Jump to content

గంగూరు

అక్షాంశ రేఖాంశాలు: 16°28′13″N 80°43′47″E / 16.4703899°N 80.7296418°E / 16.4703899; 80.7296418
వికీపీడియా నుండి
గంగూరు
—  రెవెన్యూయేతర గ్రామం  —
గంగూరు is located in Andhra Pradesh
గంగూరు
గంగూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°28′13″N 80°43′47″E / 16.4703899°N 80.7296418°E / 16.4703899; 80.7296418
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం పెనమలూరు
ప్రభుత్వం
 - సర్పంచి నందేటి దేవమణి
జనాభా (2011)
 - మొత్తం 9,757
 - పురుషుల సంఖ్య 3,529
 - స్త్రీల సంఖ్య 6,228
 - గృహాల సంఖ్య 1,839
పిన్ కోడ్ 521139
ఎస్.టి.డి కోడ్ 0866

గంగూరు, కృష్ణా జిల్లా, పెనమలూరు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.ఇది సముద్రమట్టంనుండి 19 మీ.ఎత్తులో ఉంది. ఇది బందరు రోడ్డుకి ఆనుకొని ఉంది.

గ్రామ చరిత్ర

[మార్చు]

మెట్రోపాలిటన్ ప్రాంతం

[మార్చు]

2017 మార్చి 23 న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ డిపార్ట్మెంట్ జి.ఓ. 104 ప్రకారం, ఇది విజయవాడ మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా మారింది.[1][2]

సమీప గ్రామాలు

[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో ఈడుపుగల్లు, పెనమలూరు, వేల్పూరు, ఉప్పలూరు, నిడమానూరు గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు

[మార్చు]

కంకిపాడు. గన్నవరం, విజయవాడ, విజయవాడ గ్రామీణ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను ప్రభుత్వం అందించుతుంది, అలాగే ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, రాష్ట్ర విద్యా శాఖ కింద పనిచేస్తాయి.[3][4] వివిధ పాఠశాలలు తెలుగు, ఆంగ్లం మాధ్యమంలో అనుసరిస్తూ బోధన జరుగుతుంది. ఇటీవల అనేక ప్రైవేటు విద్యాసంస్థలు నెలకొల్పారు.నలంద జూనియర్ కాలేజి, నోబుల్ ఇంగ్లీషు మీడియ్ం స్కూల్, ప్రగతినికేతన్ హైస్కూల్, గంగూరు

గ్రామములో మౌలిక వసతులు

[మార్చు]
  1. ఇ.ఎస్‌.ఐ. ఆసుపత్రి, గంగూరు.
  2. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, 132/11 కేవీ సబ్‌ స్టేషన్‌లు, గంగూరులో ఉన్నాయి.

గ్రామ పంచాయతీ

[మార్చు]
  1. ఇది ఒక మేజర్ పంచాయితీ.
  2. ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో నందేటి దేవమణి సర్పంచిగా ఎన్నికైంది. ఉపసర్పంచిగా ఇస్మాయిల్ షరీఫ్ ఎన్నికైనాడు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

పురాతన దేవాలయాలు పోరంకి, చోడవరం, యనమలకుదురు, గోసాల, కానూరు, తాడిగడప, వణుకూరు గ్రామాల్లో ఉన్నాయి. షిర్డీసాయి మందిరాలు ఈ పెనమలూరు నియోజకవర్గలో ఎక్కువగా నిర్మితమవుతున్నాయి. యనమలకుదురు ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా కీర్తి పొందాయి. కానూరులో తిరుపతమ్మ తిరునాళ్లు నిర్వహస్తున్నారు. కానూరు, గంగూరులలో పురాతన మసీదులున్నాయి. కానూరు, పోరంకి, పెనమలూరు, వణుకూరు గ్రామాల్లో పురాతనమైన చర్చీలు ఉన్నాయి.

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

గ్రామంలో పరిశ్రమలు

[మార్చు]
  • గంగూరు పరిశ్రమల కేంద్రంగా ఉంది. ఇక్కడ విజయా స్పిన్నింగ్ మిల్లు ముఖ్యమైనది.
  • వెలగపూడి కోల్డుస్టోరేజి, క్వాలిటీ ఐస్‌, లాజా ఐస్‌, తవుడాయిలు మిల్లులు ఇక్కడ ఉన్నాయి.
  • ప్రియా ఫుడ్స్‌, సిరీస్‌ కంపెనీ, డార్విన్‌ ఫార్మాస్యూటికల్స్‌ పరిశ్రమలు, రైస్‌మిల్లులు గంగూరు, పోరంకిల్లో ఉన్నాయి.
  • గంగూరులో సత్యకళ పవర్‌ప్లాంటు ఉంది.
  • గంగూరు హోటళ్లకు ప్రసిద్ధి.

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9,757. ఇందులో పురుషుల సంఖ్య 3,529, స్త్రీల సంఖ్య 6,228, గ్రామంలో నివాసగృహాలు 1839 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 532 హెక్టారులు.

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6643. ఇందులో పురుషుల సంఖ్య 3692, స్త్రీల సంఖ్య 2951, గ్రామంలో నివాసగృహాలు 1463 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 532 హెక్టారులు.

మూలాలు

[మార్చు]
  1. Reporter, Staff. "Vijayawada, 19 other contiguous areas notified as Metropolitan Area". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 27 March 2017.
  2. "Welcome to Government Order Issue Register". goir.ap.gov.in. Archived from the original on 7 May 2017. Retrieved 27 March 2017.
  3. "School Eduvation Department" (PDF). School Education Department, Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 19 March 2016. Retrieved 7 November 2016.
  4. "The Department of School Education – Official AP State Government Portal | AP State Portal". www.ap.gov.in. Archived from the original on 7 November 2016. Retrieved 7 November 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]

[2] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2013, ఆగస్టు-5; 1వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=గంగూరు&oldid=3555095" నుండి వెలికితీశారు