Jump to content

బన్స్వారా జిల్లా

వికీపీడియా నుండి
బన్‌స్వార
మంగర్ స్మారక చిహ్నం, బన్‌స్వార
మంగర్ స్మారక చిహ్నం, బన్‌స్వార
రాజస్థాన్‌ పటంలో బన్‌స్వార జిల్లా స్థానం
రాజస్థాన్‌ పటంలో బన్‌స్వార జిల్లా స్థానం
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
పరిపాలనా కేంద్రంబన్‌స్వార
విస్తీర్ణం
 • Total5,037 కి.మీ2 (1,945 చ. మై)
జనాభా
 (2011)
 • Total17,97,485
 • జనసాంద్రత360/కి.మీ2 (920/చ. మై.)
Time zoneUTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం)

రాజస్థాన్ రాష్ట్రంలోని జిల్లాలలో బన్‌స్వార జిల్లా ఒకటి. బన్‌స్వార పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 5,037 (1.4%). జిల్లా ఉత్తర సరిహద్దులో ఉదయపూర్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో ప్రతాప్‌గఢ్ జిల్లా, తూర్పు సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఆగ్నేయ సరిహద్దులో గుజరాత్ రాష్ట్రం, పశ్చిమ సరిహద్దులో దుంగర్‌పూర్ జిల్లా ఉన్నాయి.

పేరువెనుక చరిత్ర

[మార్చు]

ఈ ప్రాంతం గతంలో బన్‌స్వారా రాజాస్థానంగా ఉండేది, కనుక ఈ జిల్లాకు బన్‌స్వారా అని నామకరణం చేయబడింది. ఈ ప్రాంతం పేరు గురించి 2 కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రాంతం కొంతకాలం బిల్ రాజప్రతినిధి బన్‌స పాలనలో ఉండేది కనుక ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని ఒక కథనం వివరిస్తుంది. బన్‌స 1529లో మహారావల్ జగ్మల్ సింగ్ చేతిలో మరణించాడు. రెండవ కథనం అనుసరించి " బనస్ వర " (వెదురు దేశం) అని అర్ధం. ఇక్కడ అరణ్యంలో విస్తారంగా వెదురు పొదలు ఉన్నాయి, కనుక ఈ ప్రాంతానికి బన్‌స్వారా అనే పేరు వచ్చిందని విశ్వసిస్తారు.

భౌగోళికం

[మార్చు]

బన్‌స్వారా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వగడి భూభాగంలో ఉంది. వగడి (వగర్, వగ్రి) భూభాగంలో బన్‌స్వారా, దుంగర్‌పూర్ జిల్లాలు ఉన్నాయి.జిల్లాకు మహి నది ముఖద్వారంగా ఉంది. మధ్యప్రదేశ్ లోని వింద్యపర్వతాలలో జన్మించిన మహినది జిల్లా ఉత్తరభాగం నుండి జిల్లాలో ప్రవహిస్తుంది. తరువాత ఇది ఆగ్నేయంగా ప్రవహిస్తూ బన్‌స్వారా, దుంగర్‌పూర్ జిల్లాలలో ప్రవహించి తరువాత గుజరాత్‌లో ప్రవహించి గల్ఫ్ ఆఫ్ కాంబే వద్ద సముద్రంలో సంగమిస్తుంది. బన్‌స్వారా జిల్లా వృక్షజాలం, జంతుజాలంతో సుసంపన్నమై ఉంది. జిల్లాలోని అరణ్యంలో టేకు చెట్లు ఉన్నాయి. అరణ్యంలో చిరుత, చింకారా మొదలైన జంతువులు అధిక సంఖ్యలో ఉన్నాయి. కోడి, పార్ట్‌రిడ్జ్, నలుపు డ్రోంగో, గ్రే ష్రిక్, తేనెటీగలను తినే ఆకుపచ్చ పక్షి, బుల్బుల్, చిలుక మొదలైనవి ఉన్నాయి.

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పంచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బన్‌స్వారా జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న రాజస్థాన్ రాష్ట్ర 12 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

విభాగాలు

[మార్చు]
  • బన్‌స్వారా జిల్లాలో 3 ఉపవిభాగాలు, 5 తాలూకాలు, 8 మండలాలు ఉన్నాయి. బన్‌స్వారా ఉపవిభాగంలో బన్‌స్వారా, గర్హి తాలూకాలు ఉన్నాయి. ఘోటో ఉపవిభాగంలో కుషల్గర్ ఉపవిభాగంలో కుషల్గర్ బగిదొర తాలూకాలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న 8 మండలాలు (తల్వర్, ఘర్, ఘతొల్, పీపాల్ ఖుంత్, బగిదొర, ఆనంద్పురి, కుషల్గర్హ్, సజ్జన్) ఉన్నాయి.
  • జిల్లాలో 5 విధాన సభా నియోజకవర్గాలు ఉన్నాయి (కుషల్గర్హ్, దంపుర్, ఘతొల్, బన్‌స్వారా, బగిదొర). ఇవన్నీ దుంగర్‌పూర్ లోని 3 తాలూకాలతో కలిసి " లోన్ పార్లమెంటరీ నియోజక వర్గంలో భాగంగా ఉన్నాయి.[2]

జనాభా గణాంకాలు

[మార్చు]

చారిత్రిక జనాభా

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19011,58,456—    
19111,79,651+1.26%
19212,10,371+1.59%
19312,49,801+1.73%
19412,87,408+1.41%
19513,41,692+1.75%
19614,52,712+2.85%
19716,23,413+3.25%
19818,41,808+3.05%
199110,95,962+2.67%
200114,20,601+2.63%
201117,97,485+2.38%
source:[3]

2011 గణాంకాలు

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం రాజస్థాన్ లోని బన్స్వారా జిల్లాలో మొత్తం జనాభా 1,797,485. వీరిలో 907,754 మంది పురుషులు కాగా 889,731 మంది మహిళలు ఉన్నారు. 2011 లో బన్స్వారా జిల్లాలో మొత్తం 367,797 కుటుంబాలు నివసిస్తున్నాయి.జిల్లా సగటు సెక్స్ నిష్పత్తి 980. జిల్లా జనాభా మొత్తంలో 7.1% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా 92.9% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 85.2% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 54% ఉంది.జిల్లాలోని పట్టణ ప్రాంతాల లైంగిక నిష్పత్తి 964 కాగా, గ్రామీణ ప్రాంతాలు 981 గా ఉంది.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 325283, ఇది మొత్తం జనాభాలో 18%. 0-6 సంవత్సరాల మధ్య 168225 మంది మగ పిల్లలు, 157058 ఆడ పిల్లలు ఉన్నారు.బాలల లైంగిక నిష్పత్తి 934, ఇది జిల్లాలోని సగటు సెక్స్ నిష్పత్తి (980) కన్నా తక్కువ.[4]

2001 గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,798,194, [5]
ఇది దాదాపు. గంబియా దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. నెబ్రాస్కా నగర జనసంఖ్యకు సమం.[7]
640 భారతదేశ జిల్లాలలో. 267వ స్థానంలో ఉంది..[5]
1చ.కి.మీ జనసాంద్రత. 399 [5]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 26.58%.[5]
స్త్రీ పురుష నిష్పత్తి. 979:1000, [5]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 57.2%.[5]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  2. CEO, Rajasthan website - district & assembly constituency wise electorates
  3. Decadal Variation In Population Since 1901
  4. "Banswara District Population Religion - Rajasthan, Banswara Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in. Archived from the original on 2021-05-11. Retrieved 2021-02-23.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Gambia, The 1,797,860 July 2011 est.
  7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Nebraska 1,826,341

సరిహద్దులు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]