చెల్లెలి కాపురం
చెల్లెలి కాపురం | |
---|---|
దర్శకత్వం | కె.విశ్వనాధ్ |
తారాగణం | శోభన్ బాబు, వాణిశ్రీ, నాగభూషణం |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | |
భాష | తెలుగు |
చెల్లెలి కాపురం 1971 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో శోభన్ బాబు, వాణిశ్రీ, నాగభూషణం ముఖ్యపాత్రల్లో నటించారు. అమృతా ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. కె. వి. మహదేవన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
తారాగణం
[మార్చు]- శోభన్ బాబు
- వాణిశ్రీ
- నాగభూషణం
- సంధ్యారాణి
- మణిమాల
- మీనాకుమారి
- ఛాయాదేవి
- కె.వి.చలం
- అల్లు రామలింగయ్య
- రావు గోపాలరావు
- నిర్మలమ్మ
- మోదుకూరి సత్యం
- డా.రమేష్
- నల్ల రామ్మూర్తి
- సీతారాం
- మల్లికార్జునరావు
- డా.శివరామకృష్ణయ్య
- కాంతారావు
- చలపతిరావు
- సత్యనారాయణ
- చంద్రమోహన్
సాంకేతిక వర్గం
[మార్చు]స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.విశ్వనాథ్
సంగీతం : కె.వి మహదేవన్
నిర్మాతలు: బి.కృష్ణస్వామి, ఎ.సూర్యనారాయణ
నిర్మాణ సంస్థ: అమృతా ఫిలింస్
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి,దాశరథి
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఎస్ జానకి, బి .వసంత , పి.బి.శ్రీనివాస్
విడుదల:27:11:1971.
సంక్షిప్త చిత్ర కథ
[మార్చు]ఈ చిత్రంలో రాము (శోభన్ బాబు) వాళ్ళ బాబాయ్ (రావు గోపాలరావు) దగ్గర వ్యవసాయం చేసుకుంటూ కాలం గడుపుతాడు.రాముకి ఒక చెల్లెలు (మణిమాల) ఉంటుంది. రాముకి రచనలు చేసే అలవాటు ఉంటుంది. నీ రచనల వల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు.పట్నం వెళ్ళి కొంత డబ్బు సంపాదించి, దాని పెళ్ళి చేసి అత్తారింటికి పంపవేమిట్రా?అని వాళ్ళ బాబాయ్ అంటాడు.దానితో రాము పట్నం వస్తాడు.రచనలు అచ్చు వేయించటానికి ప్రెస్ ల చుట్టు తిరుగుతాడు.కాని అతని (అవతారం) ముఖం చూసి ఎవ్వరు అచ్చు వెయ్యటానికి ముందుకురారు. ఇంతలో రాముకి తన చిన్నప్పటి మిత్రుడు శ్రీరాం (నాగభూషణం) ఎదురవుతాడు కుశల ప్రశ్నలడిగి తన ఇంటికి తీసుకు వెళతాడు.చూడరా రాము ఈరోజుల్లో డబ్బు లేకపోయినా పరవలేదు కాని, దర్జగా, దర్పంగా తిరగాలి.అప్పుడే సంఘంలో మనిషికి విలువ.అందుకే నీ రచనలు అచ్చు వెయ్యటానికి బాగున్నా ఎవరు ముందుకు రాలేదు అంటాడు శ్రీరాం .సరే శ్రీరాం నువ్వు ఒక పని చెయ్యి, ఏమిట్రా అది ? నా రచనలన్ని నీ రచనలని చెప్పి అచ్చు వెయించు సరేనా?అదేమిట్రా, నువ్వు ఇంకేం మాట్లడకు శ్రీరాం.సరే అని చెప్పి, రచనల్ని ప్రెస్ కి తీసుకు వెళ్తాడు.అక్కడ పబ్లిషర్ శ్రీరాం తెచ్చిన రచనలని మెచ్చికుని అచ్చు వేయ్యటానికి ఒప్పుకుంటారు. రాము తన చెల్లెలిని పెళ్ళి చెసుకోమని శ్రీరాంని అడిగితే ముందు ఒప్పుకోడు, రాము బతిమాలగా ఒప్పుకుంటాడు. కొంతకాలం గడచిన తరువాత శ్రీరాం పేరుతో రాముకి ఒక ఉత్తరం వస్తుంది, అది ఒక అభిమాని రాధ (వాణీశ్రీ) రాసినది. రాము ఉత్తరం రాసిన అభిమానిని ప్రేమిస్తాడు. రాధ కూడా శ్రీరాం రాసిన రచనల్ని ఇష్టపడి ప్రేమిస్తుంది. కాని రచనలు చేసింది, శ్రీరాం కాదని, రాము అని రాధకు తెలుస్తుంది. రాధకు తెలిసిన ఈ విషయాన్ని పాఠక లోకానికి తెలియజేయ్యాలని శ్రీరాం అంటె తనకు ఇష్టమున్నట్టుగా నటిస్తుంది. చివరికి పాఠక లోకానికి రాము పరిచయమయ్యడా లేదా అనేదే అసలు కథ.
1971 వ సంవత్సరానికి గాను ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈచిత్రానికి ప్రధమ ఉత్తమ చిత్రంగా బంగారు నంది అవార్డు ప్రకటించింది.
పాటలు
[మార్చు]- ఆడవే మయూరి నటన మాడవే మయూరి - ఎస్.పి.బాలు - రచన: డా. సినారె
- కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా - ఎస్.పి.బాలు, పి.సుశీల - రచన: డా. సినారె
- నా చిట్టి నా చిన్ని ఆనక చెబుతాలే అన్ని అల్లరి పెట్టకు - పి.సుశీల, బి.వసంత - రచన: దాశరథి
- పిల్లగాలి ఊదింది పిల్లనగ్రోవి పల్లవించి ఊగింది గున్నమావి - ఎస్.పి.బాలు, రచన: సి నారాయణ రెడ్డి
- బలే బలే మా అన్నయ్య బంగారంలాటి అన్నయ్య - ఎస్.జానకి
- రానే వచ్చాడు తీరా తానే వచ్చాడు కృష్ణుడు - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ బృందం
- విరహ మోపగలేక వెన్నెల్లో , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: సి నారాయణ రెడ్డి
- ఎవరికోసం రాధ ఏ తెంచెనో, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: సి నారాయణ రెడ్డి
- చెలువ పంపిన పూలరేకలు, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: సి నారాయణ రెడ్డి.
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)