వికీపీడియా:పేజీల గణాంకాలు/అంతర్వికీ లింకుల్లేని మూసలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెవికీలో వాడే మూసలను, వాటిని మూలాన్ని బట్టి రెండు రకాలుగా చూడవచ్చు.

  1. తెవికీలోనే తయారు చేసినవి: వీటిలో ఎక్కువగా నేవిగేషను మూసలే ఉంటాయి. ఉదాహరణకు: ఫలానా మండలం లోని గ్రామాలు లాంటివి
  2. ఎన్వికీ నుండి తెచ్చుకున్నవి: దిగుమతి ద్వారాగానీ, అనువాదం చేసిగానీ ఎన్వికీ నుండి తెచ్చుకున్న మూసలివి.

మొదటి రకం మూసలకు అంతర్వికీ లింకులు ఉండకపోయినా పరవాలేదు గానీ (ఎందుకంటే వీటికి సరిజోడీ మూసలు ఇతర భాషల్లో దాదాపుగా ఉండవు కాబట్టి), రెండో రకం మూసలకు ఉంటే అనువాద పరికరంలో పనికొస్తుంది. అనువాద పరికరంలో అనువాదం చేసేటపుడు మూల భాషలో ఉన్న మూసకు సరిజోడీ తెలుగులో ఉంటే ఆ మూసను తెచ్చి చూపిస్తుంది. అలా సరిజోడీ మూస ఉందో లేదో పరికరానికి తెలియాలంటే అంతర్వికీ లింకు తప్పనిసరి. అంతేకాదు, ఈ మూసకు మూలమైన ఇంగ్లీషు మూసలో ఏమైనా మార్పులు జరిగాయేమో చూడాలంటే (ఆ మార్పులను ఇక్కడా అమలు చేసేందుకు), అంతర్వికీ లింకు దోహదపడుతుంది.

2023 ఆగస్టు 22 నాటికి తెవికీలో అంతర్వికీ లింకులు లేని మూసల జాబితాను ఈ క్వెరీ ద్వారా సేకరించాం. కీంది షరత్లకు లోబడి ఈ జాబితాను తయారుచేసాం:

  1. మూస పేరు ఇంగ్లీషులో ఉండాలి (తద్వారా ఆ మూస తెవికీలో తయారు చేసినది కాదు అని దాదాపుగా నిర్ధారణ అవుతుంది.)
  2. అది ఉపపేజీ అయి ఉండకూడదు (/doc వంటి మూసలు ఈ జాబితాలో రాకుండా నివారించడానికి)

ఈ జాబితాలో 2023 ఆగస్టు 22 నాటికి 1994 పేజీలున్నాయి. వీటన్నిటినీ ఈ పేజీలో పెట్టడం కష్టం కాబట్టి ఇక్కడ చేర్చడం లేదు. కాని వాటన్నిటినీ వర్గం:అంతర్వికీ లింకుల్లేని మూసలు అనే వర్గంలో చేర్చాం. అక్కడ వీటిని చూడవచ్చు. వాడుకరులు వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవచ్చు. ఆయా పేజీలకు అంతర్వికీ లింకులిచ్చాక, పేజీని పై వర్గం నుండి తీసెయ్యాలి.