తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారాలు-2023

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారాలు-2023
పురస్కారం గురించి
విభాగం విద్యారంగంలో కృషి
వ్యవస్థాపిత 2014
మొదటి బహూకరణ 2014
క్రితం బహూకరణ 2022
మొత్తం బహూకరణలు 67
బహూకరించేవారు తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ
నగదు బహుమతి ₹ 10,000
Award Rank
2022తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారాలు-20232024

తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారాలు, అనేవి జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబరు 5న తేదీన ఎంపికచేసిన ఉత్తమ వివిధ కళాశాలల అధ్యాపకులకు తెలంగాణ ప్రభుత్వం అందించే పురస్కారం. రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ సేవలు అందించిన అధ్యాపకులను ఎంపికచేసి వారికి రూ.10 వేల నగదుతోపాటు సర్టిఫికెట్‌, మెడల్‌ అందజేసి సన్మానిస్తారు.[1]

2023 విద్యాసంవత్సరానికి ఇంటర్‌ విద్యలో నలుగురు ప్రిన్సిపాల్స్, 11 మంది లెక్చరర్లు, ఉన్నత విద్య నుంచి 56 మంది అధ్యాపకులు, ఆచార్యులు మొత్తం 67మంది రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డులకు ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించిన రెండు వేర్వేరు జీవోలను 2023 సెప్టెంబరు 3న విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జారీచేసింది.[2]

2023, సెప్టెంబరు 5న హైదరాబాదులోని రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకలలో అవార్డుల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి, శాసనమండలి సభ్యులు సురభి వాణిదేవి, కూర రఘోత్తంరెడ్డి, ఏ.వీ.ఎన్. రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు ఆయాచితం శ్రీధర్, శ్రీధర్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్లు వెంకటరమణ, ఎస్.కె.మహమూద్, పాఠశాల విద్య సంచాలకులు దేవసేన, వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, ఇతర అధికారులు పాల్గొని ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.[3]

పురస్కార గ్రహీతలు

[మార్చు]

2023 తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కార గ్రహీతల జాబితా:[2]

ఇంటర్‌ విద్యలో ప్రిన్సిపాల్స్

[మార్చు]
క్రమసంఖ్య పేరు కళాశాల ప్రాంతం
1 రాపోలు ప్రభాకర్‌[4] ప్రభుత్వ జూనియర్‌ కళాశాల దేవరుప్పుల, జనగామ జిల్లా
2 డాక్టర్‌ కె. వెంకటేశ్వర్లు ఆలియా జూనియర్‌ కళాశాల కడెం- పెద్దూర్‌, నిర్మల్ జిల్లా
3 ఎం. రమేశ్‌లింగం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మల్దకల్, జోగులాంబ గద్వాల జిల్లా
4 కె. శ్రీనివాస్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మిరుదొడ్డి, సిద్దిపేట జిల్లా

ఇంటర్‌ విద్యలో అధ్యాపకులు

[మార్చు]
క్రమసంఖ్య పేరు హోదా కళాశాల ప్రాంతం
1 డాక్టర్‌ ఎం. గోపి హిందీ లెక్చరర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మేడ్చల్
2 వి. రవికుమార్‌ జువాలజీ లెక్చరర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కూకట్‌పల్లి, మేడ్చల్
3 వి. రాధిక ఫిజిక్స్‌ లెక్చరర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కాచిగూడ,హైదరాబాద్‌
4 జి. శ్రీలత కెమిస్ట్రీ లెక్చరర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కందుకూరు, రంగారెడ్డి
5 వి. వెంకటరమణచారి వోకేషనల్‌ లెక్చరర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కరీంనగర్
6 టి. రాధాకిషన్‌ బాటనీ లెక్చరర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మలక్‌పేట
7 కె. రమణకుమారి కెమిస్ట్రీ లెక్చరర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల హయత్ నగర్

విశ్వవిద్యాలయ ఆచార్యులు

[మార్చు]
క్రమసంఖ్య విశ్వవిద్యాలయం పేరు శాఖ ప్రాంతం
1 ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ సి. గణేశ్‌ సోషియాలజీ హైదరాబాదు
2 ప్రొఫెసర్‌ జె. హయవదన టెక్నాలజీ హైదరాబాదు
3 ప్రొఫెసర్‌ టి. మృణాళిని ఎడ్యుకేషన్‌ హైదరాబాదు
4 ప్రొఫెసర్‌ సి. శ్రీనివాసులు జువాలజీ హైదరాబాదు
5 కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ టి. మనోహర్‌ హిస్టరీ వరంగల్
6 శాతవాహన విశ్వవిద్యాలయం డాక్టర్‌ హుమేరా తస్నీమ్‌ ఉర్దూ కరీంనగర్
7 తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ ఎం. యాదగిరి కామర్స్ నిజామాబాద్
8 పాలమూరు విశ్వవిద్యాలయం డాక్టర్‌ ఎన్‌. చంద్రకిరణ్‌ కెమిస్ట్రీ మహబూబ్ నగర్
9 మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ అలువాల రవి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ నల్లగొండ
10 అంబేద్కర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ జి. రవీందర్‌ పొలిటికల్‌సైన్స్‌ హైదరాబాదు
11 కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం డాక్టర్‌ వి. సుచిత్ర హార్టికల్చర్‌ ఆదిలాబాద్‌
12 జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ప్రొఫెసర్‌ జి. మధుకర్‌ ఫొటోగ్రఫీ హైదరాబాదు
13 నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) డాక్టర్‌ మేఘా ఎస్‌. ఉప్పిన్‌ పాథాలజీ హైదరాబాదు
14 డాక్టర్‌ మహ్మద్‌ ఇస్మాయిల్‌ నిజామీ ఎమర్జెన్సీ మెడిసిన్‌ హైదరాబాదు
15 తెలుగు విశ్వవిద్యాలయం కె. శ్రీనివాసాచారి పెయింటింగ్‌ హైదరాబాదు
16 పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం డాక్టర్‌ ఉదయ్‌కుమార్‌ వెటర్నరీ సైన్స్‌ హైదరాబాదు
17 ప్రొఫెసర్‌ నళినికుమారి వెటర్నరీ సైన్స్‌ హైదరాబాదు
18 నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం డాక్టర్‌ అరుణ బి. వెంకట్‌ న్యాయ హైదరాబాదు
19 తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ పి. వారిజ తెలుగు హైదరాబాదు

యూనివర్సిటీ అనుబంధ కళాశాలలు

[మార్చు]
క్రమసంఖ్య విశ్వవిద్యాలయం పేరు శాఖ కళాశాల ప్రాంతం
1 ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టర్‌ ఎల్‌. తిరుపతి పొలిటికల్‌సైన్స్‌ సిటీ కళాశాల నయాపూల్‌, హైదరాబాద్‌
2 డాక్టర్‌ మహిత దావాలా కామర్స్‌ సెయింట్‌ ఆన్స్‌ కళాశాల హైదరాబాదు
3 డాక్టర్‌ బి. సాంబశివరావు కంప్యూటర్‌సైన్స్‌ బీజేఆర్‌ఆర్‌ కళాశాల నారాయణగూడ
4 డాక్టర్‌ ఆది రమేశ్‌బాబు ఇంగ్లిష్‌ సిటీ కళాశాల నయాపూల్‌, హైదరాబాద్‌
5 డాక్టర్‌ అభిజిత్‌ కంటాంకర్‌ కెమిస్ట్రీ తారా కళాశాల సంగారెడ్డి
6 డాక్టర్‌ జహేదా బేగం పొలిటికల్‌సైన్స్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌
7 డాక్టర్‌ కె. కరుణాదేవి పొలిటికల్‌సైన్స్‌ ఏఎంఎస్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ ఓయూ క్యాంపస్‌
8 డాక్టర్‌ ఎస్‌. ఝాన్సీరాణి కామర్స్‌ సిటీ కళాశాల నయాపూల్‌, హైదరాబాద్‌
9 డాక్టర్‌ పి. పల్లవి మైక్రో బయాలజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట
10 డాక్టర్‌ చైతన్యకుమారి మైక్రో బయాలజీ భవన్స్‌ వివేకానంద కళాశాల సికింద్రాబాద్‌
11 కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టర్‌ డి. సురేశ్‌బాబు కంప్యూటర్‌సైన్స్‌ ఎస్‌ఆర్‌అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాల ఖమ్మం
12 డాక్టర్‌ జి. రేణుక మైక్రోబయాలజీ పింగిలి మహిళా డిగ్రీ కళాశాల హనుమకొండ
13 కి. లింగారెడ్డి కామర్స్‌ కాకతీయ డిగ్రీ కళాశాల హనుమకొండ
14 డాక్టర్‌ టి. అరుణకుమారి హిందీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ
15 డాక్టర్‌ దాసరి సమ్మయ్య బాటనీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ములుగు
16 డాక్టర్‌ ఎం. రాంబాబు బాటనీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల హనుమకొండ
17 డాక్టర్‌ ఎ. రమా సత్యవతి కామర్స్‌ ఎస్‌ఆర్‌అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాల ఖమ్మం
18 డాక్టర్‌ ఎం. పూర్ణచందర్‌రావు బాటనీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ
19 శాతవాహన విశ్వవిద్యాలయం డాక్టర్‌ ఎస్‌. ఓదెలుకుమార్‌ ఇంగ్లిష్‌ ఎస్సార్‌ఆర్‌ కళాశాల కరీంనగర్
20 డాక్టర్‌ టి. మహేశ్‌ జువాలజీ ఎస్సార్‌ఆర్‌ కళాశాల కరీంనగర్
21 డాక్టర్‌ టి. లావణ్య కామర్స్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కరీంనగర్
22 పాలమూరు విశ్వవిద్యాలయం డాక్టర్‌ కె. తిరుపతయ్య కెమిస్ట్రీ ఎంవీఎస్‌ ప్రభుత్వ కళాశాల మహబూబ్‌నగర్‌
23 అమినా ముంతాజ్‌ జహన్‌ బాటనీ ఎన్టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల మహబూబ్‌నగర్‌
24 తెలంగాణ విశ్వవిద్యాలయం డాక్టర్‌ ఎం. లింగన్న కామర్స్‌ గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిజామాబాద్‌
23 డాక్టర్‌ ఈ. రాం భాస్కర్‌రాజు ఇంగ్లిష్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాన్స్‌వాడ
24 మహత్మాగాంధీ విశ్వవిద్యాలయం డాక్టర్‌ ఎ. శ్రీనివాసులు కెమిస్ట్రీ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల నల్లగొండ
25 డాక్టర్‌ ఎన్‌. దీపిక తెలుగు నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల నల్లగొండ
26 డాక్టర్‌ సీహెచ్‌. సత్యనారాయణ కామర్స్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆలేరు

ఇతర క్యాటగిరీలు

[మార్చు]
క్రమసంఖ్య పేరు హోదా కళాశాల ప్రాంతం
1 డాక్టర్‌ ఆర్‌. కుమారస్వామి లైబ్రేరియన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేట
2 సయ్యద్‌ ఫారూఖీ కమల్‌ పీడీ సెయింట్‌ ఫ్రాన్సిస్‌ మహిళా కళాశాల హైదరాబాదు

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2022-09-03). "ఉత్తమ అధ్యాపకులు 60 మంది". Namasthe Telangana. Archived from the original on 2022-09-03. Retrieved 2023-09-04.
  2. 2.0 2.1 telugu, NT News (2023-09-04). "Best Teachers | మరో 67 మంది ఉత్తమ గురువులు.. గురుపూజోత్సవం రోజు 125 మందికి సన్మానం". www.ntnews.com. Archived from the original on 2023-09-04. Retrieved 2023-09-04.
  3. telugu, NT News (2023-09-05). "Sabitha Indra Reddy | విద్యార్థుల్లో అంత‌ర్లీనంగా ఉన్న ప్ర‌తిభ‌ను వెలికితీయాలి : మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి". www.ntnews.com. Archived from the original on 2023-09-05. Retrieved 2023-09-05.
  4. "జూనియర్‌ కళాశాల ఉత్తమ ప్రిన్సిపల్‌గా ప్రభాకర్‌". EENADU. 2023-09-04. Retrieved 2023-09-04.