Jump to content

శివసాగర్ జిల్లా

వికీపీడియా నుండి
(సిబ్‌సాగర్ జిల్లా నుండి దారిమార్పు చెందింది)
Sivasagar జిల్లా
শিৱসাগৰ জিলা
Assam పటంలో Sivasagar జిల్లా స్థానం
Assam పటంలో Sivasagar జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంAssam
డివిజనుSivasagar Division
ముఖ్య పట్టణంSivasagar
మండలాలు1. Amguri 2. Gaurisagar 3. Sivasagar 4. Demow 5. Nazira 6. Hapekhati 7. Lakowa 8. West Abhayapuri 9. Sonari
Government
 • లోకసభ నియోజకవర్గాలు1. Jorhat
 • శాసనసభ నియోజకవర్గాలు1. Amguri, 2. Sivasagar 3. Thowra 4. Nazira 5. Sonari 6. Mahmora
విస్తీర్ణం
 • మొత్తం2,668 కి.మీ2 (1,030 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం11,50,253
 • జనసాంద్రత430/కి.మీ2 (1,100/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత81.36 %
 • లింగ నిష్పత్తి951 per 1000 male
ప్రధాన రహదార్లుNH-37
Websiteఅధికారిక జాలస్థలి

సిబ్‌సాగర్ జిల్లా, ఎగువ అస్సాం లోని ఒక జిల్లా. అసోం రాజులు శిబ్ సాగర్ ని ముఖ్య పట్టణంగా చేసుకుని పరిపాలించారు. ఇప్పటికీ వారి కోట అయిన తలాతల్ గఢ్, రాజులు వినోదాన్ని తిలకించే "రోం గఢ్" పర్యాటకులకు ఆసక్తి కలిగిస్తూనే ఉన్నాయి. యుద్ధ సమయాలలో రాజులు తలాతల్ గఢ్ నుంచి తప్పించుకొనేందుకు రహస్యమార్గం ఉండేదిట. దీనిని శివ్‌సాగర్ అని కూడా అంటారు. జిల్లా కేంద్రంగా సిబ్‌సాగర్ పట్టణం ఉంది. భౌగోళిక వ్యత్యాసాలకు సిబ్‌సాగర్ ప్రత్యేక గుర్తింపు పొందింది. [1] 2001 గణాంకాలను అనుసరించి జిల్లావైశాల్యం 2668 చ.కి.మీ. అస్సాం రాష్ట్ర మొత్తం వైశాల్యం 78438 చ.కి.మీ. జిల్లాలో 3 ఉప విభాగాలు ఉన్నాయి: శివ్‌సాగర్, చరైడియో, నాజిరా. 26.45°ఉ, 27.15°ఉ అక్షాంశం 94.25°తూ, 95.25°తూ రేఖాంశంలో ఉంది. శివ్‌సాగర్ జిల్లా ఉత్తర సరిహద్దులో బ్రహ్మపుత్రనది, దక్షిణ సరిహద్దులో నాగాలాండ్, తూర్పు సరిహద్దులో డిహింగ్ నది పశ్చిమ సరిహద్దులో జానీ నది ఉన్నాయి. జిల్లాలో వివిధ జాతుల, వివిధ కులాల, భాషల, సంప్రదాయాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు.

చరిత్ర

[మార్చు]

బ్రిటిష్ పాలనకు ముందు అస్సాం ప్రాంతాన్ని 600 సంవత్సరాల కాలం అహోం వంశస్థులు శివ్‌సాగర్‌ను కేంద్రంగా చేసుకుని పాలించారు. అహోం రాజులు ఆలయాలు నిర్మించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. వివిధ దేవతలకు ప్రత్యేకించిన ఆలయాలను నిర్మించి ఆలయాలకు ప్రత్యేకించి పుష్కరుణులను త్రవ్వించారు. ఈ ఆలయాలు ఇప్పటికీ ఆనాటి అహోం రాజుల వైభవాన్ని చాటుతూ ఉన్నాయి.[1] శివ్‌సాగర్ 1699 నుండి 1788 వరకు అహోం రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. ప్రబలమైన జాయ్‌సాగర్ సరోవరం రుద్రసింహా (1696-1714) తన తల్లి జాయ్‌మోతీ కుంవారి ఙాపకార్ధం నిర్మించబడు. జాయ్‌సాగర్ తీరంలో జాయ్ డాల్ ఉంది. 1745లో ప్రమత్త సింహా (1744-1751) ఇటుకలతో రణ్‌గఢ్‌ను నిర్మించాడు.

గౌరిసాగర్ సరోవరం

[మార్చు]

గౌరిసాగర్ సరసు శివ్‌సాగర్ నగరానికి 8 కి.మీ దూరంలో ఉంది. 1733లో రాణి అంబికా దేవి చేత త్రవ్వించబడింది. శివసాగర్ సరోవర తీరంలో శివుడు, విష్ణుమూర్తి, అందికా విగ్రహాలు ఉన్నాయి. గార్గయాన్‌లో రాజేశ్వర్ సింహా (1751-1769) కరేంగ్ గఢ్ నిర్మించాడు. చరైడియో 28కి.మీ శివ్‌సాగర్‌కు 28 కి.మీ దూరంలో ఉంది. ఇది మైడంస్‌కు గుర్తింపు పొందింది.మొదటి అహోం రాజు శుకఫా 1253లో చరైడియో నిర్మించాడు. శివసాగం ముందుగా రోంగ్‌పూర్ అని పిలువబడేది. రోంగ్‌పూర్ మెటక అని పిలువబడేది.[2] శివ్‌సాగర్ అసలు పేరు శిబ్‌పూర్. 1826 జిబ్రవరి 24 యాండబో ఒప్పందంతో అస్సాం ప్రాంతంతో బ్రిటిష్ ఆక్రమణ మొదలైంది. యాండబో ఒప్పందం ఈ ప్రాంతంలో 600 సంవత్సరాల అహోం పాలన ముగింపుకు వచ్చింది.

బ్రిటిష్ పాలన

[మార్చు]

1828 తరువాత అస్సాంలో బ్రిటిష్ పాలనలో జీల్లాల ఏర్పాటుతో నిర్వహణలో పలు మార్పులు జరిగాయి. 1839లో పురందర్ సింహా రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యంతో విలీనం చేయబడిన తరువాత శివ్‌సాగర్ జిల్లా ఏర్పాటు చేయబడింది. సాదర్ కేంద్రమైన శివ్‌సాగర్ జోర్హాట్కు మార్చబడింది. సమైక్య శివ్‌సాగర్ జిల్లాలో 3 ఉపవిభాగాలు ఉన్నాయి: శివ్‌సాగర్, జోర్హాట్, గోలాఘాట్. 1983లో సమైక్య శివ్‌సాగర్ జిల్లా నుండి జోర్హాట్ జిల్లా,[3] గోలాఘాట్ జిల్లాలు ఏర్పాటు చేయబడ్డాయి.[3]

భౌగోళికం

[మార్చు]

జిల్లా 26.45°, 27.15° డిగ్రీల ఉత్తర, 94.25°, 95.25° డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. శివసాగర్ వైశాల్యం 2668 చ.కి.మీ.[4] ఇది ఎస్టోనియా దేశంలోని సారెమ్మా ఐలాండ్ జనసంఖ్యకు సమం.[5] జిల్లా దక్షిణ సరిహద్దులో నాగా కొండలు, ఉత్తర సరిహద్దులో బ్రహ్మపుత్ర నది ఉంది. జిల్లా అంతటా సావంతంగా అక్కడక్కడా చిన్న కొండలతో సమతల ప్రదేశంగా ఉంది. ఆగ్నేయ, దక్షిణ సరిహద్దులో నాగాలాండ్ సరిహద్దు ఉంది.

ఆర్ధికం

[మార్చు]

జిల్లాలో అత్యధికంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా నూనె, టీ పరిశ్రమలు ఉన్నాయి.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,150,253,[6]
ఇది దాదాపు. తైమోర్ దేశ జనసంఖ్యకు సమానం.[7]
అమెరికాలోని. రోడే ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం.[8]
640 భారతదేశ జిల్లాలలో. 406వ స్థానంలో ఉంది.[6]
1చ.కి.మీ జనసాంద్రత. 431 [6]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 9.37%.[6]
స్త్రీ పురుష నిష్పత్తి. 951:1000 [6]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 81.36%.[6]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం
హిందువులు 927,706 (88.16%),
ముస్లిములు 85,761 (8.15%).
స్థానికులు అహోములు, టీ-గిరిజనులు, సుటియాలు, సోనోవాల్ (కాచారి), మిసింగ్, డియోరి.
బుద్ధిస్ట్ గ్రామీణప్రజలు కామ్యాంగ్, తురంగ్
ఇతరులు కోన్యాగ్, మెయిటీ ప్రజలి (మణిపురి), నాక్టే

వృక్షసంపద , జంతుజాలం

[మార్చు]

1999లో శివ్‌సాగర్ జిల్లా 34చ.కి.మీ వైశాల్యంలో " పనిదిహింగ్ విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఏర్పాటు చేయబడింది.[9] జిల్లాలో అదనంగా అభయపూర్, దిల్లి, డిరోయి, జెలెకి, సాలేష్ వంటి అభయారణ్యాలు ఉన్నాయి. నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులలో కొంత అటవీ భూభాగం ఉంది. జిల్లాలో ఉష్ణమండల సతతహరితారణ్యాల ఉన్నాయి. జిల్లాలో హొల్లాంగ్, టిటాచపా, నహర్, మెకై మొదలైన చెట్లు అధికంగా ఉన్నాయి. జిల్లాలో సుసంపన్నమైన జంతుజాలం ఉంది. జిల్లాలోని అభయారణ్యాలలో అంతరించిపోతున్న పులి,ఏనుగు, సన్ బియర్, సాంబార్ డీర్, హూలాక్గిబ్బన్ మొదలైన జంతువులు ఉన్నాయి.

పండుగలు , ఉత్సవాలు

[మార్చు]

జిల్లాలో బిహూ ఉత్సవాలకు ప్రాధాన్యత అధికం.[2] పంట చేతికి అందిన సమయంలో బోహగ్ బిహూ, పంట సాగు ఆరంభంలో మార్గ్ బిహూ వ్యవసాయం తక్కువగా ఉన్న సమయంలో కటి బహు జరుపుకుంటారు. ప్రముఖ వైష్ణవ సన్యాసుల జయంతి, వర్ధంతులను వైష్ణవులు ప్రత్యేక దినాలుగా పాటిస్తుంటారు. గిరిజన ప్రజలు మిషింగ్ ఉత్సవం డియోరీలు వారి శైలిలో బిహూ ఉత్సవాలు జరుపుకుంటారు. ఈద్- ఉల్- జుహా, ఈద్ ఉల్ ఫిటర్ ముస్లిముల పండుగలో ముఖ్యమైనవి. ఇతర హిందూ పండుగలలో అంబూబషి, దుర్గా పూజ, శివరాత్రి ప్రధానమైనవి. శివరాత్రి ఉత్సవాలు ఇంకా అహోం కాలంలోలా నిర్వహించబడుతున్నాయి.[2] టీ గిరిజనులు వారి స్వంత సంప్రదాయంలో ఉత్సవాలు జరుపుకుంటూంటారు. జిల్లాలో గుర్తించతగిన సంప్రదాఅయాలలో ఝుమూర్, గీతాలు ప్రధానమైనవి.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 District at a glance, Sivasagar. Office of the Deputy Director of Economics and Statistics, Sivasagar. 2001.
  2. 2.0 2.1 2.2 The North East Times, Special supplement (1995). Sivasagar District. Guwahati: G L Publications.
  3. 3.0 3.1 Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  4. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Assam: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1116. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  5. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11. Saaremaa 2,672km2
  6. 6.0 6.1 6.2 6.3 6.4 6.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  7. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Timor-Leste 1,177,834 July 2011 est.
  8. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567
  9. Indian Ministry of Forests and Environment. "Protected areas: Assam". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.

భౌగోళిక స్థానం

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]