Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

వృషణం

వికీపీడియా నుండి
(వృషణము నుండి దారిమార్పు చెందింది)
వృషణం (testicle)
Inner workings of the testicles.
Diagram of male (human) testicles
లాటిన్ testis
గ్రే'స్ subject #258 1236
ధమని Testicular artery
సిర Testicular vein, Pampiniform plexus
నాడి Spermatic plexus
లింఫు Lumbar lymph nodes
Diagram of an adult human testicle: A.) Blood vessels; B.) Head of epididymis; C.) Efferent ductules; D.) Seminiferous tubules; E.) Parietal lamina of tunica vaginalis; F.) Visceral lamina of tunica vaginalis; G.) Cavity of tunica vaginalis; H.) Tunica albuginea; I.) Lobule of testis; J.) Tail of epididymis; K.) Body of epididymis; L.) Mediastinum; M.) Vas deferens.
Diagram of an adult human testicle: A.) Blood vessels; B.) Head of epididymis; C.) Efferent ductules; D.) Seminiferous tubules; E.) Parietal lamina of tunica vaginalis; F.) Visceral lamina of tunica vaginalis; G.) Cavity of tunica vaginalis; H.) Tunica albuginea; I.) Lobule of testis; J.) Tail of epididymis; K.) Body of epididymis; L.) Mediastinum; M.) Vas deferens.
పురుషుడి వృషణాలు

మానవులలో పురుష జననేంద్రియాలు సంస్కృతంలో- వృషణాలు లేదా ముష్కాలు (ఆంగ్లం: testis) . స్త్రీలలో అండకోశాలవలె పురుషులలో వీర్య కణాలు ఇందులో తయరవుతాయి. ఇవి రెండు ఒక చర్మపు సంచి (ముష్క కోశం) లో పురుషాంగము క్రింద మానవుని శరీరం వెలుపల వ్రేలాడుతూ ఉంటాయి. వృషణాలు మనిషి శరీర ఉష్ణోగ్రత కంటే కొంచెం తక్కువగా ఉంటే సరిగా పనిచేస్తాయి. అందుకే యీ ఏర్పాటు చేయబడింది. అన్ని సకశేరుకాలలో ఇవి ఉదరములో ఉంటాయి.

నిర్మాణం

వృషణాలు ఒక్కొక్కటి 14 - 35 చదరపు సె.మీ. పరిమాణంలో ఉంటాయి. ప్రతి ముష్కములో అనేక సంఖ్యలో శుక్రోత్పాదక నాళిక (Semeniferous tubules) లను కలిగివుండి వాటి మధ్యలో మధ్యాంతర కణాలు లేదా లీడిగ్ కణాలు (Leydig cells) ఉంటాయి. ముష్కాలలోని నాళికల నుండి శుక్ర కణాలు (Spermatozoa) తయారౌతాయి. లీడిగ్ కణాలు పురుష హార్మోను టెస్టోస్టిరోన్ (Testosterone) స్రవిస్తాయి.

వృషణాల ధర్మాలు

వృషణాలు పురుష జననేంద్రియ వ్యవస్థలో భాగంగా, వినాళ గ్రంధులుగా పనిచేస్తాయి.

ఈ రెండు ధర్మాలు పియూష గ్రంధి నుండి విడుదలయ్యే గొనడోట్రోపిక్ హార్మోన్లు మీద ఆధారపడి తయారౌతాయి.

వృషణాల వ్యాధులు

వృషణాలు బయట ఉండడం మూలంగా దెబ్బలు తగలడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉండి నరాల ద్వారా కడుపులోనికి వెళ్తుంది.

  • వేరికోసిల్ : వృషణాల సిరల వాపు.
  • క్షయ, ఫైలేరియా క్రిముల మూలంగా వృషణాలు వాచి నొప్పి వస్తుంది.
  • వృషణాల కాన్సర్ ఎక్కువగా యువకులలో వస్తుంది. ఇది చాలా ప్రమాదమైనది.
  • స్పెర్మాటిక్ కార్డ్, వృషణాలు తాడులాగా మడతపడితే టార్షన్ (Torsion) అంటారు.
  • స్పెర్మాటిక్ కార్డ్ లోని రక్త నాళాలు ఉబ్బి రక్తం నిలిచిపోవడాన్ని వేరికోసీల్ (Varicocele) అంటారు.[1]
  • క్రిప్టార్కిడిజమ్ (Cryptorchidism) అనగా వృషణాలలో ఒకటి గాని రెండు గాని బయటకు కనిపించకుండా ఉండడం. పిండాభివృద్ధిలో వృషణాలు క్రిందికి దిగడంలో అవాంతరం ఏర్పడినప్పుడు అవి కడుపులో గాని, గజ్జలలో గాని ఆగిపోవచ్చును. సుమారు 3 శాతం పూర్తిగా అభివృద్ధి చెందిన శిశువులలో, 30 శాతం పాక్షికంగా అభివృద్ధి చెందిన శిశువులలో ఈ విధమైన లోపం కనిపిస్తుంది. ఇందువలన జననేంద్రియాలలో జన్మతహా వచ్చే లోపాలలో ఇది అతి సాధారణమైనది. అయితే బాగా అరుదుగా కొందరిలో వృషణాలు పూర్తిగా లేకపోవచ్చును. దీనిని ఎనార్కియా (Anorchia) అంటారు.
  • వరిబీజం, వృషణాల పరిమాణము పెరుగుదల

చిత్ర మాలిక

మూలాలు

  1. "Varicocele". Archived from the original on 2008-09-23. Retrieved 2008-10-16.
"https://te.wikipedia.org/w/index.php?title=వృషణం&oldid=3866433" నుండి వెలికితీశారు