల్
మాతంగ విశ్రమమున్ దనాఖ్య యొప్పున్.

మదన విలసితము
గణములు - న, న, గ
ఛందము - ఉష్ణిక్కుచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 7
ప్రాసనియమము - కలదు
నవిలసిత
ప్రముల్ ననగల్

మదనార్త
గణములు - త, య, స, భ, గ, గ
యతిస్థానము -
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు

మదరేఖ
ఛందము - ఉష్టిక్ చ్ఛందము
పాదాక్షరసంఖ్య -7
మద్రకము

మధుమతి
మారుపేరు - మదనవిలసితము
ఛందము - ఉష్టిక్ చ్ఛందము
పాదాక్షరసంఖ్య -7
మధురగతిరగడ
నాలుగు మాత్రలు నాటిన గణములు
నాలుగు రెంటికి నలి విరమణలు
సి మధురగతి కనలును జగణము
తొగిన ధృతకౌస్తుభ కవిరమణము

మధురాక్కర
గణములు - రవీంద్రచంద్రాఖ్య గణాలలో 5 గణములు ఉంటాయి,3 ఇంద్ర గణములు,2 సూర్యగణములు,
యతిస్థానము - నాల్గవ గణాద్యక్షరము
ణి వాసవ త్రితయంబు ధవళ భానుయుతి నొంద
నితి విశ్రాంతి నాలవనెలవున నింపుమీఱ
సమధురార్ధములఁ జెప్పఁ జను మధురాక్కరంబు
రుసఁ బంచగణములను వాలి కృతుల వెలయు

మధ్యాక్కర
గణములు - రవీంద్రచంద్రాఖ్య గణాలలో 6 గణములు ఉంటాయి, 2 ఇంద్ర గణములు,1 సూర్యగణము,2 ఇంద్ర గణములు,

1 సూర్యగణము
యతిస్థనము - నాల్గవ గణాద్యక్షరము
సురాజ యుగముతోగూడి సూర్యుతో నొడబడి యుండి
సురాజ యుగముతోగూడి సూర్యుతో నొడబడి వెండి
మొప్ప నీపాట నాఱు ణముల మధ్యాక్కరంబు
విచింప బ్రావళ్ళు నిట్లు వెలయఁ గవిజనాశ్రయుండ
\*నన్నయ గారు 5వగణాద్యక్షరం యతి వేసిరి

మనోజ్ఞము
గణములు - న, జ, జ, భ, ర
యతిస్థానము - 10
ఛందము - అతిశక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 15
ప్రాసనియమము - కలదు
రుస మనోజ్ఞమనంగ చ్చు నజాభర
స్థిగతిఁ బంకజభూయతిం బ్రతిపన్నమై

మనోరమ

మనోహర

మయూరసారి
గణములు - ర, జ, ర, గ
యతిస్థానము - 7
ఛందము - పంక్తిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 10
ప్రాసనియమము - కలదు
ర్వు నీరజంబు పైరగంబుల్
ర్వదా మయూరసారిఁ జెప్పన్
మారుపేరు - మయూరభాషిణి

మలయజము
గణములు - న, జ, న, స, న, న, భ, న ల
యతిస్థానము - 8, 15, 22
ళిన విలోచన జనసనంబులుభనగణంబులు టలగమున్
లసి గిరిత్రయహితయతుల్ తగిలయజ వృత్తము హివెలయున్

మహాక్కర
గణములు - రవీంద్రచంద్రాఖ్య గణాలలో 7 గణముల�� ఉంటాయి, 1 ఇనగణము,5 ఇంద్రగణములు, 1చంద్రగణము
వారిజాప్తుండు పంచేంద్రగణములు వనజారియును గూడి వెలయుచుండ
నారయ రెండవ నాలవచోట్ల నర్కుండయిననుం దనర్చుచుండఁ
గోరి యవ్వడిపంచమగణమునఁ గూడి మొదల నిలుపంగ నగు
సారమై ప్రాసవడి సప్తగణములు సాఁగ మహాక్కర యతిశయిల్లు

మహాస్రగ్ధర
గణములు - స, త, త, న, స, ర, ర, గ
యతిస్థానము - 9,16
ఛందము - ఆకృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 22
ప్రాసనియమము - కలదు
హిఖండగ్లౌకళా విశ్రమములను మహాస్రగ్ధరా వృత్తమౌ శ్రీ
హితౌ దార్యాసతానల్ రర గురువులున్ శ్రీరంగ రంగభూపా
దుత్యత్కీర్తి వల్లీ లిత గుణగణా లంకృతాంగా స, తా, న
స్థ, స, రా, గంబు ల్మహాస్రగ్ధరకు వసుముని స్థానవిశ్రాంతులొప్పున్.

మానిని
గణములు - భ, భ, భ, భ, భ, భ, భ, గ
యతిస్థానము - 7,13 ,19
ఛందము - ఆకృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 22
ప్రాసనియమము - కలదు
కాము లున్క్రియ న్గొన నేడు భ కారములొక్క గకారముతో
గావమై చన గావళు లన్నియు ల్గిన మానిని కామ నిభా

మాలిని
గణములు - న, న, మ, య, య
యతిస్థానము - 9
ఛందము - అతిశక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 15
ప్రాసనియమము - కలదు
విరమణ యుక్తిన్ నామయాసంగతం బై
ని దగును మాలిన్యాఖ్య చేరంగ ధీరం

ముఖచపల

మేఘవిలసితము

మేఘవిస్ఫూర్జితము
గణములు - య, మ, న, స, ర, ర, గ
యతిస్థానము - 13
ఛందము - అతిధృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 19
ప్రాసనియమము - కలదు
మృదున్యస్తార్థంబై దినకరయతి న్మేఘవిస్ఫూరితాఖ్యం
బుదాత్తశ్రీఁ జేర్చున్ యమనసర ప్రోత గప్రాప్తిచేతన్

మేదిని
గణములు - న, జ, భ, జ, ర, గ
యతిస్థానము - 11
ఛందము - అష్టిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 16
ప్రాసనియమము - కలదు
జ భ జ రేఫగంబునఁ దర్చు మేదినీవృ
త్తజనికి మూలమై దిగుదిస్థ విశ్రమం బై

మేలనగీతి
గలము రెండునగణములును గలసి ప్రాస మెఱయుఁ
జెలువు దోఁప నెత్తుగీతి వెలయుఁ గృతులయందు
నోలి నగణమొండె హగణమొండె నేడుచేసి
నాలుగడుగులందు నిలిపి నళుపుదోఁప విరతి
వాలి పంచమస్థ యగుచు వచ్చెనేని యొప్పు
మేలనాభిదాన మైన మేలుగీతి కృతుల

మోహ ప్రలాపము
గణములు - భ, భ, త, ర, గ
యతిస్థానము - 5
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య -13
ప్రాసనియమము - కలదు

రతి
గణములు - స, భ, న, స, గ
యతిస్థానము - 5
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాసనియమము - కలదు

రతిప్రియవృత్తము
స్వస్థానార్థసమ వృత్తము
గణములు - 1,3 పాదములు మ, న, జ, ర, గ, 2,4 పాదములు జ, భ, స, జ, గ
ప్రాసనియమము - కలదు
ఖ్యాశ్రీ మనజరగంబులుండఁగాఁ ద
ద్గతంబులై జభసజగంబు లొందగా
వీతాఘప్రముదితవిశ్వభూపా
ధృతిం దలంప నిది రతిప్రియం బగున్

రథగమన మనోహరము

రథోద్ధతము
మారుపేరు - నరాంతికము
గణములు - ర, న, ర, ల, గ
యతిస్థానము - 7
ఛందము - త్రిష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 11
ప్రాసనియమము - కలదు
క్తిఁ బేర్చి రనరంబు పై లగం
బుక్త మైనను రథోద్ధతం బగున్

రమణకము
గణములు - 9 నగణములు, 1 వగణము
యతిస్థానము - 1,9,17,25
మనసిజ జనకసమద రిపు గజహరిమదగజవసు విరమణములతో
నననననననననలగము లెనయగ నరవరనుత రమణక మమరున్

రసాలి

రాజహంస
గణములు - త,త,త,త,త,త,త,త,గ
యతిస్థానము - 13
ప్రాసనియమము - కలదు

రుగ్మవతి
గణములు - భ,మ,స,గ
యతిస్థానము - 6
ఛందము - పంక్తిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 10
ప్రాసనియమము - కలదు
రుగ్మవతిం జేరున్ భమసంబుల్
తిగ్మరుచిద్యుద్దీప్త గయుక్తిన్

రుచిరము
గణములు - జ, భ, స, జ, గ
యతిస్థానము - 9
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాసనియమము - కలదు
క్రమంబుతో జభసజమ్ము లిమ్ముగా
ర్పఁగా రుచిరమాహ్వయం బగున్

లత
గణములు - న, య, న, న, గ
యతిస్థానము - 7
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాసనియమము - కలదు

లయగ్రాహి
ఉద్ధురమాలా వృత్తము
గణములు - భ, జ, స, న, భ, జ, స, న, భ, య
పాదమునకు 30 అక్షరములు
పాదమునకు మాత్రలు - 24
ప్రాసయతి - 2, 10, 18, 26
ఎ'మ్మె' వెలయన్ భజసన'మ్ము'లు మఱిన్ భజసన'మ్ము'ల పయిన్ భయగణ'మ్ము'లు లయగ్రా
హి'మ్మ'ఱయు రంగనృప యి'మ్మ'హిని బ్రాసయతులె'మ్మె'ఱపి నాల్గు చరణ'మ్ము'లను వేడ్కన్

పంబినయతిన్ భజసనంబులఁ బునర్భజసనంబుల భయంబుల కదంము లయగ్రా
హిం బెనుపునం బుధమతిం రఁగుఁబ్రాసనికురుంకము పాదముల నిండరు చూడన్.
బిందుపూర్వక బకారముగా గ్రహించవలెను.

లయవిభాతి
ఉద్ధురమాలా వృత్తము
గణములు - న,స,న,న,స,న,న,న,స,న,న,స,గ
పాదాక్షరసంఖ్య - 34
పాదమునకు మాత్రలు - 24మాత్రాగర్భితపాదము
ప్రాసయతి - 2, 11, 20, 29
న న స నా కలితన న న స గం బుల విలసితతర పాదములఁ బొసఁగు నలు వ్రాలం
బ్రరితములై యలరుఁ బలయవిభాతి యన రసికులకు వీనులకు నొసఁగు జవు లింపై

లయహారి
ఉద్ధురమాలా వృత్తము
గణములు - న, న, న, న, న, న, న, న, న, న, న, స, గ
ప్రాసయతి - 2, 22
పాదాక్షరసంఖ్య - 37
పాదమునకు మాత్రలు - చత్వారింశన్మాత్రాగర్భితపాదంబు
దునొకఁడు నగణములఁ బొదలి సగణము గురువు మృదులపదరచనఁ దగి యొదవి మితివ్రాలన్
ముమొసఁగు సభల నని చదువుదురు కవివరులు హృయములఁ జతురతలుగదుర లయహారిన్

లాటీవిటము
గణములు - స, స, స, స, మ, త, య
యతిస్థానము - 13
ఛందము - ప్రకృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 21
ప్రాసనియమము - కలదు
సా మత యంబులు భానుయతి న్సాకంబై లాటీవిటవృత్తం
బెకంబెసగున్ విరచించిన విశ్వేశా, చాళుక్యక్షితిపాలా

వంశము
గణములు - జ, త, జ, ర

వంశస్థము
గణములు - జ, త, జ, ర
యతిస్థానము - 8
ఛందము - జగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 12
ప్రాసనియమము - కలదు
తంబులం జెందిన జంబు రేభయున్
నుతింప వంశస్థ మనుక్రమక్రియన్

వనమంజరి
గణములు - న, జ, జ, జ, జ, భ, ర
యతిస్థానము - 13
ఛందము - ప్రకృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 21
ప్రాసనియమము - కలదు
ర న జా జ జ భా గ్భకారయు త్రయోదశయుగ్యతిన్
వినుత మగు న్వనమంజరినాఁ దగువృత్త మింపెసలారఁగన్

వనమయూరము
గణములు - భ, జ, స, న, గ, గ
యతిస్థానము - 9
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
న్నతములై వనమయూర కృతిలోలిన్
న్నగ భజంబుల పయిన్ సనగగం బుల్
చెన్నొదవ దంతి యతి చెంది యలరారున్
వెన్నుని నుతింతురు వివేకు లతి భక్తిన్

వరాహము

వసంత తిలకము
గణములు - త, భ, జ, జ, గ,గ
యతిస్థానము - 8
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
స్థాపించినం ద భ జ జంబు చళుక్య విశ్వ
క్ష్మాపా వసంతతిలకంబగు గా నియుక్తిన్

వసంత మంజరి
గణములు - న, భ, భ, న, ర, స, వ
యతిస్థానము - 13
ఛందము - కృతి ఛందము
పాదాక్షరసంఖ్య - 20
ప్రాసనియమము - కలదు

వాతోర్మి
గణములు - మ, భ, త, ల, గ
యతిస్థానము - 7
ఛందము - త్రిష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 11
ప్రాసనియమము - కలదు
ద్వాతోర్మిన్ మభతంబుల్ లగమున్
ద్విశ్రామస్థితి సంధిల్లుచుండున్

వారాంగి వృత్తము
గణములు - జ, త, జ, గ, గ 1,2 పాదములకు మరియు త, త, జ, గ, గ 3,4 పాదములకు
ళుక్యవంశాజతల్ గగంబుల్
చెలంగి యర్థంబునఁ జెంది రీతిం
గ్రాలంగఁ దాయత్తజగానియుక్తిన్
మేయ్యె వారాంగి సమీహితాఖ్యన్

వాసంతి
గణములు - మ, త, న, మ, గ, గ
యతిస్థానము -
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు

విచికిలితము

విచిత్రము

విచిత్ర వృత్తము
ఛందము - గాయత్రీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 6
గణములు - య, య
ప్రాసనియమము - కలదు
విచిత్రంబునందున్
రుచించున్ యయంబుల్

విజయభద్రము

విజయమంగళము

వితానము

వితాళచతుష్పద

విద్యున్మాల
గణములు - మ, మ, గ, గ
యతిస్థానము - 5
ఛందము - అనుష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 8
ద్యున్మాగా యుక్తం బైనన్
విద్యున్మాలా వృత్తం బయ్యెన్

విద్రుమలత
గణములు - న, జ, న, న, ల, గ
యతిస్థానము - 8
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు

వినయము
ఛందము - మధ్యాచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 3
విపుల

విభూతి వృత్తము
గణములు - ర, జ, గ
పాదాక్షరసంఖ్య - 7
ఛందము - ఉష్ణిక్కుచ్ఛందము
ప్రాసనియమము - కలదు
స్వస్థ సద్విభూతి దా
స్థ జస్థగంబునన్

విమానము

వియోగిని

విశ్వదేవి
గణములు - మ, మ, య, య
యతిస్థానము - 8
ఛందము - జగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 12
ప్రాసనియమము - కలదు
మాయావర్ణం బొప్పం గ్రన్యాసవృత్తిన్
జేయున్ భూభృ ద్విశ్రాంతిచే విశ్వదేవిన్

విషమసీసము

వీణారచన వృత్తము
ఛందము - స్వపరస్థాన విషమ వృత్తము
చాక్యనయజ్ఞాత యనస్థసగంబుల్
వీణారచనకొందు భువిందససావంబుల్
శ్రేణీందజనస్థితభససేవిత నియతిన్
రాలనెలవై భస నరంబు లోలిగన్

వృంత

వృషభగతి

వేగవతి

వైతాళీయము

వ్రీడ

శంభువృత్తము

శరభక్రీడా వృత్తము
గణములు - య, మ, న, స, ర, గ- 1,2 పాదములు మరియు మ, భ, న, య, య -3,4

పాదములు
ఛందము - పరస్థాన విషమ వృత్తము
తుర్వర్ణాధారా య మ న స ర గ వ్యాప్తి నాద్య
ద్వితీయాం త్యాంఘ్రి ప్రస్తుతగతి నతిస్పష్టమైనన్
ఖ్యాతాసక్తిన్ మ భ న య య తృతీయాంఘ్రినొప్పన్
బ్రతిప్రేమోత్పత్తిం బరఁగి శరభక్రీడ యయ్యెన్

శార్దూలవిక్రీడితము
గణములు - మ, స, జ, స, త, త, గ
యతిస్థానము - 13
ఛందము - అతిధృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 19
ప్రాసనియమము - కలదు
సారాచార విశారదాయి నయితిన్ శార్దూల విక్రీడితా
కారంబై మసజమ్ము లిమ్ముగ సతాప్రాప్తమై చెల్వగున్

శాలిని
గణములు - మ, త, త, గ, గ
యతిస్థానము - 6
ఛందము - త్రిష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 11
ప్రాసనియమము - కలదు
రాకాధీశాకా రాజన్మ తా గా
నీప్రాప్తిన్ శాలినీవృత్తమయ్యెన్

శాలూరము

శిఖరిణి
గణములు - య, మ, న, స, భ, వ
యతిస్థానము - 12
ఛందము - అత్యష్టిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 17
ప్రాసనియమము - కలదు
విస్వ ద్విశ్రాంతి న్య న స భ వా విష్కృతగతిం
విశ్రేణీరక్తిన్ శిఖరిణియనంగాఁ దగుఁబ్రథన్

శుద్ధవిరాటి
గణములు - మ, స, జ, గ
యతిస్థానము - 6
ఛందము - పంక్తిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 10
ప్రాసనియమము - కలదు
క్తం బై మసస్థగ ప్రథా
క్తిన్ శుద్ధవిరాట నాఁ జనున్

శ్యేని
గణములు - ర, జ, ర, వ
యతిస్థానము - 7
ఛందము - త్రిష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 11
ప్రాసనియమము - కలదు
శ్యేనికై రవంబు చెప్పి పైరవం
బూనఁజేయు టెల్ల నొప్పు నెప్పుడున్

శ్రీరమణము
గణములు - భ,మ,త,గ మెదటిపాదము ఉపక్రాంత మరియు భ, భ, భ, గ,గ నికటము తరువాతి 3

పాదములు
ఛందము - పరస్థాన విషమ వృత్తము
భమవ్యాయత్తసగవ్యా
పాము నాదిమ పాదము సెందన్
జారు భభాగగసంగతిచేతన్
శ్రీమణంబని చెప్పిరి మూఁటన్

శ్రీ వృత్తము
ఛందము - ఉక్తా ఛందము
పాదాక్షరసంఖ్య - 1
శ్రీ
శ్రీం
జే
యున్

షట్పద

షట్పది
గణములు - 6 ఇంద్రగణములు,1 చంద్రగణము
సుపతులిరువురు సురపతులిద్దఱు
సుపయుగమ్ముతో సోముండును
రువడిఁబెనఁగొన నదురుగ షట్పది
రిబ్రాసంబులు దనరారంగను

సమాని
గణములు - ర,జ,వ
ఛందము - అనుష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 8
ప్రాసనియమము - కలదు
మానికిన్ ర జ వ
వ్యా మొప్పగుం గృతులన్

సరసాంకవృత్తము
గణములు - స, జ, స, స, య
యతిస్థానము - 10
ఛందము - అతిశక్వరిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 15
ప్రాసనియమము - కలదు
సాంక వృత్తమమరున్ , జ, సా, య లొందన్
సీజ సంభవయతిన్ లజాత నేత్రా

సాధ్వీ వృత్తము
గణములు - భ, న, జ, న, స, న, న, భ, గ
యతి స్థానము - 8, 15, 22
ఛందము - అభికృతి ఛందము
పాదాక్షరసంఖ్య - 25
ప్రాసనియమము - కలదు
నాద సనక సనందన వినుత సనాథ ? భ, న, జ, న, స, నా, భ గురుల్
చారు శిఖరియతి శైల విరమణము క్ష్మాధర విరతియు సాధ్వి యగున్.

సరసిజము
గణములు - మ, త, య, న, న, న, న, స
యతిస్థానము - 10
ఛందము - వికృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 23
ప్రాసనియమము - కలదు
చాళుక్యక్ష్మాపాలవరేణ్యా శ్రయమతయనననిచయయుతననసల్
చాలై యింపై వ్రాలఁ దనర్పన్ రసిజమగు నిలఁజవులకుఁ గుదురై

సింధురవృత్తము
గణములు - న, న, న, న, స, భ, భ, భ, గ
యతిస్థానము - 12
ఛందము - అభికృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 25
ప్రాసనియమము - కలదు
క్రమున న న న న స భ భ గ గణ క్రాంతిదినాధిపవిశ్రమమై
ప్రదధలసలయభరితవిరచనన్ బంధురసింధురవృత్తమగున్

సింహరేఖ
గణములు - ర, జ, గ, గ
ఛందము - అనుష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 8
ప్రాసనియమము - కలదు
జాగ్రగా నియుక్తిన్
గోరి సింహరేఖ యొప్పున్

సీసము
నల నగ సల భ ర త ల లో
పల నాఱిటి మీఁద రెండుఁ బద్మాప్త గణం
బులఁ దగి నాలుగు పదములఁ
జెలువగు నొక గీతి తోడ సీసము కృష్ణా !
ఇంద్రగణములారు ఇనగణంబులు రెండు
పాదపాదమందు పల్కుచుండు
ఆటవెలదినైన తేటగీతియు నైన
చెప్పవలయు మీద సీసమునకు

అమరంగ విషమసీసము
సమసీసము లనఁగఁ రెండుచందము లందున్
బ్రమితమగు విషమసీస
క్రమ మెఱుఁగఁగవలయుఁ జతురకవిజనములకున్
గీ
హగణనగణంబు లేడు గుర్వంతమగుచు
వి స్తరిల్లిన నుత్సాహవృత్తమయ్యె
దీనితుద గీతియొకఁడు సంధింప విషమ
సీస మిత్తెఱఁగెఱుఁగుట చెలువుమతికి
విషమ సీసము
గీ
వడి దనర్పఁ బ్రాసవైభవం బలరార
నిట్ల గణనిరూఢి నెసక మెసఁగఁ
గీ ర్తితాతిమధురగీతియుఁ బైగల్గ
నదియ విషమసీసమండ్రు కృతుల
సమసీసము
గీ
వెలయు సమసీసములు పంచ విధములయ్యె
నరయ నవకలిసీ సాహ్వయంబుఁ, బ్రాస
సీస, మక్కిలిప్రాససీసాఖ్యసీస
ము,వడిసీస, మక్కిలివడిసీసమును ననంగ

తన పాదంబులు నాలుగు
మొనసిన పై గీతిపాదములు రెండును గా
నినుమూఁడై సీసమునకు
జను నడుగులు వ్రాలు వళ్ళు సరి యిన్నిటికిన్
అవకలి సీసము

అలవడిసీసము పాదము
నలుతునుకలు చేసి మూఁట నలనామగణం
బుల రెంటి నిడి య
వ్వలితునుక నహంబు లిడఁగవలయు న్వరుసన్
సీ
సామంబుచేఁ దుల్యభూమీశ్వరులు దన, తోడిమిత్రతకు నఱ్ఱాడుచుండ,
దానంబుచే నతిమానమానవనాథు లేర్పడ నక్కఱఁ దీర్చుచుండ,
ఖేదంబుచేత దుర్మోదమహీశు లందంద సంక్షిప్తత నొందుచుండ,
దండంబుచేత నుద్దండమాండలికు లాజ్ఞాచక్ర మౌదల మోచియుండ
గీ
శశ్వదనురక్తిఁ జాళుక్యవిశ్వనిభుఁడు
వాలి వసుమతి లీలమై నేలుననుచుఁ
జెప్ప నవకలిసీస మిట్లొప్పునండ్రు,
పూని గావ్యకళావేదులైనకవులు
ప్రాస సీసము

సీసమునకు నాఱడుగులఁ
బ్రాసము లిడి యోలి సర్వపదఖండములన్
భాసురముగ వళ్ళలవడఁ
జేసిన నది కృతులఁ బ్రాససీసంబయ్యెన్
సీ
చక్రవాళాచల చంద్రకాంతములకు సంతతార్ద్రత్వంబు జరపి జరపి,
చక్రీశలోక సంచర దురు సంతమసంబుల వడిఁ బాఱఁ జదిపి చదిపి,
శక్రేభశంకరశంకరాచలశశి చారుదీధుతులపైఁ జాఁగిచాఁగి,
చక్ర స్తనీకుచ సాంద్ర చంద్రనరసచర్చలపైఁ గేలి సలిపి సలిపి,
గీ
విక్రమప్రతాప విశ్రుతమూర్తియై
విశ్వభూమివిభుని విశదకీర్తి
ప్రక్రమప్రసక్తిఁ బ్రసరించు నని చెప్పఁ
బ్రాససీస మనఁగ బరఁగు నెందు
అక్కిలిప్రాససీసము
క తుదిగీతి నాలుగడుగులు
వదలక ప్రాసంబు నిలిపి వళ్ళింపారం
గదిరినఁ గదురకయున్న
న్నది యక్కిలి ప్రాససీస మనఁగాఁ బరఁగున్
సీ
క్రమయుక్తి విద్యల కందువ యెఱుఁగుచుఁ, గవులనే ర్పారసి గారవించి,
సమరసంక్రీడనక్షమసుభటాటోప సంచారములకు నుత్సాహమూఁది,
నమితాహితక్షమానాథులరాజ్యంబు నాననాఁటి కొనర నున్నుచేసి,
ప్రముదితారాతుల భంజించి వేలుపుం బడఁతుల కిపారుపతులఁ జేసి,
గీ
విమలకీర్తుల దిక్కులు విప్పనేర్చు
శమితవినుతుండు విశ్వేశచక్రవర్తి
సముచితంబుగ నని చాల సన్నుతింప
నమరు నక్కిలిప్రాససీసాహ్వయంబు
వడిసీసము

ఏపాదమునకు నే వడి
యాపాదింపంగఁబడియె నది ఖండములం
బ్రాపింపఁ జెప్పఁగ వళిని
రూపితసీసంబు నాఁగ రూఢికినెక్కున్
సీ
గ్రహదంష్ట్ర సోఁకని గ్రహరాజు, ప్రియవచః కథనంబు నేర్చినకల్పభూజ,
మలరుఁదూపులు కేల నంటని కందర్పు, డమ్ముచే నింకని యంబురాశి,
కన్నులు పెక్కులు గల్గని యింద్రుండు, కఱకేది వంగని కనకనగము,
తనువెత్తి క్రాలెడు ధర్మదేవత, రూపుఁ దాల్చిన రాజవిద్యావిభూతి,
గీ
నయవిదుండు రాజనారాయణుఁడు విశ్వ
నాథుఁ - డనుచు వర్ణనములుసేయ
వరుస నిట్లు కృతుల వళిసీస మన నొప్పు
వసుధ వైభవాలవాల మగుచు
అక్కిలి వడిసీసము
గీ
సీసఖండంబు వళ్లిట్లు చెప్పి గీతి
ఖండవళి రెంటి కొక్కఁడుగా నొనర్ప
నదియ యక్కిలివడిసీసమండ్రు కృతుల
లక్ష్యములు చూచి యెఱుఁగుఁ డీలాగు లెల్ల

సీసములకు గీతులకుం
బ్రాసములును వళ్ళుఁ గలయఁబడి కవితల ను
ద్భాసిల్లఁ దఱచు నియమ
వ్యాసక్తియుఁ గలుగుఁ జెప్పవలసినచోటన్

సుందరి
గణములు - భ, భ, ర, స, వ
యతిస్థానము - 9
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
భా స వంబుల నొప్పుఁ ద్మజవిశ్రమం
బారఁగ సుందరవృత్తమై బుధవర్ణ్యమై

సుందరీ వృత్తము
గణములు - భ, గ, గ
ఛందము - సుప్రతిష్ఠాచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 5
ప్రాసనియమము - కలదు
సుంరి యొప్పుం
జెంది భగా నిం
పొం నియుక్తిన్
గందుకలీలన్

సుకాంతి
ఛందము - ప్రతిష్ఠాచ్ఛదము
పాదాక్షరసంఖ్య - 4
గణములు - జ, గ
ప్రాసనియమము - కలదు
గంబులం
గున్ సుకాం
తిల్పిత
ప్రల్భతన్

సుకేసరము
గణములు - న, జ, భ, జ, ర
యతిస్థానము - 10
ఛందము - అతిశక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 15
ప్రాసనియమము - కలదు
భజరేఫలం గది వచ్చి దిగ్యతిన్
సునమతి న్సు కేసరము శోభితంబగున్

సుగంధి
గణములు - ర, జ, ర, జ, ర
యతిస్థానము - 9
ప్రాసనియమము - లేదు
దంబుజం బురంబు జంబు రంబు చెన్నుమీరగా
దొమ్మిదింట విశ్రమంబు తోరమై సుగంధికిన్

సుమంగలి
గణములు - స, జ, స, స, గ
యతిస్థానము - 8
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాసనియమము - కలదు

సుముఖి

సురలత
గణములు - న, య
ఛందము - గాయత్రీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 6
ప్రాసనియమము - కలదు
సులతఁ జెప్పన్
సొరిది నయంబుల్

స్త్రీ వృత్తము
ఛందము - అత్యుక్తాచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 2
స్త్రీరూ
పారుం
గారూ
పారున్

స్రగ్ధర
గణములు - మ, ర, భ, న, య, య, య,
యతిస్థానము - 8,15
ఛందము - ప్రకృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 21
ప్రాసనియమము - కలదు
సారెస్ నాగాధి రాట్పందశ విరమతన్ స్రగ్ధరా వృత్తమౌ గాం
తారాజీవాస్త్ర యుద్యన్మరభనయయయోద్భాసి యై రంగభూపా
శ్రీన్మూర్తీ మకారా శ్రిత ర, భ, న, య, యా సేవ్యమై సానుమద్వి
శ్రామంబున్ సానుమద్వి శ్రమము నమరఁగా స్రగ్ధరా వృత్తమయ్యెన్

స్రగ్విణి
గణములు - ర, ర, ర, ర
యతిస్థానము - 7
ఛందము - జగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 12
ప్రాసనియమము - కలదు
స్ఫారితంబై యకూపా ర ర శ్రేణితో
సా మై స్రగ్విణీచారువృత్తం బగున్

స్వాగతము
గణములు - ర, స, భ, గ, గ
యతిస్థానము - 7
ఛందము - త్రిష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 11
ప్రాసనియమము - కలదు
స్వాతంబు రనభంబు గగాస్తిన్
సాగు విశ్వనృపచంద్రకులాఢ్యా

హంసరుతము

హంసి

హయప్రచారము

హరనర్తనము

హరిగతి

హరిణగతి

హరిణి
గణములు - న, స, మ, ర, స, ల, గ
యతిస్థానము - 11
ఛందము - అత్యష్టిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 17
ప్రాసనియమము - కలదు
రిణి యనువృత్తంబయ్యెన్ శంరాత్తయతిప్రథన్
రి న స మ రే ఫావక్రాంతోపేత స్థలంగంబులన్

హలముఖి
గణములు - ర, న, స
ఛందము - బృహతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 9
ప్రాసనియమము - కలదు
కామితక్రియ హలముఖీ
నా మొప్పు రనసలచేన్