అక్షాంశ రేఖాంశాలు: 16°32′00″N 80°35′00″E / 16.533333°N 80.583333°E / 16.533333; 80.583333

గొల్లపూడి (విజయవాడ గ్రామీణ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గొల్లపూడి
—  రెవెన్యూయేతర గ్రామం  —
గొల్లపూడి is located in Andhra Pradesh
గొల్లపూడి
గొల్లపూడి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°32′00″N 80°35′00″E / 16.533333°N 80.583333°E / 16.533333; 80.583333
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
N T R జిల్లా N T R జిల్లా
మండలం విజయవాడ గ్రామీణ
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి సాధనాల వెంకటేశ్వరమ్మ
జనాభా (2011)
 - మొత్తం 37,349
 - పురుషుల సంఖ్య 19,449
 - స్త్రీల సంఖ్య 17,900
 - గృహాల సంఖ్య 7,794
పిన్ కోడ్ 521 225
ఎస్.టి.డి కోడ్ 0866
చిగురుపాటి మల్లికార్జునరావు స్మారక గ్రంధాలయ భవనం

గొల్లపూడి, కృష్ణా జిల్లా, విజయవాడ గ్రామీణ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో విజయవాడ పొరుగు ప్రాంతం గొల్లపూడి.

గ్రామ చరిత్ర

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు

[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా ఉంది. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం అనేవి ఉన్నాయి.

విజయవాడ రూరల్ మండలం

[మార్చు]

విజయవాడ రూరల్ మండలంలోని ఎనికెపాడు, కుందావారి ఖండ్రిక, కొత్తూరు, గూడవల్లి, గొల్లపూడి, జక్కంపూడి, తాడేపల్లి, దోనె ఆత్కూరు, నిడమానూరు, నున్న, పాతపాడు, పైడూరుపాడు, ప్రసాదంపాడు, ఫిర్యాది నైనవరం, బోడపాడు, రామవరప్పాడు, రాయనపాడు, వేమవరం, షహబాదు, సూరాయ పాలెం (గొల్లపూడి శివారు) గ్రామాలు ఉన్నాయి.

మెట్రోపాలిటన్ ప్రాంతం

[మార్చు]

2017 మార్చి 23 న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ డిపార్ట్మెంట్ జి.ఓ. 104 ప్రకారం, ఇది విజయవాడ మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా మారింది.[2]

గ్రామ భౌగోళికం

[మార్చు]

ఇది సముద్రమట్టానికి 21 మీ.ఎత్తులో ఉంది.

గ్రామ విస్తీర్ణం

22 చదరపు కిలో మీటర్లు

గ్రామ శివారు గ్రామాలు

సూరాయపాలెం, నల్లకుంట, రామరాజ్యనగర్, దర్గా హరిజనవాడ

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

రోడ్డు మార్గం: విజయవాడ నుండి రోడ్దు రవాణా సౌకర్యం ఉంది. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి (65) ప్రక్కన ఉంది. ప్రకాశం బ్యారేజికి 5 కిలోమీటర్ల ఎగువన కృష్ణానది ఒడ్డున ఉంది.

విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి సిటీ బస్ సౌకర్యం ఉంది.

రైలు మార్గం: మేజర్ రైల్వేజంక్షన్, విజయవాడకు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ నుండి సిటీ బస్ సౌకర్యం ఉంది.

విమాన మార్గం: విజయవాడ విమానాశ్రయం (గన్నవరం) కు 29 కిలోమీటర్ల దూరంలో ఉంది.

గ్రామంలోని విద్యాసౌకర్యాలు

[మార్చు]

ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను ప్రభుత్వం అందించుతుంది, అలాగే ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, రాష్ట్ర విద్యా శాఖ కింద పనిచేస్తాయి. వివిధ పాఠశాలలు తెలుగు, ఆంగ్లం మాధ్యమంలో అనుసరిస్తూ బోధన జరుగుతుంది.

  1. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గొల్లపూడి:- ఈ పాఠశాల గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రక్కన ఉంది. 2017-2018 విద్యా సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాల నుండి అప్ గ్రేడ్ చేయబడింది.
  2. శ్రీ పోసాని నరసింహా రావు చౌదరి ఉన్నత పాఠశాల (SPNRC High School), గొల్లపూడి:- 1964 ఆగస్టు 12 న శ్రీమతి పోసాని నాగభూషణమ్మ గారిచే ఆమె భర్త పేరిట స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గ్రాంట్-ఇన్-ఎయిడ్ పొందుచున్నది. జాతీయ రహదారి-65 ప్రక్కన 2.83 ఎకరముల విస్తీర్ణములో పాఠశాల భవనము నిర్మించబడి నాటి ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి చే ప్రారంభించబడింది. ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధీనములో ఉంది.
  3. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గొల్లపూడి:- ఈ పాఠశాల గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రక్కన ఉంది. ఈ పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయులు శ్రీ దాసరి వెంకట శ్రీమన్నారాయణ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు పురస్కారానికి ఎంపికైనారు. దేశరాజధాని కొత్తఢిల్లీలోని విఙాన్ భవన్ లో, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, 2015, సెప్టెంబరు 5వ తేదీనాడు, భారత రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి చేతులమీదుగా వీరు ఈ పురస్కారం అందుకున్నారు.
  4. మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, సూరాయపాలెం (దళితవాడ):- ఈ పాఠశాల జాతీయ రహదారి-65 కు సమీపంలో గొల్లపూడి శివారు నల్లకుంటలో రాయనపాడు రోడ్ లో ఉంది.
  5. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, సిద్దార్థ నగర్, గొల్లపూడి.
  6. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, సూరాయపాలెం.
  7. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, రామరాజ్య నగర్.
  8. సి. యస్. ఐ. ఎలిమెంటరీ స్కూల్, గొల్లపూడి. (బొడ్డురాయి సెంటర్)
  9. మండల పరిషత్ ప్రాథమిక ఉర్దూ పాఠశాల, గొల్లపూడి.(మసీదు దగ్గర)
  10. మండల పరిషత్ ప్రాథమిక ఉర్దూ పాఠశాల, మౌలా నగర్, గొల్లపూడి.
  11. జిల్లా గ్రంథాలయ సంస్థ గ్రంథాలయం:- ఈ గ్రామంలో కీ.శే.చిగురుపాటి మల్లిఖార్జునరావు ఙాపకార్ధం నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ఇటీవల పునర్నర్మించి 2016 జనవరి 7న ప్రారంభించారు. [8]

ప్రైవేటు విద్యా సంస్థలు

  1. నారాయణ కాలేజి (బాలురు)
  2. నారాయణ కాలేజి (బాలికలు)
  3. చైతన్య కాలేజి (బాలురు)
  4. చైతన్య కాలేజి (బాలికలు)

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

[మార్చు]

గ్రామమంతటికి విద్యుత్ సౌకర్యం కల్పించబడింది. వీధి దీపాలు ఏర్పాటుచేయబడినవి (ఎల్.ఇ.డి. - 250, ఎం. వి. ల్యాంప్స్ - 150, ఎస్.వి. ల్యాంప్స్ - 150, ట్యూబ్ లైట్స్ - 3746)

అంగన్ వాడి కేంద్రములు 18 ఏర్పాటుచేయబడినవి. ( మెయిన్ సెంటర్ - కృష్ణ కరకట్ట, కట్ట క్రింద, పంచాయతి ఆఫీస్ వెనుక, మసీదు, కమ్యూనిటీ హాల్, ఎస్.సి. ఏరియా, బి.సి. ఏరియా, రజక పేట, అంబేద్కర్ నగర్, మౌలానగర్, దర్గా హరిజనవాడ, రామరాజ్య నగర్, కోయ గూడెం, పైపుల కంపెనీ, నల్లకుంట, సూరాయపాలెం)

ప్రజారోగ్యము - పారిశుధ్యము

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ప్రైమరీ హెల్త్ సెంటర్) కొండపల్లిలో ఉంది. సబ్ సెంటర్స్ 3 ఏర్పాటుచేయబడినవి. ( పంచాయతీ ఆఫీస్ వెనుక, హరిజనవాడ కమ్యూనిటీ హాల్, అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్)

హెల్త్ సూపర్ వైజర్ - 1, ఆరోగ్య కార్యకర్తలు - 3, ఆషా వర్కర్స్ - 15 మంది కలరు.

ఆషా హాస్పిటల్ క్రైస్తవ మిషనరీ వారిచే ఏర్పాటుచేయబడింది.

ఆంధ్రా హాస్పిటల్ (కార్పొరేట్ హాస్పిటల్)

రహదారులు

గ్రామ పంచాయతి పరిధిలో జాతీయ రహదారి - 65 (పూర్వపు యన్. హెచ్.-9) ఉంది.

సిమెంట్ రోడ్లు - 55 (6 కి.మీ. పొడవు)

తారు రోడ్లు - 28 (5 కి.మీ. పొడవు)

మెటల్ రోడ్లు - 28 (11 కి.మీ. పొడవు)

గ్రావెల్ రోడ్లు - 35 (7 కి.మీ. పొడవు)

జాతీయ బ్యాంకులు

భారతీయ స్టేట్ బ్యాంక్, శ్రీ పోసాని నరసింహా రావు చౌదరి రోడ్, గొల్లపూడి.

ఆంధ్రా బ్యాంక్, స్పెషల్ అగ్రికల్చరల్ ఫైనాన్స్ బ్రాంచ్, శ్రీ పోసాని నరసింహా రావు చౌదరి రోడ్, గొల్లపూడి

కెనరా బ్యాంక్, శ్రీ పోసాని నరసింహా రావు చౌదరి రోడ్, గొల్లపూడి

ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంక్, శ్రీ పోసాని నరసింహా రావు చౌదరి రోడ్, గొల్లపూడి

సప్తగిరి గ్రామీణ బ్యాంక్, శ్రీ పోసాని నరసింహా రావు చౌదరి రోడ్, గొల్లపూడి

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, శ్రీ పోసాని నరసింహా రావు చౌదరి హైస్కూల్ ఎదురు రోడ్, గొల్లపూడి

హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్, శ్రీ పోసాని నరసింహా రావు చౌదరి హైస్కూల్ ఎదురు రోడ్, గొల్లపూడి

తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్, దత్త కళ్యాణ మండపం రోడ్, గొల్లపూడి

ఆప్కాబ్ కో-ఆపరేటివ్ బ్యాంక్, సాయిపురం కాలనీ రోడ్, గొల్లపూడి

కోస్టల్ బ్యాంక్, గొల్లపూడి

ఇండియన్ బ్యాంక్, గొల్లపూడి

తపాలా సౌకర్యం

ఉప తపాలా కార్యాలయం ఉంది.

టెలిఫోన్ సౌకర్యం

టెలిఫోన్ ఎక్చేంజ్ ఉంది.

పోలీస్ స్టేషన్ సౌకర్యం

భవానీపురం హౌసింగ్ బోర్డ్ కాలనీలో భవానీపురం రక్షకభట నిలయం పరిధిలో ఉంది.

ఫైర్ స్టేషన్

విజయవాడ అగ్నిమాపక కేంద్రం పరిధిలో ఉంది.

గ్యాస్ స్టేషన్

కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ వారిచే నిర్వహించబడుచున్న పెట్రోల్, డీజిల్ విక్రయించు బంక్ ఉంది.

వ్యవసాయం

గొల్లపూడి అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ ఉంది.

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఉంది.

ప్రజా పంపిణీ వ్యవస్థ

ప్రభుత్వ చౌక ధరల దుకాణములు 7 ఉన్నాయి. (పోస్టాఫీసు రోడ్, ముస్లిం పేట, దళితవాడ బొడ్డురాయి సెంటర్, దళితవాడ రెడ్డి గారి భవనము దగ్గర, ఆషా హాస్పిటల్ రోడ్, సూరాయపాలెం, రామరాజ్యనగర్)

గ్రామంలో తెలుపు రేషన్ కార్డుల సంఖ్య - 3177, ఆర్.ఎ.పి. & టి.ఎ.పి. -983

అంత్యోదయ కార్డుల సంఖ్య - 98

పశు వైద్యశాల

పశువుల ఆస్పత్రి ఉంది. పశువులకు కృత్రిమ గర్భధారణ గావించు సౌకర్యం ఉంది.

సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్

స్వయం సహాయక సంఘాల సంఖ్య - 206

స్వయం సహాయక సంఘాల సభ్యుల సంఖ్య - 2876

ఫించన్ల పంపిణీ

వృద్ధాప్య ఫించన్లు - 268

వితంతు ఫించన్లు - 502

అభయ హస్తం ఫించన్లు - 30

దివ్యాంగుల ఫించన్లు - 130

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

[మార్చు]
  1. కృష్ణానది నుండి నీటిని క్లోరినేషన్ చేసి మంచి నీరు అందించబడుచున్నది.
  2. ఫిల్టర్ బెడ్స్ ద్వారా నీటిని శుభ్రపరచి త్రాగునీరు సరఫరా చేయబడుచున్నది.
  3. రక్షిత మంచినీటి సరఫరా పథక ఓ.హెచ్.యస్.ఆర్.లు - 6 ( 1. గొల్లపూడి ప్రధాన గ్రామం ట్యాంక్ - 90,000 లీటర్లు, 2. సూరాయపాలెం ట్యాంక్ - 90,000 లీటర్లు, 3. దళితవాడ ట్యాంక్ - 2,00,000 లీటర్లు, 4. రామరాజ్యనగర్ ట్యాంక్ - 1,50,000 లీటర్లు, 5. మౌలానగర్ ట్యాంక్ - 1,50,000 లీటర్లు, 6. సాయిపురం కాలనీ ట్యాంక్ - 1,50,000 లీటర్లు)
  4. పబ్లిక్ కుళాయిలు - 451
  5. ప్రైవేట్ కుళాయిలు - 4942
  6. చేతి పంపులు - 102
  7. చెరువులు - లేవు
  8. గొల్లపూడి పంపింగ్ స్కీము (లిఫ్ట్ ఇర్రిగేషన్) క్రింద గొల్లపూడి నుండి ముస్తాబాద వరకు వెడల్పాటి పంట కాలువ నిర్మించబడి వ్యవసాయానికి సాగునీటి సౌకర్యం కల్పించబడింది.
  9. తుమ్మలపాలెం పంపింగ్ స్కీము (లిఫ్ట్ ఇర్రిగేషన్) ద్వారా పంట భూములకు సాగునీటి సౌకర్యం కల్పించబడింది.

గ్రామ పంచాయతీ

[మార్చు]

గొల్లపూడి గ్రామ పంచాయతి రీజినల్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ లోకల్ ఎడ్మిని స్ట్రేషన్, విజయవాడ వారి ఉత్తర్వులు ఆర్.ఓ.సి.నెం.2274/52, తేది 09-04-1957 ప్రకారం ఏర్పడినది.

గొల్లపూడి గ్రామ పంచాయతి పాలకవర్గ సభ్యులు: సర్పంచ్, 20 మంది సభ్యులు

షెడ్యూలుకులాలకు రిజర్వ్ చేయబడినవి - 3 వార్డులు (10,19,20 వార్డులు)

షెడ్యూలుతెగలకు రిజర్వ్ చేయబడినవి - 1 వార్డు (15వ వార్డు)

వెనుకబడినతరగతులకు రిజర్వ్ చేయబడినవి - 3 (1,6,18 వార్డులు)

స్త్రీలకు రిజర్వ్ చేయబడినవి - 7 వార్డులు (3,4,5,8,9,14,17 వార్డులు)

గ్రామ పంచాయతి ఆదాయ వనరులు:

1. ఇంటి పన్నులు

2. మంచి నీటి కుళాయి ఫీజులు

3. లైసెన్స్ ఫీజులు

4. భవన నిర్మాణ రుసుములు

ప్రభుత్వ గ్రాంటులు:

1. జనాభా గ్రాంటు

2. వృత్తి పన్ను

3. రిజిస్త్రేషన్ స్టాంపు డ్యూటి

ఆర్ధిక సంఘ నిధులు:

1. 13 వ ఆర్థిక సంఘ నిధులు

2. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు

3. 14 వ ఆర్థిక సంఘ నిధులు

మాజీ సర్పంచులు:

గ్రామ పంచాయతి బోర్డు అధ్యక్షుడు లేక సర్పంచ్ గా వడ్లమూడి సీతారామస్వామి, బొమ్మసాని కృష్ణమూర్తి, వడ్లమూడి వెంకయ్య, కోమటి జగన్మోహన రావు, బొమ్మసాని సుబ్బారావు, వడ్లమూడి భీమయ్య, ఈపూరి పద్మావతి, బొమ్మసాని సుబ్బారావు గతంలో పరిపాలించారు.

ప్రస్తుత గ్రామ పంచాయతి పాలకవర్గ ఎన్నిక తేది: 27-07-2013

ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో సాధనాల వేంకటేశ్వరమ్మ సర్పంచిగా గెలుపొందింది. ఉప సర్పంచిగా చిగురుపాటి నాగరాజు ఎన్నికైనాడు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  1. శ్రీ విజయగణపతిస్వామివారి ఆలయం:- గొల్లపూడిలోని టెలికం కాలనీలో వేంచేసియున్న ఈ స్వామివారి ఆలయ వార్షికోత్సవం, 2017,జూన్-4వతేదీ ఆదివారం 9-30 కి నిర్వహించెదరు. ఈ సందర్భంగా స్వామివారి శాంతికళ్యాణం నిర్వహించెదరు. మద్యాహ్నం 12 గంటల నుండి, విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించెదరు.
  2. అయ్యప్పస్వామి గుడి.
  3. శ్రీ వెంకయ్యస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015,మార్చ్-8వ తేదీ ఆదివారం నాడు, ఆగమవేత్తల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. నెల్లూరులోని వెంకయ్యస్వామివారి ఆశ్రమ పీఠాధిపతుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లాలోని నాగులవెల్గటూరు గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన వెంకయ్యస్వామి, అక్కడి ప్రజల బాధలను పోగొట్టేవారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన స్వామివారి గొప్పదనాన్ని చాటిచెప్పే కచేరీ భక్తులను ఆకట్టుకున్నది. అనసంతరం మద్యాహ్నం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు.
  4. శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం:- 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయ పునర్నిర్మాణం కొరకు, 2015,మే నెల-2వ తేదీ శనివారంనాడు శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.
  5. శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- గ్రామంములోని పెట్రోలు బంక్ కి ఎదురుగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా సువర్చలా, ఆంజనేయస్వామివారల కళ్యాణం, కన్నుల పండువగా నిర్వహించెదరు. సాయంత్రం, స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించెదరు.
  6. శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం.
  7. రామాలయం
  8. శివాలయం
  9. పేరంటాలమ్మ గుడి

గ్రామంలోని ప్రధాన పంటలు

[మార్చు]

వ్యవసాయ భూమి సాగు విస్తీర్ణం - 3,386 ఎకరాలు.

ఒండ్రు నేలలు, మాగాణి, మెట్ట భూములు కలవు

వరి ప్రధాన పంట. జొన్న, మొక్కజొన్న, చెరకు, పొగాకు, ప్రత్తి, మినుములు, పెసలు, జనుము మొదలగు పంటలు పండిస్తారు.

బంజరు భూమి విస్తీర్ణం - 2,093 ఎకరములు

గ్రామ విశేషాలు

[మార్చు]

15 గ్రామాలతో పాటు గొల్లపూడి గ్రామాన్నికూడా ప్రతిపాదిత గ్రేటర్ విజయవాడ నగరంలో కలపబోతున్నారు. గ్రామ జనాభా సుమారు 37,000. నగరంలో స్థలాల కొరత నేపథ్యంలో వివిధకాలనీల నిర్మాణాలను గొల్లపూడి శివారులో చేపడుతున్నారు. విజయవాడ బైపాసు రోడ్డు నిర్మాణ దశలో ఉంది. గన్నవరం విమానాశ్రయం నుండి గొల్లపూడి వరకూ మధ్యలో ఇన్నర్ రింగ్ రోడ్ రామవరప్పాడు వరకు నిర్మించబడింది. విజయవాడ వన్‌టవున్‌ ప్రాంతంలోని ఎర్రకట్ట ప్రాంతాన్ని తాకుతూ బీఆర్టీఎస్‌ కారిడార్‌ను నిర్మించారు.

గొల్లపూడి గ్రామంలోని డి.అర్.డి.ఏ. కార్యాలయమైన టి.టి.డి.సి.లో రాష్ట్రస్థాయి ఇసుక త్రవ్వకాల నియంత్రణ కేంద్రం ప్రారంభమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలోని ఇసుక త్రవ్వకాలను ఇక్కడినుండియే నియంత్రించనున్నారు. [7]

సమీప గ్రామాలు

[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో భవానీపురం, హౌసింగ్ బోర్డ్ కాలనీ, విద్యాధరపురం, జోజినగర్, జక్కంపూడి, రాయనపాడు, పైడూరుపాడు, గుంటుపల్లి గ్రామాలు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-20.
  2. Reporter, Staff. "Vijayawada, 19 other contiguous areas notified as Metropolitan Area". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 27 March 2017.

వెలుపలి లింకులు

[మార్చు]