వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 22
← పాత చర్చ 21 | పాత చర్చ 22 | పాత చర్చ 23 →
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2013 జూన్ 1 - 2013 జూలై 13
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92 |
HMTV లో ఫోన్ ఇన్ కార్యక్రమం జూన్ 1, 2013, ఉ11:00 గంటలకు
[మార్చు]కార్యక్రమం నెట్ లో ప్రత్యక్ష ప్రసారం లింకు http://www.hmtvlive.com/web/guest-public/livetv ...--అర్జున (చర్చ) 04:50, 1 జూన్ 2013 (UTC)
- లింకిచ్చినందుకు ధన్యవాదాలు. మీ పుణ్యాన ఈ కార్యక్రమం జరుగుతున్నకొద్దీ చూడగలిగాను. చాలా బావుంది. నేనూహించిన దానికంటే చాలామందే సందేహాలు, ప్రశ్నలతో ఫోన్లు చేశారు. ఈ నాలుగైదేల్లలో తెవికీ కాకపోయినా కనీసం వికీపీడియా అవేర్‌నేస్ భారతదేశంలో కూడా పెరిగినట్టు తోచింది. --వైజాసత్య (చర్చ) 06:46, 1 జూన్ 2013 (UTC)
- మీ స్పందనకు ధన్యవాదాలు. వేరే పనులతోటి నేను ప్రారంభంలో కొద్దిసేపు మాత్రమే చూడగలిగాను. దీనిని కూడా నెట్ లో శాశ్వతంగా అందుబాటు చేయగలిగితే బాగుంటుంది. --అర్జున (చర్చ) 09:29, 1 జూన్ 2013 (UTC)
- రేపు ఈ పాటికి HMTV వారు డిజిటల్ కాపీ ఇస్తామన్నారు. దీనిని సోమవారం లోపు నెట్‌లో అందుబాటు చేయడానికి ప్రయత్నిస్తాను. పనిలో పనిగా HMTV లో ఇద్దరు వాడుకరులు కూడా తయారయారు --విష్ణు (చర్చ)13:14, 1 జూన్ 2013 (UTC)
- యూట్యూబ్ లింకులు:
- https://www.youtube.com/watch?v=oVNJtsURl2A
మొదటి భాగం - https://www.youtube.com/watch?v=mr1Tk82EdKE. రెండవ భాగం రహ్మానుద్దీన్ (చర్చ) 13:50, 1 జూన్ 2013 (UTC)
- ధన్యవాదములు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:49, 1 జూన్ 2013 (UTC)
ఆటోమేటిగ్గా సృష్టించబడిన ఖాతాలకు స్వాగతం
[మార్చు]ఆటోమేటిగ్గా సృష్టించబడిన ఖాతాలకు స్వాగతం అవసరం లేదని మనకు అనిపిస్తుంది. కానీ అవసరం అని నేననుకుంటున్నాను. ఎందుకంటే, ఎవరైనా ఇతర వికీల్లో ఖాతా సృష్టించుకొని ఉండి, తొలిసారిగా తెలుగు వికీలో అడుగుపెడితే ఆటోమేటిగ్గా ఖాతా సృష్టించబడుతుంది. అంటే ఎవరైనా తెలుగువాళ్ళు కూడా ఆంగ్ల వికీలో ఖాతా ఉండి తొలిసారి తెలుగులోకి అడుగుపెట్టినా ఈ విధంగా ఆటోమేటిగ్గా ఖాతా సృష్టించబడుతుంది. వాళ్ళకి స్వాగత సందేశం ఇవ్వకపోతే తెవికీకే నష్టమని నా ఆలోచన. నా అవగాహనలో ఏదైనా తప్పనిపిస్తే ఎత్తిచూపగలరు --వైజాసత్య (చర్చ) 04:55, 2 జూన్ 2013 (UTC)
- వికీలు 285 పైగా భాషలలో వున్నప్పుడుమన భాషకాని ఏభాష ప్రాజెక్టులో ఎవరు ఖాతా తెరిచినా, మన వికీలో అటోమేటిక్ ఖాతా తెరిచిన సందేశం కనబడుతుంది. వీటికి స్వాగతం చెపితే స్పామ్ క్రింద కూడా పరిగణించవచ్చు. ఇంతకుముందు అలా చెప్పిన ప్రసాద్ గారికి స్వాగతం ఎందుకు చెప్పారని కొంతమంది స్పందించటం జరిగింది. ఇంగ్లీషు లో పనిచేసే తెలుగువారిని ఆకర్షించటానికి, ఇంగ్లీషు, తెలుగు వికీల సమన్వయ ప్రాజెక్టులను చేపట్టి అలా ఇంగ్లీషులో పనిచేసే వారికి తెలుగులో పనిచేయమని స్వాగతించటంమంచిది.--అర్జున (చర్చ) 07:47, 2 జూన్ 2013 (UTC)
- ఏభాష ప్రాజెక్టులో ఎవరు ఖాతా తెరిచినా, అటోమేటిక్ ఖాతా తెరిచిన సందేశం కనబడదని అనుకుంటాను. అలా అయితే మన కొత్త సభ్యుల జాబితాలో రోజూ కొన్ని వేలమంది సభ్యులు కనిపించాలి కదా? కేవలం సభ్యులు తొలిసారి తెవికీని సందర్శించినప్పుడు మాత్రమే ఇక్కడ ఆటోమేటిగ్గా ఖాతా సృష్టించబడుతుంది. ఎంతో కొంత అసలు ఆసక్తి లేని వాళ్లు తెవికీని ఎందుకు సందర్శిస్తారు. ఉదాహరణకు 285 భాషల్లో నేనొక యాభై దాకా వికీలను ఎప్పుడో ఒకసారి సందర్శించి ఉంటాను అందుకే నాకు ఒక యాభై వికీల్లో ఖాతా ఉంది, 285 వికీల్లో కాదు. కానీ ఇంగ్లీషులో పనిచేసే వారిని తెలుగులో ఆహ్వానించే మీ సలహా మాత్రం బాగుంది. ప్రయత్నించి చూడాలి. ఇహ ఆహ్వానం పలికితే మనకొచ్చిన నష్టమేమీ లేదు. ఇటీవలి కొన్ని అటోమేటిక్ ఖాతాల్లో కొన్ని తెలుగు/భారతీయ పేర్లలా అనిపించాయి. అందుకే స్వాగతం పలకాలనిపించింది. స్పాముగా ఎందుకో పరిగణిస్తారో నాకు అర్ధం కాలేదు. నిజానికి ఐపీ అడ్రసులను కూడా స్వాగతించి, ఖాతా సృష్టించుకోమని ప్రోత్సహించే సాంప్రదాయమున్నది. en:Welcoming_committee/Welcome_templates లోని మూసలు చూడండి. తెవికీలో సభ్యులు చాలా తక్కువమంది ఉంది, చాలా మంది అజ్ఞాతంగా మార్పులు చేస్తున్న దశలో ఇక్కడా ఐపీ అడ్రసులకు స్వాగత సందేశాలు పంపేవాళ్ళం. కానీ ఆ తర్వాత తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికీ ఎవరికైనా ఓపికుంటే స్వాగత సందేశాలు ఇవ్వవచ్చు. ప్రసాద్ గారిని ఎవరు స్వాగత సందేశాలు ఇవ్వొద్దన్నారో నేను గమనించలేదు. తిరిగి వెళ్ళి చూస్తాను --వైజాసత్య (చర్చ) 08:19, 2 జూన్ 2013 (UTC)
- ఇలాంటి మూసను తెలుగుకు కూడా ఒకటి తయారుచేసి మనమూ ఆంగ్ల వికీలో తెలుగు తెలిసిన సభ్యులను ఆహ్వానించవచ్చనుకుంటా --వైజాసత్య (చర్చ) 08:25, 2 జూన్ 2013 (UTC)
ప్రముఖ వ్యక్తుల గురించి రాసేప్పుడు ఏకవచనం వాడటంపై ఇబ్బంది
[మార్చు]ఈ మధ్య తెలుగు ప్రముఖులు ప్రాజెక్టులో కొందరి గురించి రాసేప్పుడు ఏకవచనంలో రాయటం చాలా ఇబ్బంది కలిగించింది. కొన్ని వాక్యాలు రాయలేక అసలు పూర్తిగా వ్యాసం రాయ బుద్ధి కాలేదు. దయచేసి మరలా వ్యక్తుల విషంలో ఏకచనం ద్వారా సంబోధించడం, వాక్యాల్లో ఏకవచనం వాడకం గురించి పునరాలోచించి, ప్రముఖులకు బహువచనం వాడే విధానాన్ని ప్రవేశపెట్టే విషయమై చర్చ జరపాలని అభ్యర్థిస్తున్నాను. రహ్మానుద్దీన్ (చర్చ) 08:50, 2 జూన్ 2013 (UTC)
- తప్పకుండా చర్చించవచ్చు. ఏదో ఒక వైపు వాదన తెగుతుందని అని మాత్రం చెప్పలేను. మీకు ఇబ్బందిగా ఉంటే బహువచనమే వ్రాయండి. ఇక్కడ చాలామంది బహువచనాలతో వ్రాసే వాళ్ళు ఉన్నారు. కాకపోతే వేరే ఎవరైనా దాన్ని ఏకవచనాన్ని మార్చరని నేను చెప్పలేను. స్వతహాగా నేనెప్పుడు బహువచనాల్ని ఏకవచనాలుగా మార్చే ప్రయత్నం నేను చెయ్యలేదు.
- కొన్నేళ్ళ క్రితం తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారిని ఇలాంటిదే ఒక ప్రశ్న అడిగితే. ఆయనిచ్చిన సమాధానం ఈ దిగువన యాధాతథంగా ఇస్తున్నాను.
మనుషుల మధ్య ఉన్న అంతరాలు దేవుడికి వర్తించవు. ఆయన మనందరికీ తండ్రి కనుక."డు" ప్రత్యయం ఎప్పుడూ అవమాన సూచకం కాదు. అసలది మొదలయిందే గౌరవసూచకంగా ! ఎలా అంటే -మొదట్లో, అంటే 2000 సంవత్సరాల క్రితం, తెలుగువారు కూడా తమిళుల్లాగా రామన్,
కృష్ణన్ అనేవారు. తరువాత అది సమంజసంగా అనిపించక గౌరవ సూచకంగా ఒక "రు" చివరిలో చేర్చి రామన్ఱు కృష్ణన్ఱు అనడం మొదలుపెట్టారు. అవే తరువాత రామండు కృష్ణండు అయి ఇంకా తరువాతి కాలంలో రాముడు కృష్ణుడు అయ్యాయి. ఇంకో విషయం. వాడు వీడు అనేవి కూడా మొదట్లో అవమాన సూచకాలు కావు. అవి ఈనాటి "ఆయన, ఈయన" తో సమానం. కాలక్రమంలో వాడగా వాడగా చేదయ్యాయి. మాలల్ని మొదట హరిజనులని తరువాత అది కూడా వెగటుపుట్టి ఇప్పుడు దళితులంటున్నట్లు. అలాగే "అది, ఇది" అని స్త్రీలని ఈరోజు సంబోధిస్తే చాలా గొడవలవుతాయి. కాని మొదట్లో స్త్రీలింగానికి సర్వనామాలు అవే. వాటిని దేవతలకీ పతివ్రతలకీ కూడా అన్వయించి ప్రయోగించి ఉండడం మనం పాత తెలుగు కావ్యాల్లో గమనించవచ్చు.
ఇప్పుడు వాడుకలో ఉన్న ఆమె ఈమె అనేవి 19వ శతాబ్దానికి ముందు వాడుకలో లేవు. ఇవి నిజానికి సంధి రూపాలు. ఆ యమ్మ ఆమె అయింది. ఈ యమ్మ ఈమె అయింది. అలాగే ఆ బిడ్డ ఆవిడ అయింది. ఈ బిడ్డ ఈవిడ అయింది. అలాగే ఆ యన్న ఆయన అయ్యాడు. ఈ యన్న ఈయన అయ్యాడు. ఈ ఆధునిక సర్వనామాలకి బహువచన రూపాలు (ఆమెలు, ఈమెలు, ఆవిడలు, ఈవిడలు, ఆయనలు, ఈయనలు మొదలైనవి) లేకపోవడమే ఇవి ఇటీవలి సృష్టి అని సూచిస్తోంది.
- మరికొంత మంది భాషావేత్తలు, విజ్ఞానసర్వస్వాలపై కృషి చేసినవారి అభిప్రాయాలు సేకరించాలి --వైజాసత్య (చర్చ) 09:21, 2 జూన్ 2013 (UTC)
- తెలుగు వికీపీడియాలో నాకు బాధ కలిగించే విషయంలొ ఇదొకటి. పెద్దల్ని గౌరవించడం తెలుగువారి సంస్కృతిలో భాగం. దాని మన వ్యాసాల్లో రచనల్లో కూడా తెలియజేయడం చాలా సమంజసం. దీని గురించి ఇది వరకే చర్చ జరిగింది. ఏకవచన ప్రయోగం మూలంగా కొంతమంది సభ్యులు తెవికీ నుండి వైదొలగారు కూడా. నా అభిప్రాయం దీని గురించి గౌరవవాచకం తప్పులేదని; ఒకవేళ రచయితకు అది అవసరం అయితే దానిని కొనసాగనీయనిస్తే బాగుంటుంది. కానీ ఒక పాలసీని అందరి మీద రుద్దడం సరికాదు.Rajasekhar1961 (చర్చ) 06:52, 3 జూన్ 2013 (UTC)
- వైజాసత్య గారు, తాడేపల్లి వారు ఇచ్చిన సమాధానం పరిశోధనా పరంగా చాలా ఖచ్చితమైన సమాచారం. దీని వలన (మన) భాష నిరంతరం పరిణామం చెందేది అని మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. వారిచ్చిన సమాధానంలోనే ఈ సమస్యకు పరిష్కారం ఉందని నేననుకుంటున్నాను.... ప్రతీ కాలంలోనూ భాష మారటానికి కారణం అప్పటి సామాజిక-ఆర్థిక-రాజకీయ స్థితిగతులు కారణం. ఉ.దా. మాల-హరిజన-దళిత మార్పుకు ఎంతో లోతైన సంక్లిష్టమైన సామాజిక-ఆర్థిక-రాజకీయ కారణాలు ఉన్నాయని మనందరికి తెలిసిందే. ముక్తంగా చెప్పాలంటే భాష ఒక సామాజిక నిర్మాణం (social construct). కాబట్టి social acceptability, political correctness and economic purchase భాషకు కూడా వర్తిస్తాయి. దీనికి చాలా పెద్ద మచ్చుతునక మొన్నటి 19-20వ శతాబ్దపు వ్యావహరిక భాషోద్యమం. ఇది జరిగింది తెలుగులో ముద్రణ సాంకేతికత జన బాహుల్యంలోకి తీసుకు వెళ్ళాల్సిన తరుణంలో. మన గిడుగు పిడుగు గారి వాదనల గురించి తెలిసిందే. ఇప్పటి Internet, తెవికీ తరుణంలో గిడుగు గారుంటే వారు ప్రముఖుల వ్యాసాల క్రియాపదాలలో బహువచన ప్రయోగాన్ని సమర్దించేవారు. ఎందుకంటే ఇది ఇప్పటి మన సమకాలీన, సమ సమాజంలో చూస్తున్న, వ్రాస్తున్న, పలుకుతున్న, వింటున్న ప్రమాణము. మన తెవికీ ముఖ్య ఉద్దేశ్యం తెలుగు చదివేవారందరికీ సమాచార విజ్ఞానాన్ని అందించడమైతే, ప్రముఖుల వ్యాసాలలో వచ్చే క్రియాపదాలలో బహువచనాన్ని తప్పకుండా వాడాలి అని నా అభిమతం. విష్ణు (చర్చ)08:02, 3 జూన్ 2013 (UTC)
- నిజానికి అలా సమాజంలో జరిగితే అంతకంటే సంతోషదాయకం లేదు. నాలుగేళ్ళ మా పాపను కూడా అది అని వ్యవహరించడం ఇష్టం లేని నేను ఎప్పుడూ తనను పేరుతోనే వ్యవహరిస్తాను. కాబట్టి వ్యాసరచనను వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఒక వ్యక్తిని గౌరవించడానికి మనం వ్యాసాలు వ్రాయటం లేదు. వ్యక్తి గురించి నిష్పక్షపాతంగా ప్రపంచానికి తెలియజేయటానికి మాత్రమే వికీపీడియా వ్యాసాలు. వికీపీడియా:ఏకవచన ప్రయోగం లోనూ, అక్కడి చర్చా పేజీలో చెప్పినట్టు, దగ్గరితనము, ఆర్ధిక, సామాజిక అంతరాలను బట్టి ఏకవచన ప్రయోగమూ, బహువచన ప్రయోగమూ జరుగుతున్నాయి నేటి తెలుగు సమాజంలో. అలాంటి అంతరాలు వికీలో ప్రతిఫలించలేము. ఇది వికీ నిష్పాక్షికతకు గండికొట్టడమే. ఈ సమస్యకు మూల కారణం మన సమాజపు విలువలు, వికీ విలువలకు ఉన్న వైరుధ్యమే. విజ్ఞాన సర్వస్వపు భాష వేరు, పత్రికల భాష వేరు, వ్యవహారికం వేరు. నిజానికి ఇదే పేరాగ్రాఫు మీ ముందుండి ముఖతా చెప్పి ఉంటే నా పదాల ఏంపిక వేరే విధంగా ఉండేది. 1990లలో వెలువడిన విజ్ఞానసర్వస్వపు సంపుటంలో కూడా ఏకవచనమే వాడారు. మనలాగా నిష్పాక్షికంగా తారతమ్యాలు లేకుండా చెప్పవలసిన అవసరం నాకు తెలిసి న్యాయవాదులకు వస్తుంది. తెలుగులో కేసులు వ్రాస్తే వాటిని పరిశీలించాలి. ఇంకా భాషవేత్తలు, ఇది వరకు తెలుగు విజ్ఞాన సర్వస్వాలపై కృషి చేసిన వారిని సంప్రదించాలి. తెలుగు వికీలో తెలుగు ఎంత ముఖ్యమో, వికీ కూడా అంతే ముఖ్యమైనదని నా అభిప్రాయం. వికీ ముఖ్యం కాదనిపిస్తే మనం ఈ సమాచారం తీసుకెళ్ళి ఎక్కడైనా ఒక తెలుగు విజ్ఞానసర్వస్వాన్ని స్థాపించుకోవచ్చు --వైజాసత్య (చర్చ) 11:39, 5 జూన్ 2013 (UTC)
- ఏకవచన ప్రయోగం వ్యక్తిగతంగా భావించనవసరం లేదన్న వైజాసత్య గారి మాటలతో నేనూ ఏకీభావిస్తాను. అయితే... 'వికీదృష్టిలో అందరూ సమానులే' అన్న భావనతో అందరినీ 'వాడు, వీడు, అన్నాడు, చెప్పాడు, వచ్చాడు, వెళ్ళాడు, పుట్టాడు, మరణించాడు' అని చదవడం, రాయడం కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. గౌరవవాచకంగా ' పేరుకు ముందు 'శ్రీ', పేరుకు చివర 'గారు' అని తగిలించడం ఎబ్బట్టుగా వుంటుంది కూడా...! కాబట్టే... మేము పేపర్లలో వార్తలు రాసేటప్పుడు పేరుకు ముందు, పేరుకు చివర గౌరవవాచకాలు రాయము. కేవలం - అన్నారు, చెప్పారు, ఆయన, ఈయన, వారు, వీరు, వచ్చారు, వెళ్ళారు, పుట్టారు, మరణించారు, చదివారు, రాణించారు' వంటి పదాలు రాస్తుంటాము. ఇదే విధంగా వికీలో కూడా రాస్తే బావుంటుంది. ఇది 'వికీ నిష్పాక్షికతకు గండికొట్టడం కాదు' అని పెద్దలు గమనించ ప్రార్థన. విజ్ఞులు పునరాలోచించవలసిందిగా నా మనవి. ---Malladi kameswara rao (చర్చ) 12:59, 5 జూన్ 2013 (UTC)
- మల్లాది గారు ముద్రణా మాధ్యమంలో ఎంతో అనుభవమున్న వ్యక్తి; కొన్ని పుస్తకాలను కూడా రచించారు. బహువచనం లో చెప్పారు, ఆయన, ఈయన, వారు, వీరు, వచ్చారు, వెళ్ళారు, పుట్టారు, మరణించారు, చదివారు అని వుంటేనే సమంజసం అనిపిస్తుంది. లేకపోతే మరికొంతమందిని తెవికీ కోల్పోవడం నాకిష్టం లేదు. ముఖ్యంగా తెలుగు ప్రముఖులు ప్రాజెక్టు నడుస్తున్న నేపథ్యంలో ఈ కీలకమైన నిర్ణాయం మనం తీసుకోవల్సివుంది. తెలుగు విశ్వవిద్యాలయం ఎందరో ప్రముఖ భాషావేత్తల సహాయంతో ముద్రించిన 20వ శతాబ్ది తెలుగు వెలుగులు పుస్తకంలో ఏ వ్యక్తి గురించిన వ్యాసంలో కూడా ఏకవచన ప్రయోగం లేదు. ఇంతకన్నా మన వికీపీడియాకు బహువచన ప్రయోగం గురించిన ఉదాహరణ మరొకటి లభించదు. సహృదయంతో మరొకసారి ఆలోచించండి.Rajasekhar1961 (చర్చ) 14:12, 5 జూన్ 2013 (UTC)
- నేను తెవికీకి వచ్చిన దగ్గరనుంచి దాదాపుగా బహువచనమే వాడుతున్నాను. దీని గురించి చర్చలు నడిచినా బహువచనమే బావుండటంతో వ్యాసాలలో అలాగే నడిపించాను. దేవుళ్ళ విషయంలోనూ, ప్రస్తుతం ఉన్నంత వరకూ అలాగే ఉంచినా ఇకముందు బహువచనం వాడుక ద్వారా ముందు ముందు అంతర్జాలంలో అడుగుపెట్టే యువతకు మార్గదర్శిగా తెవికీ ఉండగలదని నా అభిప్రాయం.విశ్వనాధ్ (చర్చ) 17:08, 5 జూన్ 2013 (UTC)
- నేను కొత్తగా చేరినప్పుడు బహువచనంతోనే వ్రాశాను, కొందరు అలా, ఇలా వ్రాస్తుండటంతో ఆ తర్వాత ఎలా వ్రాయాలన్న సందేహం వచ్చింది. మల్లాది గారన్నట్టు పత్రికలు తిరగవేశాను. అక్కడ కూడా సమాజంలో లాగే ఆర్ధిక, సామాజిక, వయో అంతరాలను బట్టి వచన ప్రయోగం చూసి మరింత అయోమయంలో పడ్డాను. నిష్పాక్షితకు గండికొట్టడం కాదని మల్లాది గారు అన్నారు. అయితే అదే పత్రికలు అజ్మల్ కసబ్ లాంటి వ్యక్తులకు బహువచనం ప్రయోగించాయా? దీన్ని సులభంగా నిర్ధారించుకోవచ్చు. 20వ శతాబ్ది తెలుగు వెలుగులు అనే పుస్తకం నేను వ్రాసిన్ననూ ఏకవచన ప్రయోగం చేసేవాడిని కాదు. ఎందుకంటే ఆ పుస్తకం, దాని ఉద్దేశం వేరు. తెలుగు వెలుగులు అన్నప్పుడే మేము వీరిని గొప్పవారిగా భావిస్తాము. అందుకే వీరి గురించి ఈ పుస్తకంలో చెబుతున్నాం అని ఘోషిస్తోంది. ఆ పుస్తకానికి నిష్పాక్షికత అవసరం లేదు. నా మాట వినమని వాదించడం లేదు. నేను సశాస్త్రీయంగా ఈ విషయం పరిష్కారానికి న్యాయవాదులను, భాషావేత్తలను, ఇదివరకు విజ్ఞానసర్వస్వంపై పనిచేసిన వారిని సంప్రదించండి అని కోరుతున్నాను. అయినా పైన చెప్పినట్టు నేను బహువచనాన్ని, ఏకవచనానికి దిద్దటం లేదు.
ఈ రోజు ఈనాడు పత్రికలోని కొన్ని వాక్యాలు
“ | 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. నిరాడంబరంగా జీవించిన బ్రాహ్మణయ్య అందరికీ స్ఫూర్తి అని దేవినేని ఉమ అన్నారు. | ” |
“ | యువకులు తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఓ మహిళా ఫోటోగ్రాఫర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. | ” |
“ | ధవళేశ్వరంలో పులిచర్మాలను తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ ఎన్.శ్రీదేవి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఈ వివరాలను విలేకరులకు వెల్లడించారు. భార్యను వేధించిన కేసులో పిడింగొయ్యి ప్రాంతానికి చెందిన పాకా రాజు(30)కు గతంలో రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నాడు. | ” |
--వైజాసత్య (చర్చ) 06:08, 10 జూన్ 2013 (UTC)
Trademark discussion
[మార్చు]Hi, apologies for posting this in English, but I wanted to alert your community to a discussion on Meta about potential changes to the Wikimedia Trademark Policy. Please translate this statement if you can. We hope that you will all participate in the discussion; we also welcome translations of the legal team’s statement into as many languages as possible and encourage you to voice your thoughts there. Please see the Trademark practices discussion (on Meta-Wiki) for more information. Thank you! --Mdennis (WMF) (talk)
మొదటి పేజీని మార్చడం మంచిదేమో...
[మార్చు]ఈ మధ్య కాలంలో నేను చాలామంది మీడియావారితో, ఇతర ప్రముఖులతో మాట్లాడుతున్నప్పుడు --- 'మాకు కావలసిన వివరాలలోకి ఎలా వెళ్ళాలో తెలియడం లేదం'టూ చెప్పారు. మదటి పేజీని మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్ది, మీ ప్రాజెక్టులు, ఇతర లింకులను మొదటిపేజీలో హైలెట్ గా ఇస్తే బావుంటుందని సూచిస్తున్నారు. సభ్యులు తమ అభిప్రాయాలను తెలుపవలసిందిగా విజ్ఞప్తి. Malladi kameswara rao (చర్చ) 08:28, 4 జూన్ 2013 (UTC)
- దీని గురించి చర్చించాలి. ఏవేవి మార్చాలి, చేర్చాల్సిన అంశాలు ఏవి. సభ్యులు చురుకుగా పాల్గొని తమ అభిప్రాయాల్ని తెలియజేయండి. నాకైతే తెవికీ నిర్వహిస్తున్న వివిధ ప్రాజెక్టులను గురించి ఆకర్షణీయంగా మొదటిపేజీలో చూసినవారందరికీ తెలియాలని నా భావన.Rajasekhar1961 (చర్చ) 10:16, 4 జూన్ 2013 (UTC)
- రాజశేఖర్ మరియు కామేశ్వరరావు గార్లు తమ అభిప్రాయాలను ఇక్కడ చేర్చి చర్చలకు శ్రీకారం చుట్టవచ్చు. అందరికీ ఆమోదయోగ్యమైన మార్పులు జరగాలని ఆశిస్తున్నారు.
వికీపీడియా:మొదటిపేజీలో మార్పులు సభ్యుల అభిప్రాయాలుచర్చ:మొదటి పేజీ వాడండి. --అర్జున (చర్చ) 04:20, 5 జూన్ 2013 (UTC)
ప్రభుత్వ సంబంధిత గణాంకాలకు ఒక మంచి వనరు
[మార్చు]http://data.gov.in/ వద్ద ప్రభుత్వం జనబాహుళ్యం కొరకు జాతీయం చేసిన గణాంకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఒక మంచి వనరుగా మనం వాడుకోవచ్చు. సభ్యులు గమనించగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 10:06, 4 జూన్ 2013 (UTC)
- వికీపీడియా:తెవికీపిడియనులకు వనరులు చూడండి. మనం సమిష్టిగా ఈ పేజిలో మనకు తెలిసిన వనరుల చిట్టా ఉంచితే అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ప్రతి కొత్త వాడుకరికి పంపే స్వాగత సందేశంలో ఈ పేజికి లంకె ఇస్తే బాగుంటుంది. తెవికీ మిత్రులు గమనించగలరు.--విష్ణు (చర్చ)07:19, 5 జూన్ 2013 (UTC)
Universal Language Selector to replace Narayam and WebFonts extensions
[మార్చు]On June 11, 2013, the Universal Language Selector (ULS) will replace the features of Mediawiki extensions Narayam and WebFonts. The ULS provides a flexible way of configuring and delivering language settings like interface language, fonts, and input methods (keyboard mappings).
Please read the announcement on Meta-Wiki for more information. Runab 14:12, 5 జూన్ 2013 (UTC) (posted via Global message delivery)
- WP:TH యూనివర్సల్ లాంగ్వేజి సెలెక్టర్ తెరపట్టులతో తాజాకరించబడింది.--అర్జున (చర్చ) 08:54, 11 జూన్ 2013 (UTC)
- Dear all, I have created a video tutorial for enabling Telugu on TE WP which I have updated on the Telugu typing page. Please check and share your feedback so I could improve it. Thanks! --Psubhashish (చర్చ) 09:57, 27 జూన్ 2013 (UTC)
ఖాళీ సినిమా వ్యాసాల తొలగింపు
[మార్చు]నాలుగు లైన్ల సమాచార పెట్టె తప్ప ఇంకేమీ సమాచారం లేని సినిమా వ్యాసాలను తొలగించాలనుకుంటున్నాను. ఇలాంటి వ్యాసాలు తెవికీ నాణ్యతను పలుచన చేస్తున్నాయని నా అభిప్రాయం. ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపండి. రవిచంద్ర (చర్చ) 06:25, 10 జూన్ 2013 (UTC)
ఎందుకు అలా చేయడం... అవి ఉంటే ఎవరో ఒకరు రాస్తారు కదా??? Pranayraj1985 (చర్చ) 06:28, 10 జూన్ 2013 (UTC)
- తొలగింపు ప్రతిపాదన యొక్క విస్తృతి వివరించగలరు. ఉన్న కొద్ది సమాచారాన్ని పట్టి ఉంచే ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలి (ఒక్కో సంవత్సరానికి ఒక సమాచార పట్టిక?). ప్రణయ్‌రాజ్ గారన్నట్టు ఎవరో ఒకరు వ్రాయటానికి మళ్ళీ ఒక సినిమాల వ్యాసాలను ఒక నెల సమిష్టి కృషిగా ప్రకటించి విస్తరించే ప్రయత్నం కూడా చేయవచ్చు. మొత్తం అన్ని సంవత్సరాలు కాకపోయినా 30,40 దశకాలు ఒక నెల, 50లు ఒక నెల, 60లు ఒక నెల ఇలా నెలల వారీ కృషి చేయవచ్చేమో? --వైజాసత్య (చర్చ) 06:40, 10 జూన్ 2013 (UTC)
- గ్రామాల వ్యాసాల మాదిరిగా తెలుగు సినిమా వ్యాసాలు చాలా చిన్నవిగానే ఉన్నాయి. కానీ తొలగించడం సరికాదని నా అభిప్రాయం. వైజాసత్య గారన్నట్లు నెలకొక దశకం క్రింద తీసుకొని వృద్ధిచేయవచ్చును. దయచేసి తొందరపడి తొలగించవద్దు.Rajasekhar1961 (చర్చ) 08:41, 10 జూన్ 2013 (UTC)
- తొలగించినా మళ్ళీ రాయడానికి మనకేస అభ్యంతరం లేదు. కాకపోతే కొద్దిపాటి సమాచారమైనా లేకుండా కొత్త వ్యాసాలు సృష్టించడానికి వీల్లేదనే ఖచ్చితమైన నిభందన విదించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదివరకు చాలా సార్లు ఇలాగే ఎవరో రాస్తారని అనుకున్నాం కానీ అలా జరగడం లేదు. గ్రామాల వ్యాసాల విషయంలో ఇదివరకే చాలా చర్చ జరిగింది కాబట్టి దాంతో వీటిని ముడిపెట్టడం బాగుండదని నేను భావిస్తున్నాను. ఉదాహరణకు ఛండీ చాముండీ వ్యాసం చూడండి. ఇందులో కేవలం సమాచార పెట్టె తప్ప ఇంకేమీ లేదు. ఈ సినిమా గురించి భవిష్యత్తులో అంత శ్రద్ధ తీసుకుని రాస్తారని నేను అనుకోవడం లేదు. నేను మాట్లాడుతున్నది. ఇలాంటి వ్యాసాల గురించి. రవిచంద్ర (చర్చ) 11:45, 10 జూన్ 2013 (UTC)
- యిటువంటి చిన్న వ్యాసాలు "సినిమా వ్యాసాలు" భాగంలోనే కాకుండా 150 బైట్లు పరిమాణం గల మూలకాల వ్యాసాలు అనేకం ఉన్నాయి. ఉదా: బోరాన్ . ఒక విభాగంలో వ్యాసాలను తొలగిస్తూ పోతే మిగిలి విభాగాలలో వ్యాసాలను కూడా తొలగించాలి. యిలా తొలగిస్తూ పోతే సినిమా వ్యాసాల తో పాటు అనేక వ్యాసాలను తొలగించవలసి ఉంటుంది.గ్రామ వ్యాసాలు కాకుండా కూడా అనేక మొలకలు ఉన్నాయి. కనుక వీటి విస్తరణకు కృషి చేసిన బాగుండునని అభిప్రాయం. ఈ మధ్యన వైజాసత్య గారు ఒక నెలలో గల మొలకల జాబితాను రచ్చబండలో ఉంచి విస్తరించమని కోరినపుడు చాలా మంది వికిపీడియనులు స్పందించి వాటిని విస్తరించారు. అలా ఏదైనా ఒక ప్రోగ్రాం నిర్వహించి మొలకల విస్తరణకు కృషి చేస్తే బాగుంటుంది. -- కె.వెంకటరమణ చర్చ 12:03, 10 జూన్ 2013 (UTC)
- రవిచంద్ర గారూ, పాత సినిమా వ్యాసాలను వీలైనంతమేరకు విస్తరిస్తున్నాను. దయచేసి తొలగించవలదు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:02, 18 జూన్ 2013 (UTC)
లిప్యంతరీకరణ
[మార్చు]భాషల మధ్య మార్పు కొరకు క్రొత్తగ ఏర్పాటు చేసిన లిప్యంతరీకరణ ఆలస్యంగా నైనా నా యంత్రములో చేరినది. విక్షనరీలో ఎందుకో వెంటనే రాలేదు. ఆతర్వాత అన్నింటిలోను వచ్చింది. కాని ఈ రోజు వికిపీడియాలో మొదట బాగానే వచ్చింది. మొదట వెతుకు పెట్టెకు పెట్టెకు క్రింద వచ్చేది. అలా వచ్చినప్పుడు ఆ వచ్చిన పెట్టె సగభాగము అనగా క్రింది భాగము మాత్రము కనబడేది. పై భాగము కనబడలేదు. తెలుగు భాష లోకి మారడానికి . ఆ పెట్టెలో కనబడే క్రింది భాగములోని ఒక దానిపై నొక్కగా అది పూర్తిగా మరుగై పోయింది. అనగా వికిపీడియాలో ప్రస్తుతం నా యంత్రములో భాషల మద్య మారడాని అవకాశము లేకుండా పోయింది. దీనికేదయినా ఉపాయమున్నదేమో తెలిసిన వారు చెప్పగలరు. This matter has been created in vikshnari and pasted here as it is not possible to type in these columns in telugu. (search box) vetuku box lo kUDa raavaDaM lEdu......Bhaskaranaidu (చర్చ)14:39, 13 జూన్ 2013 (UTC)
- వికీపీడియా ముఖ పుటలోని ఎడమవైపు పట్టిక(column)లో ఇతరభాషలు(languages)అనేపదంకు ఎదురుగా ఒకచక్రం మీ మానిటర్లో కనిపించుచున్నచో,దానిమీద క్లిక్ చెయ్యండి.అది ఒపన్ అయ్యాక అందులో భాషను,ఫాంటును ఎన్నిక చేసుకోండి.పాలగిరి (చర్చ) 15:32, 13 జూన్ 2013 (UTC)
- లిప్యంతరీకరణ వచ్చింది. పాలగిరిగారికి నెనరలు. ఎలా వచ్చింది ఇంకొచెం వివరంగా...... మొదటి పుట లో ఎడమ వైపు మార్జిన్ లో చివరన languages అనే దానికెదురుగా పాలగిరి గారు చెప్పినట్టు ఒక చక్రం గుర్తు వున్నది. దానిని నేనింత వరకు గమనించ లేదు. గతంలో అక్కడ అన్ని భాషల పేర్లు వుండేవి. దానిని నొక్కగా దాని కనుబంధంగా మారో పెట్టె తెరుచుకున్నది. అందులోని అనేక పెట్టెలలో ( display ) box (తెలుగు) పెట్టె (apply settings) box వీటిని వరుసగా ఒకదాని తర్వాత ఒకటి నొక్కగా (లిప్యంతరీకరణ) అనే పెట్టె అసలు పుటలో మనకు కావలసిన చోటె కనిపిస్తూ మాయమౌతూ వున్నది. దాంతో పని సఫలమైంది. ఇదెందుకు వ్రాస్తున్నానంటే .... నాకు మరొక్క సారి ఇదే సమస్య ఎదురైతే సులబంగా పరిష్కరించు కోడానికి, మరియు ఇతరులెవరికైనా ఇలాంటి సమస్య వస్తే .... పరిష్కరించు కోడానికీను. అసలు మూల మంత్రం చెప్పిన పాలగిరి గారికి మరొక్క సారి నెనరులు. Bhaskaranaidu (చర్చ) 03:22, 14 జూన్ 2013 (UTC)
- టైపింగు సమస్య ఎదురైనపుడు తాజా మార్పుల గురించి వికీపీడియా:టైపింగు సహాయం చూడండి.--అర్జున (చర్చ) 03:39, 14 జూన్ 2013 (UTC)
Free Research Accounts from Leading Medical Publisher. Come and Sign up!
[మార్చు]gets Wikipedia editors free access to reliable sources that are behind paywalls. I want to alert you to our latest donation.
- Cochrane Collaboration is an independent medical nonprofit organization that conducts systematic reviews of randomized controlled trials of health-care interventions, which it then publishes in the Cochrane Library.
- Cochrane has generously agreed to give free, full-access accounts to medical editors. Individual access would otherwise cost between $300 and $800 per account.
- If you are active as a medical editor, come and sign up :)
Cheers, 21:20, 16 జూన్ 2013 (UTC)
Cochrane Library Sign-up (correct link)
[మార్చు]My apologies for the incorrect link: You can sign up for ' accounts at the COCHRANE sign-up page. Cheers, 21:55, 16 జూన్ 2013 (UTC)
రహ్మనుద్దీన్ వికీసోర్స్ నిర్వాహకత్వానికి స్పందన
[మార్చు]s:వికీసోర్స్:రచ్చబండ#రహ్మనుద్దీన్ నిర్వాహకత్వానికి వోటు ప్రక్రియ లో రహ్మనుద్దీన్ నిర్వహకత్వానికి స్పందించండి.--అర్జున (చర్చ) 03:48, 19 జూన్ 2013 (UTC)
- స్పందించిన వారందరికి ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 05:22, 21 జూన్ 2013 (UTC)
(Sorry for writing in English. You can translate the proposal.)
Should X!'s edit counter retain the opt-in requirement? Your input is strongly encouraged. Voice your input here.—cyberpower ChatAutomation 05:03, 23 జూన్ 2013 (UTC)
- Distributed via Global message delivery. (Wrong page? Fix here.)
చేసిన పని వృదా అయింది
[మార్చు]ఆర్యా......
ఈ రోజు వికిపీడియాలో వ్వాసాలు వ్రాస్తూండగా.( 10-20.రాత్రి)....... వ్రాసిన దానిని భద్ర పరచగా భద్రపరచ బడలేదు. ఏదో కొంత గందర గోళం ఏర్పడింది. అలా రెండు మూడు సార్లు జరిగింది.. దానికి కారణమేమై వుంటుందని నానేర్చిన విధంగా తెలుసుకునే ప్రయత్నం చేయగా ..... నాకు అర్థం అయిన విషయం ఏమంటే? (ఇది నిజమో..... కాదో ....) నా వ్వాసంగం జరుగు చుండగానే వేరెవరో అధికారులు నా వ్వాసంలోని అక్షర దోషాలను సరిచేసినట్లు గ్రహించాను. దాంతో నేను వ్రాసిన అంత భాగము కనుమరుగైనది. నా శ్రమ వృధా అవడమేగాక ..... నా ఉత్సాహం మీద నీళ్ళు చల్లినట్లైనది. ఇదే గనుక నిజమైతే అనగా ఒకరు ఒక వ్వాసం వ్రాస్తుంటే అదే సమయంలో అదే వ్వాసంలో అక్షర దోష నివారణ వంటి కార్య క్రమాలు చేస్తే భద్ర పరచడంలో ఇబ్బందులు వచ్చేటట్టయితే...... నా మనవి ఏమంటే?..... నేను వ్రాసిన వ్వాసం పూర్తి కాగానే అందులోని అక్షర దోషాలను మిగతా మార్పులు చేర్పులు సరి చేసే నా నేర్చిన వరకు నేనే చేస్తాను. వ్వాసం పూర్తి కాగానే దాన్ని సంపూర్ణంగా సరిచూసుకునే బాధ్యత నాకున్నది. దీనివలన అవతలి వారికి వారి సమయం వృథా కాకుండా వుంటుంది ... ఆ సమయంలో నేను వ్రాసినంత మేర కనుమరుగు కాకుండా భద్రపరుచ బడి నా సమయం కూడా వృథా కాకుండా వుండగలదు. లేదా వ్వాసం పూర్తి అయిన తర్వాత దానిని అధికారులు ఏమైనా చేసుకోవచ్చు. ..........వాడుకరి. భాస్కర నాయుడు/. Bhaskaranaidu (చర్చ) 17:32, 26 జూన్ 2013 (UTC)
- మీకు కలిగిన అసౌకర్యానికి, నష్టానికి సానుభూతి తెలియచేస్తున్నాను. మీరు మార్పు చేసేటప్పుడు ఇతరులను హెచ్చరించడానికి, మార్పు చేయబోయేముందు {{In use}} మూస చేర్చండి, మార్పులు పూర్తయిన తర్వాత దానిని తొలగించండి. --అర్జున (చర్చ) 07:18, 27 జూన్ 2013 (UTC)
- పై వ్యాఖ్య సహవికీపీడియన్ గా సలహా మాత్రమే. మీరు పేర్కొన్న సందర్భంలో నా ప్రమేయం లేదని తెలుపుతున్నాను. --అర్జున (చర్చ) 03:57, 28 జూన్ 2013 (UTC)
తెవికీ బ్లాగు ప్రారంభం
[మార్చు]బ్లాగర్లను ఇటువైపు ఆకర్షించడానికి ఈ ప్రయత్నం --రవిచంద్ర (చర్చ) 17:53, 29 జూన్ 2013 (UTC)
- మీ ప్రయత్నము మిక్కిలి అభినందనీయము.బ్లాగు బాగున్నది.పాలగిరి (చర్చ) 01:03, 30 జూన్ 2013 (UTC)
- బ్లాగు బాగుంది. మీ ప్రయత్నం ద్వారా తెలికీ అంతర్జాలంలో అందరికీ అందుబాటులోకి రావాలని, వారి సందేహాలని తీర్చి తద్వారా ఎంతోమంది వాడుకర్లను చేర్చి, అభివృద్ధి పథానికి మార్గదర్శకం అవుతుందని ఆశిస్తాను. శుభాకాంక్షలు.Rajasekhar1961 (చర్చ) 05:36, 30 జూన్ 2013 (UTC)
- ప్రయత్నం బావుంది. అయితే ఒక్కరే కాకుండా మరికొందరు పోష్టింగ్ చేయగలిగే వీలుంటే బావుంటుంది..విశ్వనాధ్ (చర్చ) 07:06, 30 జూన్ 2013 (UTC)
- విశ్వనాథ్ గారూ, రాయడానికి కొంతమందికి ఆహ్వానం పంపాను. వీవెన్, రహ్మాన్, అర్జున రావు గార్లకు పంపాను. మీరు కూడా రాయదలుచుకుంటే మీక్కూడా ఆహ్వానం పంపగలను. --రవిచంద్ర (చర్చ) 09:24, 30 జూన్ 2013 (UTC)
- తెవికీ బ్లాగు చాలా బాగున్నది. దీనివల్ల మరింత మంది వాడుకరులు క్రియాశీలకంగా మారి తెవికీ అభివృద్ధికి కృషి చేయగలరని భావిస్తాను.ఇంకా కొంతమంది కొత్త వాడుకరులు చేరి తెవికీని అభివృద్ధి పథాన నదిపించే కృషిచేయగలరని నా భావన. ఈ బ్లాగును యేర్పరచే ప్రయత్నం చేసిన రవిచంద్ర గారికి అభినందనలు.-- కె.వెంకటరమణ చర్చ 08:10, 30 జూన్ 2013 (UTC)
- విశ్వనాథ్ గారూ, రాయడానికి కొంతమందికి ఆహ్వానం పంపాను. వీవెన్, రహ్మాన్, అర్జున రావు గార్లకు పంపాను. మీరు కూడా రాయదలుచుకుంటే మీక్కూడా ఆహ్వానం పంపగలను. --రవిచంద్ర (చర్చ) 09:24, 30 జూన్ 2013 (UTC)
రెగ్యులర్ బ్లాగర్స్ మరికొందరిని కూడా చేర్చుకోండి. రవి వైజాసత్య, చంద్రకాంతరావు లాంటి వారిని కూడా అడగండి...విశ్వనాధ్ (చర్చ) 14:02, 1 జూలై 2013 (UTC)
- చక్కటి ఆలోచన. ఇది వరకు తెలుగు బ్లాగర్లతో వికీపీడియన్లకు అవినాభావ సంబంధముండేది. అది ఇప్పుడు కాస్త పలుచబడిన తరుణంలో మీ ప్రయత్నం మళ్ళీ ఆ సంబంధాలను పటిష్టపరచగలదని ఆశిస్తున్నాను. ఇప్పటికీ తెలుగు బ్లాగ్లోకానికి మనకున్న వారధుల్లో వీవెన్ గారు, చావాకిరణ్ గారు (నాకు తెలియని వారు ఇంకొంతమంది ఉండొచ్చు) --వైజాసత్య (చర్చ) 04:51, 3 జూలై 2013 (UTC)
- ఆలస్యంగా స్పందిస్తున్నాను :( ...చాలా చక్కటి ఆలోచన. చిన్ని సలహాలు... 1) బ్లాగులో తెలుగు వికీపీడియా లంకె (ఆకర్షనీయమైన Tab ద్వారా) చేరిస్తే బాగుంటుంది. 2) ఒక తెవికీ ఆర్టికల్ కౌంటర్ లాంటిది పెడితే ఆకర్షనీయంగా ఉంటుంది. 3) అలాగే ఒక విజిటర్ కౌంటర్ (ఈ లంకె ఉపయోగపడవచ్చు) విష్ణు (చర్చ)23:55, 13 జూలై 2013 (UTC)