తోంక్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
18. రాజస్థాన్లో స్థానం

రాజస్థాన్ రాష్ట్రంలోని 33 జిల్లాలలో తోంక్ జిల్లా ఒకటి. గత భారతీయ మరియు రాజస్థాన్ రాజాస్థానలలో ఇది ఒకటిగా ఉండేది. తోంక్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉండేది. జిల్లా ఉత్తర సరిహద్దులో జైపూర్ జిల్లా, తూర్పు సరిహద్దులో సవై మాధోపూర్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో కోట జిల్లా, దక్షిణ సరిహద్దులో బుంది జిల్లా, నైరుతీ సరిహద్దులో భిల్వార జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో అజ్మీర్ జిల్లా ఉన్నాయి.

భౌగోళికం[మార్చు]

తోంక్ జిల్లా జాతీయరహదారి -12 మార్గంలో ఉంది. ఇది జైపూర్ నుండి 100 కి.మీ దూరంలో ఉంది. ఇది రాజస్థాన్ ఉత్తర భూభాగంలో 75.19' & 76.16 తూర్పు భూభాగంలో మరియు 25.41' మరియు 26.24' ఉత్తర అక్షాంశంలో ఉంది. జిల్లావైశాల్యం 7194 చ.కి.మీ.

చరిత్ర[మార్చు]

నవాబి నగరి తోంక్ రాజస్థాన్ రాష్ట్రంలోనే కాక భారతదేశం అంతటిలో చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది. అక్బర్ పరిపాలనా కాలంలో జైపూర్ రాజు మాంసింగ్ తారి మరియు తొక్రా జనపద్‌లను జయించాడు. 1963లో తోక్రా జనపదంలోని 12 గ్రామాలను భోలాబ్రాహ్మణులకు ఇవ్వబడింది. తరువాత భోలా ఈ 12 గ్రామాలకు తోంక్ అని నామకరణం చేసాడు. ఈ ప్రాంతం సరిహద్దులలో 5 జిల్లాలు ఉన్నాయి (ఉత్తర సరిహద్దులో జైపూర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో బుంది జిల్లా మరియు భిల్వార జిల్లా, తూర్పు సరిహద్దులో అజ్మీర్ జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో సవై మధోపూర్ జిల్లాలు ఉన్నాయి. జిల్లా సరాసరి వర్షపాతం 62చ.కి.మీ. జిల్లా ప్రజల ప్రధాన వృత్తులలో వ్యవసాయం మరియు జంతుపెంపకం ప్రధాన్యత వహిస్తున్నాయి.

తోంక్ చరిత్ర చాలాపురతనమైనది. ఇది సాంస్కృతికంగా మరియు నాగరికత సంబంధంగా విరాటనగరికి (భైరత్) కి చెందినదిగా భావిస్తున్నారు. తోంక్‌ను రాజస్థాన్‌ లక్నో అని అంటారు. అదాబ్ కా గుల్షన్, ప్రేమ కవి అక్తర్ ష్రీరాణికి నగ్రి, మీతె ఖర్భూజొ కా చమన్, హిందూ ముస్లిం ఏక్తా, మస్కన్ వంటి ప్రముఖులకు తోంక్ జన్మభూమి .

నవాబుల పాలనలో స్థానికులు మిలాడి నభిని ఈ ప్రాంతానికి ఆహ్వానించారు. తరువాత ఈ ప్రాంతంలో మొదటి తోంక్ నావాబు రాజ్యస్థాపించబడింది. మహాభరతకాలంలో దీనిని సంవద్లక్ష్య అనేవారు. మౌర్యులకాలంలో ఇది మౌర్యసామ్రాజ్యంలో భాగంగా ఉండేది. తరువాత ఇది మాల్వారాజ్యంలో కలుపబడింది. హర్షవర్ధనుడి పాలనలో చాలాకాలం ఉంది. చైనాయాత్రీకుడు హూయంత్సాంగ్ ఈ ప్రంతం భైరత్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేదని తెలుస్తుంది. రాజపుత్రులకాలంలో ఈప్రాంతం చవ్రాలు, సోలంకీలు, కచవాలు తరువాత రాజా హోల్కర్ మరియు సింధియాల పాలనలో భాగంగా ఉంది.1806లో ముహమ్మద్ అమీర్ ఖాన్ బల్వంత్ రావు హొల్కర్‌ను జయించి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. తరువాత బ్రిటిష్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అమీర్ఖాన్ నుండి 1817 ఒప్పందం ద్వారా సంపాదించింది. అయినప్పటికీ బ్రిటిష్ ఈ ప్రాంతాన్ని అమీర్ఖాన్‌కు తిరిగి ఇచ్చింది. 1818లో ఆఫ్ఘన్ సైన్యాధికారికి ఇండోర్ పాలకుడు ఈ ప్రాంతం కానుకగా ఇవ్వబడింది. ఆయన ఈప్రాంతంలో తోంక్ రాజ్యస్థాపన చేసాడు.

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో తోంక్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న రాజస్థాన్ రాష్ట్రజిల్లాలలో 12 ఈ జిల్లా ఒకటి..[1]

విభాగాలు[మార్చు]

తోంక్ జిల్లాలో ఉపవిభాగాలు మరియు తాలూకాలు ఉన్నాయి: డియోళి (రాజస్థాన్), మల్పుర, నివై, తొదరైసింఘ్, టాంక్ (భారతదేశం), ఉనీర మరియు పీప్ల్, దెఒలి (రాజస్థాన్) మల్పుర, నివై, తొదరైసింఘ్, మరియు ఉనీర నగర్ పాలితాలు ఉన్నాయి. 2001 గణాంకాలను అనుసరించి జిల్లాలో 1093 గ్రామాలు ఉన్నాయి.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,421,711, [2]
ఇది దాదాపు. స్విడ్జర్లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. హవాయి నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 347వ స్థానంలో ఉంది..[2]
1చ.కి.మీ జనసాంద్రత. 198 .[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 17.33%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 947:1000 .[2]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 62.46%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

సంస్కృతి[మార్చు]

తీర్థయాత్రా ప్రదేశాలు[మార్చు]

  • టాంక్ జమ మస్జిద్
  • అరబిక్ పెర్షియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
  • సుంహరి కోటి
  • లార్డ్ దేవ్నారాయణన్ ఆలయం జోథ్పురియా
  • శ్రీ కళ్యాణ్ జీ మందిర్ డిగ్గీ
  • మందకల (నాగర్ రేవు) ఒక చిన్న పుష్కర్ మరియు చెరువు, పురాతన షొబ్యాత్ర (ఖేరా) ఇక్కడ ఉంది.
  • దూనిజ మందిర్
  • జల్ దేవి మందిర్ (బలుండ)
  • కల్పవృక్ష
  • జైన్ దేవాలయాలు
  • బద్రి నాథ్ దేవాలయం
  • దదబాడి ఆలయం

[5]

  • సునహరి కోఠి

ఇది టోంక్ నగరంలోని నాజర్ బాఘ్ రోడ్డు మార్గంలో బదా సమీపంలో ఉంది. కోఠీలోని గోడలు బంగారు పూత పూసి ఉంటాయి. దీనిని శేషమహల్ అని కూడా అంటారు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011. Cite web requires |website= (help)
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Swaziland 1,370,424 line feed character in |quote= at position 10 (help); Cite web requires |website= (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Hawaii 1,360,301 line feed character in |quote= at position 7 (help); Cite web requires |website= (help)
  5. "Pilgrim places of Tonk district". National Informatics Centre. Cite web requires |website= (help)

Tonk Jama Masjid Arabic Persian Research Institute Sunhari Khoti Hanuti Hanuman Temple jaisingpura

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]