Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

మర్రి

వికీపీడియా నుండి
(ఫైకస్ బెంగలెన్సిస్ నుండి దారిమార్పు చెందింది)

మర్రిచెట్టు
F. benghalensis shoot in కర్ణాటక, భారత్
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
ఫై. బెంగలెన్సిస్
మహబూబ్ నగర్ దగ్గరలో ఉన్న పిల్లలమర్రి చెట్టు
గిద్దలూరు సమీపంలోని అడవిలో ఒక మర్రిచెట్టు, దాని ఊడలు

మర్రి (ఆంగ్లం Banyan) ఫైకస్ జాతికి చెందిన ఒక చెట్టు. ఇది బాగా విస్తరించిన శాఖలతో అనేకమైన ఊడలతో పెరిగే అతిపెద్ద వృక్షం. దీనినే వటవృక్షం అంటారు. ఇది బంగ్లాదేశ్, భారతదేశం, శ్రీలంక దేశాలలో విరివిగా పెరుగుతుంది.

దీని గింజలు వేరే చెట్టు పగుళ్ళలో లేదా ఒరలలో (ఒకోమారు పెద్ద భవనాలు, వంతెనలు, రాళ్ళ సందులలో) చిగురించి కాలక్రమాన విస్తరిస్తాయి. "మర్రి" (Banyan) అనే పేరు ప్రత్యేకించి ఫైకస్ బెంగలెన్సిస్ (Ficus benghalensis) అనే జాతికి చెందిన చెట్లకు చెందుతుంది, కాని ఆ విధమైన ఇతర చెట్లకు, "యురోస్టిగ్మా" ఉపజాతికి చెందిన వాటికి, అన్నింటికీ కూడా ఈ పేరును వాడుతారు.[1]

ఈ చెట్టు విత్తనాలు పళ్లు తినే పక్షుల చేత ఇతర ప్రదేశాలకు వెదజల్లబడతాయి. వేరే చెట్టుమీద పడి, దాని పగుళ్ళలో మొలకెత్తిన మొక్కల వేళ్లు క్రమంగా భూమికి ప్రాకుతాయి. కొమ్మలు ఆకాశంవైపు విస్తరిస్తాయి. ఇలా ఆశ్రయమిచ్చిన చెట్లను చుట్టుముట్టి పెరిగే లక్షణం ఉష్ణమండలంలో కాంతికోసం పోటీపడే చెట్లలో, ముఖ్యంగా "ఫికస్"జాతికి చెందినవాటిలో కనుపిస్తుంది.[2][3][4] కనుక వీటన్నింటికి strangler fig అనే ఆంగ్లపదం వాడుతారు.

భారతదేశంలో "బనియాలు ('వణికులు' లేదా 'వ్యాపారులు') తమ ప్రయాణాలలో తరచు ఈ చెట్ల నీడలో విశ్రాంతి తీసుకొనేవారు అని విదేశీ పరిశీలకులు గమనించినందువల్ల దీనికి "బనియన్ ట్రీ" (ఫికస్ బెంగాలెన్సిస్) అనే పేరు పెట్టారు.[5]

లక్షణాలు

[మార్చు]
  • వెడల్పాటి అండాకారంగా గురుఅగ్రంతో ఉన్న సరళ పత్రాలు.
  • పత్రగ్రీవాలలో జతలుగా ఏర్పడిన పైపాంథోడియం పుష్ప విన్యాసంలో అమరిన వర్ణరహిత పుష్పాలు.
  • ఎరుపు రంగులో ఉన్న సైకోనస్ ఫలాలు.

విశేషాలు

[మార్చు]

ఉపయోగాలు

[మార్చు]

మర్రిని మందుగా వాడటం మనకి ఎప్పటినుంచో ఉంది. దీని బెరడు, లేత ఆకులు, మొగ్గలు, పాలు, పళ్ళు అన్నిటినీ ఆయుర్వేదం ఎన్నో వ్యాధుల్లో వాడుతుంది. ముఖ్యంగా చర్మ సౌందర్యం కోసం తపన పడే వారు మర్రిని మరువకూడదు మర్రి చెట్టు ఆకులు ఇంకా విచ్చుకోక ముందు ఎర్రగా మొగ్గల్లా ఉంటాయి. వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని త్రాగితే తరచు విరేచనాలు, డిసెంట్రీతో బాధపడేవారికి మంచిది. మర్రిపాలు 5 చుక్కల్ని 1 గ్లాసుడు పాలలో కలిపి తీసుకుంటే బ్లీడింగ్ పైల్స్ కి మంచి మందు. ఇక ఊడల నుంచి జాలువారే లేత వేరులు స్త్రీల సంతాన సాఫల్యత పెంచుతాయి. మర్రి వేర్లని ఎండించి, దంచి, పొడుము వలె చేసి పాలలో కలిపి ఋతుస్నానం అయిన తర్వాత వరుసగా 3 రాత్రుల పాటు తాగితే సంతానం కలుగుతుందని ఆయుర్వేదం చెబుతుంది. అలాగే మర్రి స్త్రీల జననాంగ సమస్యలలో కూడా బాగా ఉపకరిస్తుంది. మర్రి బెరడుని కషాయం కాచి దానిని గోరు వెచ్చగా ఉండగా యోని ప్రక్షాళన చేస్తే లుకేరియా తగ్గుతుంది. మర్రి ఊడలతో పళ్ళు తోముకుంటే దంత సమస్యలు రావు. మర్రి పాలు కీళ్ళ నొప్పులున్న చోట రాస్తే నొప్పులు తగ్గుతాయని గిరిజనుల నమ్మకం. మర్రి ఆకులు కోయగా వచ్చిన పాలను పులిపిరులమీద ఉంచితే అవి తగ్గిపోతాయి. పాదాలు పగిలిపోతే మర్రి చెట్టు కాండం నుంచి వచ్చిన రసాన్ని ఆ పగుళ్ళకి రోజూ రాస్తే ఉపయోగం ఉంటుంది.

తాటి చెట్టు పై మొలచిన మర్రి

[మార్చు]
తాటిచెట్టు మీద మొలిచిన చిన్న మర్రి మొక్క కాలక్రమంలో మహావృక్షంగా ఎదగడంఈ బొమ్మలో గమనించ వచ్చును. ఇంకా కొన్ని దశాబ్దాలలో మర్రి చెట్టు ఊడలు (కొమ్మలనుండి పుట్టే వ్రేళ్ళు) స్తంభాలలా ఎదిగి మర్రిచెట్టు నలుదిశలా విస్తరించడానికి దోహదం చేస్తాయి.

మూలాలు

[మార్చు]
  1. Note usage of "Banyan" versus "banyan" in మూస:PDF by Vidya R Athreya, Nature Watch, July 1997; also "Aerial-rooting banyan trees", washington.edu
  2. Zhekun, Zhou & Michael G. Gilbert (2003) Flora of China (Moraceae) 5: 21-73. [1] Archived 2011-09-29 at the Wayback Machine
  3. Serventy, V. 1984. Australian Native Plants. Victoria: Reed Books.
  4. "Light in the rainforest 1992 Tropical topics. Vol 1 No. 5" (PDF). Archived from the original (PDF) on 2007-07-01. Retrieved 2007-11-25.
  5. Yule, Henry, Sir. Hobson-Jobson: A glossary of colloquial Anglo-Indian words and phrases, and of kindred terms, etymological, historical, geographical and discursive. New ed. edited by William Crooke, B.A. London: J. Murray, 1903.

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మర్రి&oldid=4222422" నుండి వెలికితీశారు