Jump to content

జమ్మూ కాశ్మీర్ గవర్నర్ల జాబితా

వికీపీడియా నుండి
జమ్మూ కాశ్మీరు గవర్నరు
జమ్మూ కాశ్మీర్ చిహ్నం
జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర జెండా
ప్రస్తుతం పదవిలో ఉన్న వ్యక్తి
పదవి ఉనికిలో లేదు
అధికారిక నివాసం
  • రాజ్ భవన్ (జమ్ము)
    (శీతాకాలం)
  • రాజ్ భవన్ (శ్రీనగర్)
    (వేసవి)
నియమించినవారుభారత రాష్ట్రపతి
కాలవ్యవధి5 సంవత్సరాలు
ప్రారంభ హోల్డర్కరణ్ సింగ్
ఏర్పాటు1965 మార్చి 30
Final holderసత్యపాల్ మాలిక్
రద్దైన తేదీ2019 అక్టోబరు 30
వెబ్‌సైటుhttp://jkrajbhawan.nic.in

జమ్మూ కాశ్మీర్ గవర్నరు, భారత రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్‌కు అధిపతి.[1] భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, హరి సింగ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మహారాజు. సాంకేతికంగా అతను 1952 నవంబరు 17 వరకు అలాగే ఉన్నాడు. అయినప్పటికీ 1949 జూన్ 20 నుండి అతని కుమారుడు కరణ్ సింగ్ రీజెంట్‌గా పనిచేశాడు.1952 నవంబరు 17 నుండి 1965 మార్చి 30 వరకు, కరణ్ సింగ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సదర్ - ఎ-రియాసత్‌గా ఎన్నికయ్యారు. కరణ్ సింగ్ 1965 మార్చి 30న జమ్మూ కాశ్మీర్ మొదటి గవర్నర్‌గా నియమితులయ్యారు.

జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 ప్రకారం 2019 ఆగస్టులో భారత పార్లమెంటులో ఆమోదించబడిన తర్వాత గవర్నర్ కార్యాలయం రద్దు చేయబడింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా 2019 అక్టోబరు 31న పునర్వ్యవస్థీకరించారు. చట్టంలోని నిబంధనలు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవులను సృష్టించాయి.[2]

జమ్మూ కాశ్మీర్ పాలకుల జాబితా

[మార్చు]

ఇది 1846 నుండి 1952 CE వరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పాలకుల జాబితా.

పాలకులు చిత్తరువు కాలం
గులాబ్ సింగ్ 1846 మార్చి 16 – 1856 ఫిబ్రవరి 20
రణబీర్ సింగ్ 1856 ఫిబ్రవరి 20 – 1885 సెప్టెంబరు 12
ప్రతాప్ సింగ్ 1885 సెప్టెంబరు 12 – 1925 సెప్టెంబరు 23
హరి సింగ్ 1925 సెప్టెంబరు 12 – 1952 నవంబరు 17 రాచరికం రద్దు[note 1]

జమ్మూ కాశ్మీర్ సదర్-ఎ-రియాసత్

[మార్చు]
వ.సంఖ్య పేరు పదవీకాలం
నుండి వరకు ఆఫీసులో సమయం
1 కరణ్ సింగ్ 1952 నవంబరు 17 1965 మార్చి 30 12 సంవత్సరాలు, 133 రోజులు

జమ్మూ కాశ్మీర్ గవర్నర్లు జాబితా

[మార్చు]
వ.సంఖ్య పేరు పదవీకాలం మూలాలు
నుండి వరకు ఆఫీసులో సమయం
1 కరణ్ సింగ్ 1965 మార్చి 30 1967 మే 15 2 సంవత్సరాలు, 46 రోజులు

(మొత్తం: 14 సంవత్సరాలు, 179 రోజులు)

[3]
2 భగవాన్ సహాయ్

ఐసిఎస్

1967 మే 15 1973 జూలై 3 6 సంవత్సరాలు, 49 రోజులు
3 ఎల్.కె ఝా (ఐసిఎస్) 1973 జూలై 3 1981 ఫిబ్రవరి 22 7 సంవత్సరాలు, 234 రోజులు
4 బికె నెహ్రూ (ఐసిఎస్) 1981 ఫిబ్రవరి 22 1984 ఏప్రిల్ 26 3 సంవత్సరాలు, 64 రోజులు
5 జగ్మోహన్ మల్హోత్రా (ఐఎఎస్) 1984 ఏప్రిల్ 26 1989 జూలై 11 5 సంవత్సరాలు, 76 రోజులు
6 కెవి కృష్ణారావు (పి.వి.ఎస్.ఎం) 1989 జూలై 11 1990 జనవరి 19 192 రోజులు
(5) జగ్మోహన్ మల్హోత్రా (ఐఎఎస్) 1990 జనవరి 19 1990 మే 26 127 రోజులు

(మొత్తం: 5 సంవత్సరాలు, 203 రోజులు)

7 గిరీష్ చంద్ర సక్సేనా (ఐపిఎస్) 1990 మే 26 1993 మార్చి 12 2 సంవత్సరాలు, 290 రోజులు
(6) కె. వి. కృష్ణారావు (పి.వి.ఎస్.ఎం) 1993 మార్చి 12 1998 మే 2 5 సంవత్సరాలు, 51 రోజులు

(మొత్తం: 5 సంవత్సరాలు, 243 రోజులు)

(7) గిరీష్ చంద్ర సక్సేనా (ఐపిఎస్) 1998 మే 2 2003 జూన్ 4 5 సంవత్సరాలు, 33 రోజులు

(మొత్తం: 7 సంవత్సరాలు, 365 రోజులు)

8 శ్రీనివాస్ కుమార్ సిన్హా

పి.వి.ఎస్.ఎం ఎడిసి

2003 జూన్ 4 2008 జూన్ 25 5 సంవత్సరాలు, 21 రోజులు
9 ఎన్.ఎన్. వోహ్రా (ఐఎఎస్) 2008 జూన్ 25 2018 ఆగస్టు 23 10 సంవత్సరాలు, 59 రోజులు
10 సత్యపాల్ మాలిక్ 2018 ఆగస్టు 23 2019 అక్టోబరు 30 1 సంవత్సరం, 68 రోజులు
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం 2019 అక్టోబరు 31న విభజించబడింది

కరణ్ సింగ్ తర్వాత జాంకీ నాథ్ వజీర్ రెండు నెలల పాటు గవర్నర్‌గా ఉన్నారు,[4]  వజక్కులంగరైల్ ఖలీద్ 12 రోజులు గవర్నర్‌గా ఉన్నారు.[4][5]

జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లు

[మార్చు]

† పదవిలో ఉండగా మరణించారు

§ పదవికి రాజీనామా చేశారు

ẟ పదవి నుండి తొలగించబడ్డారు

సంఖ్య పేరు

(జననం – మరణం)

చిత్తరువు స్వరాష్ట్రం పదవీకాలం తక్షణ ముందు నిర్వహించిన స్థానం నియమించినవారు
నుండి వరకు కార్యాలయంలో గడిపిన సమయం
1 గిరీష్ చంద్ర ముర్ము

IAS
(జననం1959)

ఒడిశా 2019 అక్టోబరు 31[6] 2020 ఆగస్టు 6[§] 280 రోజులు కేంద్ర వ్యయ కార్యదర్శి రామ్‌నాథ్ కోవింద్

(రాష్ట్రపతి)

2 మనోజ్ సిన్హా

(జననం 1959)

ఉత్తర ప్రదేశ్ 2020 ఆగస్టు 7[7][8] అధికారంలో ఉన్నారు 4 సంవత్సరాలు, 323 రోజులు కమ్యూనికేషన్ల కోసం కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) (2019 వరకు)

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Previous Governors". Lieutenant Governor Secretariat, Raj Bhawan, Jammu and Kashmir. Archived from the original on 27 October 2021.
  2. "Reorganisation Bill" (PDF). thehindu.com. Retrieved 2019-10-30.
  3. Graça, J. Da; Graça, John Da (2017-02-13). Heads of State and Government. Springer. p. 433. ISBN 978-1-349-65771-1.
  4. 4.0 4.1 Maqbool, Umer (22 August 2018). "Career politician Satya Pal Malik new J&K Governor". Greater Kashmir (in ఇంగ్లీష్). Retrieved 2022-01-22.
  5. Lateef, Samaan (22 August 2018). "State gets its 13th Governor, first career politician". Tribune India. Retrieved 2022-01-22.
  6. Varma, Gyan (25 October 2019). "Girish Chandra Murmu is the first LG of Jammu & Kashmir". livemint.com.
  7. "Manoj Sinha takes oath as LG of Jammu and Kashmir". The Times of India. 7 August 2020.
  8. Chaturvedi, Amit (6 August 2020). "Manoj Sinha appointed as new lieutenant governor of Jammu and Kashmir". Hindustan Times.

బాహ్య లింకులు

[మార్చు]


ఉల్లేఖన లోపం: "note" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="note"/> ట్యాగు కనబడలేదు